India Vs New Zealand test series
-
IND vs NZ: ‘కివీ’ చేతుల్లో ఖేల్ ఖతం!
అనూహ్యం, అసాధారణమేమీ జరగలేదు...న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ తమ వైఫల్యాన్ని కొనసాగించారు...భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కుప్పకూలి సిరీస్‌ను అప్పగించేశారు... సొంతగడ్డపై కూడా స్పిన్‌ను ఆడలేని తమ బలహీనతను మళ్లీ ప్రదర్శిస్తూ టీమిండియా తలవంచింది...ఫలితంగా పుష్కర కాలం తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ చేజారింది... ఒక్క యశస్వి జైస్వాల్ మాత్రమే ధాటిగా ఆడి ఆశలు రేపినా... మిగతావారంతా చేతులెత్తేయడంతో మూడో రోజుకే మ్యాచ్ ముగిసింది... కివీ బౌలర్ సాంట్నర్ మరోసారి తన మాయాజాలం ప్రదర్శిస్తూ ఆరు వికెట్లతో చెలరేగాడు. శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడి ఏమాత్రం అంచనాలు, ఆశలు లేకుండా భారత గడ్డపై అడుగుపెట్టిన న్యూజిలాండ్ బృందం అసాధారణ ప్రదర్శనతో ఏకంగా 2–0తో సిరీస్‌నే గెలుచుకోవడం విశేషం. ఇక భారత్ ముందు మిగిలింది చివరి మ్యాచ్‌లో నెగ్గి కాస్త పరువు కాపాడుకోవడమే! పుణే: స్వదేశంలో భారత జట్టు అనూహ్య రీతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. శనివారం ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లోనూ నెగ్గిన ఆ జట్టు మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. 359 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (65 బంతుల్లో 77; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధసెంచరీ చేయగా, రవీంద్ర జడేజా (84 బంతుల్లో 42; 2 ఫోర్లు) చివర్లో కాస్త పోరాడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ సాంట్నర్ (6/104) మరోసారి భారత్‌ను దెబ్బ కొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 198/5తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 69.4 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. ఫిలిప్స్ (48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్లన్‌డెల్ (41; 3 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. భారత బౌలర్లలో సుందర్ 4, జడేజా 3 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు నవంబర్ 1 నుంచి ముంబైలో జరుగుతుంది. జైస్వాల్ మినహా... క్రీజ్‌లో జైస్వాల్ ఉన్నంత సేపు భారత జట్టు లక్ష్యంపై గురి పెట్టి దూకుడైన ఆటను ప్రదర్శించేందుకు సిద్ధమైందని అనిపించింది. ఒక వైపు రోహిత్ (8) మళ్లీ విఫలమైనా...మరో ఎండ్‌లో జైస్వాల్ తొలి ఓవర్‌నుంచే బౌండరీలతో చెలరేగాడు. అతనికి శుబ్‌మన్ గిల్ (23) కూడా కొద్ది సేపు సహకరించాడు. లంచ్ సమయానికి భారత్ 81/1తో మెరుగైన స్థితిలో కనిపించగా... విరామం తర్వాత 41 బంతుల్లోనే జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. అయితే రెండో సెషన్లో గిల్‌ను అవుట్ చేసి పతనానికి శ్రీకారం చుట్టిన సాంట్నర్ ఆ తర్వాత జైస్వాల్ వికెట్‌నూ ఖాతాలో వేసుకున్నాడు. మరో ఐదు బంతులకే పంత్ (0) అనవసరపు సింగిల్‌కు ప్రయతి్నంచి రనౌట్ కావడం జట్టను మరింత దెబ్బ తీసింది. కోహ్లి పాయింట్ దిశగా ఆడి పరుగు ప్రారంభించగా... పంత్ మరో ఆలోచన లేకుండా దూసుకొచ్చాడు. అయితే అతను డైవ్ చేసినా లాభం లేకపోయింది. కోహ్లి (17)ని సాంట్నర్ ఎల్బీగా దొరకబుచ్చుకోగా, భారత బ్యాటర్ రివ్యూ చేసినా ఫలితం దక్కలేదు. అనంతరం రెండు పరుగుల వ్యవధిలో సర్ఫరాజ్ (9), సుందర్ (21) అవుటయ్యారు. జడేజా, అశి్వన్ (18) కొద్ది సేపు ప్రతిఘటించినా... అదీ ఎక్కువ సేపు సాగలేదు. అంతకు ముందు న్యూజిలాండ్ మూడో రోజు మరో 16.4 ఓవర్లు ఆడి మరో 57 పరుగులు జోడించగలిగింది. స్కోరు వివరాలు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 259; భారత్ తొలి ఇన్నింగ్స్ 156; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) సుందర్ 86; కాన్వే (ఎల్బీ) (బి) సుందర్ 17; యంగ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 23; రచిన్ (బి) సుందర్ 9; మిచెల్ (సి) జైస్వాల్ (బి) సుందర్ 18; బ్లన్‌డెల్ (బి) జడేజా 41; ఫిలిప్స్ (నాటౌట్) 48; సాంట్నర్ (సి) బుమ్రా (బి) జడేజా 4; సౌతీ (సి) రోహిత్ (బి) అశి్వన్ 0; ఎజాజ్ (సి) సుందర్ (బి) జడేజా 1; రూర్కే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (69.4 ఓవర్లలో ఆలౌట్) 255. వికెట్ల పతనం: 1–36, 2–78, 3–89, 4–123, 5–183, 6–231, 7–237, 8–238, 9–241, 10–255. బౌలింగ్: అశి్వన్ 25–2–97–2, సుందర్ 19–0–56–4, జడేజా 19.4–3–72–3, బుమ్రా 6–1–25–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మిచెల్ (బి) సాంట్నర్ 77; రోహిత్ (సి) యంగ్ (బి) సాంట్నర్ 8; గిల్ (సి) మిచెల్ (బి) సాంట్నర్ 23; కోహ్లి (ఎల్బీ) (బి) సాంట్నర్ 17; పంత్ (రనౌట్) 0; సుందర్ (సి) యంగ్ (బి) ఫిలిప్స్ 21; సర్ఫరాజ్ (బి) సాంట్నర్ 9; జడేజా (సి) సౌతీ (బి) పటేల్ 42; అశ్విన్ (సి) మిచెల్ (బి) సాంట్నర్ 18; ఆకాశ్‌దీప్ (సి) రచిన్ (బి) ఎజాజ్ 1; బుమ్రా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (60.2 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–34, 2–96, 3–127, 4–127, 5–147, 6–165, 7–167, 8–206, 9–229, 10–245. బౌలింగ్: సౌతీ 2–0–15–0, రూర్కే 1–0–5–0, సాంట్నర్ 29–2–104–6, ఎజాజ్ 12.2–0–43–2, ఫిలిప్స్ 16–0–60–1. 12భారత జట్టు స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయింది. 2012లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా 1–2తో ఓడింది. 18 తాజా ఓటమికి ముందు స్వదేశంలో భారత్ వరుసగా గెలిచిన సిరీస్‌ల సంఖ్య.1 భారత గడ్డపై న్యూజిలాండ్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. గతంలో కివీస్ ఇక్కడ 12 సిరీస్‌లు ఆడగా...10 ఓడి 2 డ్రా చేసుకుంది. -
IND vs NZ: ఆ అద్భుతం సాధ్యమా!
బెంగళూరు: న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఓడిపోయి 37 ఏళ్లు గడిచాయి. 1987లో చివరిసారి భారత జట్టుకు న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై పరాజయం ఎదురైంది. సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి భారత జట్టుకు న్యూజిలాండ్ చేతిలో ఓటమి ముప్పు పొంచి ఉంది. అయితే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం... క్రీజులోకి రావాల్సిన భారత బ్యాటర్లకు భారీ స్కోర్లు చేసే సత్తా ఉండటంతో అద్భుతం జరుగుతుందా అనే ఆశ అభిమానుల్లో ఉంది. ఎందుకంటే 2001లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆ్రస్టేలియాతో జరిగిన టెస్టులోనూ భారత జట్టు ఇలాగే ప్రత్యరి్థకి తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సమరి్పంచుకొని... ఆ తర్వాత తిరిగి పుంజుకుని విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌కు 274 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ అసాధారణ ఆటతీరుతో కంగారూల నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఇప్పుడు తాజా మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌కు 356 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇంత భారీ లోటును పూడ్చాలంటే... రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతం జరగాల్సింది. అలాంటి అరుదైన సందర్భానికి శుక్రవారం బ్యాటింగ్ చేసిన నలుగురు నాంది పలకగా... నాలుగో రోజు మిగిలిన వాళ్లు దాన్ని కొనసాగించాల్సి ఉంది. దేశవాళీల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడిన అనుభవం ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశి్వన్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. అయితే కీపింగ్ చేస్తూ గాయపడ్డ పంత్ బ్యాటింగ్ చేయడంపై స్పష్టత లేదు. సొంతగడ్డపై పూర్తిస్థాయి బ్యాటర్ల కన్నా మంచి ఇన్నింగ్స్‌లు ఆడే ఆల్‌రౌండర్లు అశి్వన్, జడేజా రాణించాల్సిన అవసరం ఉంది. టీమిండియాకు కనీసం రెండొందల పరుగుల ఆధిక్యం దక్కితే తప్ప... బెంగళూరులో బౌలర్లు కూడా పెద్దగా చేయగలిగిందేమీ లేదు! -
46 రన్స్ కే కుప్పకూలిన టీమిండియా
-
అందుకే విరాట్‌ను ప్రపంచపు అత్యుత్తమ కెప్టెన్ అనేది: పాక్ మాజీ సారధి
Salman Butt Praises Virat Kohli For Supporting Rahane: గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు అండగా నిలిచిన టీమిండియా సారధి విరాట్ కోహ్లిపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి.. తన బృందంలోని సభ్యులపై అపారమైన నమ్మకం కలిగి ఉంటాడని, కష్ట సమయాల్లో వారికి అండగా నిలిచి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడని.. ఈ లక్షణాలే అతన్ని ప్రపంచపు అత్యుత్తమ కెప్టెన్‌గా నిలబెట్టడంలో దోహదపడ్డాయని తెలిపాడు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లందరూ ఫామ్ కోల్పోయిన తమ బృంద సభ్యులకు మద్దుతుగా నిలిచారని, ఇలా చేయడం వల్ల ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగి అత్యుత్తమంగా రాణించారని, చరిత్రే ఇందుకు సాక్షమని పేర్కొన్నాడు. తన గైర్హాజరీలో బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ అద్భుతంగా రాణించి ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించిన రహానేపై నమ్మకముంచడం అంత ఆశ్చర్యకరమైన విషమేమీ కాదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు సల్మాన్ బట్ తన యూట్యుబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా, కోహ్లీ గైర్హాజరీలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే.. మ్యాచ్ మొత్తంలో 39(35, 4) పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమై జట్టులో స్థానాన్ని ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా కెప్టెన్ విరాట్ కోహ్లి.. రహానేకు బాసటగా నిలిచారు. రహానే ఫామ్‌పై బయటి వ్యక్తులు చేస్తున్న విమర్శలు తుది జట్టులో అతని ఎంపికపై ప్రభావం చూపవని వారిరువురు అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే, అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీతో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ లేదా హనుమ విహారిల్లో ఎవరో ఒకరు రహానే స్థానాన్ని భర్తీ చేస్తారని బీసీసీఐ వర్గాల్లో చర్చ సాగుతోంది. రహానే సహా ఫామ్‌లో లేని పుజారాపై సైతం వేటు వేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. చదవండి: త్వరలో కీలక ప్రకటన చేయనున్న కేకేఆర్ స్టార్ బౌలర్.. -
ఐదు పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు.. భారత్ ఘన విజయం
కేవలం 43 నిమిషాలు... 11.3 ఓవర్లు... ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చడానికి నాలుగో రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్లు తీసుకున్న సమయం. నాలుగేళ్ల తర్వాత మళ్లీ టెస్టు ఆడిన ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ నాలుగో రోజు మొదటి సెషన్లో నాలుగు వికెట్ల తీయగా... నికోల్స్‌ను అవుట్ చేసి అశ్విన్ భారత జట్టుకు తమ టెస్టు చరిత్రలోనే పరుగుల పరంగా అతి పెద్ద విజయాన్ని ఖరారు చేశాడు. ఈ సిరీస్ గెలుపుతో భారత్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ను రెండో స్థానానికి వెనక్కి నెట్టి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ముంబై: సొంతగడ్డపై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ భారత క్రికెట్ జట్టు వరుసగా 14వ టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో భారత్ 372 పరుగుల తేడాతో బ్రహ్మాండమైన విజయం సాధించింది. 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 56.3 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 27 పరుగులు జతచేసి న్యూజిలాండ్ మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్లు అశ్విన్, జయంత్ యాదవ్ నాలుగు వికెట్ల చొప్పున తీయగా... మరో వికెట్ ఎడంచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ ఖాతాలోకి వెళ్లింది. ఈ గెలుపుతో భారత్ రెండు టెస్టుల సిరీస్‌ను 1–0తో కైవసం చేసుకుంది. కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ చేసిన భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుతోపాటు రూ. 1 లక్ష ప్రైజ్‌మనీ... రెండు టెస్టుల్లో పొదుపుగా బౌలింగ్ చేసి మొత్తం 14 వికెట్లు తీసిన భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారంతోపాటు రూ. 2 లక్షల 50 వేలు ప్రైజ్‌మనీ లభించాయి. కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో భారత్ రెండో సిరీస్‌ను దక్కించుకుంది. టి20 సిరీస్‌ను టీమిండియా 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 5 పరుగులు... 5 వికెట్లు ఓవర్‌నైట్ స్కోరు 140/5తో ఆట నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ బ్యాటర్లు నికోల్స్ (44; 8 ఫోర్లు), రచిన్ రవీంద్ర (18; 4 ఫోర్లు) తొలి ఆరు ఓవర్లపాటు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 22 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్ 52వ ఓవర్లో జయంత్ బౌలింగ్‌లో రచిన్ రెండో స్లిప్‌లో పుజారాకు క్యాచ్ ఇవ్వడంతో కివీస్ 162 పరుగులవద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జయంత్ ఐదు బంతుల వ్యవధిలో జేమీసన్ (0), సౌతీ (0), సోమర్విల్లే (1)లను అవుట్ చేశాడు. చివరగా అశ్విన్ బౌలింగ్‌లో నికోల్స్ స్టంపౌట్ కావడంతో న్యూజిలాండ్ ఓటమి ఖరారైంది. కివీస్ చివరి ఐదు వికెట్లను ఐదు పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 325; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62; భారత్ రెండో ఇన్నింగ్స్: 276/7 డిక్లేర్డ్; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 6; విల్ యంగ్ (సి) సూర్యకుమార్–సబ్ (బి) అశ్విన్ 20; డరైల్ మిచెల్ (సి) జయంత్ యాదవ్ (బి) అక్షర్ పటేల్ 60; రాస్ టేలర్ (సి) పుజారా (బి) అశ్విన్ 6; నికోల్స్ (స్టంప్డ్) సాహా (బి) అశ్విన్ 44; బ్లన్‌డెల్ (రనౌట్) 0; రచిన్ రవీంద్ర (సి) పుజారా (బి) జయంత్ యాదవ్ 18; జేమీసన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జయంత్ యాదవ్ 0; టిమ్ సౌతీ (బి) జయంత్ యాదవ్ 0; సోమర్విల్లే (సి) మయాంక్ అగర్వాల్ (బి) జయంత్ యాదవ్ 1; ఎజాజ్ పటేల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (56.3 ఓవర్లలో ఆలౌట్) 167. వికెట్ల పతనం: 1–13, 2–45, 3–55, 128, 5–129, 6–162, 7–165, 8–165, 9–167, 10–167. బౌలింగ్: సిరాజ్ 5–2–13–0, అశ్విన్ 22.3–9–34–4, అక్షర్ పటేల్ 10–2–42–1, జయంత్ యాదవ్ 14–4–49–4, ఉమేశ్ యాదవ్ 5–1–19–0. -
ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టేది అతడే..
Ravi Ashwin to break Muttiah Muralitharan Test record: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై బారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రీలంక గ్రేట్ ముత్తయ్య మురళీధరన్‌ను అధిగమించి టెస్ట్ క్రికెట్లో ఆల్ టైమ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచే సత్తా అశ్విన్‌కు ఉందని అతడు తెలిపాడు. ప్రస్తుతం అశ్విన్.. ఫాస్ట్ బౌలర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ల వికెట్లకు దగ్గరగా ఉన్నడాని బంగర్ చెప్పాడు. ఇప్పటికే అశ్విన్ టెస్ట్ క్రికెట్లో 427 వికెట్లు పడగొట్టాడని, మురళీధరన్‌ను అధిగమించే అన్ని అవకాశాలు అశ్విన్‌కు ఉన్నాయని బంగర్ అభిప్రాయపడ్డాడు. "అతను కొన్నాళ్లపాటు పాటు ఫిట్‌గా ఉంటే మురళీధరన్ రికార్డును అధిగమించగలడు. ఎందుకంటే అతని రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలిగితే అది రవిచంద్రన్ అశ్విన్ అని ముత్తయ్య మురళీధరన్ స్వయంగా చెప్పాడు" అని బంగర్ స్టార్ స్పోర్ట్స్‌లో పేర్కొన్నాడు. "అశ్విన్ టెస్ట్క్రికెట్లో లాంగ్ స్పెల్ బౌలింగ్ బౌలింగ్ చేస్తాడు. అతను టెస్ట్ క్రికెట్లో ఆడుతున్నప్పుడు తన ఆఫ్ స్పిన్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తాడు. కాబట్టి మురళీధరన్ రికార్డు బ్రేక్ చేయగలడని నేను భావిస్తున్నాను" అని బంగర్ తెలిపాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌తో జరగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో అశ్విన్ మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND Vs NZ: ముంబై టెస్ట్‌లో రికార్డు సృష్టించిన భారత్.. 1-0 తేడాతో సిరీస్ కైవసం -
IND Vs NZ: ముంబై టెస్ట్‌లో రికార్డు సృష్టించిన భారత్.. 1-0 తేడాతో సిరీస్ కైవసం
India win by 372 runs against new zealand: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 372పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 2 టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో భారత్ కైవసం చేసుకుంది. కగా 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. కాగా ఓవర్‌నైట్ స్కోరు 140/5 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ కివీస్.. భారత స్పిన్నర్ జయంత్ యాదవ్ మాయాజాలంకు వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. కాగా అంతకుముందు భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 276/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిసి న్యూజిలాండ్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్ల్లో 150 పరుగులతో మయాంక్ అగర్వాల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలరల్లో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, సిరాజ్ మూడు వికెట్లు సాధించాడు. ఇక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా మయాంక్ అగర్వాల్ ఎంపిక అవ్వగా, అశ్విన్ మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. కాగా భారత్‌కు పరుగుల ద్వారా ఇదే అతి పెద్ద విజయం. అంతకు ముందు 2015 లో ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాను 337 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అదే విధంగా టీమిండియా పై న్యూజిలాండ్ చివరసారిగా భారత్ వేదికగా 1988లో విజయం సాధించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: IND Vs NZ: ఏంటి అశ్విన్.. బాహుబలిలో నీవు ఏమైనా ప్రభాస్ అనుకున్నావా.. -
Ind Vs Nz 2nd Test: రెండో టెస్ట్‌లో కివీస్‌పై భారత్ భారీ విజయం
India Vs Nz 2nd Test Day 4 2021 Highlights & Updates.. సమయం 10:20Am ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 540 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు సాధించగా, కివీస్ కేవలం 62 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కాగా టెస్ట్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డు సాధించాడు. సమయం 9:50Am: న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగుల చేసిన రచిన్ రవీంద్ర, జయంత్ యాదవ్ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా స్కోరు కంటే న్యూజిలాండ్ ఇంకా 377 పరుగులు వెనుకబడి ఉంది. కాగా టీమిండియా విజయానికి 4 వికెట్ల దూరంలో నిలిచింది. 53 ఓవర్లకు కివీస్ 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెన్రీ నికోలస్,కైల్ జామీసన్ ఉన్నారు. సమయం 9:30Am: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ మూడో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్లు నష్టానికి 140 పరుగులు చేసింది. కాగా భారత్ విజయానికి ఇంకా 5 వికెట్ల దూరంలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో రచిన్ రవీంద్ర, హెన్రీ నికోలస్ ఉన్నారు. భారత్: మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్. న్యూజిలాండ్ : టామ్ లాథమ్ (కెప్టెన్), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, కైల్ జామీసన్, టిమ్ సౌథీ, విలియం సోమర్విల్లే, అజాజ్ పటేల్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: BAN Vs PAkK: నీటిలో ఫీల్డింగ్ చేసిన షకీబ్ అల్ హసన్.. వీడియో వైరల్.. -
ఏంటి అశ్విన్.. బాహుబలిలో నీవు ఏమైనా ప్రభాస్ అనుకున్నావా..
IND vs NZ 2nd Test: Virat Kohli Hilarious Reactions Recorded as Spider Cam Gets Stuck Near Pitch: ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ రెండో టెస్ట్‌లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 'స్పైడర్‌క్యామ్' ఆటకు అంతరాయం కలిగించింది. టీ విరామానికి కొన్ని ఓవర్ల ముందు ఓ స్పైడర్‌క్యామ్ టెక్నికల్ లోపంతో కిందకు పడిపోయింది. స్పైడర్ క్యామ్ పైకి వెళ్లకపోకుండా రెండు అడుగుల ఎత్తులో వేలాడింది. కంట్రోల్ రూం నుంచి దానిని తిరిగి పొందడంలో విఫలమయ్యారు. దీంతో టెక్నికల్ లోపాన్ని గ్రహించిన ఆన్-ఫీల్డ్ అంపైర్లు నితిన్ మీనన్, అనిల్ చౌదరి షెడ్యూల్ టైం కంటే ముందే టీబ్రేక్ ప్రకటించారు. ఈ క్రమంలో ఫీల్డ్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ , రవిచంద్రన్ అశ్విన్ స్పైడర్‌క్యామ్‌తో సరదాగా గడిపారు. స్పైడర్ క్యామ్ ముందుకి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... ‘నీకు ఇక్కడేం పని, పైకి వెళ్లు...’ అని సైగలతో సూచించడం, సూర్యకుమార్ యాదవ్ వచ్చి చెక్ చేయడం ఈ కెమెరాలో రికార్డైంది. అశ్విన్ అయితే బాహుబలిలో ప్రభాస్‌లా శివలింగాన్ని ఎత్తుకున్నట్లుగా కెమెరాను పైకి నెట్టుతూ పోజులు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌పై నెటిజన్లు మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ఏంటి అశ్విన్.. బాహుబలిలో నీవు ఏమైనా ప్రభాస్ అనుకున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Shreyas iyer: అహ్మదాబాద్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..! రూ.15 కోట్లు ఆఫర్.. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) Lmao🤣♥️ pic.twitter.com/Dcp5iSOpar — Sanjana🦋 (@sanjjxo) December 5, 2021 -
ఫోర్ కొట్టిన గిల్.. సచిన్ అంటూ అరిచిన అభిమానులు.. ఎందుకంటే!
Mumbai crowd chants Sachin, Sachin after Shubman Gill smashes a four: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో ఓ అసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా శుభ్‌మాన్ గిల్ ఓపెనింగ్‌కు రాలేదు. అతడి స్ధానంలో పుజారా ఓపెనర్‌గా వచ్చాడు. దీంతో మూడో రోజు గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే మూడో రోజు ఆటలో భాగంగా కీవిస్ బౌలర్ సౌథీ వేసిన బంతిని మిడ్ వికెట్ దిశగా గిల్ బౌండరీకు తరలించాడు. దీంతో ఒక్క సారిగా స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు సచిన్ సచిన్ అంటూ గట్టిగా అరిచారు. కాగా గిల్, టెండూల్కర్ కుమార్తె సారా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గిల్‌ను టార్గెట్ చేస్తూ.. అభిమానులు అలా అరిచినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. ఇక ముంబై వాంఖడే స్టేడియం సచిన్ హోం గ్రౌండ్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: Ind Vs Nz 2nd Test- Virat Kohli: 62 పరుగులకే ఆలౌట్.. అయినా అందుకే టీమిండియా ఫాలో ఆన్ ఆడించలేదు!ఔ pic.twitter.com/V073ZkjiC6 — Addicric (@addicric) December 5, 2021 -
అది నా డ్రీమ్ బాల్.. ఆసక్తికర వాఖ్యలు చేసిన మహ్మద్ సిరాజ్
It was a dream delivery for any fast bowler on Ross taylor wicket:ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్బతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను దెబ్బతీశాడు. అయితే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రాస్ టేలర్‌ను అద్బుతమైన బంతితో బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. కాగా టేలర్‌ను ఔట్ చేసిన బంతి.. తన డ్రీమ్ డెలివరీ అంటూ మ్యాచ్ అనంతరం సిరాజ్ తెలిపాడు. రెండో రోజు ఆటముగిశాక విలేకరుల సమావేశంలో సిరాజ్ మాట్లాడాడు. “మేము ఇన్‌స్వింగ్ డెలివరీకి తగ్గట్టుగా ఫీల్డ్‌ని పెట్టాము. కానీ నేను తర్వాత నా మనసుని మార్చుకుని అవుట్‌స్వింగ్ బౌలింగ్ ఎందుకు చేయకూడదని అనుకున్నాను. అందుకే అవుట్‌స్వింగ్ డెలివరీ వేశాను. దీంతో టేలర్‌ను క్లీన్ బౌల్డ్ చేయగలిగాను" అని సిరాజ్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో గాయపడిన సిరాజ్ తొలి టెస్ట్‌కు దూరమయ్యాడు. రెండో టెస్ట్‌లో ఇషాంత్ శర్మ స్ధానంలో తిరిగి జట్టులోకి పునరాగమనం చేశాడు. కాగా గాయంనుంచి కోలుకున్నాక.. తను ఫిట్నెస్ సాధించాడానికి ఎలా సాధన చేశాడో తెలిపాడు. "నేను గాయం నుంచి కోలుకున్నాక తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు వీలైనంత ఎక్కువ స్వింగ్ పొందాలనే లక్ష్యంతో సింగిల్ వికెట్ బౌలింగ్ చేసాను. నాకు ఈ మ్యాచ్‌లో అవకాశం లభిస్తే ఆ విధంగా బౌలింగ్ చేయాలి అనుకున్నాను. సింగిల్ వికెట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ఈ మ్యాచ్‌లో నాకు చాలా ఊపయోగపడింది అని సిరాజ్ తెలిపాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 62 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: Andre Russell: బౌలర్లను ఊచకోత కోసిన రస్సెల్.. 7 సిక్సర్లు, 9 ఫోర్లుతో.. Absolute peach of a delivery 📦 #Siraj #MiyaanMagic pic.twitter.com/aqU82Ersrr — King (@DNKWrites) December 4, 2021 -
గంటల్లోనే తారుమారు.. భారత్ దెబ్బకు కివీస్ విలవిల..
ఎజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శన సంబరాలు న్యూజిలాండ్ శిబిరంలో కొన్ని గంటలు కూడా సాగలేదు. ఈ చారిత్రక ఘట్టాన్ని ఆస్వాదించేలోపే జట్టు ఆనందం చెల్లాచెదురైంది. పదునైన భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేక న్యూజిలాండ్ బ్యాటింగ్ కుప్పకూలింది. భారత గడ్డపై అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా అవాంఛనీయ రికార్డును నెలకొల్పుతూ రెండో టెస్టులో రెండో రోజే కివీస్ చేతులెత్తేసింది. 263 పరుగుల ఆధిక్యం దక్కిన తర్వాత కూడా ఫాలోఆన్ ఆడించకుండా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆట ముగిసేసరికి తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకొని విజయంపై గురి పెట్టింది. ముంబై: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ గెలుపు ఇక లాంఛనమే కావచ్చు. శనివారం కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 28.1 ఓవర్లలో 62 పరుగులకే కుప్పకూలింది. జేమీసన్ (17)దే అత్యధిక స్కోరు. దాంతో భారత్‌కు 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేయడంతో ఓవరాల్ ఆధిక్యం 332 పరుగులకు చేరింది. ఫీల్డింగ్‌లో గాయపడిన శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయకపోగా... మయాంక్ అగర్వాల్ (38 బ్యాటింగ్), చతేశ్వర్ పుజారా (29 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఉదయం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 109.5 ఓవర్లలో 325 పరుగులు చేసి ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (311 బంతుల్లో 150; 17 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరికొన్ని పరుగులు జోడించగా, అక్షర్ పటేల్ (128 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. కివీస్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ 10 వికెట్లు పడగొట్టాడు. మరో 39.5 ఓవర్లు... ఓవర్‌నైట్ స్కోరు 221/4తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌కు రెండో ఓవర్లోనే దెబ్బ పడింది. ఎజాజ్ వరుస బంతుల్లో సాహా (27), అశ్విన్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఈ దశలో మయాంక్‌కు అక్షర్ అండగా నిలిచాడు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ ఏడో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అయితే 150 పరుగుల మార్క్‌ను అందుకున్న తర్వాతి బంతికే మయాంక్ వెనుదిరిగాడు. అనంతరం 113 బంతుల్లో అక్షర్ టెస్టుల్లో తన తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. అక్షర్‌ను కూడా వెనక్కి పంపిన అనంతరం ఎజాజ్... తన తర్వాతి ఓవర్లో జయంత్ (12), సిరాజ్ (4)ల పని పట్టి చరిత్ర సృష్టించాడు. శనివారం ఆడిన 39.5 ఓవర్లలో మరో 104 పరుగులు జోడించిన టీమిండియా చివరి 6 వికెట్లు కోల్పోయింది. చెలరేగిన సిరాజ్... భారత్‌ను మరీ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్న ఆనందం న్యూజిలాండ్‌కు ఎంతోసేపు నిలవలేదు. మన బౌలర్ల పదునైన బంతులను ఒక్క బ్యాటర్ కూడా సరిగా ఎదుర్కోలేకపోవడంతో కివీస్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. హైదరాబాదీ పేసర్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో మొదటి మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టాడు. తన రెండో ఓవర్లోనే యంగ్ (4), కెప్టెన్ లాథమ్ (10)లను సిరాజ్ వెనక్కి పంపించాడు. ఆపై మరో అద్భుత బంతితో రాస్ టేలర్ (1)ను అతను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. టీ సమయానికే కివీస్ స్కోరు 38/6కు చేరింది. విరామం తర్వాత జట్టు ఆట ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఈ సెషన్లో అశ్విన్ మూడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసి ప్రత్యర్థిని పడగొట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్: 325; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (సి) అయ్యర్ (బి) సిరాజ్ 10; యంగ్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 4; మిచెల్ (ఎల్బీ) (బి) అక్షర్ 8; రాస్ టేలర్ (బి) సిరాజ్ 1; నికోల్స్ (బి) అశ్విన్ 7; బ్లన్‌డెల్ (సి) పుజారా (బి) అశ్విన్ 8; రచిన్ రవీంద్ర (సి) కోహ్లి (బి) జయంత్ 4; జేమీసన్ (సి) అయ్యర్ (బి) అక్షర్ 17; సౌతీ (సి) (సబ్) సూర్యకుమార్ (బి) అశ్విన్ 0; సోమర్‌విలే (సి) సిరాజ్ (బి) అశ్విన్ 0; ఎజాజ్ పటేల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (28.1 ఓవర్లలో ఆలౌట్) 62. వికెట్ల పతనం: 1–10, 2–15, 3–17, 4–27, 5–31, 6–38, 7–53, 8–53, 9–62, 10–62. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 5–2–7–0, సిరాజ్ 4–0–19–3, అక్షర్ పటేల్ 9.1–3–14–2, అశ్విన్ 8–2–8–4, జయంత్ యాదవ్ 2–0–13–1. భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (బ్యాటింగ్) 38; పుజారా (బ్యాటింగ్) 29; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (21 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 69. బౌలింగ్: సౌతీ 5–0–14–0, ఎజాజ్ 9–1–35–0, జేమీసన్ 4–2–5–0, సోమర్‌విలే 2–0–9–0, రచిన్ 1–0–4–0. -
Ind Vs Nz 2nd Test: 62 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. భారత్ స్కోరు: 69
India Vs Nz 1st Test Day 2 2021 Highlights Updates.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 69 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 38 పరుగులు, ఛతేశ్వర్ పుజారా 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో భారత్‌కు 332 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకు ముందు 325 పరుగులకు భారత్ తొలి ఇన్నింగ్స్ ముగించగా.. కివీస్ 62 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. 5:00 PM: రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా బ్యాటింగ్ కొనసాగుతోంది. మయాంక్ అగర్వాల్ 25, ఛతేశ్వర్ పుజారా 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 325 పరుగులు ఆలౌట్ న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62 పరుగులు ఆలౌట్ 3 : 40 PM: టీమిండియాతో రెండో టెస్టులో భాగంగా న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. కేవలం 62 పరుగులుకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. రెండో రోజు ఆటలో భాగంగా తొలుత భారత్ 325 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత బౌలర్ల విజృంభణతో కివీస్ కేవలం 62 పరుగులకే కుప్పకూలడం విశేషం. అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 3:15 PM: ఎనిమిది వికెట్లు కోల్పోయిన కివీస్ ►భారత బౌలర్ల విజృంభణతో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 54 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. 3:07 PM: న్యూజిలాండ్ ప్రస్తుత స్కోరు: 51/6 (18.4). టీమిండియా కంటే ఇంకా 273 పరుగులు వెనుకబడి ఉంది. 2:48 PM: భారత బౌలర్లు న్యూజిలాండ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. అద్భుతమైన బంతులు సంధిస్తూ వరసుగా ఒక్కొక్కరిని పెవిలియన్ చేరుస్తున్నారు. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా... అక్షర్ పటేల్, అశ్విన్, జయంత్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు. దీంతో 38 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. టీమిండియా కంటే 287 పరుగుల వెనుకబడి ఉంది. ►ఆరు వికెట్లు కోల్పోయిన కివీస్ 2: 30PM: భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు విలవిల ఆడుతున్నారు. 31 పరుగుల వద్ద కివీస్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన నికోలస్.. ఆశ్విన్ బౌలింగ్ క్లీన్ బౌల్డయ్యాడు. 2: 00PM: న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్కోరు: న్యూజిలాండ్ స్కోరు: 27/4 1: 30 PM: రెండో టెస్టుతో జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ను దెబ్బకొడుతున్నాడు. మూడు వికెట్లు పడగొట్టి కివీస్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్‌లతో పాటు రాస్ టేలర్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 325 పరుగులుకు ఆలౌటైంది. కాగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ప్రపంచరికార్డు సాధించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10 వికెట్లు సాధించాడు. దీంతో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతక ముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు. ఇక భారత్ ఇన్నింగ్స్‌లో చేసిన మయాంక్ 150 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 12:20 Pm: టీమిండియా మయాంక్ అగర్వాల్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. 150 పరుగులు చేసిన మయాంక్ అజాజ్ పటేల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే ఏడు వికెట్లు పడగొట్టాడు. 11:40 Am రెండో రోజు ఆట మెదలు పెట్టిన టీమిండియా లంచ్ విరామానికి 98 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 146, అక్షర్ పటేల్32 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10:35.. టీమిండియా ప్రస్తుత స్కోర్: 85 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 135, అక్షర్ పటేల్22 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9:58AM: రెండో రోజు ఆట మెదలు పెట్టిన టీమిండియా వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 72 ఓవర్ వేసిన అజాజ్ పటేల్.. వరుస బంతుల్లో వృద్ధిమాన్ సాహా, ఆశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం భారత్ 79 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 120, అక్షర్ పటేల్12 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే ఆరు వికెట్లు సాధించాడు. 9:30 AM న్యూజిలాండ్ జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచిన భారత్ రెండో రోజు ఆటమెదలు పెట్టింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మెదటి రోజు ఆటముగిసే సమయానికి 70 ఓవర్లలో 4వికెట్లు నష్టానికి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 120, వృద్ధిమాన్ సాహా 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. భారత్: మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ న్యూజిలాండ్ : టామ్ లాథమ్ (కెప్టెన్), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, కైల్ జామీసన్, టిమ్ సౌథీ, విలియం సోమర్విల్లే, అజాజ్ పటేల్ చదవండి: Rohit sharma: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ! Incredible achievement as Ajaz Patel picks up all 10 wickets in the 1st innings of the 2nd Test. He becomes the third bowler in the history of Test cricket to achieve this feat.#INDvNZ @Paytm pic.twitter.com/5iOsMVEuWq — BCCI (@BCCI) December 4, 2021 -
టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ!
Rohit Sharma set to replace Ajinkya Rahane as Indias new test vice captain: టీమిండియా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ను ఎంపిక చేసే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ వైస్ కెప్టెన్‌గా ఉన్న రహానేను తప్పించి అతడి స్ధానంలో రోహిత్‌కు అవకాశం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వారం వెలువడునున్నట్లు సమాచారం. కగా రోహిత్ టీ20 కెప్టెన్సీ భాధ్యతలు చెపట్టిన సంగతి తెలిసిందే. త్వరలో వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా రోహిత్‌కే అందజేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కగా టెస్ట్‌ల్లో గత రెండేళ్లుగా అజింక్యా రహానె పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. స్వదేశాన న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. దీంతో కివీస్‌తో రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. అతడి చివరి 16 టెస్టుల్లో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేశాడు. మరో వైపు టెస్ట్ క్రికెట్లో ఆరంగ్రేటం చేసిన శ్రేయస్ అద్బుతంగా రాణిస్తున్నాడు. దీంతో జట్టులో రహానె స్ధానం ప్రశ్నర్ధాకంగా మారింది. చదవండి: IND vs NZ: ఐపీఎల్లో ఆ అంపైర్‌తో గొడవపడ్డ కోహ్లి.. అందుకే ఔట్ ఇచ్చాడా! -
ఔటైన కోపంలో కోహ్లి ఏం చేశాడంటే.. వీడియో వైరల్
IND v NZ 2nd Test: Watch Video Virat Kohli Controversial Dismissal: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఔటైన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీ అయిన కోహ్లి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ 30 ఓవర్ వేసిన అజాజ్ పటేల్ బౌలింగ్‌లో.. విరాట్ కోహ్లి ఢిపెన్స్ ఆడడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో బంతి మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్ అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. అయితే వెంటనే కోహ్లి రివ్యూకు వెళ్లాడు. రీప్లేలో పలుకోణాల్లో విజువల్స్ పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు దాన్ని నిర్ధారించడం కష్టంగా మారింది. రీప్లేలో, ఒక స్పైక్ కనిపించినప్పటికీ, బంతి మొదట బ్యాట్‌కి తగిలిందా లేదా ప్యాడ్‌కు తగిలిందా అనేది స్పష్టంగా తెలియలేదు. బాల్ ట్రాకింగ్‌లో బంతి స్టంప్‌లను తాకడంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ఆధారంగా థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లి అసంతృప్తి చెందాడు. కోహ్లి నిరాశతో మైదానం వీడాడు. కాగా పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో కోహ్లీ బౌండరీ రోప్‌లను తన బ్యాట్‌తో కొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో అజాజ్ పటేల్ బౌలింగ్ పూజారా, కోహ్లి ఇద్దరూ డకౌట్లుగా పెవిలియన్‌కు చేరారు. చదవండి: David Warner: వార్నర్ కు అప్పుడు అండగా నిలిచింది వాళ్లే కదా.. అది గుర్తు లేదా? Ek do ek do UMPIRE KO FEK DO! Wankhede has gone wild after Kohli has got out 💔💔💔 Watch the entire reaction here...#INDvsNZ pic.twitter.com/8AfEbnnEcD — Vinesh Prabhu (@vlp1994) December 3, 2021 -
రెండో టెస్ట్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నాడా..?
Who Will Sacrifice To Accommodate for Virat kohli Pujara Or Iyer: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. కాగా ఆరంగ్రేట్ర టెస్ట్‌లో టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సెంచరీతో మెరిశాడు. అంతే కాకుండా పలు రికార్డులను కూడా సృష్టించాడు. ఆరంగ్రేట్ర టెస్ట్‌లో సెంచరీ, అర్ధసెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. అంతేకాకుండా డెబ్యూ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా అయ్యర్ రికార్డు నెలకొల్పాడు. కాగా తొలి టెస్ట్‌కు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి తిరిగి రెండో టెస్ట్ కోసం జట్టులో చేరనున్నాడు. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. తొలి టెస్ట్‌లో కోహ్లి స్ధానంలోనే శ్రేయస్‌కు అవకాశం దక్కింది. ఈ క్రమంలో ముంబై వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో శ్రేయస్‌ను పక్కన పెడతారా.. లేక వరుసగా విఫలమవుతున్న పూజారాకు విశ్రాంతి ఇస్తారా అన్నది వేచి చూడాలి. ఈ టెస్ట్‌లో పూజారా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు తొలి టెస్ట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానేపై వేటు పడనుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తొలి టెస్టులో రహానే బ్యాటర్‌గా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో 35 పరుగులకే అవుటైన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక్క బౌండరీ బాది పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: Irfan Pathan: అతడు వేలానికి వస్తే, రికార్డులు బద్ధలు కావాల్సిందే.. -
Ind Vs Nz 1st Test: ప్చ్.. మనకు నిరాశే.. డ్రాగా ముగిసిన కాన్పూర్ టెస్టు
Ind Vs Nz 2021 1st Test Day 5 Highlights Updates Telugu: 04:22 PM: ►గెలుపు ఖాయమనుకున్న తొలి టెస్టులో భారత్‌కు నిరాశ తప్పలేదు. చివరి వికెట్ తీయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ అడ్డుగోడగా నిలబడి విలియమ్సన్ బృందాన్ని ఓటమి బారి నుంచి తప్పించారు. ఫలితంగా మ్యాఛ్ డ్రాగా ముగిసింది. అరంగేట్ర హీరో శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్‌లో అయ్యర్ మొత్తంగా 170 పరుగులు చేశాడు. టీమిండియా : ►తొలి ఇన్నింగ్స్: 345-10 (111.1 ఓవర్లలో) ►రెండో ఇన్నింగ్స్: 234-7 డిక్లేర్డ్ (81 ఓవర్లు) న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 296-10 (142.3 ఓవర్లలో) రెండో ఇన్నింగ్స్: 165-9(98 ఓవర్లు). 3:55 PM ►విజయం దిశగా పయనిస్తున్న భారత్ ►ఐదో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో టిమ్ సౌథీ పెవిలియన్ చేరాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర క్రీజులో ఉన్నారు. ఇక విజయానికి ఒక వికెట్ దూరంలో ఉన్న నేపథ్యంలో రహానే ఫీల్డింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశాడు. 3: 44 PM: ►రెండు వికెట్లు పడగొడితే చాలు విజయం టీమిండియాదే. ►‘సర్’ రవీంద్ర జడేజా.. జేమీసన్ వికెట్ పడగొట్టడంతో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ప్రస్తుత స్కోరు- 147/8 (86.2) 3:35 PM: ►విజయానికి మూడు వికెట్ల దూరంలో టీమిండియా ►కివీస్ స్కోరు: 143/7 ►న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. టామ్ బ్లండెల్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపి భారత్‌ను విజయానికి మరింత చేరువ చేశాడు. ప్రస్తుతం కివీస్ టీమిండియా కంటే 138 పరుగులు వెనుకబడి ఉంది. 3:14PM: ►టీమిండియా కంటే న్యూజిలాండ్ 146 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుత స్కోరు: 138/6 (77). ►రచిన్ రవీంద్ర(6), టామ్ బ్లండెల్(2) పరుగులతో క్రీజులో ఉన్నారు. 2:55PM: టీమిండియా విజయానికి మరింత చేరువైంది. విలియమ్సన్ రూపంలో న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రవీంద్ర జడేజా ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. దీంతో న్యూజిలాండ్ ఆశలు ఆవిరయ్యాయి. కాగా టీమిండియా విజయానికి ఇంకా 4 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో టామ్ బ్లండెల్(2) ఉండగా, రచిన్ రవీంద్ర క్రీజులోకి వచ్చాడు న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. హెన్రీ నికోల్స్‌ను అక్షర్ పటేల్ ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. కాగా టీమిండియా విజయానికి ఇంకా 5 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్ 24 పరుగులతో ఉండగా, టామ్ బ్లండల్ క్రీజులోకి వచ్చాడు 2:14 PM: న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన రాస్ టేలర్‌ను రవీంద్ర జడేజా ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. కాగా టీమిండియా విజయానికి ఇంకా 6 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్ 24 పరుగులతో ఉండగా,హెన్రీ నికోల్స్ క్రీజులోకి వచ్చాడు. న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన టామ్ లాథమ్‌ను, రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కాగా టీమిండియా విజయానికి ఇంకా 7 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్(7), రాస్ టేలర్(0) పరుగులతో ఉన్నారు. 12: 58 PM: కివీస్ స్కోర్: 99/2, భారత్ కంటే ఇంకా 185 పరుగులు వెనుకబడి ఉన్న కివీస్. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(49),విలియమ్సన్(7) పరుగులతో ఉన్నారు. 12: 14PM: 79 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన విలియం సోమర్విల్లే, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో శుభమాన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(32),విలియమ్సన్ ఉన్నారు. 11:30AM: ఐదో రోజు ఆట: లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ స్కోరు(సెకండ్ ఇన్నింగ్స్): ఒక వికెట్ నష్టానికి 79 పరుగులు. భారత్ కంటే ఇంకా 205 పరుగులు వెనుకబడి ఉన్న కివీస్. 11:18 Am: న్యూజిలాండ్ స్కోర్: 70/1, ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(32), విలియం సోమర్విల్లే(32) పరుగులతో ఉన్నారు. 10:10 Am: ఐదో రోజు ఆట ప్రారంభించిన కివీస్ నిలకడగా ఆడుతుంది. 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి న్యూజిలాండ్ 32 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(10), విలియం సోమర్విల్లే(18) పరుగులతో ఉన్నారు. 9:30 Am: కాన్పూర్ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అఖరి రోజు ఆట ప్రారంభమైంది. కాగా చివరి రోజు ఆట ఆసక్తికరంగా మారింది. ఇరు జట్లుకు విజయం ఊరిస్తోంది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్, విలియం సోమర్విల్లే ఉన్నారు. కాగా భారత్.. విజయానికి ఇంకా 9 వికెట్ల దూరంలో నిలవగా, మరోవైపు న్యూజిలాండ్ 284 పరుగుల లక్ష్యాన్ని చేధించి గెలుపు రుచి చూడాలని భావిస్తోంది. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత జట్టు: శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్) శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్- వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్‌స్టిట్యూట్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్. న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్విల్లే. చదవండి: BAN Vs PAK: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లు... -
గిల్ ఓపెనర్‌గా కాకుండా ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి
Irfan Pathan Pointed Out Flaw In Opener Shubman Gill: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అవుటైన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తొలి ఇన్నింగ్స్‌లో అర్దసెంచరీ సాధించిన గిల్ కైల్ జామీసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. అదే రీతిలో సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా వికెట్ సమర్పించుకున్నాడు. కైల్ జెమీషన్ వేసిన అద్భుత స్వింగ్ డెలివరీకి గిల్ క్లీన్ బౌల్డయ్యాడు. ఈ క్రమంలో గిల్ అవుటైన తీరుపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్పాన్ పఠాన్ స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో గిల్ బ్యాటింగ్ స్టైల్ గురించి పఠాన్ మాట్లాడూతూ.. గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పు చేసుకోవాలని సూచించాడు. "అతడు ముఖ్యంగా పిచ్-అప్ డెలివరీలకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు. అతడిలో చాలా ప్రతిభ దాగి ఉంది. ఆ బంతులను అతడు ఎదరుర్కొంటే చాలు.. తిరుగు ఉండదు. గిల్ అవుటైన విధానం గమనిస్తే.. అతడి రెండు పాదాలు ఒకే చోట ఉన్నాయి. అందుకే బ్యాట్‌తో బంతిని ఆపేందుకు సమయం పట్టింది. ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆడటం అంత సులభంకాదు. కాన్పూర్‌లో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతోంది. అంతేకాకుండా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌పై సాధారణంగా ఒత్తిడి ఉంటుంది. దీంతో తొందరగా పెవిలియన్‌కు చేరుతుంటారు. గిల్ మాత్రం తన బ్యాటింగ్ టెక్నిక్‌పై దృష్టిసారించాలి. అప్పుడే మంచి ఫలితాలు రాబట్టగలడు" అని పఠాన్ పేర్కొన్నాడు. అదే విధంగా భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా మాట్లాడూతూ.. గిల్‌కు ఉన్న బ్యాటింగ్ టెక్నిక్కు ఓపెనింగ్ కంటే మిడిల్ ఆర్డర్లో అవకాశం ఇస్తే బాగుటుందని అభిప్రాయపడ్డాడు. చదవండి: Trolls On Ajinkya Rahane: నీకిది తగునా రహానే.. బై బై చెప్పే సమయం ఆసన్నమైంది! -
జడ్డూ బాయ్ వాట్ ఏ స్టన్నింగ్ క్యాచ్
రవీంద్ర జడేజా.. ఎంత మంచి ఫీల్డర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఫీల్డింగ్‌తో అవతలి జట్టుకు పరుగులు రాకుండా ఎన్నోసార్లు నియంత్రించాడు. ఒంటిచేత్తో క్యాచ్‌లు అందుకోవడంతో పాటు ఫీల్డింగ్‌లో తన మెరుపు విన్యాసాలతో ఆకట్టుకుంటాడు. తాజాగా గురువారం త్రోబ్యాక్ థర్స్డే హ్యాష్‌ట్యాగ్ పేరిట జడేజా అందుకున్న అద్భుతమైన క్యాచ్‌ను న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ తన ట్విటర్లో షేర్ చేసింది. డీప్స్కేర్ లెగ్‌లో నిల్చున్న జడేజా వెనక్కి తిరిగి ఒంటిచేత్తో అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ క్రికెట్ ప్రపంచ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. ఇది జరిగింది ఈ ఏడాదిలోనే.. గత జనవరిలో భారత జట్టు 5 టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్‌లో పర్యటించింది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. మహ్మద్ షమీ వేసిన బంతిని కివీస్ బ్యాట్స్‌మన్ నీల్ వాగ్నర్ ఒక బారీ షాట్ ఆడాడు. అందరూ ఆ షాట్ ఫోర్ అనే భావించారు. కానీ అక్కడే ఒక అద్భుతం చోటుచేసుకుంది. డీప్స్కేర్ లెగ్‌లో నిల్చున్న జడేజా పైకి ఎగిరి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. జడేజా చేసిన ఫీట్‌కు మిగతా ఆటగాళ్లు బిత్తరపోయారు. బారీ షాట్‌ను వెనక్కి తిరిగి అందుకోవడమే కష్టం.. అలాంటిది ఒంటిచేత్తో అందుకోవడం ఆకట్టుకుంటుంది. (చదవండి : కోహ్లిని ప్రశంసిస్తే తప్పేంటి..) #ThrowbackThursday | "Quite possibly one of the greatest outfield catches in the history of the game!" Do you agree with Ian Smith on this effort from @imjadeja? Test Highlights | https://t.co/fB75C9cKGN #CricketNation #NZvIND pic.twitter.com/R7cs4P9eH2 — BLACKCAPS (@BLACKCAPS) September 2, 2020 ఆ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా ఉన్న ఇయాన్ స్మిత్.. 'జడేజా అందుకున్న క్యాచ్ ఔట్‌ఫీల్డ్ క్యాచ్స్లో ఉత్తమమైనది.. నేను చూసిన వాటిలో ఇదే అత్యుత్తమం.. జడేజా విన్యాసం నిజంగా అద్భుతం.. ' అంటూ కామెంట్ చేశాడు. కానీ జడేజా క్యాచ్ జట్టును గెలిపించలేకపోయింది. ఏడు వికెట్లతో ఆ మ్యాచ్‌ను నెగ్గిన కివీస్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. కివీస్ పర్యటనలో వన్డే సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌తో కివీస్‌కు అప్పగించిన టీమిండియా టీ20 సిరీస్‌లో మాత్రం అదరగొట్టింది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0 తేడాతో ఆతిధ్య జట్టుపై క్లీన్‌స్వీప్ చేయడమొక్కటే సానుకూలాంశంగా చెప్పవచ్చు. ఈ సిరీస్ తర్వాతే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో దాదాపు నాలుగు నెలల పాటు క్రికెట్ స్తంభించిపోయింది. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు ఆటగాళ్లంతా సిద్ధమయ్యారు. -
రహానే, పుజారాలపై వెంగ్‌సర్కార్ వ్యాఖ్యలు..
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్ట్‌లో భారత్ ఓటమిపై టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తనదైన శైలిలో విశ్లేషించారు. ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి స్ర్టైక్ రేట్పైనా పలువురు వేలెత్తిచూపడంతో పాటు ఈ టూర్లో విరాట్ కోహ్లీ ఫాంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్యాట్స్మెన్లు తరచూ స్ర్టైక్ రొటేట్ చేయకపోవడం సమస్యలకు కారణమని వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చారు. ఎక్కువ సమయం క్రీజ్‌లోకి రాకుండా ఉంటే నాన్ స్ర్టైకర్ తన బ్యాటింగ్ రిథమ్‌ను కోల్పోతాడని అన్నారు. రహానే క్రీజ్ వద్ద కుదురుకుని భారీ స్కోర్ నమోదు చేసేందుకు ప్రయత్నించాలని వ్యాఖ్యానించారు. ‘పుజారా చాలా పరుగులు చేశాడు..అయితే అతను స్ర్టైక్ రొటేట్ చేయడంపై దృష్టిసారించాలి..లేకుంటే తన బ్యాటింగ్ భాగస్వామి ఇబ్బందుల్లో పడతాడ’ని పేర్కొన్నారు. మరోవైపు భారత బ్యాట్స్మెన్లు క్రీజులో కుదురుకోకుండా కివీస్ బౌలర్లు కట్టడి చేశారని ప్రశంసించారు. చదవండి : సమం చేస్తారా? -
ఆ మ్యాచ్‌లో గెలిస్తే.. టీమిండియా కొత్త రికార్డు
క్రైస్ట్‌చర్చి : ఫిబ్రవరి 29 నుంచి క్రైస్ట్‌చర్చి వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సిద్దంగా ఉన్నాయి. ఇప్పటికే టీమిండియాపై 3-0 తేడాతో వన్డే సిరీస్, 10 వికెట్ల తేడాతో తొలి టెస్టును కైవసం చేసుకొన్న కివీస్ రెండో టెస్టులోనూ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తుంది. మరోవైపు టెస్టు చాంపియన్‌షిప్‌లో తొలి ఓటమి తర్వాత కనీసం రెండో మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తుంది. అయితే రెండో టెస్టు జరగనున్న క్రైస్ట్‌చర్చి నగరంలోనే రెండు మైదానాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏఎంఐ స్టేడియం కాగా మరొకటి హెగ్లే ఓవల్ స్టేడియం ఉన్నాయి. (మోదీపై ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు) టీమిండియా ఇప్పటివరకు ఏఎంఐ స్టేడియంలో నాలుగు టెస్టులు ఆడగా రెండు ఓటమిపాలై రెండు డ్రాగా ముగించింది. కాగా హెగ్లే ఓవల్ మైదానంలో మాత్రం ఇంతవరకు టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. శనివారం నుంచి మొదలుకానున్న రెండో టెస్టు మ్యాచ్ భారత్‌కు తొలి మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్‌లో గనుక విజయం సాధిస్తే క్రైస్ట్‌చర్చిలో తొలి విజయంతో పాటు టీమిండియా పేరిట కొత్త రికార్డు నమోదవుతుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఇక్కడ ఆడిన ఆరు టెస్టుల్లో నాలుగు గెలుచుకొని, ఒక మ్యాచ్‌లో ఓటమి చెంది మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. (టెస్టు ఓటమి.. కపిల్ ప్రశ్నల వర్షం) (‘అప్పుడు ధోని ఏం చెప్పాడంటే?’) -
రాహుల్‌కు షాక్.. శుబ్‌మన్ గిల్ ఇన్..
న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కాలికి గాయం కారణంగా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ పర్యటన నుంచి తప్పుకోవడంతో యువ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్‌కు భారత జట్టులో చోటు దక్కింది. వన్డే జట్టులోకి ఎంపికైన మయాంక్ అగర్వాల్, పృథ్వీషాకు.. టెస్టు సిరీస్‌లోనూ అవకాశం కల్పించారు. యువ పేసర్ నవదీప్ సైని కూడా టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో మంచి ఆటతీరు ప్రదర్శించిన కేఎల్ రాహుల్‌కు మాత్రం బీసీసీఐ షాకిచ్చింది. న్యూజిలాండ్‌తో చివరి టీ20లో రాణించిన రాహుల్‌కు సెలక్టర్లు టెస్టు జట్టులో చోటు కల్పించలేదు. జట్టులో వికెట్ కీపర్‌గా ఉన్న రిషభ్ పంత్ తన స్థానాన్ని కాపాడుకున్నారు. టెస్ట్ జట్టులో ఇషాంత్ శర్మ పేరు కూడా చేర్చినప్పటికీ.. అతను ఫిట్నెస్ పరీక్షను ఎదుర్కొవాల్సి ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను 5-0 క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. రేపటి నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో సత్తా చాటేందుకు సిద్దమవుతోంది. భారత జట్టు : విరాట్ కోహ్లి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పూజారా, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ(ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కొవాల్సి ఉంది). -
ఆ కోహ్లిని చూసి ఈ కోహ్లి షాక్ తిన్నాడు!
ఇటీవల ముగిసిన భారత్-న్యూజిల్యాండ్ మూడో టెస్టులో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు ఒకేసారి ఇద్దరు విరాట్ కోహ్లిలు దర్శనమిచ్చారు. ఒకరేమో ప్రేక్షకులు ఉండే స్టాండ్స్‌లో.. మరొకరు మైదానంలో.. డాషింగ్ బ్యాట్స్‌మన్‌ను రెండుచోట్ల చూడటంతో అభిమానులు విస్తుపోయారు. ఇంకా విచిత్రమేమిటంటే ఒరిజినల్ విరాట్ కోహ్లి కూడా అచ్చం తనలాంటి వాడు ప్రేక్షకుల మధ్య కనిపించడంతో బిత్తరపోయాడు. అతన్ని చూసి.. తనను తాను అద్దంలో చూసుకున్నట్టు ఫీలయ్యాడేమో.. కోహ్లికి నవ్వు ఆగలేదు. చేయి అడ్డం పెట్టుకొని మరీ చప్పట్లు కొడుతూ నవ్వుల్లో మునిగిపోయాడు. ఇండోర్‌లో జరిగిన భారత్-న్యూజిల్యాండ్ మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్టాండ్స్‌లో అచ్చం కోహ్లిలాగా ఉండే ఆయన డూప్ ఒకరు హల్చల్ చేశారు. అచ్చం కోహ్లి పోలికలతో ఉన్న ఆ వ్యక్తితో సెల్ఫీలు తీసుకోవడానికి ఒకవైపు ప్రేక్షకులు పోటెత్తారు. ఈ డూప్లికేట్ కోహ్లి వెంట అభిమానులు పడిన దృశ్యం కెమెరా కంటపడింది. మైదానంలో పెట్టిన టీవీ స్క్రీన్లలో తరచూ కనిపించిన ఈ దృశ్యాన్ని చూసి నిజమైన కోహ్లి ఒకింత విస్తుపోయాడు. ఆ తర్వాత పట్టరాని ఆనందంలో మునిగిపోయాడు. ఈ సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఫేస్బుక్లో పెట్టిన ఈ వీడియోను ఐదులక్షల మందికిపైగా చూడగా.. 6,400సార్లు దీనిని నెటిజన్లు షేర్ చేసుకున్నారు.