Bangladesh vs Afghanistan
-
అదే నా కెరీర్లో చివరి టోర్నీ: అఫ్గన్ స్టార్ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్ ప్రకటన
వచ్చే ఏడాది జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం వస్తే.. అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదని అఫ్గనిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అన్నాడు. ఈ ఐసీసీ టోర్నీ తర్వాత తాను వన్డేల నుంచి తప్పుకొంటానని తెలిపాడు. కాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో సమష్టి ప్రదర్శనతో సత్తాచాటిన అఫ్గనిస్తాన్.. సిరీస్‌ను కైవసం చేసుకుంది.హ్యాట్రిక్ విజయాలుతద్వారా ఈ ఫార్మాట్లో వరుసగా మూడో సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం నాటి ఆఖరి వన్డేలో అఫ్గన్ 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. ఫలితంగా 2–1తో సిరీస్ చేజిక్కించుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.మహ్ముదుల్లా (98 బంతుల్లో 98; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ (119 బంతుల్లో 66; 4 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించాడు. అఫ్గనిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గాన్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.రహమానుల్లా గుర్బాజ్ సూపర్ సెంచరీఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ (120 బంతుల్లో 101; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ పూర్తి చేసుకోగా... అజ్మతుల్లా (77 బంతుల్లో 70 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. చివర్లో మొహమ్మద్ నబీ (34 నాటౌట్; 5 ఫోర్లు) కీలక పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో నహీద్ రాణా, ముస్తఫిజుర్ రహమాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అజ్మతుల్లాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మొహమ్మద్ నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. అది ముగిసిన తర్వాత వన్డేల నుంచి తప్పుకొంటాఈ నేపథ్యంలో నబీ మాట్లాడుతూ.. ‘‘‘గత ఏడాది వన్డే ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి దీని గురించి ఆలోచిస్తున్నా. కానీ మా జట్టు చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. దీంతో ఆ టోర్నీ ఆడాలనుకున్నా. అది ముగిసిన తర్వాత వన్డేల నుంచి తప్పుకొంటా’ అంటూ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించాడు. కాగా సుదీర్ఘ కాలంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న 39 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ను అభిమానులు అఫ్గన్ క్రికెట్ హీరోగా పిలుచుకుంటారు.ఇక అఫ్గన్ తరఫున ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 167 వన్డేలు ఆడిన నబీ... 27.48 సగటుతో 3,600 పరుగులు చేయడంతో పాటు 172 వికెట్లు పడగొట్టాడు. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నబీ... 2 సెంచరీలు, 17 అర్ధశతకాలు తన పేరిట రాసుకున్నాడు.గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన అఫ్గనిస్తాన్ జట్టు... ఆరో స్థానంలో నిలవడం ద్వారా తొలిసారి చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన విషయం తెలిసిందే.చదవండి: BGT 2024: అతడి బ్యాటింగ్ అద్భుతం.. భారత తుదిజట్టులో చోటివ్వాల్సిందే: ఆసీస్ మాజీ కెప్టెన్ -
గుర్భాజ్ విధ్వంసకర సెంచరీ.. బంగ్లాను చిత్తు చేసిన అఫ్గాన్
షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో అఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(98) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మెహాది హసన్ మిరాజ్(66) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. నబీ, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు.గుర్భాజ్ విధ్వంసకర సెంచరీ..అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. అఫ్గాన్ లక్ష్య చేధనలో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 120 బంతులు ఎదుర్కొన్న గుర్భాజ్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు 'మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్' అజ్మతుల్లా ఒమర్జాయ్(70 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా, ముస్తఫిజుర్ రెహ్మాన్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్ -
మెరిసిన షాంటో.. అఫ్గాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్... రెండో మ్యాచ్‌లో సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం షార్జా వేదికగా జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 68 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై గెలుపొందింది. ఫలితంగా సిరీస్ 1–1తో సమమైంది.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిరీ్ణత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నజ్ముల్ షంటో (119 బంతుల్లో 76; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధసెంచరీ నమోదు చేయగా... సౌమ్య సర్కార్ (35), జాకీర్ అలీ (37 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు), నసుమ్ అహ్మద్ (25; ఒక ఫోర్, రెండు సిక్సర్లు) రాణించారు. తన్జిద్ హసన్ (22), మెహది హసన్ మిరాజ్ (22) కూడా ఫర్వాలేదనిపించారు అఫ్గాన్ బౌలర్లలో నంగెయాలియా ఖరోటె 3, రషీద్ ఖాన్ ఘజన్ఫర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ 43.3 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. రహమత్ షా (76 బంతుల్లో 52; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా... సెదిఖుల్లా అటల్ (39; 5 ఫోర్లు), గుల్బదిన్ నైబ్ (26; 4 ఫోర్లు, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు. గత మ్యాచ్‌లో స్ఫూర్తివంతమైన ప్రదర్శన కనబర్చిన అఫ్గాన్ బ్యాటర్లు ఈ సారి అదే జోష్ కొనసాగించలేకపోయారు. రహామనుల్లా గుర్బాజ్ (2), అజ్మతుల్లా (0), హష్మతుల్లా (17), మొహమ్మద్ నబీ (17), రషీద్ ఖాన్ (14) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నసుమ్ అహ్మద్ 3... ముస్తఫిజుర్ రహమాన్, మెహదీ హసన్ మిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే సోమవారం ఇక్కడే జరగనుంది. -
ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాభవం.. అంతలోనే బంగ్లాదేశ్‌కు మరో ఎదురుదెబ్బ..!
షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు 11 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గెలవాల్సిన మ్యాచ్‌లో అనూహ్య పరిస్థితుల్లో ఓటమిని ఎదుర్కోవడంతో బంగ్లాదేశ్ జట్టు నిరాశలో కూరుకుపోయింది. ఆఫ్ఘన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ తన స్పిన్ మాయాజాలంతో (6/26) బంగ్లాదేశ్ భరతం పట్టాడు.ఈ ఘోర పరాభవం నుంచి కోలుకోక ముందే బంగ్లా జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కమ్ వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీం గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. వికెట్‌కీపింగ్ చేస్తున్న సమయంలో ముష్ఫికర్ చేతి వేలుకు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ చీఫ్ సెలెక్టర్ ఘాజీ అష్రఫ్ హొసేన్, ఆ జట్టు చీఫ్ ఫిజీషియన్ డాక్టర్ దేబశిష్ చౌదురి ధృవీకరించారు. గాయం కాస్త సీరియస్‌గానే ఉన్నట్లు వారు వెల్లడించారు.కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ను మొహమ్మద్ నబీ (79 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 84 పరుగులు), హష్మతుల్లా షాహిది (92 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 52 పరుగులు) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. ఆఖర్లో టెయిలెండర్లు వేగంగా ఆడటంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఓ దశలో (132/3) సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే యువ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ బంగ్లా చేతి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఘజన్ఫర్ ధాటికి బంగ్లాదేశ్ చివరి 7 వికెట్లను 11 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఘజన్ఫర్ దెబ్బకు బంగ్లాదేశ్ 143 పరుగులకు కుప్పకూలి, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. -
చరిత్ర సృష్టించిన అఫ్గాన్ యువ సంచలనం.. ప్రపంచంలోనే?
షార్జా క్రికెట్ గ్రౌండ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో 92 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చారిత్రత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఘజన్ఫర్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని బంగ్లా బ్యాటర్లు విల్లవిల్లాడారు.ఈ మ్యాచ్‌లో 6.3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఘజన్ఫర్ కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఘజన్ఫర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఘజన్ఫర్ సాధించిన రికార్డులు ఇవే..👉వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో అఫ్గానిస్తాన్ బౌలర్‌గా 18 ఏళ్ల ఘజన్ఫర్ నిలిచాడు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2018లో గ్రాస్ ఐలెట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 18 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.👉అంతర్జాతీయ వన్డేల్లో 6 వికెట్ల ఘనత సాధించిన మూడో అత్యంత పిన్న వయష్కుడిగా ఘజన్ఫర్ రికార్డులకెక్కాడు. ఈ అఫ్గానీ 18 సంవత్సరాల 231 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజం వకార్ యూనిస్(18 సంవత్సరాల 164 రోజులు) అగ్రస్ధానంలో ఉండగా, రషీద్ ఖాన్(18 సంవత్సరాల 174 రోజులు) రెండో స్ధానంలో ఉన్నాడు.👉అదే విధంగా బంగ్లాదేశ్-అఫ్గాన్ వన్డేల్లో గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కూడా ఘజన్‌ఫన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్హసన్ పేరిట ఉండేది. 2019లో సౌతాంప్టన్‌లో అఫ్గాన్‌తో జరిగిన వన్డేల్లో షకీబ్ 29 పరుగులిచ్చి 5 వికెట్ల పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన ఘజన్‌ఫన్.. షకీబ్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. From 132/3 to 143 all out! 🤯Bangladesh have just been routed by the spin wizardry of AM Ghazanfar! 🪄#AFGvBANonFanCode pic.twitter.com/vLUXe6Xc56— FanCode (@FanCode) November 6, 2024 -
BAN Vs AFG: ఘజన్ఫర్ మాయాజాలం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ జట్టు...బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి పోరులో అఫ్గానిస్తాన్ 92 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 49.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది.ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (79 బంతుల్లో 84; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించగా... కెపె్టన్ హష్మతుల్లా షాహిది (92 బంతుల్లో 52; 2 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. గుర్బాజ్ (5), రహమత్ షా (2), అజ్మతుల్లా (0) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తఫిజుర్, తస్కిన్ అహ్మద్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 34.3 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అల్లా మొహమ్మద్ ఘజన్ఫర్ 26 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను దెబ్బ కొట్టాడు.బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజుమల్ హోస్సేన్ షాంటో (68 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ నిలిచాడు. సౌమ్య సర్కార్ (33), మిరాజ్ (28) మినహా ఇతర బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. తంజీద్ హసన్ (3), మహ్ముదుల్లా (2), ముష్పికర్ (1), రిషాద్ (1), తౌహిద్ (11) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడే రెండో వన్డే జరగనుంది.చదవండి: టాప్–20 నుంచి కోహ్లి, రోహిత్ అవుట్ -
Ban vs Afg ODIs: బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా అతడే
అఫ్గనిస్తాన్‌తో వన్డేలకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో పాల్గొననున్న పదిహేను మంది సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. ఈ క్రమంలో నజ్ముల్ హుసేన్ షాంటోనే కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు స్పష్టమైంది. కాగా ఇటీవల పాకిస్తాన్ గడ్డపై చారిత్రాత్మక టెస్టు సిరీస్ సాధించిన బంగ్లాదేశ్ సారథిగా రికార్డులకెక్కాడు షాంటో.టెస్టులకు, టీ20లకు వేరే కెప్టెన్లు!అయితే, ఆ తర్వాత భారత పర్యటనలో టెస్టుల్లో 2-0తో క్లీన్‌స్వీప్ సహా.. స్వదేశంలో సౌతాఫ్రికాలో చేతిలోనూ టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్‌కు గురైంది బంగ్లాదేశ్. ఈ నేపథ్యంలో షాంటో కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, బంగ్లా బోర్డు అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ షాంటో వన్డే సారథిగా కొనసాగేలా ఒప్పించినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడినే సారథిగా కొనసాగిస్తున్నట్లు తాజా ప్రకటనతో వెల్లడైంది. మరోవైపు.. టెస్టులకు మెహదీ హసన్ మిరాజ్, టీ20లకు టస్కిన్ అహ్మద్ లేదంటే తౌహీద్ హృదోయ్ సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ పర్యటనఇదిలా ఉంటే.. వన్డే సిరీస్ ఆడేందుకు అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ పర్యటనకు రానుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య షార్జా వేదికగా నవంబరు 6, నవంబరు 9, నవంబరు 11 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత కాలమానం ప్రకారం బంగ్లా- అఫ్గన్ మ్యాచ్‌లు సాయంత్రం ఐదు గంటలకు ఆరంభం కానున్నాయి.ఇక.. అఫ్గన్‌తో వన్డే సిరీస్ ఆడే జట్టులో పేసర్ సషీద్ రాణా తొలిసారి చోటు దక్కించుకోగా.. లిటన్ దాస్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక తంజీమ్ అహ్మద్ సైతం భుజం నొప్పి వల్ల విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే, సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సెలక్షన్‌కు అందుబాటులో ఉండలేదని బంగ్లా బోర్డు అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ తెలిపాడు.అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుసౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, జకీర్ హసన్, నజ్ముల్ హుసేన్ షాంటో(కెప్టెన్), ముష్ఫికర్ రహీం, మహ్మదుల్లా రియాద్, తౌహీద్ హృదోయ్, జాకెర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్(వైస్ కెప్టెన్), రిషాద్ హొసేన్, నసూం అహ్మద్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, నషీద్ రాణా. -
T20 World Cup 2024: రషీద్ ఖాన్‌కు మందలింపు
ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఐసీసీ మందలించింది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో బ్యాట్‌ను నేలకేసి కొట్టినందుకు గాను మందలింపుతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను ఫైన్‌గా విధించింది. 24 నెలల వ్యవధిలో రషీద్ చేసిన మొదటి తప్పిదం కావడంతో ఐసీసీ స్వల్ప చర్యలతో సరిపెట్టింది. బ్యాట్‌ను నేలకేసి కొట్టడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9ని ఉల్లంఘన కిందికి వస్తుంది. దీన్ని లెవెల్ 1 తప్పిదంగా పరిగణిస్తారు.బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రషీద్ బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ఆ సందర్భంలో తన బ్యాటింగ్ భాగస్వామి కరీం జనత్ స్ట్రైక్‌ను తిరస్కరించినందుకు (రెండో పరుగు) రషీద్ బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది. అయితే సెమీస్‌లో ఆ జట్టుకు సౌతాఫ్రికా చేతిలో చుక్కెదురైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు 56 పరుగుల స్వల్ప స్కోర్‌కు చాపచుట్టేయగా.. సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా సౌతాఫ్రికా తొలిసారి ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది. ఇవాళే (జూన్ 27, రాత్రి 8 గంటలకు) జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్తుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. -
అఫ్గాన్ ఆల్‌రౌండర్ చీటింగ్.. ఐసీసీ సీరియస్!? రూల్స్ ఇవే
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఆఫ్గానిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఆఖరి సూపర్-8 మ్యాచ్ సినిమా థ్రిల్లర్‌ను తలిపించిన సంగతి తెలిసిందే. ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 8 పరుగులతో తేడాతో విజయం సాధించిన అఫ్గానిస్తాన్.. తొలి సారి ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నైబ్ వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమైంది.అసలేం ఏం జరిగిందంటే?ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి కేవలం 115 పరుగులు మాత్రమే చేయగల్గింది. అయితే బౌలింగ్‌లో మాత్రం అఫ్గానిస్తాన్ సత్తాచాటింది. లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 11.4 ఓవర్లు ముగిసే సరికి 81/7 పరుగులు చేసింది.అయితే అప్పుడే చినుకులు ప్రారంభం అయ్యాయి. వర్షం మొదలయ్యే సమయానికి డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అఫ్గాన్ రెండు పరుగులు ముందు ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే అఫ్గానిస్తాన్ 2 పరుగుల తేడాతో గెలవనుంది.అయితే వర్షం మొదలైనప్పటికి అంపైర్లు మాత్రం ఆ ఓవర్‌ను ఫినిష్ చేయాలని భావించారు. ఈ క్రమంలో అపట్టికే నాలుగు బంతులు వేసిన నూర్ ఆహ్మద్‌ను అంపైర్లు ఓవర్ పూర్తి చేయమని ఆదేశించారు.అయితే రెండు బంతలు మిగిలుండడంతో బంగ్లా బ్యాటర్ బౌండరీ బాదితే.. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ ముందంజవేస్తోంది. ఈ తరుణంలో అఫ్గాన్ హెడ్‌కోచ్ ట్రాట్ ఆలస్యం చేయాలని డగౌట్ నుంచి తమ ప్లేయర్లకు సైగలు చేశాడు. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గుల్బాదిన్ నైబ్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. కండరాలు పట్టేశాయంటూ నొప్పితో విలవిలలాడినట్లు కన్పించాడు. సరిగ్గా ఆ సమయంలో ఊపందుకోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశాడు. ఫిజియో వచ్చి నైబ్‌ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాడు. అయితే ఇక్కడవరకు అంతబాగానే ఉన్నప్పటకి.. నొప్పితో అంతలా విలవిల్లాడిన నైబ్ 10 నిమిషాల్లో మళ్లీ ఫిట్‌గా కనిపించి బౌలింగ్ చేసేశాడు.దీంతో అతడు చీటింగ్ చేశాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొంతమంది మాజీలు సైతం అతడి తీరును తప్పుబడుతున్నారు. అస్కార్ అవార్డు ఇవ్వాలని పోస్ట్‌లు చేస్తున్నారు.రూల్స్ ఏమి చెబుతున్నాయంటే?కాగా నైబ్ వ్యవహరాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సీరియస్‌గా తీసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా సమయం వృదా చేయకూడదు. అలా చేస్తే ఆర్టికల్ 2.10.7 ప్రకారం లెవల్ 1 లేదా 2 నేరంగా మ్యాచ్ రిఫరీ పరిగణిస్తాడు. ఈ క్రమంలో లెవల్ 1 నేరానికి 100 శాతం మ్యాచ్-ఫీజు జరిమానా, రెండు సస్పెన్షన్ పాయింట్లు విధించే ఛాన్స్ ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో 41.9 ప్రకారం.. బౌలర్ లేదా ఫీల్డర్ కావాలనే సమయం వృధా చేస్తే ఆ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించే అధికారం అంపైర్లకు ఉంటుంది. కానీ బంగ్లా-అఫ్గాన్ మ్యాచ్‌లో అంపైర్లు ఎటువంటి పెనాల్టీ విధించలేదు. ఇక నైబ్ వ్యవహరంపై ఇప్పటివరకు ఐసీసీ నుంచి గానీ మ్యాచ్ రిఫరీ నుంచి ఎటువంటి ఆధికారిక ప్రకటన వెలువడలేదు. -
తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్.. భావోద్వేగాలు, సంబరాలు
ఒకప్పటి క్రికెట్ పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్-2024 బరిలోకి దిగిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి మేటి జట్లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి ప్రపంచకప్ సెమీఫైనల్స్‌కు చేరింది. THE WINNING MOMENT FOR AFGANISTAN. 🇦🇫- Pure raw emotions, the boys made it to the Semi Final. 🥹❤️pic.twitter.com/IMW34vfjbj— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఇవాళ (జూన్ 25) జరిగిన సూపర్-8 సమరంలో బంగ్లాను మట్టికరిపించిన ఆఫ్ఘన్లు.. ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించి, క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశారు. బంగ్లాపై గెలుపు అనంతరం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లంతా భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. కోచ్ జోనాథన్ ట్రాట్, బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో కూడా ఆఫ్ఘన్ల గెలుపు సంబరాల్లో భాగమయ్యారు.THE CELEBRATIONS FROM JONATHAN TROTT AND DWAYNE BRAVO. 💥 pic.twitter.com/KXp81jGL9J— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే ఈ సందర్భాన్ని ఆఫ్ఘన్లతో పాటు ప్రతి క్రికెట్ ప్రేమికుడు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆఫ్ఘన్ పౌరుల సంబరాలు, భావోద్వేగాలు మాటల్లో వర్ణించలేని విధంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నగర వీధులు తమ దేశ ఆటగాళ్ల నామస్మరణతో మార్మోగాయి. The joy on the face and happy tears on Afghanistan's fans. 🥹❤️ pic.twitter.com/3LOWLanIPP— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024AFGHANISTAN CELEBRATION IN TEAM BUS. 🔥- The Greatest day ever. [Bravo IG] pic.twitter.com/x3jHvdD0OZ— Johns. (@CricCrazyJohns) June 25, 2024Water brigade used on Afghanistan people to clear the road, but nobody moved. 😂🔥 pic.twitter.com/zFCnGmlTM7— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024 ఆఫ్ఘన్లు బహుశా తమకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా ఇంతలా సంబురాలు చేసుకుని ఉండరు. కాబుల్ సహా దేశంలోని ప్రతి నగరంలో జనాలు రోడ్లపైకి వచ్చి సమూహిక సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల గెలుపు సంబరాలు వైరలవుతున్నాయి.THE CELEBRATIONS IN PAKTIA PROVINCE. 🥶🇦🇫 pic.twitter.com/5wf2wucJjv— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024కాగా, వరుణుడి అంతరాయాల నడుమ సాగిన సూపర్-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరగా.. గ్రూప్-1 నుంచి సెమీస్ రేసులో ఉండిన బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఒకేసారి ఇంటిముఖం పట్టాయి.The madness in Afghanistan. 🤯🇦🇫 pic.twitter.com/MyYrAcFidr— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024ఇదిలా ఉంటే, బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో టీ20 వరల్డ్‌కప్ 2024లో నాలుగు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా జట్లు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. జూన్ 26న జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. ఆతర్వాతి రోజు జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఢీకొంటాయి. Celebration time pic.twitter.com/0bub4dXREP— Byomkesh (@byomkesbakshy) June 25, 2024 -
ఉత్కంఠ పోరులో బంగ్లాపై గెలుపు.. సెమీస్‌కు ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా ఇంటికి
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. తాజాగా బంగ్లాదేశ్‌ను ఖంగుతినిపించారు. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అద్భుత పోరాటం చేసి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరగా.. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఇంటిముఖం పట్టాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ (43) ఒక్కడే రాణించాడు. ఇబ్రహీం జద్రాన్ (29 బంతుల్లో 18), అజ్మతుల్లా (12 బంతుల్లో 10), గుల్బదిన్ (3 బంతుల్లో 4), నబీ (5 బంతుల్లో 1) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో రషీద్ ఖాన్ 3 సిక్సర్లు కొట్టడంతో (10 బంతుల్లో 19) ఆఫ్ఘనిస్తాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ (4-0-26-3), తస్కిన్ అహ్మద్ (4-1-12-1), ముస్తాఫిజుర్ (4-0-17-1), షకీబ్ (4-0-19-0) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. సూపర్-8లో ఒక్క మ్యాచ్ గెలవకపోయినా సెమీస్‌కు చేరే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఆ జట్టు ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో ఛేదించి ఉంటే సెమీస్‌కు చేరి ఉండేది. అయితే ఇలా జరగకపోగా చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. లక్ష్య ఛేదనలో పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన బంగ్లా లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులకు కుదించారు. ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ ఈ స్కోర్‌ను కూడా ఛేదించలేకపోయింది. నవీన్ ఉల్ హక్ (3.5-0-26-4), రషీద్ ఖాన్ (4-0-23-4), ఫజల్ హక్ (2-0-15-1), గుల్బదిన్ నైబ్ (2-0-5-1) ధాటికి 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
T20 World Cup 2024: బంగ్లా లక్ష్యం 116.. 12.1 ఓవర్లలో ఛేదిస్తే సెమీస్‌కు..!
టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8లో ఒక్క మ్యాచ్ గెలవకపోయిన సెమీస్‌కు చేరే సువర్ణావకాశం బంగ్లాదేశ్‌కు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్ 24) జరుగుతున్న మ్యాచ్‌లో 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని (116 పరుగులు) ఛేదిస్తే.. భారత్‌తో పాటు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ (43) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇబ్రహీం జద్రాన్ (29 బంతుల్లో 18), అజ్మతుల్లా (12 బంతుల్లో 10), గుల్బదిన్ (3 బంతుల్లో 4), నబీ (5 బంతుల్లో 1) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో రషీద్ ఖాన్ 3 సిక్సర్లు కొట్టడంతో (10 బంతుల్లో 19) ఆఫ్ఘనిస్తాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో అందరూ పొదుపుగా బౌలింగ్ చేశారు. రిషద్ హొసేన్ (4-0-26-3), తస్కిన్ అహ్మద్ (4-1-12-1), ముస్తాఫిజుర్ (4-0-17-1), షకీబ్ (4-0-19-0) ఆఫ్ఘన్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ను ఆపేశారు. -
T20 World Cup 2024: రసవత్తరంగా మారిన గ్రూప్-1 రెండో సెమీస్ బెర్త్ రేసు
టీ20 వరల్డ్‌కప్ 2024లో గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్ రేసు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్ నుంచి టీమిండియా తొలి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా (ఆసీస్‌పై విజయంతో).. రెండో బెర్త్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. టీమిండియా చేతిలో ఆసీస్ ఓటమితో గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు ముందు ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్ ఖాతాల్లో చెరి 2 పాయింట్లు ఉండగా.. బంగ్లాదేశ్ ఖాతా పాయింట్లేమీ లేవు.ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిస్తే.. ఆ జట్టు ఖాతాలో కూడా 2 పాయింట్లు చేరతాయి. అప్పుడు ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్లతో పాటు బంగ్లాదేశ్ కూడా సెమీస్ రేసులో ఉంటుంది.ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ 61 పరుగులు అంతకంటే ఎక్కువ తేడాతో గెలిచినా.. 13 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించినా భారత్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది.ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్‌ను ఓడిస్తే భారత్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది.ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 61 పరుగుల కంటే తక్కువ తేడాతో గెలిస్తే ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంటుంది.ఇదిలా ఉంటే, సెయింట్ విన్సెంట్ వేదికగా ఇవాళ (జూన్ 25) ఉదయం 6 గంటలకు ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ ఎంచుకుంది. 16.3 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 3 వికెట్ల నష్టానికి 89 పరుగులుగా ఉంది. గుర్బాజ్ (43), ఇబ్రహీం జద్రాన్ (18), ఒమర్జాయ్ (10) ఔట్ కాగా.. గుల్బదిన్ నైబ్ (4), నబీ (1) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 3, ముస్తాఫిజుర్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ ఫలితంపై గ్రూప్-1 రెండో సెమీస్ బెర్త్ ఆధారపడి ఉంది. -
అఫ్గనిస్తాన్‌కు బీసీసీఐ అనుమతి.. మరోసారి
దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత అఫ్గనిస్తాన్ మరోసారి భారత్‌లో తమ హోం మ్యాచ్‌లు ఆడనుంది. ఉత్తరప్రదేశ్ వేదికగా బంగ్లాదేశ్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుకు అనుమతినిచ్చింది. ధ్రువీకరించిన బీసీసీఐఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ‘‘తమ హోం సెంటర్‌గా అఫ్గనిస్తాన్ ఉత్తరప్రదేశ్‌ను ఎంచుకుంది. వాళ్లు తమ అంతర్జాతీయ మ్యాచ్‌లను ఇక్కడే ఆడతారు. కాన్పూర్, గ్రేటర్ నోయిడా వేదికగా సిరీస్‌లో పాల్గొంటారు.ఇక్కడున్న గ్రీన్ పార్క్ స్టేడియం అత్యంత పురాతనమైన టెస్టు క్రికెట్ గ్రౌండ్. ఇక ముందు కాన్పూర్‌లో కూడా పూర్తిస్థాయిలో టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నట్లు సదరు మీడియా సంస్థ తెలిపింది.షెడ్యూల్ ఇదే కాగా తమ దేశంలోని పరిస్థితుల దృష్ట్యా అఫ్గనిస్తాన్ 2019లో భారత్ వేదికగా వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. నాడు విండీస్‌తో టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లు ఆడింది అఫ్గనిస్తాన్. లక్నోలోని ఏకనా స్టేడియం ఇందుకు వేదికైంది.ఈసారి యూపీ వేదికగా మరోసారి బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు సిద్ధమైంది. జూలై 25 నుంచి ఆగష్టు 6 వరకు ఈ సిరీస్ సాగనుంది. జూలై 25న మొదటి వన్డే, జూలై 27న రెండో వన్డే, జూలై 30న మూడో వన్డే... ఆగష్టు 2, 4, 6 తేదీల్లో టీ20 సిరీస్ ఆడనుంది.అఫ్గన్ సిరీస్ తర్వాత టీమిండియా కాన్పూర్‌లో ఇక ఈ ఏడాది స్వదేశంలో టీమిండియా బంగ్లాదేశ్‌తో సెప్టెంబరులో టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు (సెప్టెంబరు 19–23)చెన్నైలో జరుగనుండగా.. రెండో టెస్టు (సెప్టెంబరు 27–అక్టోబర్ 1)కు కాన్పూర్ వేదిక కానుంది.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024తో బిజీగా ఉన్న టీమిండియా.. సూపర్-8లో తమ తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసింది. సెమీస్ లక్ష్యంగా శనివారం బంగ్లాదేశ్‌తో తమ రెండో మ్యాచ్‌లో తలపడనుంది. -
CWC 2023 AFG VS BAN: ఇదేం గ్రౌండ్ రా సామీ.. ఇసుక దిబ్బలే నయం..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా నిన్న (అక్టోబర్ 7) ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మెహది హసన్ మీరజ్ ఆల్‌రౌండర్ షోతో (9-3-25-3, 57) అదరగొట్టి బంగ్లాదేశ్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. కాగా, మ్యాచ్ అనంతరం ధర్మశాల మైదానంపై సోషల్‌మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బౌండరీ లైన్ వద్ద గ్రౌండ్ పరిస్థితిని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రౌండ్ కంటే ఇసుక, బుడద దిబ్బలు నయమని అంటున్నారు. గ్రౌండ్ పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్న ఓ వీడియోను (బౌండరీ లైన్ వద్ద ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఫీల్డింగ్ చేస్తూ కిందపడ్డ వీడియోను) వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే గ్రౌండ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది. This happened in Dharamsala today! How did the ICC deem this ground fit enough to host a World Cup match 🤦🏼♂️🤦🏼♂️I hope Mujeeb Ur Rahman isn't badly hurt. Crazy 🙏🏼 #CWC23 #WorldCup2023 pic.twitter.com/P5XpwLHmte— Farid Khan (@_FaridKhan) October 7, 2023 వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్లో మ్యాచ్ నిర్వహించేందుకు ఈ గ్రౌండ్‌కు ఐసీసీ ఎలా అనుమతి ఇచ్చిందని క్రికెట్ ఫాలోవర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీస ప్రమాణాలు లేని బుడద మైదానంలో మ్యాచ్‌ను నిర్వహించడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఈ విషయంలో జనాలు బీసీసీఐని నిందిస్తున్నారు. కాగా, ధర్మశాల మైదానం హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎత్తైన కొండ ప్రాంతంలో ఉందన్న విషయం తెలిసిందే. ఇక్కడ వాతావరణం ఎప్పుడూ శీతలంగా ఉంటుంది. ఇక్కడ ఎండ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే ఈ మైదానం కాస్త స్టికీగా ఉంటుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్.. ఇవాళ (అక్టోబర్ 8) తమ తొలి మ్యాచ్‌ను ఆడనున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభంకానుంది. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు పూర్తైన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో నెదార్లండ్స్‌పై పాక్ సూపర్ విక్టరీ సాధించింది. నిన్న జరిగిన 2 మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్.. శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయాలు నమోదు చేశాయి. -
WC 2023: షకీబ్ రెండోసారి! 156 పరుగులకే కుప్పకూలిన అఫ్గనిస్తాన్
ICC Cricket World Cup 2023 - Bangladesh vs Afghanistan: వన్డే వరల్డ్‌కప్-2023లో తమ ఆరంభ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ 156 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి తాళలేక బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 37.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ధర్మశాల వేదికగా శనివారం టాస్ ఓడిన అఫ్గాన్.. బంగ్లా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ల శుభారంభం.. ఆ తర్వాత ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ 47, ఇబ్రహీం జద్రాన్ 22 పరుగులతో శుభారంభం అందించారు. వీరిద్దరు అవుటైన తర్వాత ఆఫ్గన్ ఇన్నింగ్స్ పతనం ఆరంభమైంది. బంగ్లాదేశ్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. పెవిలియన్‌కు క్యూ కట్టారు ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన రహ్మత్ షా 18, ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ హష్మతుల్లా షాహిది 18, నజీబుల్లా జద్రాన్ 5, మహ్మద్ నబీ 6, అజ్మతుల్లా ఒమర్జాయ్ 22, రషీద్ ఖాన్ 9, ముజీబ్ ఉర్ రహమాన్ 1 పరుగు తీయగా.. నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారుకీ డకౌట్లుగా వెనుదిరిగారు. షోరిఫుల్ ఇస్లాం.. నవీన్‌ను బౌల్డ్ చేయడంతో ఆఫ్గన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 156 పరుగులకే హష్మతుల్లా బృందం చాపచుట్టేసింది. కాగా ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు బౌల్డ్ కావడం గమనార్హం. ఇక బంగ్లా బౌలర్లలో స్పిన్నర్లు కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు 3, మెహిదీ హసన్ మిరాజ్‌కు 3 వికెట్లు దక్కగా.. పేసర్లు ముస్తాఫిజుర్ రహ్మాన్ ఒకటి, షోరిఫుల్ ఇస్లాం 2, టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీశారు. వరల్డ్‌కప్ టోర్నీలో అఫ్గన్‌తో మ్యాచ్ అంటే షకీబ్ తగ్గేదేలే! ధర్మశాలలో అఫ్గనిస్తాన్‌తో తాజా మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. గతంలో 2015, 2019 ప్రపంచకప్ ఈవెంట్లలో కాన్బెర్రా, సౌతాంప్టన్ మ్యాచ్‌లలో అఫ్గన్‌పై వరుసగా 2/43, 5/29 బౌలింగ్ ఫిగర్స్ సాధించాడు. ఈ క్రమంలో అఫ్గన్‌పై ఐసీసీ ఈవెంట్లో రెండోసారి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: WC 2023: ఆసీస్‌తో మ్యాచ్‌కు గిల్ దూరం.. రోహిత్‌కు జోడీగా ఇషాన్ ఫిక్స్! -
