ఆసియాలో ఆధిపత్యం కోసం యుద్ధం.. ఆసియా కప్‌ 2022 ప్రోమో అదుర్స్‌..! | Star Sports Releases Asia Cup Promo | Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌ 2022 ప్రోమోను విడుదల చేసిన స్టార్‌ స్పోర్ట్స్‌

Published Sat, Jul 23 2022 4:59 PM | Last Updated on Sat, Jul 23 2022 4:59 PM

Star Sports Releases Asia Cup Promo - Sakshi

Asia Cup 2022: నాలుగేళ్లుగా క్రికెట్‌ అభిమానులను ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న ఆసియా కప్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. యూఏఈ వేదికగా ఆగస్ట్‌ 27 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ జట్లు ఇదివరకే అర్హత సాధించగా.. ఆరో బెర్త్‌ కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యూఏఈలు క్వాలిఫికేషన్ రౌండ్‌లో తలపడనున్నాయి.

తాజాగా టోర్నీకి సంబంధించిన ప్రోమోను ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ట్విటర్ వేదికగా విడుదల చేస్తూ.. ఆసియాలో ఆధిపత్యం కోసం యుద్ధం అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 45 సెకెన్ల పాటు సాగిన ఈ ప్రోమోలో అత్యధిక భాగం భారత ఆటగాళ్లు దర్శనమివ్వగా.. పాక్‌ నుంచి బాబర్‌ ఆజమ్‌, షాహిన్‌ అఫ్రిది, బంగ్లాదేశ్‌ నుంచి షకీబ్‌ అల్‌ హసన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున రషీద్‌ ఖాన్‌ కనిపించారు. ఈ టోర్నీలో ఆగస్టు 28న భారత్-పాకిస్తాన్‌ జట్లు గ్రూప్ దశలో తలపడనున్న విషయం తెలిసిందే.
చదవండి: టీమిండియా డ్రెస్సింగ్ రూంలో అనుకోని అతిధి.. ఏం చేశాడో చూడండి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement