నీ భార్య విధుల్లో ఉంటే.. ఒంటరిగా ఏం చేస్తున్నావ్‌ బుమ్రా! | What Is Bumrah Doing Alone Twitter Hilariously Reacts To Sanjana | Sakshi
Sakshi News home page

ట్విటర్‌ వేదికగా బుమ్రాపై సెటైర్లు

Published Fri, Mar 26 2021 5:12 PM | Last Updated on Fri, Mar 26 2021 5:29 PM

 What Is Bumrah Doing Alone Twitter Hilariously Reacts To Sanjana - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా స్పీడ్‌గన్‌ జస్ప్రీత్ బుమ్రా.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌‌ను అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మార్చి 15న గోవాలో పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం జరిగి నెల రోజులు కూడా గడవక ముందే ఆయన సతీమణి సంజన, విధులకు హాజరుకావడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా ప్రముఖ క్రీడా ఛానెల్‌ (స్టార్‌ స్పోర్ట్స్) స్టూడియోలో సంజన ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు సరదాగా సెటైర్లు వేస్తున్నారు.

వృత్తి పట్ల సంజనకు ఉన్న నిబద్దతను కొనియాడుతూనే, బూమ్రాకు కౌంటర్లు ఇస్తున్నారు. "భార్య విధులకు హాజరైతే, నువ్వు ఒంటరిగా ఏం చేస్తున్నావంటూ.." కొందరు, "బుమ్రా ఇంకా అదే(హాలిడే) మూడ్‌లో ఉన్నట్టున్నావ్‌.. నీ భార్య డ్యూటీ ఎక్కేసిందంటూ.." మరికొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తర్వాత బుమ్రా.. బ్రేక్‌ తీసుకుని, భాగస్వామితో సరదాగా గడుపుతున్నాడు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌లో అతను తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement