ఐపీఎల్ 2024 సీజన్ ముగిసి రెండు రోజులైనా పూర్తి కాకముందే క్రికెట్ సర్కిల్స్‌ను పొట్టి ప్రపంచకప్ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచకప్ ప్రారంభానికి మరో మూడు రోజులు ఉండగానే అభిమానులతో పాటు విశ్లేషకులు వరల్డ్‌కప్ మోడ్‌లోకి వచ్చారు.
ఈసారి తమ టీమ్ గెలుస్తుందంటే తమ టీమ్ గెలుస్తుందని అభిమానులు నెట్టింట డిబేట్లకు దిగుతున్నారు. విశ్లేషకులు, మాజీలు గెలుపు గుర్రాలపై అంచనాలు వెల్లడిస్తున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు మాజీ క్రికెటర్లు వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరే జట్లపై తమ అంచనాలను వెల్లడించారు. వీరిలో అందరూ భారత్ తప్పక సెమీస్‌కు చేరుతుందని చెప్పడం విశేషం.
టీ20 వరల్డ్‌కప్ 2024 సెమీఫైనలిస్ట్‌ల విషయంలో మాజీల అంచనాలు ఇలా..
అంబటి రాయుడు- భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా
బ్రియాన్ లారా- భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్
పాల్ కాలింగ్‌వుడ్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్
సునీల్ గవాస్కర్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్
క్రిస్ మోరిస్- భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా
మాథ్యూ హేడెన్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా
ఆరోన్ ఫించ్- భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్
మొహమ్మద్ కైఫ్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్
టామ్ మూడీ- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా
శ్రీశాంత్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్
కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడనున్నాయి.
గ్రూప్-ఏలో భారత్, పాక్, ఐర్లాండ్, యూఎస్‌ఏ, కెనడా దేశాలు..
గ్రూప్-బిలో నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా..
గ్రూప్-సిలో ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్..
గ్రూప్-డిలో నెదర్లాండ్స్, నేపాల్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment