
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆఖరి బంతికి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ డివిలియర్స్ మెరుపులతో 2 వికెట్ల తేడాతో ఆఖరిబంతికి విజయాన్ని అందుకుంది. ఇటీవలే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో 'తగ్గేదే..లే' అనే డైలాగ్ చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో బన్నీ చెప్పిన డైలాగ్, ఆయన మేనరిజమ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిని పేరడీగా తీసుకొని స్టార్‌స్పోర్ట్స్ తెలుగు తన అఫీషియల్ ట్విటర్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫోటోతో మార్పింగ్ చేసి ఒక కామెంట్‌ను జత చేసింది.
''తగ్గేదే.. లే ఆరంభం అదిరింది.. ఓటమి సరిహద్దుల దాకా వెళ్ళి విజృంభించే ప్రదర్శన మాదే అన్నట్టు ఆడేసారు.. సరిలేరు మీకెవ్వరు అనే మాటకి నిదర్శనంగా నిలిచారు'' అంటూ రాసుకొచ్చింది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు పెట్టిన ఈ కామెంట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. నెటిజన్లు కూడా ఆర్‌సీబీ మద్దతుగా కామెంట్స్ చేశారు. అవును టైటిల్ గెలిచేవరకు తగ్గేదే..లే.. అంటూ కామెంట్లు పెట్టారు. కాగ ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 14న చెన్నై వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడనుంది.
చదవండి: ఐపీఎల్ 2021: తొలి మ్యాచ్‌కే ఇలా అయితే ఎలా?
'పంత్ కూల్‌గా ఉండడం మాకు కలిసొచ్చింది'
తగ్గేదే.. లే ❗😎
— StarSportsTelugu (@StarSportsTel) April 9, 2021
ఆరంభం అదిరింది
ఓటమి సరిహద్దుల దాకా వెళ్ళి
విజృంభించే ప్రదర్శన మాదే అన్నట్టు ఆడేసారు 😍
సరిలేరు మీకెవ్వరు అనే మాటకి నిదర్శనంగా నిలిచారు 🙌#KohliMantra ఫలించింది మొదటి మ్యాచ్‌లో #RCB గెలిచేసింది#VIVOIPL #MIvsRCB pic.twitter.com/x4n69Wa0Td
Comments
Please login to add a commentAdd a comment