Pacer
-
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇవాన్స్ గుడ్‌బై
స్కాట్లాండ్ బౌలర్ అలస్డేర్ ఇవాన్స్(Alasdair Evans) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పదిహేనేళ్ల తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు మంగళవారం వెల్లడించాడు. సుదీర్ఘకాలం పాటు కెరీర్ కొనసాగించేందుకు సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ఈ సందర్భంగా ఇవాన్స్ కృతజ్ఞతలు తెలిపాడు. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నాడు. కాగా 2009లో కెనడాతో వన్డే మ్యాచ్‌తో ఇవాన్స్ స్కాట్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 42 వన్డేలు, 35 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో ఈ పేస్ బౌలర్ 58, 41 వికెట్లు తీశాడు. చివరగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్‌లో శ్రీలంక తరఫున మ్యాచ్ ఆడాడు. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమైన అతడు..తాజాగా ఆటకు వీడ్కోలు పలుకుతూ ప్రకటన విడుదల చేశాడు.ఎవరో జోక్ చేస్తున్నారనుకున్నా‘‘నా అరంగేట్రం గురించి ఇప్పటికీ ప్రతీ విషయం గుర్తుంది. ఆరోజు అబెర్డీన్లో మ్యాచ్. హెడ్‌కోచ్ పీట్ స్టెయిన్డిల్ నుంచి రాత్రి ఫోన్ కాల్ వచ్చింది. జట్టులో చాలా మంది ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. నువ్వు రావాల్సి ఉంటుందని చెప్పారు.నేను కూడా ఇంటర్నేషనల్ క్రికెటర్ అవుతానని ఊహించలేదు. అందుకే నాకు హెడ్‌కోచ్ కాల్ చేసినపుడు ఎవరో జోక్ చేస్తున్నారనుకున్నా. నా ప్రయాణంలో అద్భుతమైన క్రికెటర్లతో ఆడే అవకాశం దక్కింది. పదిహేనేళ్లు జట్టుతో ఉన్నందుకు సంతోషంగా ఉంది. కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అభిమానులకు ధన్యవాదాలు’’ అని ఇవాన్స్ పేర్కొన్నాడు. చదవండి: కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు! -
Happy Birthday Jasprit Bumrah:టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
Navdeep Saini-Swati Asthana Marriage: స్వాతిని పెళ్లాడిన నవదీప్ సైనీ.. హీరోయిన్లకు తక్కువేమీ కాదు!(ఫొటోలు)
-
విషాదం: మాజీ క్రికెటర్ అశ్విన్ యాదవ్ ఇకలేరు
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు ఐపీఎల్ సంబరం జరుగుతుండగా హైదరాబాద్ రంజీ జట్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రంజీ జట్టు మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్(33) శనివారం గుండెపోటుతో కన్ను మూశారు. అశ్విన్ అకాలమరణంపై పలువురు క్రికెట్ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. అశ్విన్‌కు భార్య, ముగ్గురు కుమారులున్నారు. అశ్విన్ యాదవ్ మరణ వార్త తనను దిగ్భ్రాంతి గురి చేసిందని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ట్వీట్ చేశారు. సరదాగా ఉండే అశ్విన్ ఇక లేడంటే నమ్మలేకపోతున్నానంటూ మాజీ రంజీ ఆఫ్ స్పిన్నర్, విశాల్ శర్మ సంతాపం తెలిపారు. అశ్విన్ టీమ్ మ్యాన్ అని ఎపుడు జట్టు విజయం కోసం ఆరాటపడేవాడని గుర్తు చేసుకున్నారు. స్థానిక మ్యాచ్‌లలో ఎస్‌బిహెచ్ తరఫున అశ్విన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హైదరాబాద్ మాజీ ఓపెనర్ డేనియల్ మనోహర్ మాట్లాడుతూ అశ్విన్ ఇంత చిన్న వయసులో మనకి దూరంకావడం విచారకరమన్నారు. ఫాస్ట్ బౌలర్‌గా టీమ్‌కు అండగా ఉండేవాడు. ఫిట్‌నెస్‌కు ప్రాణమిచ్చే అశ్విన్‌కు గుండెపోటు రావడం షాకింగ్ ఉందన్నారు. అశ్విన్ తన ఆటతో ఎపుడూ ఆకట్టుకునేవాడని, చిన్న వయస్సు నుండే వికెట్లు తీసే సామర్ధ్యం కలిగి ఉన్నాడని ఆండ్రూస్ స్కూల్ కోచ్‌గా పనిచేసిన నోయెల్ కార్ సంతాపం తెలిపారు. 2002లో సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్ర అండర్ -14 జట్టుకు 25 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడు నిలిచాడంటూ నివాళులర్పించారు. కాగా కరియర్లో 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ యాదవ్ 34 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో 2007 లో మొహాలిలో పంజాబ్‌తో రంజీ ట్రోఫీకి అరంగేట్రం చేశాడు. 2008-09 సీజన్లో ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీపై 52 పరుగులకు 6 వికెట్లు తీశాడు. యాదవ్ చివరి సారిగా 2009లో ముంబైతో తన రంజీ మ్యాచ్ ఆడాడు. రెండు టీ 20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. Devastated to hear the news of #Ashwinyadav passing away. A Very jovial and fun loving guy, team man to the core, punched way above his skills as a fast bowler. I pray to God for strength to his family. #gonetooearly #OmShanti You will be missed. pic.twitter.com/0gIuOKZr6L — R SRIDHAR (@coach_rsridhar) April 24, 2021 -
ఆడటానికి టీనేజర్లే... కానీ!
కరాచీ: పాకిస్తాన్ యువ పేసర్ల వయసుపై మాజీ సీమర్ మొహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జట్టుకు ఆడే బౌలర్లు పెద్ద వయసు వారేనని, అయితే వారు 9, 10 ఏళ్లు తక్కువగా పేర్కొంటారని చెప్పాడు. ‘వయో ధ్రువీకరణ పత్రాల్లో మా పేసర్లు 17, 18 ఏళ్ల వారిగా చూపిస్తారు. కానీ వాళ్ల నిజమైన వయసు 27, 28 ఏళ్లు. అందుకే ఈ వయసు పైబడిన బౌలర్లు సుదీర్ఘ స్పెల్స్ వేయలేరు. 20 నుంచి 25 ఓవర్లు వేసే సత్తా మా వాళ్లకు లేదు. ఇంకా చెప్పాలంటే ఐదారు ఓవర్ల స్పెల్ వేసిన బౌలర్‌కు మైదానంలో సరిగ్గా ఫీల్డింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండదు’ అని కమ్రాన్ అక్మల్‌కు చెందిన యూట్యూబ్ చానెల్లో ఆసిఫ్ ఆరోపించాడు. అయితే ఎవరి వయసు పైబడిందో పేర్లు మాత్రం బయటపెట్టలేదు. -
పీసీబీ వేధింపులే కారణమన్న పేసర్
కరాచీ: పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టే మానసిక క్షోభ భరించలేకే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు 29 ఏళ్ల బౌలర్ ఓ వీడియో మెసేజ్‌లో వెల్లడించాడు. ‘ఇప్పుడున్న పీసీబీ మేనేజ్మెంట్ వేధింపుల్ని తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఆడలేను. నేను తప్పు (స్పాట్ ఫిక్సింగ్) చేశాను. దానికి శిక్ష కూడా అనుభవించాను. అయినా సరే బోర్డు నన్ను గత అనుభవాలతోనే చిన్నచూపు చూస్తోంది. నిషేధం అనంతరం తిరిగి క్రికెట్ ఆడేందుకు మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, మాజీ పీసీబీ చీఫ్ నజమ్ సేథీ నాకు వెన్నుదన్నుగా నిలిచారు. వాళ్ల అండదండలతోనే నేను మళ్లీ ఆడగలిగాను’ అని ఆ వీడియోలో వివరించాడు. అతని వీడియో సందేశం వైరల్ కావడంతో పీసీబీ స్పందించింది. ఆమిర్ నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తుందని, అలాగే అతని ఆరోపణలపై తక్షణం స్పందించడం తగదని ఒక ప్రకటనలో తెలిపింది. ‘స్పాట్’ చిచ్చు నాణ్యమైన పేసర్‌గా కెరీర్ తొలినాళ్లలోనే కితాబు అందుకున్న ఈ క్రికెటర్ ప్రతిభాపాఠవాలను ‘స్పాట్ ఫిక్సింగ్’ మసకబార్చింది. 2010లో ఇంగ్లండ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడటంతో ఐదేళ్ల నిషేధానికి (2010–2015)కు గురయ్యాడు. అంతర్జాతీయ కెరీర్లో 36 టెస్టులాడి 119 వికెట్లు తీశాడు. 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లను పడగొట్టాడు. 2009లో టి20 ప్రపంచకప్ నెగ్గిన పాకిస్తాన్ జట్టు సభ్యుడు. నిషేధం తర్వాత 2017లో చాంపియన్స్ ట్రోఫీ విజయంలోనూ ఆమిర్ కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో భారత్‌పై పాక్ గెలిచింది. -
షమీ సూపర్ షో
⇒ నాలుగు వికెట్లు తీసిన పేసర్ ⇒ వెస్టిండీస్ 205/9 కింగ్స్టన్: గాయం కారణంగా రెండేళ్లు జట్టుకు దూరంగా ఉన్న పేసర్ మొహమ్మద్ షమీ (4/48) అదరగొట్టే ప్రదర్శనతో తన ఫామ్‌ను చాటుకున్నాడు. 2015 వన్డే ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న తను గత మ్యాచ్‌తోనే పునరాగమనం చేసినా వికెట్ తీయలేకపోయాడు. అయితే గురువారం వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో మాత్రం చెలరేగి విండీస్ మిడిలార్డర్‌ను వణికించాడు. ఫలితంగా విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. షాయ్ హోప్ (98 బంతుల్లో 51; 5 ఫోర్లు), కైల్ హోప్ (50 బంతుల్లో 46; 9 ఫోర్లు), హోల్డర్ (34 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్), పావెల్ (32 బంతుల్లో 31; 2 సిక్సర్లు) రాణించారు. ఉమేశ్‌కు మూడు వికెట్లు దక్కాయి. చివర్లో తడబాటు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఓపెనర్లు లూయిస్ (9), కైల్ హోప్ ఓ మాదిరి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా హోప్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలతో జోరు కనబరిచాడు. ఉమేశ్, షమీ బౌలింగ్‌ను తను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే తొమ్మిదో ఓవర్లో లూయిస్‌ను పాండ్యా అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే సిరీస్‌లో తొలిసారిగా పవర్‌ప్లేలో విండీస్ 49 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా జోరు తగ్గించని కైల్ హోప్.. షమీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. కానీ 16వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ విండీస్‌కు షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో కైల్ హోప్, చేజ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత స్పిన్నర్లను రంగంలోకి దించడంతో విండీస్ పరుగుల వేగం తగ్గగా 10 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. మొహమ్మద్ (16)ను కేదార్ జాదర్ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేశాడు. ఈ దశలో షాయ్ హోప్, హోల్డర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పరిస్థితులకు తగ్గట్టు నిదానంగా ఆడిన షాయ్ 94 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. అయితే 40వ ఓవర్ నుంచి షమీ అనూహ్యంగా చెలరేగడంతో విండీస్ పతనం ప్రారంభమైంది. తన వరుస నాలుగు ఓవర్లలో జోరు మీదున్న హోల్డర్, షాయ్ హోప్‌తో పాటు నర్స్, బిషూ వికెట్లకు తీయడంతో విండీస్ వణికింది. హోల్డర్, షాయ్ హోప్ మధ్య ఐదో వికెట్‌కు అత్యధికంగా 48 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. చివర్లో పావెల్ కాస్త దూకుడు కనబరచగా స్కోరు 200 దాటింది. స్కోరు వివరాలు:- విండీస్ ఇన్నింగ్స్: లూయిస్ (సి) కోహ్లి (బి) పాండ్యా 9; కైల్ హోప్ (సి) ధావన్ (బి) ఉమేశ్ యాదవ్ 46; షాయ్ హోప్ (సి) రహానే (బి) షమీ 51; చేజ్ ఎల్బీడబ్లు్య (బి) ఉమేశ్ యాదవ్ 0; మొహమ్మద్ (సి అండ్ బి) కేదార్ జాదవ్ 16; హోల్డర్ (సి) ధావన్ (బి) షమీ 36; పావెల్ (సి) ధోని (బి) ఉమేశ్ 31; నర్స్ (సి) కుల్దీప్ (బి) షమీ 0; బిషూ (సి) ధోని (బి) షమీ 6; జోసెఫ్ నాటౌట్ 3; విలియమ్స్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–39, 2–76, 3–76, 4–115, 5–163, 6–168, 7–171, 8–182, 9–205. బౌలింగ్: షమీ 10–0–48–4; ఉమేశ్ యాదవ్ 10–1–53–3; పాండ్యా 6–0–27–1; జడేజా 10–1–27–0; కుల్దీప్ యాదవ్ 10–0–36–0; కేదార్ జాదవ్ 4–0–13–1. -
తస్కిన్, సన్నీ బౌలింగ్ శైలిపై ఫిర్యాదులు
ధర్మశాల: బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్, ఎడమ చేతి స్పిన్నర్ అరాఫత్ సన్నీ బౌలింగ్ శైలిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరి బౌలింగ్ శైలిపై అంపైర్ల నుంచి మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు అందింది. 8 పరుగులతో గెలిచిన ఆ మ్యాచ్ చివరి ఓవర్‌ను తస్కిన్ వేశాడు. ‘బంగ్లా క్రికెట్ మేనేజ్మెంట్తో ఈ విషయమై ఐసీసీ పనిచేస్తోంది. చెన్నైలోని గుర్తింపు పొందిన టెస్టింగ్ సెంటర్లో పరీక్షకు వీరిద్దరు హాజరవుతారు. వారం రోజుల్లో ఈ స్వతంత్ర విచారణ ఫలితం వస్తుంది. అప్పటిదాకా ఇద్దరు బౌలర్లు మ్యాచ్‌లు ఆడవచ్చు’ అని ఐసీసీ పేర్కొంది. -
భువనేశ్వర్‌కు ప్రమోషన్
‘ఎ’ గ్రేడ్‌లో తొలిసారి చోటు ⇒‘బి’ గ్రేడ్‌లో అంబటి రాయుడు ⇒జాబితా నుంచి గంభీర్, యువీ అవుట్ ⇒కాంట్రాక్ట్‌లు ప్రకటించిన బీసీసీఐ ముంబై: ఏడాది కాలంగా భారత క్రికెట్ జట్టు ప్రధాన పేసర్‌గా నిలకడగా రాణిస్తున్న భువనేశ్వర్ కుమార్‌కు బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ప్రమోషన్ దక్కింది. ఇప్పటి వరకు గ్రేడ్ ‘బి’లో ఉన్న భువీకి బోర్డు ఈసారి గ్రేడ్ ‘ఎ’లో చోటు కల్పించింది. ఈ సీజన్లో భువనేశ్వర్‌కు ‘బీసీసీఐ-ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’... ఐసీసీ ‘పీపుల్స్ చాయిస్ అవార్డు’ లభించాయి. 2014-15 సీజన్ కోసం బోర్డు సోమవారం కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. ఈ జాబితాలో ఉన్న ఐదుగురు ఆటగాళ్లకు సంవత్సరానికి రూ. 1 కోటి చొప్పున ఫీజుగా లభిస్తుంది. గత ఏడాది ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్ రిటైర్ కావడంతో ఆ స్థానంలో భువనేశ్వర్ వచ్చాడు. గ్రేడ్ ‘బి’ ఆటగాళ్లకు రూ. 50 లక్షలు, గ్రేడ్ ‘సి’ క్రికెటర్లకు రూ. 25 లక్షల చొప్పున ఫీజు దక్కుతుంది. సీనియర్ల కథ ముగిసింది వన్డే ప్రపంచ కప్ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకోని సీనియర్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌లను బోర్డు పూర్తిగా పక్కన పెట్టింది. వారిని కాంట్రాక్ట్ జాబితాలో చేర్చకుండా భవిష్యత్తుపై తమ ఉద్దేశాన్ని వెల్లడించింది. ఈ ఐదుగురిలో గత ఏడాది గంభీర్, యువరాజ్ మాత్రం గ్రేడ్ ‘బి’లో ఉన్నారు. ఏడాది కాలంగా భారత్ తరఫున మ్యాచ్ ఆడకపోయినా హైదరాబాద్ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా తన ‘బి’ కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకోవడం విశేషం. రాయుడు కూడా ముందుకు యువ ఆటగాళ్లలో తెలుగు కుర్రాడు అంబటి తిరుపతి (ఏటీ) రాయుడుతో పాటు అజింక్య రహానే, మొహమ్మద్ షమీలకు కూడా ప్రమోషన్ దక్కింది. గత ఏడాది ‘సి’ గ్రేడ్‌లో ఉన్న వీరు నిలకడగా ఆడి ‘బి’లో స్థానం దక్కించుకున్నారు. గ్రూప్ ‘సి’లో కొత్తగా 12 మందికి చోటు దక్కగా... వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, జైదేవ్ ఉనాద్కట్‌లను తప్పించారు. అయితే 30 మంది ప్రపంచ కప్ ప్రాబబుల్స్‌లో స్థానం పొందిన మనీశ్ పాండే, కేదార్ జాదవ్, అశోక్ దిండాలతో పాటు మరో వికెట్ కీపర్ నమన్ ఓజాకు కూడా కాంట్రాక్ట్ దక్కలేదు. ప్రస్తుతం జాబితాలో చోటు లేకపోయినా ఈ సీజన్లో ఎవరైనా కొత్త ఆటగాడు అంతర్జాతీయ అరంగేట్రం చేస్తే అతను నేరుగా గ్రూప్ ‘సి’లో స్థానం పొందుతాడని బీసీసీఐ ప్రకటించింది.