నన్ను క్రికెట్ జట్టులో ఎంపిక చేయొద్దన్నారట! | ICC Reason Behind Mohammad Asif Not Playing For Pakistan? | Sakshi
Sakshi News home page

నన్ను క్రికెట్ జట్టులో ఎంపిక చేయొద్దన్నారట!

Published Mon, Dec 5 2016 12:37 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

నన్ను క్రికెట్ జట్టులో ఎంపిక చేయొద్దన్నారట!

నన్ను క్రికెట్ జట్టులో ఎంపిక చేయొద్దన్నారట!

హైదరాబాద్(పాకిస్తాన్): మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంపై సుదీర్ఘకాలం నిషేధం ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెటర్లు మొహ్మద్ అమిర్, మొహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్లకు గతేడాది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నుంచి ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల క్రితం ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా వారు ముగ్గురు మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడి నిషేధానికి గురయ్యారు. కాగా, 2015లో జాతీయ జట్టులో ఆడేందుకు ఐసీసీ నుంచి క్లియరెన్స్ లభించింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పేస్ బౌలర్ అమిర్ పునరాగమనం చేసినా, ఆసిఫ్ మాత్రం ఇంకా జాతీయ జట్టలో ఆడలేదు.

 

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కూడా  ఆసిఫ్ ఎంపికపై ఎటువంటి ముందడుగు వేయలేదు. కాగా, ఇందుకు కారణం ఐసీసీనేనని ఆసిఫ్ తాజాగా స్పష్టం చేశాడు. తన ఎంపికపై పీసీబీ నిర్లక్ష్యానికి ఐసీసీ నుంచి వారికి అందిన సమాచారమే కారణన్నాడు. తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయకూడదని పీసీబీకి ఐసీసీ చెప్పినట్లు ఆసిఫ్ పేర్కొన్నాడు. ఈ విషయం తనకు కొన్ని రోజుల క్రితమే తెలిసినట్లు తెలిపాడు. దీనిపై ఆసిఫ్ కొద్దిపాటి  విచారం వ్యక్తం చేశాడు. 'నేను రెగ్యులర్గా దేశవాళీ టోర్నీలు ఆడుతున్నాను. నాపై ఐసీసీ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను. నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఐసీసీ నుంచి గుర్తింపు లభిస్తుందనే అనుకుంటున్నా.అసలు నాకు  క్లీన్చిట్ ఇచ్చిన తరువాత ఎందుకు ఆడొద్దన్నారు అనే విషయం అయితే తెలీదు.నాతో పాటు సల్మాన్ భట్ ఎప్పుడు జాతీయ జట్టుకు ఆడతాడు అనేది కచ్చితంగా తెలియదు. కనీసం మా ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే యత్నం కూడా చేయడంలేదు' అని ఆసిఫ్ ఆవేదన చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement