Salman Butt
-
‘పాకిస్తాన్లో అలా ఉండదు.. సూపర్ హిట్ గ్యారెంటీ’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సూపర్ హిట్ అవుతుందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అన్నాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలా కాకుండా ఈ ఈవెంట్ పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఉపఖండ దేశాల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యానే తాను ఈ మాట చెప్తున్నట్లు సల్మాన్ బట్ పేర్కొన్నాడు.రూ. 167 కోట్ల మేర నష్టంగతేడాది నుంచి ఐసీసీ టోర్నీల జాతర జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 నిర్వహించగా.. అమెరికా- వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్-2024కు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. అయితే, క్రికెట్‌కు అంతగా క్రేజ్‌లేని అమెరికాలో తొలిసారిగా ఈ ఈవెంట్ నిర్వహించడం వల్ల ఐసీసీ భారీగా నష్టపోయిందనే వార్తలు వచ్చాయి.సుమారు రూ. 167 కోట్ల మేర ఐసీసీ అపెక్స్ కౌన్సిల్‌కు నష్టం వచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అమెరికాలో జరిగిన టీ20 టోర్నీకి.. మా దేశంలో జరిగే ఈవెంట్‌కు అసలు పోలికే ఉండదు.టీ20 వరల్డ్‌కప్ కంటే చాంపియన్స్ ట్రోఫీ పెద్ద హిట్ అవుతుంది. నిజానికి అక్కడ(అమెరికా) పిచ్‌లు సరిగా లేవు. జనావాసాలకు స్టేడియాలు చాలా దూరం. అంతేకాదు హోటల్స్ కూడా ఎక్కడో దూరంగా ఉంటాయి. అసలు అక్కడి స్థానికులకు కూడా తమ సిటీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.భద్రత విషయంలోనూ విదేశీయులు మాత్రమే అక్కడికి వెళ్లి మ్యాచ్‌లు వీక్షించారు. అయితే, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఇక్కడి ప్రజలు ఆటగాళ్లను ఆదరించడంతో పాటు ప్రేమిస్తారు, గౌరవిస్తారు కూడా! క్రికెట్ అంటే ఇక్కడి వాళ్లకు చాలా ఇష్టం.అలాగే జట్లు గంటల పాటు ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. మహా అయితే.. ఆరు నిమిషాల్లో టీమ్ హోటల్ నుంచి స్టేడియానికి చేరుకోవచ్చు. భద్రత విషయంలోనూ ఎలాంటి సందేహాలు ఉండవు. ఉపఖండ దేశాల్లో ఉన్నట్లు అమెరికాలో క్రికెటర్లకు క్రేజ్ ఉండదు’’ అని సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం టీమిండియా పాకిస్తాన్ వెళ్లే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు కోసం ఐసీసీ.. బీసీసీఐ కోరినట్లుగానే పాక్ వెలుపల వేదిక ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. -
బాబర్, రిజ్వాన్, అఫ్రిది వద్దు.. అతడే పాక్ కెప్టెన్ కావాలి: సల్మాన్ బట్
టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తమ జట్టు చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్, సెలక్టర్ అబ్దుల్ రజాక్‌పై వేటు వేసిన పీసీబీ.. కెప్టెన్సీ మార్పుపై కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.టీ20 వరల్డ్‌కప్ ముందు పాక్ జట్టు పగ్గాలను తిరిగి చేపట్టిన బాబర్ ఆజం.. మరోసారి ఐసీసీ టోర్నీల్లో జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో బాబర్‌ను పాక్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి.ఈ జాబితాలోకి తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ చేరాడు. పరిమిత ఓవర్లలో పాక్ కెప్టెన్సీని స్టార్ బ్యాటర్ షాన్ మసూద్‌కు అప్పగించాలని బట్ పీసీబీని సూచించాడు. కాగా మసూద్ ప్రస్తుతం టెస్టుల్లో పాక్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు."ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో కాస్త గందరగోళం నెలకొంది. జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటకి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. బాబర్‌కు కెప్టెన్సీ స్కిల్స్ పెద్దగా లేవు.ఫీల్డ్‌లో వ్యూహాలు రచించడంలో విఫలమవుతున్నాడు. పాకిస్తాన్ తిరిగి విన్నింగ్ ట్రాక్‌లో రావాలంటే ఒక్కటే మార్గం. షాన్ మసూద్ అన్ని ఫార్మాట్లలో పాక్ కెప్టెన్సీ అప్పగించాలని"ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భట్ పేర్కొన్నాడు.చదవండి: లంకతో సిరీస్‌తో రీఎంట్రీ!.. ఖరీదైన ఫ్లాట్ కొన్న టీమిండియా స్టార్ -
పాకిస్తాన్ పొమ్మంది.. సల్మాన్ బట్కు అఫ్గానిస్తాన్ బంపరాఫర్!?
భారత పర్యటనకు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్‌ను నియమించాలని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏఆర్వై న్యూస్ రిపోర్టు ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) తమ సీనియర్ పురుషుల జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు చేపట్టాలని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏసీబీ ప్రతిపాదనను అతడు అంగీకరిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. భారత పర్యటనలో భాగంగా అఫ్గానిస్తాన్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 11న మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. 24 గంట్లలోనే వేటు.. కాగా ఇటీవల పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సల్మాన్ బట్ ఎంపికయ్యాడు. అయితే అతడిని సెలక్షన్ ప్యానల్ కన్సల్టెంట్ మెంబర్‌గా నియమించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాడిని సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎలా నియమిస్తారని ఆ దేశ మాజీ ఆటగాళ్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో పాకిస్తాన్ ఛీప్ సెలక్టర్ వహాబ్ రియాజ్.. 24 గంటలు తిరగకముందే సల్మాన్‌ను తన పదవి నుంచి తప్పించాడు. చదవండి: National T20 Cup: దురదృష్టం అంటే నీదే భయ్యా.. పాపం ఎవరికీ ఈ కష్టం రాకూడదు! -
పాకిస్తాన్ క్రికెట్లో మరో కీలక పరిణామం.. సల్మాన్ భట్‌పై వేటు
పాకిస్తాన్ క్రికెట్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన సల్మాన్ బట్‌ను 24 గంటల తిరగక ముందే ఛీఫ్ సెలక్టర్ వాహబ్ రియాజ్ తొలిగించాడు. వహాబ్ రియాజ్ సెలక్షన్ ప్యానల్ కన్సల్టెంట్ మెంబర్‌గా సల్మాన్ భట్‌ను నియమించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఆ దేశమాజీ క్రికెటర్ల నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాడిని సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే భట్‌ను కన్సల్టెంట్ పదవి నుంచి రియాజ్ తొలిగించాడు. "సల్మాన్ భట్‌ను కన్సల్టెంట్‌గా ఎంపిక చేసిన తర్వాత నాపై విమర్శల వర్షం కురిస్తోంది. సల్మాన్ గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అందుకే నా నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాను. నేను ఇప్పటికే సల్మాన్ బట్‌తో మాట్లాడాను. నా టీమ్ నుంచి అతడిని తొలిగించానని చెప్పాను. కొన్ని మీడియా సంస్థలు ఆసత్యాలను ప్రచారం చేస్తున్నాయి. మేము పారదర్శకంగా జాకా అష్రఫ్ అధ్యక్షతన పని చేస్తున్నామని" విలేకురల సమావేశంలో రియాజ్ పేర్కొన్నాడు. కాగా 2010లో పాకిస్తాన్ క్రికెట్‌ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో సల్మాన్ భట్ కూడా ఉన్నాడు. అతడిపై ఐదేండ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. తిరిగి అతడు 2016లో క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. పాకిస్తాన్ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 33 టీ20లు ఆడిన భట్.. తన కెరీర్లో 5,209 పరుగులు సాధించాడు. Salman Butt is sacked by Wahab Raiz. pic.twitter.com/qIbppFPKt6 — ZAINI💚 (@ZainAli_16) December 2, 2023 -
పాక్ సెలక్టర్‌గా ‘మ్యాచ్ ఫిక్సర్’
ఫిక్సింగ్ ఉదంతంలో నిషేధానికి గురి కావడంతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన మాజీ ఆటగాడు సల్మాన్ బట్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జాతీయ జట్టు సెలక్టర్‌గా ఎంపిక చేసింది. అతనితో పాటు మరో ఇద్దరు మాజీలు కమ్రాన్ అక్మల్, ఇఫ్తికార్ అంజుమ్ కూడా సెలక్టర్లుగా ఎంపికయ్యారు. చీఫ్ కోచ్ వహాబ్ రియాజ్‌తో కలిసి వీరిద్దరు పని చేస్తారు. సల్మాన్ బట్ పాక్ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులో కెప్టెన్‌గా ఉన్న బట్ సహచరులు ఆసిఫ్, ఆమిర్‌లతో నోబాల్స్ వేయించి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. ఐసీసీ నిషేధంతో పాటు బట్కు 30 నెలల జైలు శిక్ష కూడా పడింది. అయితే 7 నెలలకే విడుదలైన బట్ 2016లో తిరిగి క్రికెట్లోకి అడుగు పెట్టాడు. దేశవాళీలో మంచి ప్రదర్శన కనబర్చినా...పాక్ జట్టు కోసం అతని పేరును మళ్లీ పరిశీలించలేదు. అయితే ఇప్పుడు సెలక్టర్‌గా అతను అధికారిక పదవిలోకి వచ్చాడు. -
కోహ్లి, రోహిత్ ఔటైతే చాలు.. ఐపీఎల్ ఆడితే సరిపోదు! పాకిస్తానే ఫేవరేట్
ఆసియాకప్-2023 బుధవారం(ఆగస్టు 30) నుంచి ప్రారంభం కానుంది. ముల్తాన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్-నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఇక టీమిండియా పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో తమ ఆసియాకప్ ప్రయణాన్ని ప్రారంభించనుంది. సెప్టెంబర్2న కాండీ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత జట్టును టార్గెట్ చేస్తూ పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కీలక వాఖ్యలు చేశాడు. ప్రస్తుత భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మినహా అంత గొప్ప ఆటగాళ్ల లేరని భట్ మరోసారి విషం చిమ్మాడు. "భారత జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వారితో పాటు యువ ఆటగాళ్లు ఉన్నారు. వారు చాలా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన అనుభవం మాత్రం పెద్దగా లేదు. ముఖ్యంగా ఇటువంటి హై వోల్టేజ్ మ్యాచ్‌ల్లో ఒత్తడిని తట్టుకోలేరు. విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ అద్భుతంగా ఆడినప్పుడే భారత్ చాలా సార్లు గెలుపొందింది. మిగితా ఆటగాళ్లు బాధ్యత తీసుకుని ఆడినప్పుడు టీమిండియా గెలవడానికి చాలా కష్టపడింది. టీమిండియా బ్యాటింగ్ పరంగా చాలా బలహీనంగా ఉంది. పాక్ బౌలర్లు కోహ్లి, రోహిత్ వంటి రెండు పెద్ద వికెట్లను పడగొడితే సగం మ్యాచ్ గెలిచనట్లే. అదే పాకిస్తాన్లో బాబర్, రిజ్వాన్, ఫఖర్, షాదాబ్, షాహీన్, హరీస్ రవూఫ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ప్రస్తుత పాకిస్తాన్ జట్టు చాలా అద్భుతంగా ఉంది. నా వరకు అయితే పాకిస్తాన్ టైటిల్ ఫేవరేట్" అని తన యూట్యూబ్ ఛానల్లో భట్ పేర్కొన్నాడు. చదవండి: తిలక్ వర్మకు చోటు దక్కడం చాలా సంతోషం: విజయ్ దేవరకొండ -
ఇషాన్ కిషన్ కు పాకిస్థాన్ క్రికెటర్ సపోర్ట్..
-
ఇమ్రాన్, బాబర్ కాదు; వరల్డ్ నంబర్ 1 కెప్టెన్ ఈ టీమిండియా స్టార్: పాక్ మాజీ సారథి
ప్రపంచంలోని క్రికెట్ జట్ల కెప్టెన్లందరిలో టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని అత్యుత్తమ సారథి అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అన్నాడు. గొప్ప విజయాలెన్నో సాధించినా నిరాండంబరంగా ఉండటం అతడికే చెల్లిందన్నాడు. అందుకే వరల్డ్ నంబర్ 1 కెప్టెన్ అంటే తనకు ధోనినే గుర్తుకొస్తాడని సల్మాన్ పేర్కొన్నాడు. కాగా 2004లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ధోని. అనతికాలంలోనే టీమిండియా పగ్గాలు చేపట్టి.. మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ గెలిచి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఇటు వికెట్ కీపర్ బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చిన ధోని ఖాతాలో ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు ఉండటం విశేషం. ధోని హయాంలోనే.. ప్రస్తుతం టీమిండియా ముఖచిత్రంగా మారిన విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంచెలంచెలుగా ఎదిగారన్న సంగతి తెలిసిందే. తలా ప్రోత్సాహంతో రోహిత్ ఓపెనర్‌గా ప్రమోట్ కాగా.. కోహ్లికి పెద్దన్నలా మారి అన్ని విషయాల్లో ధోని అతడికి అండగా నిలిచాడు. ఇక సంచలన నిర్ణయాలతో జట్టు రూపురేఖలు మార్చిన భారత కెప్టెన్లలో ధోనికి చోటు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మైదానంలో మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్న ధోని లీగ్ క్రికెట్లోనూ సత్తా చాటుతున్నాడు. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా నిలిపాడు. ఈ నేపథ్యంలో నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన పాక్ మాజీ సారథి సల్మాన్ బట్.. ధోని గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘గత 15 ఏళ్ల చరిత్రను ఒక్కసారి గమనిస్తే.. ప్రపంచంలో నంబర్ 1 కెప్టెన్ అంటే మహేంద్ర సింగ్ ధోని గుర్తుకువస్తాడు. మైదానంలో అతిగా ప్రవర్తించిన దాఖలాలు లేవు. సహచరులతో గానీ, ప్రత్యర్థులతో గానీ గొడవ పడిన సందర్భాలు కూడా లేవు. అతిపెద్ద విజయాలు సాధించిన సమయంలో జట్టు సభ్యులు సెలబ్రేట్ చేసుకుంటున్నపుడు కూడా ఓ పక్కన సాధారణ వ్యక్తిలా నిలబడతాడు. అంత నిరాండంబరంగా, ప్రశాంతంగా ఉండే వ్యక్తులు ఎవరుంటారు?’’ అంటూ ధోనిని కొనియాడాడు. కాగా పాకిస్తాన్‌కు 1992లో.. వన్డే వరల్డ్‌కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజంలను కాదని దాయాది జట్టు మాజీ సారథి.. ధోని పేరును చెప్పడం విశేషం. చదవండి: 50 ఓవర్ల ఫార్మాట్లో భారీ స్కోర్.. ఇంగ్లండ్ 498 పరుగులు చేస్తే..! గిల్, జైశ్వాల్, కిషన్ కాదు.. అతడే టీమిండియా ఫ్యూచర్ స్టార్! -
'ఒకే మ్యాచ్‌లో 1000 కొట్టినా.. జట్టులో చోటుకు గ్యారంటీ లేదు'
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో మూడు వన్డేల్లోనూ వరుసగా హాఫ్ సెంచరీలు బాది 184 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు ముందు కిషన్ మంచి ఫామ్‌లో ఉండడం భారత జట్టుకు కలిసొచ్చే ఆంశం. అయితే రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుబాటులో లేడు కాబట్టి కిషన్‌కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. అదే విధంగా వరల్డ్‌కప్‌కు ముందు ఆటగాళ్లను పరీక్షించాలనే ఉద్దేశ్యంతో కిషన్‌కు ప్రస్తుతం విండీస్ సిరీస్‌లో ఓపెనర్‌గా అవకాశం ఇచ్చారు. కిషన్ అద్భుతంగా ఆడుతున్నప్పటికీ జట్టులో మాత్రం చోటు అనుమానంగానే ఉంది. రోహిత్, కెఎల్ రాహల్ అందుబాటులోకి వస్తే అతడికి జట్టులో చోటు కష్టమే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కిషన్‌ను ఉద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్ పట్ల భారత జట్టు వ్యవహరిస్తున్న తీరు గందరగోళంగా ఉంది. అతడిని ప్రయోగాలకు ఎందుకు బలిచేస్తుందో నాకు అర్ధం కావడం లేదు. భారత జట్టు మెనెజ్‌మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే తను డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతడు కేవలం సెకెండ్ ఆప్షనే అని భారత జట్టు మెనెజ్‌మెంట్ అంగీకరించాలి. అతడు ఒకే ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసినా రెండో ఆప్షన్‌గానే ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇలా చేయడం వల్ల ఆటగాడి ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బ తింటుంది. ఆటగాడి శ్రమకు తగ్గ ఫలితం దక్కాలి. అంతే తప్ప సెకెండ్ ఆప్షన్‌గా భావించకూడదు" అని బట్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: #Riyan Parag: నేను అవన్నీ పట్టించుకోను.. చూయింగ్ గమ్ నమిలితే తప్పు! అది నా ఇష్టం -
గిల్‌ను సచిన్‌తో పోల్చిన అక్రమ్.. స్పందించిన పాక్ మాజీ కెప్టెన్! ఎమన్నాడంటే?
గత కొన్ని నెలలగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్మురేపుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో అక్రమ్ పోల్చాడు. కాగా గిల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2023లో ఈ యువ ఓపెనర్ అదరగొట్టాడు. ఓవరాల్‌గా 17 మ్యాచ్‌ల్లో 890 పరుగులు చేసి ఈ ఏడాది సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. అంతకుముందు ఈ ఏడాదిలో న్యూజిలాండ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీ, అదే జట్టుపై టీ20 సెంచరీ సాధించాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా గిల్ సెంచరీతో చెలరేగాడు. ఇక ఐపీఎల్లో దుమ్మురేపిన గిల్.. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ఈ నేపధ్యంలో స్టార్ స్పోర్ట్స్’లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో అక్రమ్ పాల్గొన్నాడు. "ఒకవేళ నేను గిల్ వంటి అద్భుతమైన ఆటగాడికి టీ20 ఫార్మాట్లో బౌలింగ్ చేస్తే.. వన్డేలలో సచిన్‌కు తొలి 10 ఓవర్లలో ఎలా వేసేవాడినో అలాగే వేస్తా. అతడు కచ్చితంగా సచిన్ అంతటి వాడు అవుతాడని" అక్రమ్ కొనియాడాడు. ఇక గిల్‌ను ఉద్దేశించి అక్రమ్ చేసిన వాఖ్యలపై మరోపాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ స్పందించాడు. "గిల్‌కి బౌలింగ్ చేయడం సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ చేయడం ఒక్కటే అని వసీం భాయ్ అన్నాడు. నాకు తెలిసి గత కొన్ని రోజులగా చాలామంది గిల్ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. గొప్ప గొప్ప ఆటగాళ్లు గిల్‌ను సచిన్ వంటి దిగ్గజ క్రికెటర్లతో పోల్చుతున్నారు. ముఖ్యంగా అక్రమ్ లాంటి దిగ్గజ బౌలర్ గిల్‌ను ప్రశంసించడం.. అది అతడికి దక్కిన గౌరవం. నిజానికి గిల్ కూడా అందుకు అర్హుడు. అతడు కొన్ని నెలలగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడు ఇదే దూకుడును రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని కోరుకుంటున్నా" అని తన యూట్యూబ్ ఛానల్లో భట్ పేర్కొన్నాడు. -
అలా అయితే టీమిండియా భారీ మూల్యం చెల్లించకతప్పదు: పాక్ మాజీ కెప్టెన్
India Vs Australia - BGT 2023: రిషబ్ పంత్ జట్టుకు దూరమైన నేపథ్యంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా వికెట్ కీపర్ ఎవరన్న అంశంపై క్రీడావర్గాల్లో చర్చ నడుస్తోంది. కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ల రూపంలో ముగ్గురు వికెట్ కీపర్లు ఉండగా.. మేనేజ్మెంట్ ఎవరివైపు మొగ్గుచూపుతుందోనన్న ఆసక్తి పెరిగింది. కాగా, దేశవాళీ క్రికెట్లో తమ జట్టు తరఫున రెగ్యులర్‌గా కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు ఆంధ్ర ఆటగాడు భరత్. అతడు ఈ సిరీస్‌తో అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. కీలక సిరీస్ నేపథ్యంలో సీనియర్, వైస్ కెప్టెన్ రాహుల్‌కే కీపర్‌గా అవకాశం ఇస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పార్ట్ టైమ్ వికెట్ కీపర్‌ను నమ్ముకుంటే టీమిండియా భారీ మూల్యం చెల్లించకతప్పదని అభిప్రాయపడ్డాడు. ‘‘పిచ్ స్వభావం గురించి పక్కన పెడితే.. టెస్టు మ్యాచ్‌లో పార్ట్ టైమ్ వికెట్ కీపర్‌తో ప్రయోగాలు చేయకూడదు. ఈ తప్పిదం కారణంగా మ్యాచ్ మాత్రమే కాదు.. ఏకంగా సిరీస్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. రెగ్యులర్‌గా కీపింగ్ చేసే వ్యక్తిని కాదని వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ సల్మాన్ భట్ పేర్కొన్నాడు. కాగా కేఎస్ భరత్‌కు వికెట్ కీపర్‌గా తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. చదవండి: BGT 2023: ఆసీస్‌తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఇషాన్ కిషన్..! Rohit Sharma: 'పిచ్‌పై ఏడ్వడం మానేసి ఆటపై ఫోకస్ పెట్టండి' WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ తేదీని ప్రకటించిన ఐసీసీ -
శుభ్‌మన్ గిల్‌ను ఫెదరర్‌తో పోల్చిన పాక్ మాజీ కెప్టెన్
టీమిండియా యంగ్ డైనమైట్, రైజింగ్ స్టార్ శుభ్‌మన్ గిల్‌పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్లో ఓ ప్రోగ్రాం సందర్భంగా భట్ మాట్లాడుతూ.. గిల్‌తో పాటు టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్, టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ పేర్లను ప్రస్తావించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో గిల్ చేసిన విధ్వంసకర శతకాన్ని కొనియాడిన భట్.. ఇదే సందర్భంగా గిల్ సహచరుడు, సహ ఓపెనర్ ఇషాన్‌ను తక్కువ చేసి మాట్లాడాడు. గిల్ బ్యాటింగ్ స్టయిల్‌ను ఆకాశానికెత్తుతూనే, ఇషాన్ స్థాయి ఇంకా మెరుగుపడాలని సూచించాడు. ఇషాన్‌తో పోలిస్తే గిల్ స్థాయి చాలా ఎక్కువ అని, ఈ ఒక్క ఇన్నింగ్స్ ఆధారంగా తాను ఈ కామెంట్ చేయట్లేదని అన్నాడు. గిల్ బ్యాటింగ్ చూస్తుంటే టెన్నిస్‌లో ఫెదరర్ ఆట చూసిన ఫీలింగ్ కలుగుతుందని, ఫెదరర్లా గిల్ కూడా ఆటను చాలా క్లాస్‌గా ఆడతాడని ప్రశంసించాడు. పవర్ హిట్టింగ్ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో గిల్ కష్టపకుండా, టెక్నిక్ ఉపయోగించి సునాయాసంగా షాట్లు ఆడుతున్నాడని కొనియాడాడు. గిల్ ఆడిన ప్రతి షాట్ కూడా అచ్చమైన క్రికెటింగ్ షాట్ అని, టెన్నిస్‌లో ఇదే ఫార్ములా ఫాలో అయిన ఫెదరర్ ఎలా సక్సెస్ అయ్యాడో గిల్ కూడా అలాగే సక్సెస్ అవుతాడని జోస్యం చెప్పాడు. టెక్నిక్ విషయంలో ప్రస్తుత తరం క్రికెటర్లలో గిల్ మించిన బ్యాటర్ లేడని, ఇతను కచ్చితంగా టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమని ప్రశంసల వర్షం కురింపించాడు. పాక్ మాజీలు సహజంగా టీమిండియా ఆటగాళ్లను విమర్శించడమే పనిగా పెట్టుకుంటుంటారు. కానీ, భట్ గిల్‌ను పొగడ్తలతో ముంచెత్తడం ఆశ్చర్యకరంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, న్యూజిలాండ్‌తో మూడో టీ20లో గిల్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 126 నాటౌట్ పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా టీమిండియా మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన గిల్.. అంతకుముందు కివీస్‌తోనే జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ, డబుల్ సెంచరీ బాదాడు. -
సూర్య ఇండియన్ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్లో ఉంటే పరిస్థితి!
Suryakumar Yadav: ‘‘అతడు 30వ ఏట అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడని నేనెక్కడో చదివాను. అతడి ఫిట్నెస్, బ్యాటింగ్ చూస్తుంటే ముచ్చటేస్తుంది’’ అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అన్నాడు. తను గనుక పాకిస్తాన్లో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వ్యాఖ్యానించాడు. టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. సూర్య గ్రేట్ ఇన్నింగ్స్ శ్రీలంకతో నిర్ణయాత్మక ఆఖరి టీ20లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. రాజ్‌కోచ్ మ్యాచ్‌లో ‘పవర్ ప్లే’ ఆఖరి బంతికి క్రీజులోకి వచ్చాడు సూర్య. 6 ఓవర్ల పవర్ల ప్లేనే అయిపోయింది. కానీ.. మిగతా 14 ఓవర్ల పవర్ స్ట్రోక్స్ ఎలావుంటాయో ‘స్కై’ చూపెట్టాడు. కవర్ డ్రైవ్, ర్యాంప్ షాట్లతో టచ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ స్కోరు బోర్డును ఆద్యంతం పరుగు పెట్టించాడు. 26 బంతుల్లోనే ఫిఫ్టీ స్పిన్, పేస్, గూగ్లీ ఇలా ఏ బంతి వేసిన తన శైలి షాట్లతో చెలరేగిపోయాడు. పేస్‌తో ముఖం మీదికి వచ్చే బంతుల్ని విడిచి పెట్టలేదు. అదే పనిగా ర్యాంప్ షాట్లతో సిక్స్‌లు, ఫోర్లుగా దంచేస్తూ 26 బంతుల్లోనే ఫిఫ్టీని అవలీలగా పూర్తి చేసుకున్నాడు. అతని షాట్లకు ఆకాశమే హద్దయ్యింది. ఫుట్ టాస్ బంతుల్ని, యార్కర్ డెలివరీల్ని మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలకు తరలించాడు. ఎలా వేసినా దంచేశాడు. అతని ధాటికి లంక బౌలర్ మదుషంక 13వ ఓవర్లో 18 పరుగులు రాగా... తీక్షణ మరుసటి ఓవర్లో 2, 4, 6, 6, 1లతో సూర్య వేగం ఇంకాస్త పెంచాడు. ఆఖరి బంతిని ఆడిన గిల్ బౌండరీ కొట్టడంతో ఆ ఓవర్లో 23 పరుగులొచ్చాయి. కేవలం ఈ రెండు ఓవర్లలోనే భారత్ 113/2 నుంచి 154/2కు చేరింది. హసరంగ 15వ ఓవర్లో గిల్ క్లీన్‌బౌల్డయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4), దీపక్ హుడా (4) స్వల్ప వ్యవధిలోనే నిష్క్రమించినా... సూర్య బాదుడుకు అదేమంతా ప్రభావమే చూపలేదు. మూడో సెంచరీ ఆఖర్లో జతయిన అక్షర్ పటేల్ (9 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు) చకచకా బౌండరీలు బాదాడు. 18వ ఓవర్ చివరి బంతికి భారత్ స్కోరు 200కు చేరగా, 19వ ఓవర్ తొలి బంతికి సూర్యకుమార్ (45 బంతుల్లో; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీ పూర్తయ్యింది. పొట్టి ఫార్మాట్లో అతనికిది మూడో సెంచరీ కావడం విశేషం. ఇక సూర్య తుపాన్ ఇన్నింగ్స్ ధాటికి 228 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా 91 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోండగా... పాక్ మాజీ సారథి సల్మాన్ భట్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. సూర్యను కొనియాడుతూనే తమ బోర్డు గత విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా.. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కుదరదని సర్ఫరాజ్ అహ్మద్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. యూట్యూబ్‌లో ప్రస్తావించిన సల్మాన్.. సూర్య పాకిస్తాన్లో ఉండి ఉంటే అసలు అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేవాడే కాదన్నాడు. సల్మాన్ భట్ ఇండియన్ కావడం తన అదృష్టం ‘‘తను భారతీయుడు కాబట్టి 30 ఏళ్ల వయసులో అరంగేట్రం చేయగలిగాడు. కొంతమంది జట్టులోకి వచ్చిన తర్వాత సరిగ్గా ఆడకపోయినా ఏదో నెట్టుకొస్తారు. మరి కొంతమందికి అసలు అవకాశాలే రావు. కానీ సూర్యకుమార్ విషయం విభిన్నం. 30లలో అతడు జట్టులోకి రావడం గొప్ప విషయం. నిజానికి ఇండియన్ కావడం తన అదృష్టం. ఒకవేళ తనే గనుక పాకిస్తాన్లో ఉండి ఉంటేనా.. 30 ఏళ్లు పైబడిన బాధితుల జాబితాలో ఉండిపోయేవాడు. బ్యాటింగ్‌లో సూర్య పరిణతి చూస్తుంటే.. ఏ బౌలర్ ఎలాంటి బాల్ వేస్తాడో తనకు ముందుగానే తెలిసినట్లు అనిపించింది’’ అని సల్మాన్ భట్ పేర్కొన్నాడు. కాగా 2021లో తనకు 30 ఏళ్ల వయసున్నపుడు ఇంగ్లండ్‌తో స్వదేశంలో మ్యాచ్‌తో సూర్య అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. చదవండి: IND vs SL: డివిలియర్స్, క్రిస్ గేల్‌తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు శ్రీలంకతో వన్డే సిరీస్.. టీమిండియాలో ఎవరెవరు ఉన్నారంటే..? -
ఐపీఎల్లో కప్ సాధిస్తే.. టీమిండియా కెప్టెన్ చేయాలా? ఇదెక్కడి రూల్!
టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అదే విధంగా రోహిత్ స్ధానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పజెప్పాలని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రపంచకప్‌లో ఓటమి పాలైనంత మాత్రాన కెప్టెన్సీలో మార్పు చేయాలనడం సరికాదు అని అతడు అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో కప్ సాధిస్తే.. కెప్టెన్ చేస్తారా? తన యూట్యూబ్ ఛానల్లో భట్ మాట్లాడుతూ.. "హార్దిక్ పాండ్యాను ఎవరు కెప్టెన్ చేయాలని అనుకుంటున్నారో నాకు తెలియదు. అయితే అతడు అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఐపీఎల్లో కూడా కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు. కానీ భారత్ వంటి అగ్రశ్రేణి జట్టును సారథిగా ముందుకు నడిపించడం అంత సులభం కాదు. అలా అయితే రోహిత్ శర్మ ఐపీఎల్లో ఐదు సార్లు కెప్టెన్‌గా టైటిల్ సాధించాడు. ఇప్పుడు వరల్డ్‌కప్‌లో విఫలమయ్యాడు కదా. అదే అతడు ఈ ప్రపంచకప్‌లో ఒకటి రెండు మంచి ఇన్నింగ్స్‌లు ఆడి ఉంటే.. కెప్టెన్సీ మార్పు గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఆసియాలో అది ఒక అనవాయితీ. కెప్టెన్‌గా ఒకట్రెండు సిరీస్‌లలో విఫలమైతే చాలు, కెప్టెన్సీ నుంచి తీసేయాలి, జట్టు నుంచి తొలిగించాలని డిమాండ్స్ వినిపిస్తాయి. ఆట గురించి పూర్తిగా తెలిసినవారు అలా మాట్లడారని నేను అనుకుంటున్నాను. అలా అయితే ఈ ఏడాది ప్రపంచకప్‌ను ఒకే ఒక కెప్టెన్ సాధించాడు. మిగిలిన జట్లు ఓడిపోయాయి. ప్రపంచకప్‌లో ఓటమిపాలైనందుకు మొత్తం 11 జట్ల కెప్టెన్లను మార్చమంటారా? ఇవన్నీ అవసరలేని చర్చలు’’ అని అతడు పేర్కొన్నాడు. చదవండి: భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 ఆలస్యం.. కారణమిదే -
బాబర్ చేసిన తప్పు అదే.. అందుకే పాకిస్తాన్ ఓడిపోయింది! లేదంటే
టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో రెండో సారి ఛాంపియన్స్‌గా నిలవాలన్న పాక్ కల నేరవేరలేదు. కాగా ఫైనల్లో ఆఫ్రిది స్థానంలో ఇఫ్తికర్ ఆహ్మద్‌ను బౌలింగ్ చేయంచడాన్ని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తప్పుబట్టాడు. ఏం జరిగిందంటే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 16 ఓవర్ వేయడానికి వచ్చిన పాక్ పేసర్ షాహీన్ ఆఫ్రిది గాయం కారణంగా కేవలం ఒక్క బంతి మాత్రమే వేసి ఫీల్డ్‌ను వీడాడు. దీంతో ఆ ఓవర్లో మిగిలిన ఐదు బంతులను ఇఫ్తికర్ ఆహ్మద్‌తో బాబర్ బౌలింగ్ చేయించాడు. అయితే ఈ ఐదు బంతుల్లో ఇఫ్తికర్ 13 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మలుపు తిరిగింది. అనంతరం పాకిస్తాన్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఇంగ్లండ్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అయితే ఐదు బంతులను నవాజ్‌తో పూర్తి చేసి ఉంటే బాగుండేది అని సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. బాబర్ చేసిన తప్పు అదే "ఈ మ్యాచ్‌లో షాహీన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆరంభంలోనే ఫామ్‌లో ఉన్న హేల్స్ వికెట్ పడగొట్టాడు. అయినప్పటికీ పవర్‌ప్లేలో ఐదో ఓవర్ ఆఫ్రిదికి ఎందుకు ఇవ్వలేదో నాకు ఇప్పటికీ ఆర్ధం కాలేదు. ఆ సమయంలో బంతి అద్భుతంగా స్పింగ్ అవుతోంది. అటువంటి సమయంలో బాబర్.. షహీన్, నసీమ్ షాతో వరుస ఓవర్లు బౌలింగ్ చేయాల్సింది. ఎందుకంటే బంతి స్వింగ్‌తో పాటు ఇంగ్లండ్ కూడా ఒత్తడిలో ఉంది. అప్పుడు షాదాబ్ ఖాన్‌తో బాబర్ బౌలింగ్ వేయించాడు. ఈ నిర్ణయం ఇంగ్లండ్ బ్యాటర్లపై ఎటువంటి ప్రభావం చూపలేదు. షాహీన్ తన సెకెండ్ స్పెల్ కోటాను గాయం కారణంగా పూర్తి చేయలేకపోయాడు. బెన్ స్టోక్స్ క్రీజులో ఉన్నాడు కాబట్టి ఆఫ్రిది ఓవర్ పూర్తి చేయంచడానికి బాబర్ ఇఫ్తికర్ అహ్మద్‌ని తీసుకువచ్చాడు. అది కచ్చితంగా సరైన నిర్ణయం కాదు. మహ్మద్ నవాజ్ పాకిస్తాన్ ప్రధాన బౌలర్. అతడితో ఓవర్ పూర్తి చేయాల్సింది. కానీ బాబర్ అలా చేయలేదు. ఆ ఒక్క ఓవర్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది" అని యూట్యూబ్ ఛానల్లో సల్మాన్ భట్ పేర్కొన్నాడు. చదవండి: IRE vs PAK: పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. చిత్తు చేసిన ఐర్లాండ్! సిరీస్ సొంతం -
'బౌలింగ్‌లో దమ్ము లేకపోయేది.. హెల్మెట్ లేకుండానే ఆడేవారు'
టి20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు మరో రెండు వారాల సమయం ఉంది. కాస్త సమయం ఉన్నప్పటికి ఇప్పటినుంచే అభిమానులు పదునైన మాటలతో కత్తులు దూసుకుంటున్నారు. ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే ఎంత హైవోల్టేజ్ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా చిరకాల ప్రత్యర్థుల మధ్య అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా మ్యాచ్ జరగనుంది. తాజాగా భారత్, పాక్ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో భారత్ పేస్ బౌలింగ్ వీక్‌గా ఉండడంతో పాక్ ఓపెనర్లు హెల్మెట్లు లేకుండానే బరిలోకి దిగేవారంటూ పేర్కొన్నాడు. సల్మాన్ భట్ మాట్లాడుతూ.. 'సయీద్ అన్వర్, అమీర్ సోహైల్‌లు ఆడుతున్న సమయంలో టీమిండియా పేస్ బౌలింగ్ వీక్‌గా ఉండేది. అందుకే వాళ్లు హెల్మెట్లు లేకుండానే బరిలోకి దిగేవారు. తలకు క్యాప్‌ను పెట్టుకుని టీమిండియా బౌలర్లను ఉతికారేసేవారు'' అంటూ చెప్పుకొచ్చాడు. 2013లో భారత్, పాక్‌ల మధ్య చివరిసారి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆ తర్వాత రాజకీయ కారణాలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో మ్యాచ్‌లకు ఆస్కారం లేకుండా పోయింది. అప్పటినుంచి కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే టీమిండియా, పాకిస్తాన్‌లు తలపడుతూ వస్తున్నాయి. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ భారత్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఇటీవలే ఆసియాకప్‌లో తలపడగా.. టీమిండియా పాక్‌పై బదులు తీర్చుకుంది. మళ్లీ నెల వ్యవధిలోనే ఇరుజట్లు పొట్టి ప్రపంచకప్‌లో మరోసారి తలపడనున్నాయి. మరి ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఇక సల్మాన్ భట్ పాకిస్తాన్ తరపున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టి20లు ఆడాడు. 2010లో తోటి క్రికెటర్లు మహ్మద్ ఆమిర్, మహ్మద్ ఆసిఫ్‌లతో కలిసి సల్మాన్ భట్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడం అతని కెరీర్‌ను అంధకారంలో పడేసింది.ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో సల్మాన్ భట్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించింది. 2015లో నిషేధం నుంచి బయటపడ్డ సల్మాన్ భట్ అప్పటినుంచి దేశవాలీ టోర్నీలో ఆడాడు. ఆ తర్వాత మే 2022లో సింగపూర్ క్రికెట్ టీమ్‌కు కన్సల్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. చదవండి: ఉమ్రాన్ మాలిక్‌కు వీసా కష్టాలు..ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఇబ్బందులు క్రికెట్లో అరుదైన ఘటన.. నోరెళ్లబెట్టడం ఖాయం! -
Ind Vs Aus: కోహ్లి, పాండ్యా మినహా వాళ్లంతా వేస్ట్! అధిక బరువు కారణంగా..
India Vs Australia T20 Series: ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఓటమి నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల తీరుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో కొంతమంది ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించకుండా రోజురోజుకీ లావైపోతున్నారని వ్యాఖ్యానించాడు. అధిక బరువుతో బాధపడుతున్నారని.. ప్రస్తుతం టీమిండియా కంటే కూడా మిగతా ఆసియా జట్ల క్రికెటర్లు ఫిట్‌గా కనిపిస్తున్నారని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా మినహా మిగతా ఆటగాళ్లంతా ఫిట్నెస్ను సీరియస్‌గా తీసుకున్నట్లు లేదని సల్మాన్ అభిప్రాయపడ్డాడు. కాగా మొహాలీలో ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. చెత్త ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా.. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ మెరుపులు వృథాగా పోయాయి. కోహ్లి, పాండ్యా మినహా.. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో భారత్ ఫీల్డింగ్ చేసిన తీరు విమర్శలకు దారి తీసింది. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కీలక సమయంలో క్యాచ్‌లు మిస్ చేయడంతో టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సల్మాన్ భట్ మాట్లాడుతూ.. ‘‘ఎంత మంది నాతో ఏకీభవిస్తారో తెలియదు కానీ.. నా అభిప్రాయం ప్రకారం టీమిండియా ఆటగాళ్ల ఫిట్నెస్ మాత్రం మరీ అంత గొప్పగా ఏమీ లేదు. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా మినహా ఎవరూ ఫిట్‌గా కనిపించడం లేదు. నిజానికి ప్రపంచంలోనే అత్యధిక పేమెంట్ అందుకుంటున్నది టీమిండియా ఆటగాళ్లే! ఎప్పుడూ ఏదో ఒక సిరీస్‌తో బిజీగా ఉంటారు. వరుసగా మ్యాచ్‌లు ఆడుతూ ఉంటారు. రోహిత్, రిషభ్ వంటి ఆటగాళ్లు.. కానీ ఇప్పుడు వాళ్ల ఫిట్నెస్ స్థాయికి తగ్గట్టు కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పోలిస్తే టీమిండియా ఆటగాళ్లు వెనకబడి ఉన్నారు. అంతెందుకు ఇతర ఆసియా జట్టు సైతం ఈ విషయంలో భారత్ కంటే ఓ అడుగు ముందే ఉన్నాయి. కొంతమంది భారత ఆటగాళ్లు ఉండాల్సిన దాని కన్నా ఎక్కువ బరువు ఉన్నారు. విరాట్ కోహ్లి ఫిట్‌నెస్‌కు మారుపేరులా నిలిస్తే.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ మైదానంలో చురుగ్గా కదల్లేక బద్దకంగా కనిపిస్తున్నారు. వాళ్లు పూర్తి ఫిట్‌గా ఉంటే మాత్రం ప్రమాదకర బ్యాటర్లుగా మారతారడనడంలో సందేహం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: Kohli-Ashneer Grover: కోహ్లిని కలిసిన వివాదాస్పద పారిశ్రామికవేత్త Ind Vs Aus 2nd T20: ‘ఆరెంజ్ సిటీ’లో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం.. వీడియో వైరల్ -
'నేను మూడేళ్ల క్రితమే చెప్పాను.. పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి వస్తుందని'
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఆ దేశ క్రికెట్ బోర్డుపై మండిపడ్డాడు. ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదని బట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఆదివారం (సెప్టెంబర్ 11) దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 23 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బట్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "పాక్ సరైన యువ ఆటగాళ్లను తాయారు చేయాల్సిన అవసరముందని నేను మూడేళ్ల క్రితమే చెప్పాను. ప్రస్తుతం జట్టు కూర్పు అస్సలు బాగోలేదు. పాక్ మిడాలర్డర్‌లో సరైన ఆటగాళ్లు లేరు. జట్టు మేనేజ్మెంట్ సీనియర్ ఆటగాళ్లకు ఇచ్చిన అవకాశాలు యువ క్రికెటర్లకు ఇవ్వడం లేదు. అసలు పాకిస్తాన్ ప్రణాళికలు ఎంటో నాకు ఆర్ధం కావడం లేదు. అదే విధంగా ఆసియాకప్‌లో ఓటమి అనంతరం రిపోర్టర్లు హెడ్‌కోచ్‌ను ఎందుకు సరైన ప్రశ్నలు అడగలేదో నాకు తెలియదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నవాజ్ అద్భుమైన బ్యాటింగ్ చేశాడు. ఆతర్వాతి మ్యాచ్‌లో అతడిని ఎందుకు ఆ స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు రాలేదు? నసీమ్ షా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అటువంటి అప్పడు అతడితో ముందు తన నాలుగు ఓవర్ల కోటాను ఎందుకు పూర్తి చేయంచరు..? ఇటువంటి ఎన్నో తప్పులు ఆసియాకప్‌లో పాక్ చేసింది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Shahid Afridi: 'కోహ్లి రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం'.. మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
'రోహిత్ శర్మను పాక్ ఆటగాళ్లతో పోల్చడం సరికాదు'
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ బట్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ విధ్వంసకర ఆటగాడని, అతడికి ఎవరూ సాటి రారు అని బట్ కొనియాడాడు. రోహిత్‌ను పాక్ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజాం, రిజ్వాలన్తో పోల్చడం సరికాదని బట్ అభిప్రాయపడ్డాడు. "రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. అటువంటి ఆటగాడిని బాబర్, రిజ్వాన్‌లతో పోల్చడం సరికాదు. కోహ్లిలో ఉన్న సగం ఫిట్నెస్ రోహిత్‌కు ఉంటే అతడికి ఎవరూ సాటి రారు. కేవలం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ మాత్రమే రోహిత్ శర్మ వంటి ఆట తీరును కలిగి ఉన్నాడు" అని యూట్యూబ్ ఛానల్లో బట్ పేర్కొన్నాడు. కాగా ఆసియాకప్-2022లో రోహిత్ శర్మ అంతగా రాణించలేకపోయాడు. ఇక పాక్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో 6 మ్యాచ్‌లు ఆడిన బాబర్ కేవలం 68 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రిజ్వాన్ మాత్రం ఈ టోర్నీలో అదరగొట్టాడు. 281 పరుగులతో టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా రిజ్వాన్ నిలిచాడు. చదవండి: Virat Kohli-Anushka Sharma: లండన్ వీధుల్లో విరుష్క దంపతుల చక్కర్లు -
జెట్ లాగ్ వల్లేనేమో! ఏబీతో సూర్యను పోల్చడమేంటి?: పాక్ మాజీ కెప్టెన్
తాజాగా భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. సూర్య ఆటతీరు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ను గుర్తుకు తెస్తోందని పాంటింగ్ అన్నాడు. అయితే తాజాగా సూర్యకుమార్ యాదవ్‌ను డివిలియర్స్‌తో పొల్చడాన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ తప్పు బట్టాడు. డివిలియర్స్‌కు ఉన్న ప్రతిభ ప్రపంచ క్రికెట్లో మరే ఏ ఇతర ఆటగాడికి లేదని సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ అద్భతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరగిన టీ20 సిరీస్‌లో సూర్య సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం సూర్య టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. క్రికెట్ ప్రపంచంలో డివిలియర్స్ లాంటి ఆటగాడే లేడు "ఏబీ డివిలియర్స్‌తో ప్రస్తుత తరం క్రికెటర్లతో పోల్చడం సరికాదు. అతడి ప్రతిభకు ఎవరూ సాటిరారు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్ధి జట్టుకు వెన్నులో వణుకు పుడుతోంది. ఏబీడిని తొందరగా ఔటచేయలేకపోతే.. ఓటమి తప్పదని ప్రత్యర్ధిజట్టుకు ముందే తెలుసు. రూట్, విలియమ్సన్, కోహ్లితో పాటు ప్రపంచ నెం.1 బ్యాటర్‌గా నిలిచిన డివిలియర్స్.. తన కెరీర్లో అద్భుతమైన సెంచరీలు కూడా సాధించాడు. బహుశా పాంటింగ్‌కు జెట్ లాగ్ వదిలినట్లు లేదు. అందుకే ఇలా అంటున్నాడేమో" అని సల్మాన్ బట్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. సూర్యని వివ్ రిచర్డ్స్‌తో పోల్చవచ్చు "సూర్యకు ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో అంత అనుభవం లేదు. అతడు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాడు. సూర్య కూడా అద్భుమైన ప్రతిభ కలిగి ఉన్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అతడిని డివిలియర్స్‌తో పొల్చి పాటింగ్ తొందరపడ్డాడు. ఎందుకంటే సూర్యకుమార్ ఇంకా ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో ఆడలేదు. ప్రస్తుతం క్రికెట్లో ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాడు లేడన్నది వాస్తవం. సూర్యని ఎవరతోనైనా పోల్చాలి అనుకుంటే.. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్‌తో పోల్చవచ్చు" అని బట్ అన్నాడు. చదవండి: Deepak Hooda: ప్రపంచ రికార్డుకు చేరువలో దీపక్ హుడా.. భారత్ తరపున తొలి ఆటగాడిగా -
Asia Cup 2022: కచ్చితంగా టీమిండియా ట్రోఫీ గెలవగలదు: పాక్ మాజీ కెప్టెన్
Asia Cup 2022 Winner Prediction: ఆసియా కప్-2022 ట్రోఫీ సాధించగల సత్తా టీమిండియాకు ఉందా అన్న ప్రశ్నపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సరదాగా స్పందించాడు. కచ్చితంగా భారత్ ట్రోఫీ గెలవగలదన్న అతడు.. వాళ్లకేమైనా విటమిన్లు తక్కువయ్యాయా అంటూ చమత్కరించాడు. టీమిండియా బెంచ్ పటిష్టంగా ఉందన్న ఉద్దేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆగష్టు 27 నుంచి ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ ట్రోఫీ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ తలపడనున్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటికే ఏడు సార్లు విజేతగా నిలిచిన టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఈసారి కప్‌ను లిఫ్ట్ చేయగల సత్తా భారత్‌కు ఉందా అంటూ సల్మాన్ బట్కు సోషల్ మీడియా వేదికగా ప్రశ్న ఎదురైంది. కచ్చితంగా వాళ్లు గెలవగలరు! ఇందుకు స్పందించిన ఈ పాకిస్తాన్ మాజీ కెప్టెన్.. ‘‘కచ్చితంగా వాళ్లు గెలవగలరు. వాళ్లకేమైనా విటమిన్లు తక్కువయ్యాయా? గత కొన్ని రోజులుగా ఇండియా అద్భుతంగా ఆడుతోంది. వాళ్లకు చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. కాబట్టి వారినే చాలా మంది ఫేవరెట్లుగా పేర్కొంటున్నారు’’ అని అన్నాడు. ఇక ఇతర జట్ల విజయావకాశాల గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ జట్టు తనదైన రోజు చెలరేగి ఎవరినైనా ఓడించగలదని అందరికీ తెలుసు. టీ20 ఫార్మాట్లో మెరుగైన భాగస్వామ్యాలే కీలకం. అయితే, ఆరోజు పరిస్థితి ఎలా ఉందన్న అంశం మీదే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అఫ్గనిస్తాన్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. ఇక బంగ్లాదేశ్ విషయానికొస్తే.. వాళ్లు ఒక్కోసారి బాగానే ఆడతారు. మరికొన్ని సార్లు మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తారు’’ అని సల్మాన్ బట్ పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్-2022లో భాగంగా ఆగష్టు 28న భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. టీ20 ప్రపంచకప్-2021లో పాక్ చేతిలో ఎదురైన ఘోర ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్ధన Rishabh Pant- Urvashi Rautela: మరీ అంత స్ట్రెస్ తీసుకోకు: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ మరో కౌంటర్! Asia Cup 2022 : కోహ్లి ఫామ్‌లోకి వస్తే అంతే సంగతులు.. పాకిస్తాన్‌కు ఆ దేశ మాజీ కెప్టెన్ వార్నింగ్! -
Ind Vs Pak: అతడు ఫామ్‌లోకి వస్తే మనకు ఓటమి తప్పదు: పాక్‌కు సల్మాన్ వార్నింగ్
Asia Cup 2022 India Vs Pakistan: ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈనెల 27న శ్రీలంక, అఫ్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఆ మరుసటి రోజే క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఇక మ్యాచ్‌లో గెలిచి టీ20 ప్రపంచకప్-2021లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక ప్రస్తుతం రోహిత్ సేన వరుస విజయాలు సాధిస్తూ జోరు మీదున్న తీరు చూస్తే గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్లు, యువ ఆటగాళ్లు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఫామ్‌లో ఉండటం సహా.. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్‌లోకి వస్తే భారత్‌ను ఆపడం ఎవరితరం కాదని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కూడా ఇదే మాట అంటున్నాడు. రొటేషన్ పాలసీతో భారత్ తమ ఆటగాళ్లందరినీ పరీక్షిస్తూ బెంచ్‌ను పటిష్టం చేసుకుంటోందని కొనియాడాడు. అదే విధంగా విరాట్ కోహ్లి విజృంభిస్తే పాకిస్తాన్‌కు కష్టాలు తప్పవని బాబర్ ఆజం బృందాన్ని హెచ్చరించాడు. మంచి పరిణామం! ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా సల్మాన్ బట్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘భారత జట్టులో రొటేషన్ పాలసీ అనేది ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయినట్లుగా అనిపిస్తోంది. ప్రతీ సిరీస్‌లోనూ వాళ్లు వేర్వేరు ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నారు. సీనియర్లకు తగినంత విశ్రాంతినిస్తూ.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. విభిన్న కాంబినేషన్లతో ముందుకు వస్తున్నారు. నిజానికి ప్రస్తుతం వాళ్ల బెంచ్ స్ట్రెంత్ కారణంగా సెలక్షన్ తలనొప్పిగా మారుతోంది. ఇది మంచి పరిణామమే. కోహ్లి గనుక ఫామ్‌లోకి వస్తే! ఇక విరాట్ కోహ్లి విషయానికొస్తే... అతడు ఎంతటి అనువజ్ఞుడో, అతని శక్తి సామర్థ్యాలేమిటో అందరికీ తెలుసు. కోహ్లి వీలైనంత తొందరగా ఫామ్‌లోకి వస్తే బాగుంటుందని ఇండియా భావిస్తోంది. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చాలా మంది భారత ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చిన తీరును మనం చూశాం. ఒకవేళ కోహ్లి గనుక తిరిగి పుంజుకుంటే.. కచ్చితంగా అతడు పాకిస్తాన్‌కు తలనొప్పిగా మారతాడు’’ అని సల్మాన్ బట్ పాకిస్తాన్ జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు. కాగా దుబాయ్ వేదికగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా పాకిస్తాన్‌పై కోహ్లి అర్ధ శతకం(57)తో రాణించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్(39) మినహా ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయకపోవడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ బ్యాటర్లను కట్టడి చేయడం భారత బౌలర్లకు సాధ్యం కాకపోవడంతో పది వికెట్ల తేడాతో కనీవిని ఎరుగని రీతిలో ఐసీసీ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. చదవండి: India Tour Of Zimbabwe: స్టార్ ఆల్‌రౌండర్ దూరం..! WI VS NZ 3rd T20: ఎట్టకేలకు ఓ విజయం.. వైట్‌వాష్ అవమానాన్ని తప్పించుకున్న విండీస్ టీమిండియా పటిష్టమైన జట్టే కావొచ్చు.. ధీటుగా పోటీ ఇస్తాం..! #ViratKohli has started the practice for #AsiaCup 2022 at BKC Complex Mumbai.pic.twitter.com/KkhgGWGYti — Lakshya Lark (@lakshyalark) August 11, 2022 Cometh the hour, cometh the man!🙌 Do you remember this crucial knock that helped #TeamIndia complete a tricky chase? Look forward to more such knocks from #KingKohli in the greatest rivalry! #BelieveInBlue | #AsiaCup | #INDvPAK: Aug 28, 6PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/UtZJnVh9v4 — Star Sports (@StarSportsIndia) August 12, 2022 -
కోహ్లితో పోలిస్తే అతను బెటర్.. వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపిక సరైందే..!
Salman Butt: టీమిండియా వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపికపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్‌ను ఎంపిక చేస్తూ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయం సరైందేనని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లిని కాకుండా కేఎల్ రాహుల్‌వైపు మొగ్గుచూపడం సమర్ధనీయమని పేర్కొన్నాడు. వన్డే కెప్టెన్సీ విషయంలో కోహ్లితో పోలిస్తే బీసీసీఐకి రాహులే బెటర్ అప్షన్ అని తెలిపాడు. ఈ విషయమై బీసీసీఐ విధానాన్ని అతను ప్రశంసించారు. రెగ్యులర్ వైస్ కెప్టెన్‌ను స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం అనవాయితినేనని, మరోవైపు రాహుల్ సామర్ధ్యంపై బీసీసీఐకి కూడా పూర్తి నమ్మకం ఉందని, ఐపీఎల్లో రాహుల్ ఈ విషయాన్ని బుజువు చేశాడని తన యూట్యూబ్ ఛానల్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఈ సందర్భంగా యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో బీసీసీఐ అనుసరిస్తున్న విధానాలను ప్రశంసలతో ముంచెత్తిన బట్.. ధోని హయాంలో కూడా ఇదే జరిగిందని గుర్తు చేశాడు. టీమిండియా చిన్న దేశాలతో తలపడినప్పుడు.. బీసీసీఐ యువకులకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించేదని వివరించాడు. రాహుల్‌కి కెప్టెన్సీ అప్పజెప్పడంతో పాటు బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం కూడా సరైందేనని బట్ అభిప్రాయపడ్డాడు. చదవండి: కోహ్లి పేరు పక్కన 'అది' లేకపోవడం ఇబ్బందిగా అనిపించింది.. -
పాండ్యా చాలా వీక్‌గా ఉన్నాడు.. ఇలా అయితే కష్టమే: సల్మాన్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం శరీరకంగా చాలా బలహీనంగా ఉన్నాడని, అతడు తన శరీర దృఢత్వం పెంచుకోవాలని బట్ అభిప్రాయపడ్డాడు. కాగా కొంతకాలంగా ఫామ్ లేక తంటాలు పడుతున్న హార్దిక్ ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్లోను దారుణంగా విఫలమయ్యాడు. దీంతో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. “హార్దిక్ పాండ్యా శరీరం చాలా బలహీనంగా ఉంది. ఇలా అయితే అతడు ఒక్క ఫార్మాట్లో కూడా రాణించలేడు. అతడు తన బరువును, కండలను పెంచుకోవాలి. పాండ్యా తిరిగి 4 ఓవర్లు వేయగలిగేలా కష్టపడాలని రవిశాస్త్రి ఇటీవల చెప్పాడు. ప్రస్తుతం 4 ఓవర్లు కూడా వేయలేని పరిస్థితుల్లో అతడు ఉన్నాడు" అని బట్ తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ రీటైన్ చేసుకోలేదు. దీంతో అతడు రానున్న మెగా వేలంలో పాల్గొననున్నాడు. చదవండి: అహ్మదాబాద్ హెడ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్.. బౌలింగ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా! -
అందుకే విరాట్‌ను ప్రపంచపు అత్యుత్తమ కెప్టెన్ అనేది: పాక్ మాజీ సారధి
Salman Butt Praises Virat Kohli For Supporting Rahane: గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు అండగా నిలిచిన టీమిండియా సారధి విరాట్ కోహ్లిపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి.. తన బృందంలోని సభ్యులపై అపారమైన నమ్మకం కలిగి ఉంటాడని, కష్ట సమయాల్లో వారికి అండగా నిలిచి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడని.. ఈ లక్షణాలే అతన్ని ప్రపంచపు అత్యుత్తమ కెప్టెన్‌గా నిలబెట్టడంలో దోహదపడ్డాయని తెలిపాడు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లందరూ ఫామ్ కోల్పోయిన తమ బృంద సభ్యులకు మద్దుతుగా నిలిచారని, ఇలా చేయడం వల్ల ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగి అత్యుత్తమంగా రాణించారని, చరిత్రే ఇందుకు సాక్షమని పేర్కొన్నాడు. తన గైర్హాజరీలో బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ అద్భుతంగా రాణించి ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించిన రహానేపై నమ్మకముంచడం అంత ఆశ్చర్యకరమైన విషమేమీ కాదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు సల్మాన్ బట్ తన యూట్యుబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా, కోహ్లీ గైర్హాజరీలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే.. మ్యాచ్ మొత్తంలో 39(35, 4) పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమై జట్టులో స్థానాన్ని ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా కెప్టెన్ విరాట్ కోహ్లి.. రహానేకు బాసటగా నిలిచారు. రహానే ఫామ్‌పై బయటి వ్యక్తులు చేస్తున్న విమర్శలు తుది జట్టులో అతని ఎంపికపై ప్రభావం చూపవని వారిరువురు అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే, అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీతో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ లేదా హనుమ విహారిల్లో ఎవరో ఒకరు రహానే స్థానాన్ని భర్తీ చేస్తారని బీసీసీఐ వర్గాల్లో చర్చ సాగుతోంది. రహానే సహా ఫామ్‌లో లేని పుజారాపై సైతం వేటు వేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. చదవండి: త్వరలో కీలక ప్రకటన చేయనున్న కేకేఆర్ స్టార్ బౌలర్..