
హైదరాబాద్: స్టార్ స్పోర్ట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. వ్యాపార విస్తరణతో పాటు అభిమానులకు మరింత చేరువకావాలనే ఉద్దేశంతో స్టార్ సంస్థలు ప్రాంతీయ భాషలపై దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు చానల్ ప్రారంభించింది. ఇప్పటికే ప్రో కబడ్డీ ఆరో సీజన్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్.. క్రీడా అభిమానులకు మరింత చేరువయ్యేందుకు మరో ముందుడుగేసింది.
ఆస్ట్రేలియా పర్యటన అనంతరం టీమిండియా న్యూజిలాండ్‌కు పయనమవనుంది. ఈ పర్యటనలో కివీస్‌తో కోహ్లి సేన ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేయనుంది. దీనిలో భాగంగా సిరీస్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా స్టార్ స్పోర్స్ట్ విడుదల చేసింది. ‘కె అంటే కోహ్లి.. కోహ్లి న్యూజిలాండ్ వస్తున్నాడు. అప్పుడు తెలుస్తుంది నిజమైన కింగ్ ఎవరనేది’ అంటూ తెలుగులో సంభాషణలు ఉండటంతో తెలుగు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన ప్రోమో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ప్రాంతీయ భాషలో క్రికెట్ కామెంటరీ వినబోతుండటం ఆనందంగా ఉందని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment