Salman Butt Praises Virat Kohli For Supporting Rahane: గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు అండగా నిలిచిన టీమిండియా సారధి విరాట్ కోహ్లిపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి.. తన బృందంలోని సభ్యులపై అపారమైన నమ్మకం కలిగి ఉంటాడని, కష్ట సమయాల్లో వారికి అండగా నిలిచి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడని.. ఈ లక్షణాలే అతన్ని ప్రపంచపు అత్యుత్తమ కెప్టెన్‌గా నిలబెట్టడంలో దోహదపడ్డాయని తెలిపాడు.
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లందరూ ఫామ్ కోల్పోయిన తమ బృంద సభ్యులకు మద్దుతుగా నిలిచారని, ఇలా చేయడం వల్ల ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగి అత్యుత్తమంగా రాణించారని, చరిత్రే ఇందుకు సాక్షమని పేర్కొన్నాడు. తన గైర్హాజరీలో బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ అద్భుతంగా రాణించి ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించిన రహానేపై నమ్మకముంచడం అంత ఆశ్చర్యకరమైన విషమేమీ కాదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు సల్మాన్ బట్ తన యూట్యుబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
కాగా, కోహ్లీ గైర్హాజరీలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే.. మ్యాచ్ మొత్తంలో 39(35, 4) పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమై జట్టులో స్థానాన్ని ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా కెప్టెన్ విరాట్ కోహ్లి.. రహానేకు బాసటగా నిలిచారు. రహానే ఫామ్‌పై బయటి వ్యక్తులు చేస్తున్న విమర్శలు తుది జట్టులో అతని ఎంపికపై ప్రభావం చూపవని వారిరువురు అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే, అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీతో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ లేదా హనుమ విహారిల్లో ఎవరో ఒకరు రహానే స్థానాన్ని భర్తీ చేస్తారని బీసీసీఐ వర్గాల్లో చర్చ సాగుతోంది. రహానే సహా ఫామ్‌లో లేని పుజారాపై సైతం వేటు వేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి.
చదవండి: త్వరలో కీలక ప్రకటన చేయనున్న కేకేఆర్ స్టార్ బౌలర్..
Comments
Please login to add a commentAdd a comment