Age Verification Document
-
Supreme Court Of India: వయసు నిర్ధారణకు ‘ఆధార్’ ప్రామాణికం కాదు
న్యూఢిల్లీ: వయసు నిర్ధారణకు ఆధార కార్డు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిహారం నిమిత్తం రోడ్డు ప్రమాద మృతుడి వయసును నిర్ధారించడానికి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఆధార్ కార్డును బట్టి కాకుండా పాఠశాల టీసీలో పేర్కొన్న తేదీని పుట్టిన తేదీగా పరిగణించాలని జువెనైల్ జస్టిస్ యాక్ట్–2015 టీసీలో పేర్కొన్న తేదీకి చట్టపరమైన గుర్తింపునిస్తోందని తెలిపింది. ‘ఆధార్ గుర్తింపు కార్డుగా పనికొస్తుందే తప్ప పుట్టినతేదీని నిర్ధారించడానికి కాదని దాన్ని జారీచేసే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 2023లో సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది’ అని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం పేర్కొంది. 2015లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ రూ. 19.35 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. మృతుడి వయసును టీసీ ఆధారంగా లెక్కించి (45 ఏళ్లు) పరిహారాన్ని గణించింది. పంజాబ్– హరియా ణా హైకోర్టు ఆధార్ కార్డు ఆధారంగా వయసును గణించి (47 ఏళ్లుగా) పరిహారాన్ని రూ. 9.22 లక్షలకు తగ్గించింది. దీన్ని బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా వయసు నిర్ధారణకు ఆధార్ కార్డును ప్రామా ణికంగా పరిగణించలేమని సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. -
ఆడటానికి టీనేజర్లే... కానీ!
కరాచీ: పాకిస్తాన్ యువ పేసర్ల వయసుపై మాజీ సీమర్ మొహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జట్టుకు ఆడే బౌలర్లు పెద్ద వయసు వారేనని, అయితే వారు 9, 10 ఏళ్లు తక్కువగా పేర్కొంటారని చెప్పాడు. ‘వయో ధ్రువీకరణ పత్రాల్లో మా పేసర్లు 17, 18 ఏళ్ల వారిగా చూపిస్తారు. కానీ వాళ్ల నిజమైన వయసు 27, 28 ఏళ్లు. అందుకే ఈ వయసు పైబడిన బౌలర్లు సుదీర్ఘ స్పెల్స్ వేయలేరు. 20 నుంచి 25 ఓవర్లు వేసే సత్తా మా వాళ్లకు లేదు. ఇంకా చెప్పాలంటే ఐదారు ఓవర్ల స్పెల్ వేసిన బౌలర్‌కు మైదానంలో సరిగ్గా ఫీల్డింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండదు’ అని కమ్రాన్ అక్మల్‌కు చెందిన యూట్యూబ్ చానెల్లో ఆసిఫ్ ఆరోపించాడు. అయితే ఎవరి వయసు పైబడిందో పేర్లు మాత్రం బయటపెట్టలేదు. -
ఆధార్‌కు వయసు ధ్రువీకరణ తప్పనిసరి కాదు
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు దరఖాస్తు సమయంలో వయసు ధ్రువీకరణ పత్రం తప్పనిసరేమీ కాదని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తెలిపింది. మనదేశంలో చాలామందికి పుట్టినరోజు, సంవత్సరం తెలియదని.. అలాంటి సందర్భంలో తమ నిబంధనలకు అనుగుణంగా వివరాలు అందించాలని యూఐడీఏఐ ఉన్నతాధికారి తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని కంజసా గ్రామంలో ప్రతి ఐదుగురిలో ఒకరి పుట్టినరోజు జనవరి 1న ఉండడంపై ఆయన స్పందించారు. దరఖాస్తుదారు అందించిన వివరాల ఆధారంగానే ఆధార్‌కార్డులు జారీచేస్తామన్నారు.