
కరాచీ: పాకిస్తాన్ యువ పేసర్ల వయసుపై మాజీ సీమర్ మొహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జట్టుకు ఆడే బౌలర్లు పెద్ద వయసు వారేనని, అయితే వారు 9, 10 ఏళ్లు తక్కువగా పేర్కొంటారని చెప్పాడు. ‘వయో ధ్రువీకరణ పత్రాల్లో మా పేసర్లు 17, 18 ఏళ్ల వారిగా చూపిస్తారు. కానీ వాళ్ల నిజమైన వయసు 27, 28 ఏళ్లు. అందుకే ఈ వయసు పైబడిన బౌలర్లు సుదీర్ఘ స్పెల్స్ వేయలేరు. 20 నుంచి 25 ఓవర్లు వేసే సత్తా మా వాళ్లకు లేదు. ఇంకా చెప్పాలంటే ఐదారు ఓవర్ల స్పెల్ వేసిన బౌలర్‌కు మైదానంలో సరిగ్గా ఫీల్డింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండదు’ అని కమ్రాన్ అక్మల్‌కు చెందిన యూట్యూబ్ చానెల్‌లో ఆసిఫ్ ఆరోపించాడు. అయితే ఎవరి వయసు పైబడిందో పేర్లు మాత్రం బయటపెట్టలేదు.
Comments
Please login to add a commentAdd a comment