Taskin Ahmed
-
T20 World Cup 2024: బంగ్లా లక్ష్యం 116.. 12.1 ఓవర్లలో ఛేదిస్తే సెమీస్‌కు..!
టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8లో ఒక్క మ్యాచ్ గెలవకపోయిన సెమీస్‌కు చేరే సువర్ణావకాశం బంగ్లాదేశ్‌కు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్ 24) జరుగుతున్న మ్యాచ్‌లో 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని (116 పరుగులు) ఛేదిస్తే.. భారత్‌తో పాటు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ (43) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇబ్రహీం జద్రాన్ (29 బంతుల్లో 18), అజ్మతుల్లా (12 బంతుల్లో 10), గుల్బదిన్ (3 బంతుల్లో 4), నబీ (5 బంతుల్లో 1) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో రషీద్ ఖాన్ 3 సిక్సర్లు కొట్టడంతో (10 బంతుల్లో 19) ఆఫ్ఘనిస్తాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో అందరూ పొదుపుగా బౌలింగ్ చేశారు. రిషద్ హొసేన్ (4-0-26-3), తస్కిన్ అహ్మద్ (4-1-12-1), ముస్తాఫిజుర్ (4-0-17-1), షకీబ్ (4-0-19-0) ఆఫ్ఘన్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ను ఆపేశారు. -
వరల్డ్ కప్‌నకు బంగ్లా జట్టు ప్రకటన.. అనూహ్యంగా అతడికి చోటు!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి తమ జట్టును ప్రకటించింది. నజ్ముల్ హొసేన్ కెప్టెన్సీలో వరల్డ్ కప్‌లో ఆడబోయే 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది. సీనియర్లు, ఇటీవల పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.అయితే, గాయంతో బాధపడుతున్న మరో పేసర్ టస్కిన్ అహ్మద్ అనూహ్య రీతిలో జట్టులో చోటు సంపాదించడంతో పాటు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫామ్‌లేమితో బాధపడుతున్న ఓపెనింగ్ బ్యాటర్ లిటన్ దాస్ సైతం చోటు దక్కించుకున్నాడు.కాగా 29 ఏళ్ల ఈ పేస్ బౌలర్ గతవారం జింబాబ్వేతో సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. అయితే, ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మాత్రం అదరగొట్టాడు. 4.56 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. షకీబ్ అల్ హసన్ 2007 నుంచి టీ20 ప్రపంచకప్ ఈవెంట్‌ను ఒక్కసారి కూడా మిస్ కాలేదు.ఇదిలా ఉంటే.. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ జూన్ 1 నుంచి ఆరంభం కానుంది. ఇందులో భాగంగా డల్లాస్‌లోని టెక్సాస్ వేదికగా జూన్ 7న బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో మ్యాచ్‌తో మెగా ఈవెంట్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్- 2024కు బంగ్లాదేశ్ జట్టు:నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), టస్కిన్ అహ్మద్ (వైస్ కెప్టెన్), లిటన్ కుమర్ దాస్, సౌమ్య సర్కార్, తన్జిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తవ్హిద్ హృదోయ్, మహమూద్ ఉల్లా రియాద్, జకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షేక్ మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజీమ్ హసన్ సకీబ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: అఫిఫ్ హుస్సేన్, హసన్ మహమూద్. -
ఐపీఎల్లో ఆడనందుకు రివార్డు.. ఆ ముగ్గురికీ బోనస్
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగం కావాలని ప్రపంచంలో ప్రతీ ఒక్క క్రికెటర్ కోరుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే విధంగా ఎంతోమంది అనామకులను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా ఐపీఎల్‌కు ఉంది. ఇటువంటి క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగమయ్యే అవకాశాన్ని ఏ ఆటగాడు వదులుకోవడానికి ఇష్టపడడు. కానీ బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ కంటే తమ జాతీయ జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఐపీఎల్ ఆఫర్‌ను వదులుకున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు షకీబ్ అల్హసన్, లిటన్ దాస్, టాస్కిన్ అహ్మద్‌లకు ఆ దేశ క్రికెట్ రివార్డు ప్రకటించింది. ఈ ముగ్గురికీ కలిపి 65 వేల డాలర్లు (దాదాపు 53 లక్షలు) బీసీబీ రివార్డుగా ఇవ్వనుంది. కాగా ఐపీఎల్ 2023 మినీ వేలంలో బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ని బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. అయితే ఐర్లాండ్‌తో టెస్టు సిరీస్ కారణంగా షకీబ్ అల్హసన్ ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అదే విధంగా లిటన్ దాస్ కూడా ఐర్లాండ్ సిరీస్ కారణంగా ఈ ఏడాది సీజన్ ఫస్ట్‌హాఫ్‌లో ఆడలేదు. ఆ తర్వాత ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఆడేందుకు వచ్చిన కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడిని రూ.50 లక్షలకు కేకేఆరే సొంతం చేసుకుంది. మరోవైపు గాయం కారణంగా ఐపీఎల్ సెకెండ్ హాఫ్‌కు దూరమైన లక్నో ఫాస్ట్ బౌలర్ స్ధానంలో టాస్కిన్ అహ్మద్‌కు ఆ ఫ్రాంచైజీ నుంచి పిలుపు వచ్చిందంట. అయితే బంగ్లా క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో లక్నో ఆఫర్‌ను టస్కిన్ అహ్మద్ తిరష్కరించినట్లు సమాచారం. ఇక వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్‌ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యారు. చదవండి: ఆ రెండు మ్యాచులు గెలిస్తే.. వరల్డ్ కప్ టీమిండియాదే: సునీల్ గవాస్కర్ -
ఆఫ్గాన్‌తో వైట్‌బాల్ సిరీస్‌లు.. బంగ్లా జట్టు ప్రకటన! స్టార్ బౌలర్ వచ్చేశాడు
ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన రెండు వేర్వేరు జట్లను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. వన్డే సిరీస్‌కు తమీమ్ ఇక్భాల్ సారధ్యం వహించనుండగా.. టీ20 సిరీస్‌లో బంగ్లా జట్టును షకీబ్ అల్ హసన్ జట్టును నడిపించనున్నాడు. కాగా గత కొన్ని సిరీస్‌లుగా జట్టుకు దూరంగా ఉన్న అఫీఫ్ హొస్సేన్ ఆఫ్గాన్ సిరీస్‌తో రి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడితో పాటు ఎబాడోత్ హొస్సేన్కు కూడా వన్డే, టీ20 జట్టులో చోటు దక్కింది. అదే విధంగా గాయం కారణంగా జట్టుగా దూరంగా ఉన్న స్టార్ పేసర్ టాస్కిన్ అహ్మద్ కూడా ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. ఇక స్వదేశంలో మూడు వన్డేలు, రెండు టీ20ల్లో ఆఫ్గాన్‌తో బంగ్లా జట్టు తలపడనుంది. జూలై 5, 8, 11 తేదీల్లో చటోగ్రామ్ వేదికగా వన్డే సిరీస్ జరగనుండగా.. జూలై 12, 14 తేదీల్లో సిల్హెట్లో రెండు టీ20లు జరగనున్నాయి. కాగా ఇదే ఆఫ్గాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రత్మాక విజయం సాధించిన సంగతి తెలిసిందే. 546 పరుగుల తేడాతో అత్యంత భారీ విజయాన్ని బంగ్లా మూటగట్టుకుంది. 21వ శతాబ్దంలో టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్‌దే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఆఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లా జట్టు తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, అఫీఫ్ హుస్సేన్, మహ్మద్ నయీమ్ ఆఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లా జట్టు షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్, రోనీ తాలూక్దార్, నజ్ముల్ హుస్సేన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహ్మద్, తస్కిన్ అహ్మద్, , ఎబాడోత్ హోస్సేన్, రిషాద్ హొస్సేన్, అఫీప్ హోస్సేన్ చదవండి: రోహిత్ ఫామ్‌లోకి రావాలంటే అదొక్కటే మార్గం: స్మిత్ -
వరల్డ్‌కప్ ఫైనల్లో ఆడడమే మా టార్గెట్.. ఏ జట్టునైనా ఓడిస్తాం: బంగ్లా బౌలర్
బంగ్లాదేశ్ స్టార్ పేసర్ టాస్కిన్ ఆహ్మద్ గాయం కారణంగా ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన టాస్కిన్ ఆహ్మద్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. వైట్‌బాల్ క్రికెట్లో స్పెషలిస్టుగా పెరొందిన అహ్మద్.. డైలీ స్టార్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ గురించి టాస్కిన్ చర్చించాడు. "ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. మా ప్రణాళికలు మాకు ఉన్నాయి. మా ప్లాన్స్‌ను వెల్లడించడానికి సరైన సమయం కాదు. కానీ ప్రపంచకప్‌లో ఫైనల్ ఆడడమే మా ప్రధాన లక్ష్యం. అందుకు భగవంతుడి దయ కూడా కావాలి. నేను భారత్ గడ్డపై టీ20 ప్రపంచకప్, ఓ టెస్టు మ్యాచ్ ఆడాను. భారత పిచ్‌లు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. అయితే కొన్ని పిచ్‌లకు మాత్రం బ్యాటింగ్ అనూకూలిస్తాయి. అక్కడ కచ్చితంగా పేసర్లకు మాత్రం గట్టి సవాలు ఎదురవుతుంది. కానీ బౌలింగ్ యూనిట్ సరిగ్గా రాణించగల్గితే ఏ జట్టుకైన గట్టిపోటీని ఇవ్వగలుగుతాం" అని డైలీ స్టార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాస్కిన్ అహ్మద్ పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్ తరపున 57 వన్డేలు, 52 టీ20లు, 12 టెస్టులు ఆడిన అహ్మద్ 152 వికెట్లు పడగొట్టాడు. కాగా వన్డే ప్రపంచకప్ ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగనుంది. ఐసీసీ ఇంకా వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయలేదు. చదవండి: నేను బౌలింగ్ చేసి ఉంటే రాజస్తాన్ 40 పరుగులకే ఆలౌటయ్యేది: కోహ్లి -
పసికూనలపై బంగ్లా పులుల ప్రతాపం
స్వదేశంలో బంగ్లాదేశ్ విజయాల పరంపర కొనసాగుతుంది. ఇటీవలే జగజ్జేత ఇంగ్లండ్‌ను క్లీన్‌స్వీప్ (3-0 తేడాతో టీ20 సిరీస్) చేసి జోష్ మీదున్న బంగ్లాదేశ్.. ఐర్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న హోం సిరీస్‌లోనూ అదే జోరును కంటిన్యూ చేస్తోంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న బంగ్లా పులులు.. ఇవాళ (మార్చి 27) మొదలైన టీ20 సిరీస్‌కు కూడా శుభారంభం చేశారు. చట్టోగ్రామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిధ్య జట్టు.. 19.2 ఓవర్ల తర్వాత 207/5 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగా, వర్షం మొదలైంది. చాలా సేపు కొనసాగిన వర్షం నిర్ణీత సమయానికి కాస్త ముందు ఎడతెరిపినివ్వడంతో రిఫరీ మ్యాచ్‌ను ప్రారంభించాడు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లా టార్గెట్‌ను 8 ఓవర్లలో 104 పరుగులుగా నిర్ధేశించారు. ధాటిగా ఛేదనను ప్రారంభించిన ఐర్లాండ్‌ను తస్కిన్ అహ్మద్ దారుణంగా దెబ్బకొట్టాడు. తొలి ఓవర్లో 18 పరుగులు, రెండో ఓవర్లో 14 పరుగులు రాబట్టి లక్ష్యం దిశగా పరుగులు తీస్తున్న ఐర్లాండ్‌ను తస్కిన్ అహ్మద్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. 2 ఓవర్ల తర్వాత 32/0గా ఉన్న స్కోర్ 4 ఓవర్ల తర్వాత 44/4గా మారింది. ఈ పరిస్థితి తర్వాత కూడా ఏమాత్రం తగ్గని ఐర్లాండ్ తమవంతు ప్రయత్నం చేసి చివరికి ఓటమిపాలైంది. 2 ఓవర్లు వేసిన తస్కిన్ 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు.. లిట్టన్ దాస్ (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోని తలుక్దార్ (38 బంతుల్లో 67; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), షమీమ్ హొస్సేన్ (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్), షకీబ్ (13 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు) రాణించడంతో బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరో 4 బంతులు మిగిలుండగానే వర్షం ప్రారంభంకావడంతో బంగ్లా ఇన్నింగ్స్ ఆక్కడే ముగిసింది. బంగ్లా-ఐర్లాండ్ మధ్య రెండో టీ20 మార్చి 29న జరుగుతుంది. -
నిప్పులు చెరిగిన పేసర్లు.. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తొలిసారి..!
సొంతగడ్డపై ఇటీవలే ప్రపంచ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు షాకిచ్చి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా టైగర్స్.. తాజాగా ఐర్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నారు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్పటికే (2 మ్యాచ్‌ల తర్వాత) 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న బంగ్లాదేశ్.. ఇవాళ (మార్చి 23) జరుగుతున్న ఆఖరి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 28.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ (8.1-1-32-5), తస్కిన్ అహ్మద్ (10-1-26-3), ఎబాదత్ హొస్సేన్ (6-0-29-2) గోలాల్లాంటి బంతులు సంధించి ఐర్లాండ్‌ను మట్టికరిపించారు. వీరి దెబ్బకు ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్లు కాగా.. కేవలం ఇద్దరు (టక్కర్ (28), కర్టిస్ క్యాంపర్ (36)) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. యాదృచ్చికమైన విషయమేమిటంటే, వన్డే క్రికెట్ చరిత్రలో బంగ్లా పేసర్లు తొలిసారి 10కి 10 వికెట్లు పడగొట్టారు. బంగ్లా వన్డే హిస్టరీలో ఇలా ఎప్పుడు జరగలేదు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. 4 ఓవర్లలో ఆ జట్టు వికెట్ కోల్పోకుండా 29 పరుగులు చేసింది. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (19), లిటన్ దాస్ (8) క్రీజ్‌లో ఉన్నారు. -
టీమిండియాతో తొలి టెస్ట్.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్
2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రేపటి (డిసెంబర్ 14) నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. వన్డే సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఆతిధ్య బంగ్లాదేశ్ ఉరకలేస్తుండగా.. ఎలాగైనా టెస్ట్ సిరీస్ గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కేఎల్ రాహుల్ నేతృత్వంలో బరిలోకి దిగుతుండగా, బంగ్లాదేశ్.. షకీబ్ అల్ హసన్ సారధ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇవాళ జరిగిన ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా బంగ్లా కెప్టెన్ గాయపడినప్పటికీ, అతని గాయం అంత తీవ్రమైందని కాదని తేలడంతో బంగ్లా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. షకీబ్ గాయంపై క్షేమ సమాచారం అందుకున్న బంగ్లా అభిమానులకు ఈ వార్త తెలిసే లోపే మరో షాకింగ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ టస్కిన్ అహ్మద్ తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉండడని ఆ జట్టు కోచ్ రస్సెల్ డొమింగో స్పష్టం చేశాడు. టీమిండియాతో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన టస్కిన్ పూర్తిగా కోలుకోలేదని, ఈ పరిస్థితుల్లో అతన్ని బరిలోకి దించే రిస్క్ చేయలేమని డొమింగో తెలిపాడు. ఇటీవలి కాలంలో టస్కిన్.. బంగ్లాదేశ్ కీలక బౌలర్‌గా ఎదిగాడు. బంగ్లా తరఫున 11 టెస్ట్‌లు, 52 వన్డేలు, 46 టీ20లు ఆడిన టస్కిన్.. మొత్తం 130 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ దెబ్బకు బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఆసుపత్రి బాట పట్టాడు. ప్రాక్టీస్‌లో భాగంగా ఉమ్రాన్ వేసిన ఓ బంతి షకీబ్ ఛాతికి బలంగా తాకడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ సమయానికి స్టేడియంకి సంబంధించిన ఎలాంటి వాహనాలు లేకపోవడంతో షకీబ్‌ను ఆంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. భారత్: శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ బంగ్లాదేశ్: మహ్మదుల్ హసన్ జాయ్, మొమినుల్ హాక్, నజ్ముల్ హొసేన్ షాంటో, యాసిర్ అలీ, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, నురుల్ హసన్, జాకీర్ హసన్, మెహిది హసన్ మీరజ్, అనాముల్ హాక్, తైజుల్ ఇస్లాం, టస్కిన్ అహ్మద్, ఖలీద్ అహ్మద్, షొరీఫుల్ ఇస్లాం, ఎబాదత్ హొస్సేన్, రహ్మాన్ రజా -
టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్!
స్వదేశంలో టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో తమీమ్‌కు గజ్జ గాయమైంది. అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండు వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యలు సూచించారు. ఈ క్రమంలోనే వన్డే సిరీస్‌కు తమీమ్ దూరమయ్యాడు. అయితే డిసెంబర్ 14న జరిగే తొలి టెస్టుకు కూడా తమీమ్ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. అయితే వన్డే సిరీస్‌కు తమీమ్ ఇక్బాల్ స్థానంలో ఆ జట్టు వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే తొలి వన్డేకు ఆ జట్టు స్టార్ పేసర్ టాస్కిన్ ఆహ్మద్ కూడా వెన్ను నొప్పితో దూరమయ్యాడు. కాగా తమీమ్,టాస్కిన్ వంటి స్టార్ ఆటగాళ్లు దూరం కావడం కచ్చితంగా బంగ్లాకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత్‌తో వన్డేలకు బంగ్లా జట్టు: లిట్టన్ కుమార్ దాస్, అనముల్ హక్ బిజోయ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరి, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్,జ్ముల్ హుస్సేన్ శాంటో,మహ్మదుల్లా,నూరుల్ హసన్ సోహన్ చదవండి: ENG Vs PAK: 'యార్..నెంబర్ వన్ బౌలింగ్'.. పాక్ జట్టును ఆడేసుకున్నారు -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి!
దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. తొలి సారి దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. నిర్ణాయక మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా తస్కిన్ అహ్మద్ (5/35) దెబ్బకు 37 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జన్నెమాన్ మలన్ 39 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 5 వికెట్లు పడగొట్టగా, షకీబ్ అల్ హసన్ రెండు, మెహాది హాసన్,షారిఫుల్ ఇస్లాం చెరో వికెట్ సాధించారు. ఇక 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (87 నాటౌట్; 14 ఫోర్లు) మెరిశాడు. తస్కిన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్’ అవార్డులు దక్కాయి. చదవండి: PAK vs AUS: 'నువ్వా- నేనా' అంటూ కత్తులు దూసుకున్న వార్నర్, అఫ్రిది -
బంగ్లాదేశ్ బౌలర్‌కు బంపర్ ఆఫర్.. తొలిసారి ఐపీఎల్లో!
ఐపీఎల్-2022కు లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మార్క్ వుడ్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. వెస్టిండీస్-ఇంగ్లండ్ రెండో టెస్టు సందర్భంగా వుడ్ గాయ పడ్డాడు. అయితే మార్క్ వుడ్ స్ధానాన్ని బంగ్లాదేశ్ స్టార్ పేసర్ టాస్కిన్ ఆహ్మద్‌తో భర్తీ చేయాలని లక్నో ప్రాంఛైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే లక్నో అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఇక దక్షిణాఫ్రికాలో పర్యటించిన బంగ్లాదేశ్ జట్టులో టాస్కిన్ ఆహ్మద్ భాగమై ఉన్నాడు. అయితే వన్డే సిరీస్ అనంతరం బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో టెస్టు సిరీస్ నుంచి టాస్కిన్ ఆహ్మద్ తప్పుకోనే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ కొత్త జట్టుగా అవతరించింది. ఈ జట్టుకు టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో మార్చి28న తలపడనుంది. చదవండి: IPL 2022- KL Rahul: పంజాబ్ కింగ్స్‌ను వీడటానికి ముఖ్య కారణం అదే: కేఎల్ రాహుల్ -
Nz Vs Ban 1st Test: అత్యంత చెత్త రివ్యూ ఇదే... అనవసరంగా..
Nz Vs Ban 1st Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు కూడా మెరుగ్గా రాణించింది ఆతిథ్య బంగ్లాదేశ్. అంతకు ముందు బ్యాటర్ల విజృంభణతో 458 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన బంగ్లా... కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా 5 వికెట్లు కూల్చింది. కానీ, క్యాచ్‌లు డ్రాప్ చేయడం, రనౌట్లు మిస్ చేయడం వంటి తప్పిదాల కారణంగా మరింత పటిష్ట స్థితిలో నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ముఖ్యంగా 37వ ఓవర్లో టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ఆఖరి నిమిషంలో రివ్యూ కోరి వేస్ట్ చేసుకుంది. టస్కిన్ వేసిన బంతిని కవర్స్ దిశగా ఆడేందుకు రాస్ టేలర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో టేలర్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు భావించిన బంగ్లా కెప్టెన్ మొమినల్ అప్పీలు చేయగా నెగటివ్ ఫలితం వచ్చింది. దీంతో అతడు రివ్యూకు వెళ్లగా అక్కడా చేదు అనుభవమే ఎదురైంది. బ్యాటర్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. అంతేగాక బంగ్లాకున్న రివ్యూ అవకాశాలు అన్నీ ఊడ్చుకుపోయాయి. కాగా బంతి రాస్ టేలర్ బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించినప్పటికీ మొమినల్ రివ్యూకు వెళ్లడాన్ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఇప్పటి వరకు చూసిన అత్యంత చెత్త రివ్యూ ఇదే’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. చదవండి: Rohit Sharma: 5-6 కిలోలు తగ్గాలి రోహిత్.. అప్పుడే ఉపశమనం; ఫొటో షేర్ చేసిన ధావన్ WORST REVIEW EVER??! Bangladesh lost their last remaining review when THIS was given 'not out' for LBW! FOLLOW #NZvBAN LIVE: 👉 https://t.co/vIAFgN1IK7 👈 pic.twitter.com/f8CmxEKkpk — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) January 4, 2022 -
పిచ్‌పై బంగ్లా బ్యాట్స్‌మెన్ డ్యాన్స్.. గొడవకు దిగిన జింబాబ్వే బౌలర్
హరారే: జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్ల మధ్య హరారే వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తస్కిన్ అహ్మద్ పిచ్‌పై డ్యాన్స్ వేయడం ఈ గొడవ మొదలైంది. జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానికి వేసిన బంతిని వికెట్ కీపర్‌కు వదిలేసిన తస్కిన్.. ఆ వెంటనే ఓ డ్యాన్స్ స్టెప్ వేశాడు. ఇది చూసిన ముజరబాని అతనిపైకి దూసుకెళ్లాడు. దీంతో ఇద్దరు ఆటగాళ్లు ఒకరి ముఖంలో మరొకరు కోపంగా చూసుకుంటూ మాటామాటా అనుకున్నారు. Now this is something! Muzarabani and Taskin get into each other's faces! 🎥 Rabbitholebd #ZIMvBAN #BANvZIM #Cricket pic.twitter.com/mJmR8QfpFI — Shihab Ahsan Khan (@shihabahsankhan) July 8, 2021 అయితే, ముజరబాని అలా రియాక్ట్ కావడానికి ఓ కారణం ఉంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్.. ఓ దశలో 132 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే లిటన్ దాస్ (95), మహ్మదుల్లా (150), చివర్లో తస్కిన్ అహ్మద్ (75) అద్భుతంగా రాణించడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగుల భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా 9వ వికెట్‌కు మహ్మదుల్లాతో కలిసి తస్కిన్ 191 పరుగులు జోడించడం ముజరబాని జీర్ణించుకోలేకపోయాడు. దీనికి తోడు తస్కిన్ తనను అవమానించే విధంగా డ్యాన్స్ వేయడంతో ముజరబాని సహనాన్ని కోల్పోయాడు. ఓ దశలో ఇద్దరు ఆటగాళ్లు పిచ్‌పైనే కొట్టుకునేలా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఆతిధ్య జట్టు సైతం ధీటుగానే బదులిస్తుంది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి జింబాబ్వే 2 వికెట్లు నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్ బ్రెండన్ టేలర్(81), ఓపెనర్ మిల్టన్ షుంబా(41) రాణించగా, కెయిటానో(63), డియాన్ మయర్స్(21) క్రీజ్‌లో ఉన్నారు. -
తస్కిన్, సన్నీ బౌలింగ్ శైలిపై ఫిర్యాదులు
ధర్మశాల: బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్, ఎడమ చేతి స్పిన్నర్ అరాఫత్ సన్నీ బౌలింగ్ శైలిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరి బౌలింగ్ శైలిపై అంపైర్ల నుంచి మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు అందింది. 8 పరుగులతో గెలిచిన ఆ మ్యాచ్ చివరి ఓవర్‌ను తస్కిన్ వేశాడు. ‘బంగ్లా క్రికెట్ మేనేజ్మెంట్తో ఈ విషయమై ఐసీసీ పనిచేస్తోంది. చెన్నైలోని గుర్తింపు పొందిన టెస్టింగ్ సెంటర్లో పరీక్షకు వీరిద్దరు హాజరవుతారు. వారం రోజుల్లో ఈ స్వతంత్ర విచారణ ఫలితం వస్తుంది. అప్పటిదాకా ఇద్దరు బౌలర్లు మ్యాచ్‌లు ఆడవచ్చు’ అని ఐసీసీ పేర్కొంది.