Mohammad Asif
-
మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడిన వ్యక్తితో ఫోటో అవసరమా.. యువీకి చురకలు
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నాడు. వర్జీనియా వేదికగా జరగనున్న యునిటీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా పాల్గొనే యువ క్రికెటర్లకు యువీ తన సలహాలు అందించనున్నాడు. ఇదే టోర్నీకి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ కూడా వచ్చాడు. చాలాకాలం తర్వాత ఈ ఇద్దరు ఎదురుపడడంతో ఒకరినొకరు పలకరించుకొని ఫోటోకు ఫోజిచ్చారు. కాగా ఈ ఫోటోను మహ్మద్ ఆసిఫ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ''స్నేహానికి ఎలాంటి హద్దులు ఉండవు'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఆసిఫ్ షేర్ చేసిన ఫోటో కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. అయితే యువరాజ్ ఆసిఫ్‌తో ఫోటో దిగడంపై క్రికెట్ ఫ్యాన్స్ రెండుగా చీలిపోయారు. చిరకాల ప్రత్యర్థులుగా కనిపించే రెండు దేశాల నుంచి ఇద్దరు క్రికెటర్లు ఒకేచోట కలిసి ఫోటో దిగడం ఆనందంగా అనిపించిదని కొందరు కామెంట్స్ చేయగా.. మరికొందరు మాత్రం మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డ ఒక ఆటగాడితో ఎలా ఫోటో దిగుతావు అంటూ మరికొందరు యువరాజ్‌ను తప్పుబట్టారు. అయితే యువరాజ్ తనంతట తానుగా ఈ ఫోటోను ట్విటర్లో షేర్ చేయలేదని.. పాక్ క్రికెటర్ ఆసిఫ్ మాత్రమే షేర్ చేసుకున్నాడని.. ఇందులో యువరాజ్ తప్పేమి లేదని పేర్కొన్నారు. కాగా మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం పక్కనబెడితే మహ్మద్ ఆసిఫ్ స్వతహాగా సూపర్ బౌలర్. ఫాస్ట్ బౌలింగ్‌కు పెట్టింది పేరైన ఆసిఫ్ మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టేవాడు. పాకిస్తాన్ తరపున 72 మ్యాచ్‌లాడిన ఆసిఫ్ 168 వికెట్లు తీశాడు. అయితే 2005లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మహ్మద్ ఆసిఫ్ ఆది నుంచి వివాదాలే చుట్టుముట్టాయి. నిషేధిత డ్రగ్స్ వాడి ఒకసారి సస్పెండ్ అయిన ఆసిఫ్.. 2010లో ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా ప్రీ ప్లాన్‌గా ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ వేశాడు. ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో మహ్మద్ ఆసిఫ్‌పై ఐసీసీ ఏడేళ్ల నిషేధం విధించింది. ఆసిఫ్‌తో పాటు సల్మాన్ భట్, మహ్మద్ ఆమిర్‌లపై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అయితే 2015లో ఐసీసీ ఆసిఫ్‌పై విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకొని అన్ని ఫార్మాట్లలో ఆడొచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆసిఫ్ కొద్దిరోజులకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: Chris Lynn: ఆ బ్యాటర్ పని అయిపోందన్నారు.. సెంచరీతో నోరు మూయించాడు Friendship have no limits. #YuvrajSingh #ICC #USA #dc #unitycup2022 pic.twitter.com/VJ0u5U7z3Z — Muhammad Asif (@MuhammadAsif_26) May 30, 2022 -
Mohammad Asif: అక్తర్ నీకు అంతలేదు గానీ.. నోరు మూసుకో
ఇస్లామాబాద్: ‘‘షోయబ్ అక్తర్ పదమూడేళ్లపాటు ఆ గొడవను పట్టుకునే వేలాడాడు. వీలు చిక్కినప్పుడల్లా నా గురించి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం గురించి నేను తనతో మాట్లాడాలనుకున్నాను. అందుకే ఇటీవల అక్తర్‌కు కాల్ చేశాను. దయచేసి నోరు మూసుకో ఇక. అదంతా గతం. ఆ విషయం గురించి మర్చిపో అని చెప్పాను’’ అంటూ పాకిస్తాన్ మాజీ బౌలర్ మహ్మద్ ఆసిఫ్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు పాక్ బౌలర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్‌ల మధ్య డ్రెస్సింగ్‌రూంలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. షాహిద్ ఆఫ్రిది, ఆసిప్ మాట్లాడుకుంటుండగా అక్కడికి వచ్చిన అక్తర్.. తన గురించే మాట్లాడుకుంటూ నవ్వుతున్నారని భావించి వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనలో ఆసిఫ్‌ను బ్యాట్‌తో కొట్టగా.. అతడి తొడకు గాయమైంది. ఈ వివాదం యావత్ క్రికెట్ ప్రపంచాన్నే విస్మయానికి గురిచేసింది. దీంతో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అక్తర్‌ను టీ20 వరల్్డ కప్ నుంచి తప్పిస్తూ స్వదేశానికి పిలిపించింది. అయితే, ఆ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన అక్తర్, ఆసిఫ్‌ను క్షమాపణ కోరడంతో ఆ వివాదం తాత్కాలికంగా ముగిసిపోయింది. కానీ, నేటికి కూడా దీనికి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. నీకు అంతలేదు.. వాస్తవంలోకి రా! ఈ క్రమంలో ఇటీవల షాహిద్ ఆఫ్రిది ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తాను జోక్ చేస్తే, అక్తర్ సీరియస్ అయ్యాడని, దీంతో గొడవ జరిగిందని చెప్పాడు. ఆవేశంలో అతడు తప్పు చేశాడని పేర్కొన్నాడు. ఇక తాజాగా ఈ ఘటన గురించి ఆసిఫ్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. అంతేకాకుండా.. అక్తర్ కలలు కనడం మానేసి యువ క్రికెటర్లకు సాయం చేస్తే బాగుంటుంది అంటూ చురకలు అంటించాడు. ‘‘ఒకరోజు, తాను చీఫ్ సెలక్టర్ అవుతానని, మరోరోజు పాకిస్తాన్ హెడ్ కోచ్.. అదీ కాదంటే ఏకంగా పీసీబీ చైర్మన్ అవుతానని అక్తర్ కలలు కంటూ ఉంటాడు. అతడు వాస్తవంలో బతకాలి. 2007 నాటి ఘటనను పట్టుకుని, పదే పదే దాని గురించి మాట్లాడుతూ.. సమయం వృథా చేసే బదులు వర్ధమాన క్రికెటర్లకు తన వంతు సాయం చేస్తే బాగుంటుంది’’అని హితవు పలికాడు. చదవండి: గంగూలీది కష్టపడే తత్వం కాదు.. కానీ: చాపెల్ -
'నేను జోక్ చేశా.. అక్తర్ సీరియస్ అయ్యాడు'
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఆ జట్టులో ఆటగాళ్ల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అంతుచిక్కదు. అనవసర విషయాల్లో తలదూర్చి ఆటగాళ్లు తమ కెరీర్‌ను నాశనం చేసుకున్న సందర్బాలు చాలానే ఉన్నాయి. 2007 దక్షిణాఫ్రికా వేదికగా తొలి టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు పాకిస్తాన్ బౌలర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్‌ల గొడవ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన వాగ్వాదంలో.. కోపంతో అక్తర్ ఆసిఫ్‌పై బ్యాట్‌తో దాడికి దిగాడు.ఆ దెబ్బకు ఆపిఫ్ తొడకు బలమైన గాయం అయింది.ఈ గొడవ అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పీసీబీ అతన్ని జట్టు నుంచి తొలగించి టీ20 ప్రపంచకప్ ఆడకుండా సస్పెండ్ చేసింది. అయితే తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన అక్తర్ ఆసిఫ్‌కు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా 14 ఏళ్ల తర్వాత షాహిద్ అఫ్రిది గొడవకు సంబంధించిన సీక్రెట్‌ను రివీల్ చేశాడు. ''ఆరోజు ఆసిఫ్, నేను సరదాగా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఇంతలో అక్కడికి వచ్చిన అక్తర్ తన గురించి మాట్లాడుతున్నారని భావించి మమ్మల్ని అడిగాడు. అయితే నీ గురించి మాట్లాడుకోవడానికి మాకు పని లేదా అని నేను జోక్ చేశా.. కానీ అక్తర్ దానిని సీరియస్‌గా తీసుకున్నాడు. దాంతో గొడవ ప్రారంభమైంది.. అలా మాటామాటా పెరిగి తను మాపై బ్యాట్‌తో దాడికి యత్నించాడు. నేను తప్పించుకున్నా.. ఆసిఫ్ మాత్రం గాయపడ్డాడు.. ఈ విషయంలో నేను అక్తర్‌ను తప్పుబట్టలేను.. ఎందుకంటే అతనికి మంచి మనుసు ఉంది. ఆవేశంలో అలా చేశాడు తప్ప వాస్తవానికి అతను చాలా మంచి వ్యక్తి'' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అక్తర్ ఆటకు గుడ్‌బై చెప్పాకా తన ఆటోబయోగ్రఫీలో ఆసిఫ్‌తో గొడవను ప్రస్తావించాడు. ''ఆసిఫ్‌తో గొడవ జరగడానికి కారణం అఫ్రిదినే.. ఈ విషయం అతనికి కూడా తెలుసు.. కానీ ఆ సమయంలో నన్ను బ్లేమ్ చేస్తూ తాను తప్పించుకున్నాడు. వాస్తవానికి ఆరోజు జరిగిన గొడవలో అఫ్రిది, ఆసిఫ్‌లను బ్యాట్‌తో కొట్టేందుకు ప్రయత్నించాను. అఫ్రిది తప్పించుకోగా.. ఆసిఫ్ తొడకు మాత్రం గాయం అయింది. కానీ ఇంతకముందు ఏనాడు డ్రెస్సింగ్‌రూమ్‌లో అలా బిహేవ్ చేయలేదు'' అని రాసుకొచ్చాడు. చదవండి: సిగ్గుచేటు.. దేశం ఇలా ఉందంటే నీలాంటి వారి వల్లే -
అతడి బౌలింగ్‌లో డివిల్లియర్స్ ఏడ్చేశాడు: అక్తర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ సీమర్ మహ్మద్ ఆసిఫ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్ ఏడుపు లంకించుకున్నాడంటూ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా ఏషియన్ టెస్టు చాంపియన్‌షిప్ సమయంలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఆసిఫ్ బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డాడని చెప్పుకొచ్చాడు. భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న నేపథ్యంలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ఓ స్పోర్ట్స్ చానెల్లో మాట్లాడిన అక్తర్.. మహ్మద్ ఆసిఫ్ తర్వాత తాను చూసి అత్యంత స్మార్ట్ బౌలర్ బుమ్రా అంటూ కితాబిచ్చాడు. గాలివాటుని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా బంతుల్ని విసిరే టెక్నిక్‌ను తాను, వసీం, వకార్ ఉపయోగించేవాళ్లమని, ఇప్పుడు బుమ్రా సైతం అదే తరహాలో బౌలింగ్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. (చదవండి: గంగూలీపై ఒత్తిడి తెచ్చి వాడుకోవాలని చూస్తున్నారు!) డివిల్లియర్స్ కంటతడి పెట్టాడు ‘‘పాక్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ బౌలింగ్‌లో పరుగులు చేయలేక ఏబీ డివిల్లియర్స్ కంటతడి పెట్టాడు. వీవీఎస్ లక్ష్మణ్ అయితే.. ‘‘ఇలాంటి బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలి’’ అని వాపోయాడు. వసీం అక్రం కంటే ఆసిఫ్‌కే ఎక్కువ భయపడేవారు. ఇప్పుడు టీమిండియా బౌలర్ బుమ్రాను చూస్తే నాకు అతడే గుర్తుకువస్తాడు. ఆసిఫ్ తర్వాత అంత స్మార్ట్‌గా బౌలింగ్ చేసే ఫాస్ట్‌బౌలర్ తను. ఫిట్నెస్ పరంగా టెస్టు క్రికెట్‌కు అతడు పనికివస్తాడా అని చాలా మంది సందేహపడేవారు. అయితే నేను గమనించింత వరకు.. ఏదైనా అనుకుంటే దానిని కచ్చితంగా సాధించాలనే పట్టుదల అతడి సొంతం. ఫాస్ట్‌బౌలర్‌గా తను పర్ఫెక్ట్. తనో అసాధారణ ఆటగాడు. గొప్ప బౌలర్. ఫిట్నెస్ సాధిస్తే సుదీర్ఘకాలం పాటు సంప్రదాయ క్రికెట్లో కొనసాగుతాడు’’ అని అక్తర్ ప్రశంసలు కురిపించాడు. కాగా బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొత్తంగా బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్ తీసి సత్తా చాటడంతో భారత్ ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.(చదవండి: టీమిండియానే ఈ సిరీస్ గెలవాలి: పాక్ క్రికెటర్) -
ఆడటానికి టీనేజర్లే... కానీ!
కరాచీ: పాకిస్తాన్ యువ పేసర్ల వయసుపై మాజీ సీమర్ మొహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జట్టుకు ఆడే బౌలర్లు పెద్ద వయసు వారేనని, అయితే వారు 9, 10 ఏళ్లు తక్కువగా పేర్కొంటారని చెప్పాడు. ‘వయో ధ్రువీకరణ పత్రాల్లో మా పేసర్లు 17, 18 ఏళ్ల వారిగా చూపిస్తారు. కానీ వాళ్ల నిజమైన వయసు 27, 28 ఏళ్లు. అందుకే ఈ వయసు పైబడిన బౌలర్లు సుదీర్ఘ స్పెల్స్ వేయలేరు. 20 నుంచి 25 ఓవర్లు వేసే సత్తా మా వాళ్లకు లేదు. ఇంకా చెప్పాలంటే ఐదారు ఓవర్ల స్పెల్ వేసిన బౌలర్‌కు మైదానంలో సరిగ్గా ఫీల్డింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండదు’ అని కమ్రాన్ అక్మల్‌కు చెందిన యూట్యూబ్ చానెల్లో ఆసిఫ్ ఆరోపించాడు. అయితే ఎవరి వయసు పైబడిందో పేర్లు మాత్రం బయటపెట్టలేదు. -
నా ముందు.. నా తర్వాత ఎందరో ఫిక్సర్లు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ పేసర్ మొహమ్మద్ ఆసిఫ్ తమ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పు చేసిన వారందరికీ రెండో అవకాశమిచ్చే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిం చిందని అన్నాడు. తన కన్నా ముందు ఎందరో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని, తన తర్వాత కూడా మరెందరో ఈ మార్గంలో నడిచారని అన్నాడు. అయితే పీసీబీ మాత్రం తనకే కఠిన శిక్ష విధించిందని చెప్పాడు. 2010లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆసిఫ్‌పై పీసీబీ ఏడేళ్ల నిషేధాన్ని విధించింది. ‘అందరూ తప్పులు చేస్తారు. కానీ పీసీబీ నాపై వివక్ష చూపింది. నేను ఏ స్థాయి బౌలర్‌ని అని చూడకుండా శిక్షించింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు. కానీ ఒకప్పడు నా బౌలింగ్‌తో ప్రపంచాన్ని వణికించా. ఇన్నేళ్లు గడిచాక కూడా ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ నా బౌలింగ్ గురించి మాట్లాడటం గర్వంగా ఉంటుంది. పీటర్సన్, డివిలియర్స్, ఆమ్లా నా గురించి గొప్పగా చెప్పడం ఆనందాన్ని కలిగించింది’ అని 37 ఏళ్ల ఆసిఫ్ పేర్కొన్నాడు. -
‘నేనే చివరి ఫిక్సర్‌ను కాదు కదా’
కరాచీ: ఎంతో మంది తప్పులు చేస్తూ ఉంటారని అందులో తాను ఒకడినని అంటున్నాడు పాకిస్తాన వెటరన్ పేసర్ మహ్మద్ అసిఫ్. 2010లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఆపై ఏడేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న అసిఫ్.. మళ్లీ పాకిస్తాన్ జట్టులో కనిపించలేదు. అప్పట్లో అసిఫ్‌పై ఉన్న నిషేధాన్ని ఐదేళ్లకు తగ్గించినా ఆ తర్వాత అతనికి పాక్ జట్టులో పునరాగమనం చేసే అవకాశం రాలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెటర్లలో కొంతమందికి తిరిగి జాతీయ జట్టులో ఆడే అవకాశం ఇచ్చినా తనకు మాత్రం రెండో చాన్స్ ఇవ్వలేదని అంటున్నాడు అసిఫ్. తన సహచర బౌలర్, మహ్మద్ అమిర్ కూడా ఫిక్సింగ్‌లో ఇరుక్కొన్నప్పటికీ మళ్లీ రీఎంట్రీ చేయడాన్ని అసిఫ్ పరోక్షంగా ప్రస్తావించాడు. (‘నో డౌట్.. ఆ సామర్థ్యం కోహ్లిలో ఉంది’) ‘నా కంటే ముందు ఫిక్సింగ్ చేసిన వాళ్లు కావొచ్చు.. నాతో పాటు ఫిక్సింగ్ చేసిన వారు కావొచ్చు. నా తర్వాత ఫిక్సింగ్స్ చేసిన వాళ్లు కావొచ్చు.. ఎవరికైనా రెండో అవకాశం అనేది ఉంటుంది. ప్రతీ ఒక్కరిలాగా నేను కూడా తప్పు చేశా. ఇక్కడ ఫిక్సింగ్ చేసిన వేరే వాళ్లకి ఆడే అవకాశం ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేదు. ఒక్కొక్కరికీ ఒక్కో తీరుగా ఉంటుందా పీసీబీ విధానం. ఫిక్సింగ్‌కు పాల్పడిన కొంతమంది క్రికెటర్లను పీసీబీ కాపాడింది. పీసీబీ మనుషులు కాబట్టి వారిని రక్షించుకుంది. నన్ను ఏ విషయంలోనూ పట్టించుకోలేదు.పాకిస్తాన్ క్రికెట్లో నేనే చివరి ఫిక్సర్‌ను అన్నట్లు ట్రీట్ చేస్తున్నారు. నా తర్వాత కూడా చాలా మంది ఫిక్సింగ్ చేశారు. వారికి కూడా పీసీబీ అవకాశం ఇచ్చింది. కొంతమంది ఏకంగా పీసీబీలోనే ఉన్నారు’ అంటూ అసిఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడితో తన ప్రపంచం ఏమీ అయిపోలేదని, జరిగిపోయిందేదో జరిగిందని, ఇక జరగాల్సింది మాత్రమే ఉందన్నాడు. తన కెరీర్లో చాలా క్రికెట్‌ను ఆడేశానని అసిఫ్ పేర్కొన్నాడు. తాను క్రికెట్ ఆడే సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు లభించిందన్నాడు. తానెప్పుడు స్వార్థ పరుడిలా ఉండేవాడినని చాలా మంది అంటారనీ, అది వికెట్లు తీసి జట్టును గెలిపించాలనే స్వార్థం మాత్రమేనన్నాడు. జట్టు విజయం కోసం ఎప్పుడూ శ్రమించేవాడినని, ఒకవేళ అదే స్వార్థమైతే తాను ఏమీ చేయలేనని అసిఫ్ పేర్కొన్నాడు.(కెప్టెన్సీపై తిరుగుబాటు చేశారు..) -
కశ్మీర్‌పై అంతర్జాతీయ చర్చ!
దావోస్: కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్ దావోస్‌లో అన్నారు. ప్రస్తుత ప్రపంచంలోని వివిధ విభేదాలకు కశ్మీర్ వివాదం, రోహింగ్యాల అంశం కూడా కారణాలేనని ఆయన పేర్కొన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాక్కన్ అబ్బాసీతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. అసిఫ్ మాట్లాడుతూ ‘ప్రపంచం ముక్కలుగా విడిపోవడానికి కశ్మీర్ వివాదం, రోహింగ్యాల అంశం కూడా కారణమే’ అని అన్నారు. ఈ ఏడాది డబ్ల్యూఈఎఫ్ సమిట్ నినాదమైన ‘ముక్కలైన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణం’ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు చైనా, అటు అమెరికాతో తమ ద్వైపాక్షిక బంధాలు ఎంతో దృఢంగా ఉన్నాయని పాక్ ప్రధాని షాహిద్ ఖాక్కన్ అబ్బాసీ అన్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ), చైనా–పాక్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) తదితర ప్రాజెక్టులతో గత కొన్నేళ్లలో చైనాతో పాక్ బంధం మరింత బలపడిందని అబ్బాసీ చెప్పారు. -
'ఆ ఇద్దరే అత్యుత్తమ క్రికెటర్లు'
కరాచీ: కొత్త బంతితో తన కంటే మెరుగ్గా బౌలింగ్ చేసే వారు ప్రపంచంలోనే ఎవరూ లేరంటా ఇటీవలే కితాబిచ్చుకున్న పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ అసిఫ్.. తాజాగా భారత దిగ్గజ ఆటగాళ్ల రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. తన కెరీర్లో కఠినమైన ఆటగాళ్లు ఎవరైనా ఉంటే అది ద్రవిడ్, లక్ష్మణ్లేనని స్పష్టం చేశాడు. తన పరంగా చూస్తే ప్రపంచ క్రికెట్ లో ఆ ఇద్దరూ సాంకేతికంగా ఎంతో మెరుగైన ఆటగాళ్లని ఆసిఫ్ పేర్కొన్నాడు. 'రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్‌లు ఇద్దరూ..ఇద్దరే. టెక్నికల్ గా వారు ఎంతో నైపుణ్య కల్గినవారు. ఆ ఇద్దరికీ ఆఫ్ స్టంప్ బంతులను వేయాలంటే చాలా భయపడేవాన్ని. వారికి ఆఫ్ స్టంప్ బంతులు వేయడం నాకు ఒక ఛాలెంజ్‌లా ఉండేది' అని ఆసిఫ్ ఒక ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. మరొకవైపు భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై కూడా ఆసిఫ్ ప్రశంసలు కురిపించాడు. సాంకేతికంగా విరాట్ కోహ్లి చాలా మెరుగైన ఆటగాడని, ఈ క్రమంలోనే అతనికి బౌలింగ్ చేయాలంటే ఏ బౌలరైనా అత్యంత శ్రమించక తప్పదన్నాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆసిఫ్.. ఐదేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. గతేడాది నిషేధం పూర్తి చేసుకున్న ఆసిఫ్.. ఇంకా తిరిగి పాక్ జాతీయ జట్టులో పునరాగమనం చేయలేదు. త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో చోటు దక్కించుకునే పనిలో పడ్డాడు ఆసిఫ్. దీనిలో భాగంగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతూ సత్తా చాటుకుంటున్నాడు. -
బౌలింగ్ చేయడంలో నన్ను మించినోడు లేడు
న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్లో కొత్త బంతితో తన కంటే మెరుగ్గా బౌలింగ్ చేసే బౌలర్ ప్రపంచంలో ఎవరూ లేరని పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆసిఫ్ అన్నాడు. తానే అత్యుత్తమ బౌలర్ అని ఆసిఫ్ తనకు తాను కితాబిచ్చుకున్నాడు. మ్యాచ్ ఆరంభంలోనే ప్రత్యర్థి జట్టును సాధ్యమైనంత వరకు దెబ్బతీసే సామర్థ్యం తనకు ఉందని అసిఫ్ చెప్పాడు. టెస్టు క్రికెట్లో కొత్త బంతితో వికెట్లు తీయకపోతే జట్టు చిక్కుల్లో పడినట్టేనని అన్నాడు. ప్రత్యర్థి జట్టు ఏదైనా, పరిస్థితులు ఎలాంటివైనా కొత్త బంతితో రాణిస్తానని చెప్పాడు. కొత్త బంతితో ఎలా బౌలింగ్ చేయాలో తనకంటే బాగా ఎవరికి తెలియదని ఆసిఫ్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిషేధానికి గురైన ఆసిఫ్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన తర్వాత సత్తాచాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. వయసు, ఫిట్నెస్ తనకు సమస్యలు కావని 33 ఏళ్ల ఆసిఫ్ చెప్పాడు. గతంలో 40 ప్లస్ వయసులో కూడా కొందరు బౌలర్లు రాణించారని అన్నాడు. -
నన్ను క్రికెట్ జట్టులో ఎంపిక చేయొద్దన్నారట!
హైదరాబాద్(పాకిస్తాన్): మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంపై సుదీర్ఘకాలం నిషేధం ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెటర్లు మొహ్మద్ అమిర్, మొహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్‌లకు గతేడాది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నుంచి ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల క్రితం ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా వారు ముగ్గురు మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడి నిషేధానికి గురయ్యారు. కాగా, 2015లో జాతీయ జట్టులో ఆడేందుకు ఐసీసీ నుంచి క్లియరెన్స్ లభించింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పేస్ బౌలర్ అమిర్ పునరాగమనం చేసినా, ఆసిఫ్ మాత్రం ఇంకా జాతీయ జట్టలో ఆడలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కూడా ఆసిఫ్ ఎంపికపై ఎటువంటి ముందడుగు వేయలేదు. కాగా, ఇందుకు కారణం ఐసీసీనేనని ఆసిఫ్ తాజాగా స్పష్టం చేశాడు. తన ఎంపికపై పీసీబీ నిర్లక్ష్యానికి ఐసీసీ నుంచి వారికి అందిన సమాచారమే కారణన్నాడు. తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయకూడదని పీసీబీకి ఐసీసీ చెప్పినట్లు ఆసిఫ్ పేర్కొన్నాడు. ఈ విషయం తనకు కొన్ని రోజుల క్రితమే తెలిసినట్లు తెలిపాడు. దీనిపై ఆసిఫ్ కొద్దిపాటి విచారం వ్యక్తం చేశాడు. 'నేను రెగ్యులర్‌గా దేశవాళీ టోర్నీలు ఆడుతున్నాను. నాపై ఐసీసీ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను. నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఐసీసీ నుంచి గుర్తింపు లభిస్తుందనే అనుకుంటున్నా.అసలు నాకు క్లీన్చిట్ ఇచ్చిన తరువాత ఎందుకు ఆడొద్దన్నారు అనే విషయం అయితే తెలీదు.నాతో పాటు సల్మాన్ భట్ ఎప్పుడు జాతీయ జట్టుకు ఆడతాడు అనేది కచ్చితంగా తెలియదు. కనీసం మా ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే యత్నం కూడా చేయడంలేదు' అని ఆసిఫ్ ఆవేదన చెందాడు. -
విస్తరణపై ఫ్రిస్కా హోమ్ హెల్త్‌కేర్ దృష్టి
• ఫ్రాంచైజీ మోడల్లో తొలుత ఐదు పట్టణాలకు • విస్తరణ కోసం ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి నిధుల సేకరణ • విలేకరులతో ఫ్రిస్కా ఫౌండర్ సీఈవో ఆసిఫ్ మహ్మద్ సాక్షి, అమరావతి : విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న హోమ్ హెల్త్‌కేర్ సేవల సంస్థ ఫ్రిస్కా... తెలుగు రాష్ట్రాల్లో విస్తరణపై దృష్టిసారించింది. ఫ్రాంచైజీ విధానంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర పట్టణాలతో పాటు తెలంగాణాలోని ఇతర పట్టణాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఫ్రిస్కా ఫౌండర్ సీఈవో ఆసిఫ్ మహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా తొలుత విశాఖపట్నంలో రెండు ఫ్రాంచైజీలు ప్రారంభించామని, త్వరలోనే విశాఖలో మరో అరుుదు ఫ్రాంచైజీలు తెరవనున్నామని చెప్పారాయన. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ‘‘రానున్న కాలంలో ద్వితీయ శ్రేణి పట్టణాలైన కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, తిరుపతి, వరంగల్, ఖమ్మంలలో సేవలు ఆరంభిస్తాం. విదేశాల్లో ఉంటూ స్థానికంగా ఉంటున్న తల్లిదండ్రుల ఆరోగ్య రక్షణ కోరుకునే వారిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. దీంతోపాటు తొలిసారిగా ఫ్రిస్కాలో సభ్యత్వ కార్డును ప్రవేశపెట్టాం. రూ.750 పెట్టి సభ్యత్వం తీసుకుంటే కుటుంబ సభ్యులందరికీ ఒకసారి డాక్టర్లు ఇంటికి వచ్చి ఉచితంగా పరీక్షలు నిర్వహించడమే కాకుండా, ఇతర పరీక్షలపై డిస్కౌంట్ లభిస్తుంది’’ అని వివరించారు. హోమ్ హెల్త్‌కేర్ రంగానికి డిమాండ్ బాగుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారని, ప్రస్తుతం ఇవి చర్చల దశలో ఉన్నాయని చెప్పారు. ఏంజల్ ఇన్వెస్టర్ల ద్వారా 10 లక్షల డాలర్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇలా సేకరించిన నిధులతో విస్తరణ కార్యక్రమాలు చేపడతామన్నారు. -
'ఆ ముగ్గురూ' క్రికెట్ ఆడొచ్చు!
దుబాయ్: ఐదేళ్ల క్రితం స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లకు ఉపశమనం లభించింది. మొహమ్మద్ ఆమిర్, ఆసిఫ్, సల్మాన్ భట్ల శిక్షా కాలం సెప్టెంబర్ 1న ముగుస్తుండడంతో వారు పోటీ క్రికెట్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా ధ్రువీకరించింది. వీరిలో ఆమిర్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడేందుకు అనుమతి లభించింది. ‘యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ విధించిన కొన్ని షరతులకు లోబడి వారు పోటీ క్రికెట్లో అడుగు పెట్టవచ్చు. ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్లో కూడా పాల్గొనవచ్చు’ అని ఐసీసీ పేర్కొంది. ఆసిఫ్, భట్‌లకు ఏడు, పదేళ్ల చొప్పున శిక్ష విధించినా సడలింపునిస్తూ దానిని ఐదేళ్లకే పరిమితం చేశారు.