తస్కిన్, సన్నీ బౌలింగ్ శైలిపై ఫిర్యాదులు | Taskin, Sunny bowling style Complaints | Sakshi
Sakshi News home page

తస్కిన్, సన్నీ బౌలింగ్ శైలిపై ఫిర్యాదులు

Published Fri, Mar 11 2016 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

Taskin, Sunny bowling style Complaints

ధర్మశాల: బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్, ఎడమ చేతి స్పిన్నర్ అరాఫత్ సన్నీ బౌలింగ్ శైలిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరి బౌలింగ్ శైలిపై అంపైర్ల నుంచి మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు అందింది. 8 పరుగులతో గెలిచిన ఆ మ్యాచ్ చివరి ఓవర్‌ను తస్కిన్ వేశాడు. ‘బంగ్లా క్రికెట్ మేనేజ్‌మెంట్‌తో ఈ విషయమై ఐసీసీ పనిచేస్తోంది. చెన్నైలోని గుర్తింపు పొందిన టెస్టింగ్ సెంటర్‌లో పరీక్షకు వీరిద్దరు హాజరవుతారు. వారం రోజుల్లో ఈ స్వతంత్ర విచారణ ఫలితం వస్తుంది. అప్పటిదాకా ఇద్దరు బౌలర్లు మ్యాచ్‌లు ఆడవచ్చు’ అని ఐసీసీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement