'ఆ ముగ్గురూ' క్రికెట్ ఆడొచ్చు! | Salman Butt and Mohammad Asif poised to play again after bans | Sakshi
Sakshi News home page

'ఆ ముగ్గురూ' క్రికెట్ ఆడొచ్చు!

Published Thu, Aug 20 2015 8:52 AM | Last Updated on Wed, Jul 25 2018 1:57 PM

'ఆ ముగ్గురూ' క్రికెట్ ఆడొచ్చు! - Sakshi

'ఆ ముగ్గురూ' క్రికెట్ ఆడొచ్చు!

దుబాయ్: ఐదేళ్ల క్రితం స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లకు ఉపశమనం లభించింది. మొహమ్మద్ ఆమిర్, ఆసిఫ్, సల్మాన్ భట్‌ల శిక్షా కాలం సెప్టెంబర్ 1న ముగుస్తుండడంతో వారు పోటీ క్రికెట్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా ధ్రువీకరించింది.

వీరిలో ఆమిర్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడేందుకు అనుమతి లభించింది. ‘యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ విధించిన కొన్ని షరతులకు లోబడి వారు పోటీ క్రికెట్‌లో అడుగు పెట్టవచ్చు. ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా పాల్గొనవచ్చు’ అని ఐసీసీ పేర్కొంది. ఆసిఫ్, భట్‌లకు ఏడు, పదేళ్ల చొప్పున శిక్ష విధించినా సడలింపునిస్తూ దానిని ఐదేళ్లకే పరిమితం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement