India win by 372 runs against new zealand: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 372పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 2 టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో భారత్ కైవసం చేసుకుంది. కగా 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. కాగా ఓవర్‌నైట్ స్కోరు 140/5 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ కివీస్.. భారత స్పిన్నర్ జయంత్ యాదవ్ మాయాజాలంకు వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.
కాగా అంతకుముందు భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 276/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిసి న్యూజిలాండ్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్‌ల్లో 150 పరుగులతో మయాంక్ అగర్వాల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలరల్లో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, సిరాజ్ మూడు వికెట్లు సాధించాడు.
ఇక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా మయాంక్ అగర్వాల్ ఎంపిక అవ్వగా, అశ్విన్ మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. కాగా భారత్‌కు పరుగుల ద్వారా ఇదే అతి పెద్ద విజయం. అంతకు ముందు 2015 లో ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాను 337 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అదే విధంగా టీమిండియా పై న్యూజిలాండ్ చివరసారిగా భారత్ వేదికగా 1988లో విజయం సాధించింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: IND Vs NZ: ఏంటి అశ్విన్.. బాహుబలిలో నీవు ఏమైనా ప్రభాస్ అనుకున్నావా..
Comments
Please login to add a commentAdd a comment