ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన రెండు వేర్వేరు జట్లను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. వన్డే సిరీస్‌కు తమీమ్ ఇక్భాల్ సారధ్యం వహించనుండగా.. టీ20 సిరీస్‌లో బంగ్లా జట్టును షకీబ్ అల్ హసన్ జట్టును నడిపించనున్నాడు. కాగా గత కొన్ని సిరీస్‌లుగా జట్టుకు దూరంగా ఉన్న అఫీఫ్ హొస్సేన్ ఆఫ్గాన్ సిరీస్‌తో రి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
అతడితో పాటు ఎబాడోత్ హొస్సేన్‌కు కూడా వన్డే, టీ20 జట్టులో చోటు దక్కింది. అదే విధంగా గాయం కారణంగా జట్టుగా దూరంగా ఉన్న స్టార్ పేసర్ టాస్కిన్ అహ్మద్ కూడా ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. ఇక స్వదేశంలో మూడు వన్డేలు, రెండు టీ20ల్లో ఆఫ్గాన్‌తో బంగ్లా జట్టు తలపడనుంది.
జూలై 5, 8, 11 తేదీల్లో చటోగ్రామ్ వేదికగా వన్డే సిరీస్ జరగనుండగా.. జూలై 12, 14 తేదీల్లో సిల్హెట్‌లో రెండు టీ20లు జరగనున్నాయి. కాగా ఇదే ఆఫ్గాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రత్మాక విజయం సాధించిన సంగతి తెలిసిందే. 546 పరుగుల తేడాతో అత్యంత భారీ విజయాన్ని బంగ్లా మూటగట్టుకుంది. 21వ శతాబ్దంలో టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌దే అతిపెద్ద విజయం కావడం విశేషం.
ఆఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లా జట్టు
తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, అఫీఫ్ హుస్సేన్, మహ్మద్ నయీమ్
ఆఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లా జట్టు
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్, రోనీ తాలూక్దార్, నజ్ముల్ హుస్సేన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహ్మద్, తస్కిన్ అహ్మద్, , ఎబాడోత్ హోస్సేన్, రిషాద్ హొస్సేన్, అఫీప్ హోస్సేన్
చదవండి: రోహిత్ ఫామ్‌లోకి రావాలంటే అదొక్కటే మార్గం: స్మిత్
Comments
Please login to add a commentAdd a comment