కోవిడ్-19 దెబ్బకు ఐపీఎల్-14 వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండో దఫా ఐపీఎల్-14 యూఎఈలో కొనసాగుతుంది. ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులను దక్కించుకున్న స్టార్‌స్పోర్ట్స్‌కు యాడ్స్ రూపంలో కనక వర్షం కురుస్తోంది. ఐపీఎల్-14 రెండో దఫా నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్ యాడ్ రేట్లను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.దసరా, దీపావళి పండుగ సీజన్ల నేపథ్యంలో పలు కంపెనీ బ్రాండ్స్ నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో సుమారు 25 శాతం నుంచి 30 శాతం మేర యాడ్స్ రేట్లను పెంచింది.
చదవండి: Forgotten Password: పాస్‌వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...!
విశ్వసనీయ వర్గాల ప్రకారం.. తొలి దఫా ఐపీఎల్‌లో ఒక యాడ్ పది సెకన్ల పాటు టీవీలో కన్పించేందుగాను సుమారు రూ. 13 నుంచి 14 లక్షలు ఉండగా...ప్రస్తుతం రూ. 18 లక్షలను ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాడ్స్ పెంపుపై స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం స్పందించలేదు. స్టార్‌స్పోర్ట్స్‌ను ఇప్పటివరకు 12 బ్రాండ్ కంపెనీలు సంప్రదించారు. సహ-సమర్పణ స్పాన్సర్‌లుగా... డ్రీమ్ 11, ఫోన్‌పే, బైజుస్ ఉన్నాయి. అసోసియేట్ స్పాన్సర్‌లుగా..బింగో, కమలా పసంద్, ఏఎమ్‌ఏఫ్‌ఐ, ఏషియన్ పెయింట్స్, క్యాడ్‌బరీ డైరీ మిల్క్, అమెజాన్ ప్రైమ్, థమ్స్ అప్, గార్నియర్ మెన్, క్రెడ్ కంపెనీలు ఉన్నాయి
ఎక్స్‌చేంజ్4మీడియా నివేదిక ప్రకారం...ఐపీఎల్-14 మొదటి దశలో 10 సెకన్ల యాడ్స్‌కు సుమారు రూ. 14.1 నుంచి 14.3 లక్షలను స్టార్‌స్పోర్ట్స్ ఛార్జ్ చేసింది. సహ-ప్రాయోజిత వ్యయం రూ.110-125 కోట్ల పరిధిలో ఉండగా, అసోసియేట్ స్పాన్సర్‌షిప్ ధర రూ.65-70 కోట్లుగా ఉంది. బ్రాడ్‌కాస్టర్ సహ-సమర్పించే స్పాన్సర్‌ల నుంచి 10 సెకన్లకు 13.2 లక్షలు, అసోసియేట్ స్పాన్సర్‌ల నుంచి 10 సెకన్లకు 13.6 లక్షలను వసూలు చేసింది.
చదవండి: iPhone13: ఐఫోన్-13పై చిప్ దెబ్బ..కొన్ని వారాలు ఎదురు చూడాల్సిందేనా?
Comments
Please login to add a commentAdd a comment