India Tour of South Africa 2021-22: Star Sports Launches Promo as Virat Kohli & Co - Sakshi
Sakshi News home page

టీమిండియా 29 ఏళ్ల దాహం తీరేనా.. దక్షిణాఫ్రికాలో సిరీస్‌ విజయంపై ప్రోమో అదుర్స్‌

Published Wed, Dec 8 2021 5:42 PM | Last Updated on Thu, Dec 9 2021 10:57 AM

India Tour Of South Africa 2021-22: Star Sports Launches Promo - Sakshi

India Tour of South Africa: Star Sports Launched Promo: మూడు టెస్ట్‌ల సిరీస్‌ ఆడేందుకు దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనున్న కోహ్లీ సేనను ఉత్సాహపర్చేందుకు భారత క్రికెట్ జట్టు అఫిషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రోమోను విడుదల చేసింది. ‘First ka Thirst’ అంటూ సాగే ఈ ప్రోమోలో ఇంగ్లండ్(1971), పాకిస్థాన్(2004), ఆసీస్(2018) గడ్డలపై టీమిండియా సాధించిన మొదటి సిరీస్ విజయాలకు సంబంధించిన దృశ్యాలను చూపించిన స్టార్ స్పోర్ట్స్​.. భారత క్రికెట్‌ జట్టుకు ఆల్ ద బెస్ట్ చెప్పింది. దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్‌ విజయం సాధించి 29 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆకాంక్షిస్తూ.. #BelieveinBlue అనే హ్యాష్‌ట్యాగ్‌ను రూపొందించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తుంది. 

ఇదిలా ఉంటే, 1992 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా ఇంతవరకు ఒక్క టెస్ట్‌ సిరీస్ కూడా నెగ్గలేకపోయింది. ఇటీవలి కాలంలో విదేశీ గడ్డలపై అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా.. ఈ సారి ఎలాగైనా సిరీస్ నెగ్గాలని భావిస్తుంది. భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం ఏడు టెస్ట్‌ సిరీస్‌లు (దక్షిణాఫ్రికా గడ్డ మీద) జరగ్గా.. ఒక్క సిరీస్‌ను మాత్రమే టీమిండియా డ్రా చేసుకోగలిగింది. ఇక, ప్రస్తుత సిరీస్‌ విషయానికొస్తే.. తొలి టెస్ట్‌ డిసెంబర్ 26న, రెండో టెస్టు వచ్చే ఏడాది జనవరి 3న, సిరీస్‌లో ఆఖరుదైన మూడో టెస్ట్‌ జనవరి 11న జరగనున్నాయి. 
చదవండి: భారత హాకీ జట్టులో కరోనా కలకలం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement