world cup semis
-
T20 World Cup 2024: సెమీస్‌కు చేరే జట్లు ఇవే..!
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసి రెండు రోజులైనా పూర్తి కాకముందే క్రికెట్ సర్కిల్స్‌ను పొట్టి ప్రపంచకప్ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచకప్ ప్రారంభానికి మరో మూడు రోజులు ఉండగానే అభిమానులతో పాటు విశ్లేషకులు వరల్డ్‌కప్ మోడ్‌లోకి వచ్చారు. ఈసారి తమ టీమ్ గెలుస్తుందంటే తమ టీమ్ గెలుస్తుందని అభిమానులు నెట్టింట డిబేట్లకు దిగుతున్నారు. విశ్లేషకులు, మాజీలు గెలుపు గుర్రాలపై అంచనాలు వెల్లడిస్తున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు మాజీ క్రికెటర్లు వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరే జట్లపై తమ అంచనాలను వెల్లడించారు. వీరిలో అందరూ భారత్ తప్పక సెమీస్‌కు చేరుతుందని చెప్పడం విశేషం.టీ20 వరల్డ్‌కప్ 2024 సెమీఫైనలిస్ట్‌ల విషయంలో మాజీల అంచనాలు ఇలా..అంబటి రాయుడు- భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాబ్రియాన్ లారా- భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్పాల్ కాలింగ్‌వుడ్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్సునీల్ గవాస్కర్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్క్రిస్ మోరిస్- భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియామాథ్యూ హేడెన్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాఆరోన్ ఫించ్- భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్మొహమ్మద్ కైఫ్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్టామ్ మూడీ- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాశ్రీశాంత్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాక్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా దేశాలు.. గ్రూప్-బిలో నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా.. గ్రూప్-సిలో ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-డిలో నెదర్లాండ్స్, నేపాల్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. -
CWC 2023: సెమీస్‌కు సౌతాఫ్రికా.. ఇంగ్లండ్ ఇంటికి.. మూడు జట్ల మధ్య తీవ్ర పోటీ
వన్డే వరల్డ్‌కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. నిన్నటితో రెండు సెమీస్ బెర్త్‌లు, టోర్నీ నుంచి నిష్క్రమించే రెండు జట్ల పేర్లు ఖరారయ్యాయి. ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత్ రెండు రోజుల కిందటే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. నిన్న పాక్ చేతిలో న్యూజిలాండ్ ఓడటంతో సౌతాఫ్రికా ఫైనల్ ఫోర్కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. ఈ ఎడిషన్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు బంగ్లాదేశ్ కాగా.. నిన్నటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో ఇంగ్లండ్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ ఇరు జట్లు ఏడు మ్యాచ్‌ల్లో చెరి 6 పరాజయాలు మూటగట్టుకుని టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. వీటిలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్ పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. ఈ జట్టు వరుసగా ఐదు పరాజయాలు మూటగట్టుకుని అవమానకర రీతిలో సెమీస్‌కు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. పోటీలో నాలుగు జట్లు.. ప్రస్తుతం మిగిలిన రెండు సెమీస్ బెర్త్‌ల కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో ఆస్ట్రేలియా మూడో బెర్త్‌ను (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) దాదాపుగా ఖరారు చేసుకోగా.. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. న్యూజిలాండ్ సెమీస్‌కు చేరాలంటే.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో (8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 0.398) ఉన్న కివీస్ సెమీస్‌కు చేరాలంటే వారు తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (శ్రీలంక) భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. కీలకపాత్ర పోషించనున్న నెట్ రన్‌రేట్.. ప్రస్తుతం 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన పాక్ సెమీస్‌కు చేరాలంటే వారు తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (ఇంగ్లండ్) భారీ తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది. పాక్, న్యూజిలాండ్‌లు తదుపరి మ్యాచ్‌ల్లో తమతమ ప్రత్యర్దులపై విజయాలు సాధిస్తే సమాన పాయింట్లు (10) కలిగి ఉంటాయి. ఇక్కడ నెట్ రన్‌రేట్ కీలకపాత్ర పోషిస్తుంది. రెండు జట్లలో మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను ఓడించాలి.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే వారు తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను ఓడించాల్సి ఉంటుంది. ఈ జట్టు రెంటిలో ఒకటి ఓడినా సెమీస్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫైనల్ ఫోర్కు చేరుకుంటుంది. అయితే పటిష్టమైన ఆసీస్, సౌతాఫ్రికాలను ఓడించడం ఆఫ్ఘనిస్తాన్‌కు అంత సులువు కాదు. -
CWC 2022: వెస్టిండీస్‌ను చిత్తు చేసి.. భారీ విజయంతో వరల్డ్‌కప్ ఫైనల్‌కు
ICC women World Cup 2021: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఓటమన్నదే ఎరుగని ఆసీస్.. సెమీస్‌లోనూ జయభేరి మోగించింది. అజేయ రికార్డును కొనసాగిస్తూ వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే, వర్షం అంతరాయం కలిగించిన కారణంగా మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హేన్స్(85), హేలీ(129) అదిరిపోయే ఆరంభం అందించారు. బెత్ మూనీ 43 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ ముగ్గురి అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా నిర్ణీత 45 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 305 పరుగుల భారీ స్కోరు సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ డియాండ్ర డాటిన్ శుభారంభం అందించింది. 34 పరుగులతో రాణించింది. వన్‌డౌన్‌లో వచ్చిన హేలీ మాథ్యూస్ 34, కెప్టెన్ స్టెఫానీ టేలర్ 48 పరుగులు సాధించారు. ఆ తర్వాత టపటపా వికెట్లు పడ్డాయి. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. దీంతో 37 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయి వెస్టిండీస్ కుప్పకూలింది. 157 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అలీసా హేలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 తొలి సెమీ ఫైనల్ ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ స్కోర్లు ఆస్ట్రేలియా- 305/3 (45) వెస్టిండీస్- 148 (37) చదవండి: SRH Vs RR: 8 కోట్లు పెట్టి కొన్నది ఎనిమిదో స్థానంలో ఆడించడానికా? పూరన్‌పై మీకు నమ్మకం.. కానీ View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: ‘హమ్మయ్య భారత్ ఓడిపోయింది’.. వెస్టిండీస్ సంబరాలు.. వైరల్
ICC Women World Cup 2022: తెలిసో తెలియకో ఒకరికి ఎదురైన పరాభవం మరొకరి పాలిట వరమవుతుంది. ఒకరి బాధ పరోక్షంగా మరొకరి సంతోషానికి కారణం అవుతుంది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ భారత్, వెస్టిండీస్ జట్లకు ఇలాంటి అనుభవాన్నే మిగిల్చింది. మెగా ఈవెంట్ సెమీ ఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఆఖరి నిమిషంలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో రిక్త హస్తాలతోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. నో బాల్ రూపంలో దురదృష్టం వెంటాడంతో మిథాలీ సేనకు భంగపాటు తప్పలేదు. దీంతో భారత జట్టు బాధతో వెనుదిరగగా.. వెస్టిండీస్ మాత్రం సంబరాలు చేసుకుంది. ఆఖరి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన దక్షిణాఫ్రికా- భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించిన వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు.. మిథాలీ సేన ఓటమి పాలు కావడంతో ఎగిరి గంతేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) సౌతాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో విండీస్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాప్-4 అంటే సెమీస్ చేరే క్రమంలో ఇంగ్లండ్ బంగ్లాదేశ్‌తో, భారత్ దక్షిణాఫ్రికాతో తలపడ్డాయి. ఆదివారం నాటి ఈ రెండు మ్యాచ్‌లలో ఇంగ్లండ్ విజయం సాధించి సెమీస్ చేరగా.. భారత్ ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఫలితంగా ఇంగ్లండ్‌తో పాటు వెస్టిండీస్ సెమీ ఫైనల్లో నిలిచింది. ఇదే వారి ఆనందానికి కారణమైంది. ఈ క్రమంలో వారి సంబరాలు అంబరాన్నంటాయి. హమ్మయ్య భారత్ ఓడిపోయిందన్నట్లుగా వారు సంతోషంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి.. సెమీస్ చేరిన ఇంగ్లండ్.. ఇక భారత్!
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్‌కు చేరింది. బంగ్లాదేశ్‌పై 100 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తర్వాత సెమీస్ చేరిన మూడో జట్టుగా హీథర్‌నైట్ బృందం నిలిచింది. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో ఆదిలోనే డానియెల్ వ్యాట్(6) వికెట్ కోల్పోయినప్పటికీ... ఓపెనర్ బీమౌంట్ 33 పరుగులతో పర్వాలేదనిపించింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ హీథర్‌నైట్ సైతం 6 పరుగులకే నిష్క్రమించడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటర్ నటాలీ సీవర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. 40 పరుగులతో రాణించింది. View this post on Instagram A post shared by ICC (@icc) మరోవైపు వికెట్ కీపర్ అమీ జోన్స్ ఆమెకు అండగా నిలబడింది. ఇక 72 బంతుల్లో 67 పరుగులు సాధించిన సోఫియా డంక్లే ఇంగ్లండ్ మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖర్లో బ్రంట్ 24, ఎక్లెస్‌స్టోన్ 17 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు షమీమా సుల్తానా, షర్మిన్ అక్తర్ చెరో 23 పరుగులు సాధించి శుభారంభం అందించారు. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే మిడిలార్డర్ దీనిని కొనసాగించలేకపోయింది. దీంతో 48 ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి బంగ్లా జట్టు ఆలౌట్ అయింది. దీంతో విజయం ఇంగ్లండ్ సొంతమైంది. సరిగ్గా వంద పరుగుల తేడాతో హీథర్‌నైట్ బృందం గెలుపొందింది. విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ బ్యాటర్ సోఫియా డంక్లేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే ఇంగ్లండ్‌తో పాటు టాప్-4లో నిలుస్తుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప- 2022 ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్లు ఇంగ్లండ్- 234/6 (50) బంగ్లాదేశ్- 134 (48) View this post on Instagram A post shared by ICC (@icc) -
నెటిజన్లపై బాలీవుడ్ ఆగ్రహం
ముంబై: భారత్, ఆస్ట్రేలియాల ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో విరాట్ కోహ్లీ విఫలమవడానికి అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కారణమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేయడంపై బాలీవుడ్ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుష్కకు మద్దతు తెలుపుతూ నెటిజన్లపై పరుష పదజాలం వాడారు. అనుష్కను విమర్శించేవాళ్లు చదువుకోని మూర్ఖులు అంటూ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ ఘాటుగా స్పందించారు. ఇంకా భాలీవుడ్ భామలు ప్రియాంక చోప్రా, సుస్మితా సేన్, దియా మీర్జా తదితరులు అనుష్కకు అండగా నిలిచారు. స్నేహితుడికి మద్దతుగా మ్యాచ్ చూడటం తప్పా అని ప్రియాంక నెటిజన్లను విమర్శించారు. సెమీస్‌లో టీమిండియా ఓడిపోవడం అభిమానులకు నిరాశకు గురిచేసిఉండొచ్చు, అయితే అనుష్కను నిందించడం దారుణమని దియా మీర్జా తప్పుపట్టారు. ఇలాంటి కామెంట్లు ఆపాలని సూచించారు. ఈ మ్యాచ్‌లో గెలవడం ఆస్ట్రేలియా ఘనతని, ఇందుకు వ్యక్తిగతంగా ఎవర్నీ నిందించివద్దని అర్జున్ కపూర్ అన్నారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా నెటిజన్ల వ్యాఖ్యలను తప్పుపడుతూ, అనుష్కను నిందించడం ఆపాలని పేర్కొన్నారు. సెమీస్ సందర్భంగా విరాట్ కోహ్లీకి మద్దతు తెలిపేందుకు అనుష్క శర్మ ఆస్ట్రేలియా వెళ్లడం.. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ విఫలమవడం.. గ్యాలరీలో అనుష్క కనిపించడం.. టీమిండియా ఓడిపోయాక నెటిజన్లు అనుష్క లక్ష్యంగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.