WC 2023 AFG Vs BAN: అఫ్గనిస్తాన్‌పై బంగ్లాదేశ్ గెలుపు
ICC Cricket World Cup 2023- Bangladesh vs Afghanistan, 3rd Match Updates: 156 పరుగులకు ఆఫ్గనిస్తాన్ ఆలౌట్.. లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. ధర్మశాల మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను ఓడించి తొలి విజయం నమోదు చేసింది. 22 ఓవర్లలో బంగ్లా స్కోరు: 99/2 మిరాజ్, షాంటో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ డౌన్ 6.4: ఫరూకీ బౌలింగ్‌లో లిటన్ దాస్ బౌల్డ్(13) 4.1: ఫరూకీ బౌలింగ్‌లో తాంజిద్ హసన్(5) రనౌట్. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్. 37.2: ఆఫ్గనిస్తాన్ ఆలౌట్ నవీన్ ఉల్ హక్ రూపంలో ఆఫ్గాన్ పదో వికెట్ కోల్పోయింది. దీంతో బంగ్లాతో మ్యాచ్‌లో 37.2 ఓవర్లలో 156 పరుగులకే ఆఫ్గనిస్తాన్ ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బంగ్లాదేశ్ ఛేదనకు దిగనుంది. 36.3: తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆఫ్గాన్ ఆఫ్గనిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 156 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. మిరాజ్ బౌలింగ్‌లో ముజీబ్ అవుట్ కావడంతో ఫారూకీ క్రీజులోకి వచ్చాడు బంగ్లా బౌలర్ల దెబ్బకు ఆఫ్గాన్ బ్యాటర్లు విలవిల 35.2: షోరిఫుల్లా ఇస్లాం బౌలింగ్‌లో ఒమర్జాయ్(22) బౌల్డ్. ఎనిమిదో వికెట్ డౌన్. స్కోరు: 156/8 (35.2) 34.2: ఏడో వికెట్ కోల్పోయిన ఆఫ్గాన్ మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్(9) బౌల్డ్. స్కోరు: 150/7 (34.2). ఒమర్జాయ్ 17, ముజీబ్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు 29.6: కష్టాల్లో ఆఫ్గాన్.. 30 ఓవర్లలో స్కోరు ఎంతంటే టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో మహ్మద్ నబీ(6) బౌల్డ్. స్కోరు: 126/6 (30) 28.4: ఐదో వికెట్ డౌన్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్ నజీబుల్లా(5) అవుట్. ఐదో వికెట్ కోల్పోయిన ఆఫ్గనిస్తాన్. స్కోరు: 123-5(29) 25.2: నాలుగో వికెట్ కోల్పోయిన ఆఫ్గన్ నిలకడగా ఆడుతున్న గుర్బాజ్(47)ను ముస్తాఫిజుర్ పెవిలియన్‌కు పంపాడు. స్కోరు: 112-4(26) 24.4: మూడో వికెట్ కోల్పోయిన ఆఫ్గనిస్తాన్ మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో షాహిది(18) అవుట్. స్కోరు: 112/3 (24.5) 23 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 106/2 23 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్(47), హస్మతుల్లా షాహిదీ(13) ఉన్నారు. సెకెండ్ వికెట్ డౌన్.. 83 పరుగుల వద్ద ఆఫ్గానిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రెహమత్షా.. షకీబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 86/2 తొలి వికెట్ కోల్పోయిన ఆఫ్గానిస్తాన్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గానిస్తాన్ 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్.. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రెహమత్ షా వచ్చాడు. 5 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 27/1 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గానిస్తాన్ నిలకడగా ఆడుతోంది. 5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా ఆఫ్గాన్ 27 పరుగులు చేసింది. క్రీజులో రహ్మతుల్లా గుర్భాజ్(9), ఇబ్రహీం జద్రాన్(16) పరుగులతో ఉన్నారు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా ఆఫ్గానిస్తాన్- బంగ్లాదేశ్ జట్లు తలపడతున్నాయి. ఇరు జట్లుకు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా రెండు వామప్ మ్యాచ్‌లకు దూరమైన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తిరిగి అందుబాటులోకి వచ్చాడు. తుది జట్లు ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫరూఖీ బంగ్లాదేశ్ : తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్ -
వన్డేల్లో అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
అంతర్జాతీయ వన్డేల్లో ఆఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా రెండు సార్లు హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ముజీబ్ నిలిచాడు. ఆసియాకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌వికెట్‌గా ఔటైన ముజీబ్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 45 ఓవర్ వేసిన తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మరి ముజీబ్ హిట్‌వికెట్‌గా ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌తో ఆడిన వన్డేలో కూడా ముజీబ్ హిట్ వికెట్‌గానే వెనుదిరిగాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లా చేతిలో 89 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ ఓటమి పాలైంది. అదే విధంగా ఈ విజయంతో బంగ్లాదేశ్ తమ సూపర్- ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఇక మంగళవారం లాహోర్‌లో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ గెలిస్తే మాత్రం బంగ్లాదేశ్‌తో కలిసి ఈ మూడు జట్లు రెండు పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఈ సమయంలో మెరుగైన రన్‌రేట్ ఉన్న రెండు జట్లు ‘సూపర్–4’ దశకు అర్హత సాధిస్తాయి. చదవండి: Asia Cup 2023: ఆసియాకప్ మ్యాచ్‌లపై నీలినీడలు.. ఇది నాకు ముందే తెలుసు! చెత్త కారణాలు చెప్పారు -
Asia Cup 2023: శతకాల మోత మోగించిన బంగ్లాదేశ్ బ్యాటర్లు.. భారీ స్కోర్
ఆసియా కప్-2023లో భాగంగా లాహోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. మెహిది హసన్ మీరజ్ (119 బంతుల్లో 112; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హసన్ షాంటో (105 బంతుల్లో 104; 9 ఫోర్లు, సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. మీరజ్, షాంటోలు తమతమ వన్డే కెరీర్లలో రెండో సెంచరీలు నమోదు చేసి, తమ జట్టు భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు. 112 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మీరజ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.. 104 పరుగులు చేసి షాంటో రనౌటయ్యాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ నైమ్ (28), ముష్ఫికర్ రహీం (25), షకీబ్ అల్ హసన్ (32 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. తౌహిద్ హ్రిదోయ్ డకౌటై నిరాశపరిచాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టగా.. షాంటో, ముష్ఫికర్, షమీమ్ (11) రనౌట్లయ్యారు. కాగా, ఈ టోర్నీలో నిలబడాలంటే బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఆ జట్టు తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌కు సైతం ఈ మ్యాచ్ చాలా కీలకమనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు గెలిస్తే.. తదుపరి శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో సంబంధం లేకుండా సూపర్-4కు చేరుకుంటుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన శ్రీలంక సూపర్-4 బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్ ఇదివరకే సూపర్-4కు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై నెగ్గిన ఆ జట్టు.. నిన్న (సెప్టెంబర్ 2) టీమిండియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ (మొత్తంగా 3 పాయింట్లు) ఖాతాలో వేసుకుని తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. పాక్‌తో మ్యాచ్ రద్దు కావడంతో భారత్‌కు సైతం ఓ పాయింట్ దక్కింది. రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్.. నేపాల్‌పై గెలిస్తే సూపర్-4కు చేరుకుంటుంది. -
ఆఫ్గానిస్తాన్‌తో బంగ్లాదేశ్ కీలక పోరు.. ఓడితే ఇంటికే!
ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో బంగ్లాదేశ్ ఆదివారం అఫ్గానిస్తాన్‌తో కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్ ‘బి’ నుంచి సూపర్–4కు ముందంజ వేయాలంటే బంగ్లాదేశ్ ఇందులో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా మధ్యహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో శ్రీలంక చేతిలో బోల్తా పడిన షకీబుల్ బృందం అఫ్గాన్‌తో జరిగే పోరులో పుంజుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమిపాలైతే టోర్నీ నుంచే నిష్కమ్రించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు యేటికేడు రాటుదేలుతున్న అఫ్గానిస్తాన్ తమదైన రోజున ఎంతటి ప్రత్యర్ధినైనా కంగుతినిపించగలదు. ఇదే నమ్మకంతో ఆదివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో శుభారంభం ఇవ్వాలనే లక్ష్యంతో అఫ్గాన్ బరిలోకి దిగనుంది. కాగా ఈ టోర్నీకి ముందు పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆఫ్గానిస్తాన్ ఓటమి పాలైంది. సిరీస్ ఓటమితో ఆసియాకప్ టోర్నీలోకి ఆఫ్గాన్ అడుగుపెట్టింది. తుది జట్లు(అంచనా) బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్, అనాముల్ హక్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆఫ్గానిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూకీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, గుల్బాదిన్ నాయబ్/కరీం జనత్, మహ్మద్ సలీమ్ సఫీ చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్ -
పుండు మీద కారం చల్లినట్లు..హెడ్‌కోచ్, ఆటగాడిని శిక్షించిన ఐసీసీ
రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్.. బంగ్లాదేశ్‌కు కోల్పోయిన సంగతి తెలిసిందే. సిరీస్ ఓటమితో బాధలో ఉన్న ఆఫ్గన్‌కు మరో గట్టిషాక్ తగిలింది. జట్టు హెడ్‌కోచ్ జొనాథన్ ట్రాట్‌తో పాటు ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జైయ్లకు ఐసీసీ శిక్షించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి(Code Of Conduct) లెవెల్-1 నిబంధన ఉల్లఘించినందుకు గానూ ఇద్దరిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన సమయంలో ఫీల్డ్ అంపైర్లు పిచ్‌ను పరిశీలించడానికి ఇన్స్పెక్షన్కు వచ్చారు. ఈ సమయంలో కోచ్ జొనాథన్ ట్రాట్ అంపైర్ల నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్టాడినట్లు తెలిసింది. ఈ మేరకు ఫీల్డ్ అంపైర్లు కోచ్ ట్రాప్‌పై రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఇక ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిర్ హృదయ్‌ను ఔట్ చేశాకా.. అజ్మతుల్లా ఒమర్జైయ్ హృదయ్‌ను టార్గెట్ చేస్తూ పరుష పదజాలం ఉపయోగిస్తూ పెవిలియన్ వైపు చేతిని చూపెట్టాడు. ఇది స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీంతో ఆర్టికల్ 2.5 ప్రకారం అజ్మతుల్లా ఐసీసీ నియమావళి నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. ఇద్దరికి ఇదే తొలి తప్పుగా భావించిన ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. 24 నెలల్లో మరోసారి ఇదే తప్పు చేస్తే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్స్ విధించే అవకాశం ఉంటుంది. ఇక షెల్లాట్ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్దతి) బంగ్లాదేశ్ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను తొలుత 17 ఓవర్లకు కుదించారు. మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అజ్మతుల్లా జజాయ్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లా బౌలర్లలో టాస్కిన్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజర్ రెహమన్, షకీబ్ అల్ హసన్‌లు తలా రెండు వికెట్లు సాధించారు. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ టార్గెట్‌ను 119 పరుగులగా నిర్ణయించారు. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. బంగ్లా ఛేజింగ్‌లో లిటన్ దాస్(35), షకీబ్(18 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. ఇక సిరీస్ విజయంతో వన్డే సిరీస్ ఓటమికి బంగ్లాదేశ్ బదులు తీర్చకున్నట్లైంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో ఆఫ్గాన్ సొంతం చేసుకుంది. చదవండి: #MLC2023: దంచికొట్టిన సీఎస్కే ఓపెనర్.. సూపర్‌కింగ్స్‌కు రెండో విజయం CWG 2026: 'అంత బడ్జెట్ మావల్ల కాదు'.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం -
ఆఖరి టీ20లో ఆఫ్గానిస్తాన్ చిత్తు.. బంగ్లాదేశ్‌దే సిరీస్
షెల్లాట్ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్దతి) బంగ్లాదేశ్ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను తొలుత 17 ఓవర్లకు కుదించారు. మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో ఆజ్ముతుల్లా జాజాయ్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లా బౌలర్లలో టాస్కిన్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తిఫిజర్ రెహ్మాన్, షకీబ్ అల్హసన్ తలా రెండు వికెట్లు సాధించారు. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ టార్గెట్‌ను 119 పరుగులగా నిర్ణయించారు. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. బంగ్లా ఛేజింగ్‌లో లిటన్ దాస్(35), షకీబ్(18 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. ఇక సిరీస్ విజయంతో వన్డే సిరీస్ ఓటమికి బంగ్లాదేశ్ బదులు తీర్చకున్నట్లైంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో ఆఫ్గాన్ సొంతం చేసుకుంది. చదవండి: SL VS PAK 1st Test: కళ్లు చెదిరే క్యాచ్..! -
ఈజీగా గెలవాల్సిన మ్యాచ్.. చచ్చీ చెడీ చివరకు
ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన దశలో ఏ జట్టైనా ఈజీగా విజయం సాధిస్తుందని అందరం అనుకుంటాం. కానీ బంగ్లాదేశ్ జట్టు విషయంలో మాత్రం ఈ సీన్ రివర్స్ అయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఒత్తిడికి లోనయ్యి చచ్చీ చెడీ ఎలాగోలా నెగ్గింది. ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడంతో పాటు ఓటమి చేరువగా వచ్చి మళ్లీ గెలుపు రుచి చూసిన బంగ్లాదేశ్ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకుంది. శుక్రవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మహ్మద్ నబీ 40 బంతుల్లో 54 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. అజ్మతుల్లా 18 బంతుల్లో 33, నజీబుల్లా 23 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు తీయగా.. నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిపుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్, మెహదీ హసన్ మిరాజ్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. తౌహిద్ చౌదరీ 47 పరుగులు చేయగా.. షమీమ్ హొసెన్ 33 పరుగులు చేశాడు. ఆఫ్గన్ బౌలర్లలో కరీమ్ జనత్ మూడు వికెట్లు తీశాడు. 19 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. విజయానికి కేవలం ఆరు పరుగులు మాత్రమే అవసరం. ఈ నేపథ్యంలోనే ఆఖరి ఓవర్ వేసిన ఆఫ్గన్ బౌలర్ కరీమ్ జనత్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతిని మిరాజ్ ఫోర్ బాదడంతో చివరి ఐదు బంతుల్లో రెండు పరుగులు వస్తే చాలు. కానీ తర్వాతి మూడు బంతులకు వరుసగా మిరాజ్, తస్కిన్ అహ్మద్ నసుమ్ అహ్మద్‌లను ఔట్ చేసి కరీమ్ జనత్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. అయితే ఓవర్ ఐదో బంతికి ఫోర్ బాది బంగ్లాకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు షోరిపుల్ ఇస్లామ్. ఈ విజయంతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. This over had more drama than a daily soap 🎢 pic.twitter.com/jxM2zt1CfP — FanCode (@FanCode) July 14, 2023 చదవండి: #ViratKohli: ఆనందంతో చిందులు.. లోకం సంగతి మైమరిచిన కోహ్లి IND Vs WI 2023: ఏంటి కిషన్.. తొలి మ్యాచ్‌లోనే ఇలా అయితే ఎలా? తెల్లముఖం వేశావుగా -
సొంతగడ్డపై బంగ్లాకు దారుణ పరాభవం.. వన్డే సిరీస్ ఆఫ్గన్‌దే
బంగ్లాదేశ్‌కు వారి సొంతగడ్డపైనే అఫ్గానిస్తాన్ షాకిచ్చింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్తాన్ 142 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆఫ్గన్ బౌలర్ల ధాటికి 43.2 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. ముష్ఫికర్ రహీమ్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెహదీ హసన్ మిరాజ్ 25 పరుగులు చేశాడు. ఆఫ్గన్ బౌలర్లలో ఫజల్లా ఫరుకీ, ముజీబ్ ఉర్ రెహమాన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు, మహ్మద్ నబీ ఒక వికెట్ పడగొట్టాడు. వన్డే చరిత్రలో పరుగుల పరంగా అఫ్గానిస్తాన్‌కు ఇది మూడో అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇక మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో అఫ్గానిస్తాన్ కైవసం చేసుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్(125 బంతుల్లో 145 పరుగులు, 13 ఫోర్లు, 8 సిక్సర్లు), ఇబ్రహీం జర్దన్(119 బంతుల్లో 100 పరుగులు, 9 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో చెలరేగారు.వీరి తర్వాత మహ్మద్ నబీ చివర్లో 15 బంతుల్లో 25 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, హసన్ ముహ్మద్, షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. ఎబాదత్ హొసెన్ ఒక వికెట్ తీశాడు. What a Win! 🙌#AfghanAtalan have opened a new chapter in 🇦🇫 Cricket History by securing their first-ever ODI series with successive wins over Bangladesh. 💪 Congratulations to AfghanAtalan and the whole Afghan Nation for an incredible achievement. 👏🤩#BANvAFG | #XBull pic.twitter.com/8LOGortG2I — Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023 🚨 RESULT | AFGHANISTAN WON BY 142 RUNS#AfghanAtalan backed up their brilliant batting effort with a much better bowling performance to beat the @BCBtigers by 142 runs and secure their first-ever series victory over Bangladesh in the format. 🤩#BANvAFG2023 | #XBull pic.twitter.com/U3BSfIAtMI — Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023 చదవండి: #BANVsAFG: సెంచరీలతో చెలరేగిన ఆఫ్గన్ ఓపెనర్లు.. ప్రపంచ రికార్డు -
సెంచరీలతో చెలరేగిన ఆఫ్గన్ ఓపెనర్లు.. ప్రపంచ రికార్డు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్(125 బంతుల్లో 145 పరుగులు, 13 ఫోర్లు, 8 సిక్సర్లు), ఇబ్రహీం జర్దన్(119 బంతుల్లో 100 పరుగులు, 9 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరి ధాటికి అఫ్గానిస్తాన్ 400 పరుగులు దాటుతుందని అనిపించింది. కానీ స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔట్ కావడం.. తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. వీరి తర్వాత మహ్మద్ నబీ చివర్లో 15 బంతుల్లో 25 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, హసన్ ముహ్మద్, షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. ఎబాదత్ హొసెన్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తడబడుతోంది. ప్రస్తుతం 8 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 25 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. ఇక అఫ్గానిస్తాన్ ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడమే కాకుండా ప్రపంచ రికార్డుతో మెరిశారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ► రహమనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దన్‌లు తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 256 పరుగులు జోడించారు. అఫ్గాన్ వన్డే చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకముందు 2010లో స్కాట్లాండ్పై కరీమ్ సాదిక్, మహ్మద్ షెహజాద్‌లు రెండో వికెట్‌కు 218* పరుగులు జోడించి రెండో స్థానంలో ఉన్నారు.2010లోనే షార్జా వేదికగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షెహజాద్, నూర్ అలీ జర్దన్‌లు రెండో వికెట్‌కు 205 పరుగులు జోడించి మూడో స్థానంలో ఉన్నారు. ► ఇక ఓవరాల్‌గా అఫ్గాన్ క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో పరిశీలిస్తే 256 పరుగుల భాగస్వామ్యం రెండో అత్యధికంగా ఉంది. ఇక మొదటి స్థానంలో అస్గర్ అప్గన్, హస్మతుల్లా షాహిది జోడి ఉంది. ఈ జోడి 2021లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో నాలుగో వికెట్‌కు 307 పరుగులు జోడించారు. ► ఇక వన్డే క్రికెట్లో బంగ్లాదేశ్‌పై ఏ జట్టుకైనా ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకముందు 2022లో టీమిండియా నుంచి కోహ్లి, ఇషాన్ కిషన్ల జోడి రెండో వికెట్‌కు 290 పరుగులు జోడించి తొలి స్థానంలో ఉన్నారు. The moment @RGurbaz_21 reached his 4th ODI hundred! 🤩#AfghanAtalan | #BANvAFG2023 | #XBull pic.twitter.com/0AmNoEtGol — Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023 When @IZadran18 brought up his 4th ODI hundred! 🤩#AfghanAtalan | #BANvAFG2023 | #XBull pic.twitter.com/Lv1eV610cg — Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023 చదవండి: విలన్‌గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్షాపులో డబ్బులు ఎగ్గొట్టి -
ఆఫ్గాన్‌తో వైట్‌బాల్ సిరీస్‌లు.. బంగ్లా జట్టు ప్రకటన! స్టార్ బౌలర్ వచ్చేశాడు
ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన రెండు వేర్వేరు జట్లను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. వన్డే సిరీస్‌కు తమీమ్ ఇక్భాల్ సారధ్యం వహించనుండగా.. టీ20 సిరీస్‌లో బంగ్లా జట్టును షకీబ్ అల్ హసన్ జట్టును నడిపించనున్నాడు. కాగా గత కొన్ని సిరీస్‌లుగా జట్టుకు దూరంగా ఉన్న అఫీఫ్ హొస్సేన్ ఆఫ్గాన్ సిరీస్‌తో రి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడితో పాటు ఎబాడోత్ హొస్సేన్కు కూడా వన్డే, టీ20 జట్టులో చోటు దక్కింది. అదే విధంగా గాయం కారణంగా జట్టుగా దూరంగా ఉన్న స్టార్ పేసర్ టాస్కిన్ అహ్మద్ కూడా ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. ఇక స్వదేశంలో మూడు వన్డేలు, రెండు టీ20ల్లో ఆఫ్గాన్‌తో బంగ్లా జట్టు తలపడనుంది. జూలై 5, 8, 11 తేదీల్లో చటోగ్రామ్ వేదికగా వన్డే సిరీస్ జరగనుండగా.. జూలై 12, 14 తేదీల్లో సిల్హెట్లో రెండు టీ20లు జరగనున్నాయి. కాగా ఇదే ఆఫ్గాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రత్మాక విజయం సాధించిన సంగతి తెలిసిందే. 546 పరుగుల తేడాతో అత్యంత భారీ విజయాన్ని బంగ్లా మూటగట్టుకుంది. 21వ శతాబ్దంలో టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్‌దే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఆఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లా జట్టు తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, అఫీఫ్ హుస్సేన్, మహ్మద్ నయీమ్ ఆఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లా జట్టు షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్, రోనీ తాలూక్దార్, నజ్ముల్ హుస్సేన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహ్మద్, తస్కిన్ అహ్మద్, , ఎబాడోత్ హోస్సేన్, రిషాద్ హొస్సేన్, అఫీప్ హోస్సేన్ చదవండి: రోహిత్ ఫామ్‌లోకి రావాలంటే అదొక్కటే మార్గం: స్మిత్ -
546 పరుగులతో బంగ్లా గెలుపు.. 21వ శతాబ్దంలో అతిపెద్ద విజయం
బంగ్లాదేశ్ తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అప్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో 546 పరుగుల తేడాతో అత్యంత భారీ విజయాన్ని మూటగట్టుకుంది. 662 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గన్ చివరి బ్యాటర్ జహీర్ ఖాన్ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్ మూడు, మెమదీ హసన్ మిరాజ్, ఎబాదత్ హొసెన్‌లు చెరొక వికెట్ పడగొట్టారు. ఇక టెస్టు క్రికెట్లో పరుగుల పరంగా బంగ్లాదేశ్ జట్టుకు తొలి అతిపెద్ద విజయం కాగా.. ఓవరాల్‌గా మూడో అతిపెద్ద విజయం. కాగా 21వ శతాబ్దంలో బంగ్లాదేశ్‌దే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇంతకముందు 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 675 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను(1932లో) ఓడించి రెండో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. తాజాగా బంగ్లాదేశ్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల తర్వాత పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. అంతకముందు బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 425 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో(146 పరుగులు) మెరిసిన నజ్ముల్ హొసెన్ షాంటో రెండో ఇన్నింగ్స్‌లోనూ(124 పరుగులు) సెంచరీతో మెరవగా.. మోమినుల్ హక్ కూడా సెంచరీ(121 పరుగులు నాటౌట్) మార్క్ అందుకున్నాడు. అంతకముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులకు ఆలౌట్ కాగా.. అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. అఫ్గానిస్తాన్: తొలి ఇన్నింగ్స్ : 146 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 115 ఆలౌట్ బంగ్లాదేశ్: తొలి ఇన్నింగ్స్: 382 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 425/4 డిక్లేర్ ఫలితం: 546 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం Walton Test Match: Bangladesh vs Afghanistan | Only Test | Day 04 Bangladesh won by 546 runs. Full Match Details: https://t.co/MDvtIwN35K#BCB | #Cricket | #BANvAFG pic.twitter.com/sk24j4tteZ — Bangladesh Cricket (@BCBtigers) June 17, 2023 చదవండి: 'వరల్డ్‌కప్ ఆడతామో లేదో'.. పూటకో మాట మారిస్తే ఎలా? -
ఆఫ్గన్‌తో ఏకైక టెస్టు.. చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ నజ్ముల్ హొసెన్ షాంటో చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన షాంటో 175 బంతుల్లో 146 పరుగులు చేశాడు.. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 115 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న షాంటో ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నజ్ముల్ షాంటో ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. బంగ్లాదేశ్ తరపున ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకముందు మోమినుల్ హక్ 2018లో శ్రీలంకతో చిట్టగాంగ్ వేదికగా జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 176, రెండో ఇన్నింగ్స్‌లో 105 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో అఫ్గానిస్తాన్ జట్టుపై ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా షాంటో నిలిచాడు. ఇక ఓవరాల్ టెస్టు క్రికెట్ జాబితాలో నజ్ముల్ హొసెన్ షాంటో 91వ క్రికెటర్‌గా నిలిచాడు. ఇక టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ భారీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌట్ అయిన ఆఫ్గన్‌ను ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లా మూడోరోజు ఆటలో లంచ్ విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. షాంటో 112, మోమినుల్ హక్ 43 పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 491 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండురోజులు మిగిలి ఉండడంతో బంగ్లాదేశ్ భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు -
ఆఫ్గాన్ పేసర్ అరుదైన రికార్డు.. తొలి బౌలర్‌గా
ఆఫ్గానిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ నిజత్ మసూద్ తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు. 16 ఓవర్లలో 72 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో నిజత్ మసూద్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి ఆఫ్గాన్ ఫాస్ట్‌బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతకుముందు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లోనే తొలి బంతికే వికెట్ తీసిన ఏడో బౌలర్‌గా నిజత్ మసూద్ రికార్డులకెక్కాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆట సమయానికి ఆ జట్టు 370 పరుగుల ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్‌ను (134/1) కొనసాగిస్తోంది. మహ్మదుల్ హసన్ జాయ్ (17) ఔట్ కాగా.. జకీర్ హసన్ (54), నజ్ముల్ హసన్ షాంటో (54) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకు చాపచుట్టేసింది. బంగ్లా బౌలర్లలో ఎబాదత్ హొసేన్ (4/47), షొరీఫుల్ ఇస్లాం (2/28), తైజుల్ ఇస్లాం (2/7), మెహిది హసన్ మీరజ్ (2/15) అద్భుతంగా రాణించారు చదవండి: Asia Cup 2023: ఆసియాకప్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాళ్లు వచ్చేస్తున్నారు! -
ఆఫ్గాన్ పేసర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే ఏడో బౌలర్‌గా
టెస్టుల్లో ఆఫ్గానిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ నిజత్ మసూద్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లోనే తొలి బంతికే వికెట్ తీసిన ఏడో బౌలర్‌గా నిజత్ మసూద్ రికార్డులకెక్కాడు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న ఏకైక టెస్టులో జకీర్ హసన్‌ను ఔట్ చేసిన మసూద్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (1991), నీలేష్ కులకర్ణి (1997), చమిలా గమగే (2002),నాథన్ లియోన్ (2011), షామిందా ఎరంగా (2011), డేన్ పీడ్ట్ (2014), హార్డస్ విల్జోయెన్ (2016) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆఫ్గాన్‌పై బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో(146) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు ఓపెనర్ మహ్మదల్ హసన్(76) పరుగులతో చెలరేగాడు. ప్రస్తుతం క్రీజులో ముష్ఫికర్ రహీం(41), మెహిదీ హసన్ మిరాజ్(43) పరుగులతో ఉన్నారు. చదవండి: IND vs WI: విండీస్ టూర్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న ప్లేయర్లెవరు? జైశ్వాల్‌తో సహా -
చెలరేగిన నబీ, నిప్పులు చెరిగిన ఫరూఖీ.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన అఫ్ఘాన్
T20 WC Warm Up Matches: టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన మూడో వార్మప్ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఆతిధ్య ఆస్ట్రేలియాను మట్టికరిపించగా.. రెండో మ్యాచ్‌లో పాక్‌పై ఇంగ్లండ్ సునాయాస విజయం సాధించింది. బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడో మ్యాచ్‌లో అప్ఘాన్ జట్టు అద్భుతమైన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో చెలరేగి తమకంటే మెరుగైన బంగ్లాదేశ్‌ను 62 పరుగుల భారీ తేడాతో ఓడించి శభాష్ అనిపించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇబ్రహీమ్ జద్రాన్ (39 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ నబీ (17 బంతుల్లో 41 నాటౌట్; ఫోర్, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ అహ్మద్, షకీబ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఫజల్ హాక్ ఫారూఖీ (3/9), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (1/5), మహ్మద్ నబీ (1/11) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 98 పరుగులకు మాత్రమే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఆద్యంతం బంగ్లా బ్యాటింగ్ చెత్తగా సాగింది. -
Asia Cup: ఇంకో 10 పరుగులు చేసినా బాగుండు.. ఇప్పుడు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి
Asia Cup 2022 Bangladesh vs Afghanistan: ఆసియా కప్-2022 టోర్నీలో అఫ్గనిస్తాన్ అదరగొడుతోంది. ఈ మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన నబీ బృందం... మంగళవారం(ఆగష్టు 30) బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. షార్జా వేదికగా సాగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తద్వారా గ్రూప్- బి టాపర్‌గా నిలిచి సూపర్ 4కు అర్హత సాధించింది. మరోవైపు.. బంగ్లాదేశ్.. శ్రీలంకతో మ్యాచ్‌లో గెలిస్తే తప్ప రేసులో నిలవలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ చేతిలో ఓటమి అనంతరం బంగ్లా ఆల్‌రౌండర్ ముసాదిక్ హొసేన్ మాట్లాడుతూ.. తమ జట్టు కనీసం 140 పరుగులు నమోదు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ ఘోర ఓటమి కారణంగా తదుపరి మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోక తప్పని స్థితికి చేరుకున్నామని పేర్కొన్నాడు. ఈ మేరకు హొసేన్ మాట్లాడుతూ.. ‘‘టీ20 మ్యాచ్‌లలో ఆరంభంలోనే అంటే పవర్ ప్లేలో రెండు, మూడు వికెట్లు కోల్పోయామంటే పరిస్థితులు కఠినంగా మారతాయి. ఒకవేళ మేము 140 పరుగులైనా చేసి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి చేజారింది. తదుపరి మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. మా బ్యాటింగ్ ఆర్డర్ రాణిస్తే బాగుండేది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా సెప్టెంబరు 1న శ్రీలంకతో బంగ్లాదేశ్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఇక బంగ్లాదేశ ఇటీవలి కాలంలో వెస్టిండీస్, జింబాబ్వేతో వరుసగా టీ20 సిరీస్‌లలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. మరోవైపు.. ఐర్లాండ్‌కు టీ20 సిరీస్ కోల్పోయి.. ఆ వెంటనే యూఏఈకి చేరుకున్న అఫ్గనిస్తాన్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో వరుస విజయాలు నమోదు చేయడం విశేషం. మ్యాచ్ ఇలా సాగింది( Afghanistan Beat Sri Lanka By 7 Wickets) అఫ్గాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అఫ్గన్ బౌలర్లు ముజీబ్ వుర్ రహ్మాన్ (3/16), రషీద్ ఖాన్ (3/22) స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఇద్దరూ కలిసి ఆరు వికెట్లు పడగొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో షకీబ్ అల్ హసన్ బృందం.. ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఆల్‌రౌండర్ ముసాదిక్ హొసేన్(31 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 13 ఓవర్లలో 3 వికెట్లకు 62 పరుగులే చేసి కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నజీబుల్లా (17 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించి మ్యాచ్‌ను తమవైపు తిప్పేశాడు. ఇక ఇబ్రహీమ్ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు చేసి అఫ్గన్‌ను గెలిపించాడు. బంగ్లాదేశ్ పతనాన్ని శాసించిన ముజీబ్ వుర్ రహ్మాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Asia Cup 2022 IND Vs HK: హాంకాంగ్‌తో మ్యాచ్.. భారీ విజయమే లక్ష్యంగా AUS Vs ZIM: జింబాబ్వేతో రెండో వన్డే.. మూడు గంటల్లో ముగించిన ఆసీస్ د بریا شېبې 😍 ----- لحظات پیروزی 🥰 ----- Winning Moments 🤩#AfghanAtalan | #AsiaCup2022 pic.twitter.com/RsBlL0Cpbb — Afghanistan Cricket Board (@ACBofficials) August 30, 2022 -
బంగ్లాపై విజయం.. రషీద్ ఖాన్ ఖాతాలో కొత్త రికార్డు
అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టి20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఆసియాకప్‌లో మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయడం ద్వారా అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాతో మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రషీద్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు రషీద్ ఖాన్ 112 వికెట్లతో ఉన్నాడు. ముష్ఫికర్ రహీమ్, అఫిప్ హొస్సేన్, మహ్మదుల్లా రూపంలో మూడు వికెట్లతో.. మొత్తంగా 68 మ్యాచ్‌ల్లో 115 వికెట్లు సాధించి న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీని(114 వికెట్లు) అధిగమించాడు. కాగా రషీద్ కంటే ముందు బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 122 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. రెండు విజయాలతో అఫ్గానిస్తాన్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. గురువారం శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ‘సూపర్–4’ రెండో బెర్త్ ఖరారవుతుంది. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 127 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముజీబ్ వుర్ రహ్మాన్ (3/16), రషీద్ ఖాన్ (3/22) తిప్పేశారు. ముసాదిక్ (31 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం అఫ్గానిస్తాన్ 13 ఓవర్లలో 3 వికెట్లకు 62 పరుగులే చేసింది. లక్ష్యంలో సగం స్కోరైనా చేయలేదు. ఈ దశలో నజీబుల్లా (17 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇబ్రహీమ్ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు చేసి గెలిపించాడు. చదవండి: Ravindra Jadeja: 'సాంపుల్ మాత్రమే.. అంతకంటే ఘోరమైనవి చాలానే చూశా' AFG Vs BAN: అఫ్గన్‌తో మ్యాచ్.. అరుదైన ఘనత అందుకోనున్న బంగ్లా కెప్టెన్ -
Asia Cup 2022: బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం
బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకను చిత్తు చేసి ఆఫ్ఘనిస్థాన్.. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో కేవలం 127 పరుగులు చేయడంతో ఆఫ్ఘన్ బ్యాటర్లు మొదటి నుంచి ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 9 బంతులు మిగిలి ఉండగానే.. 128 రన్స్ టార్గెట్‌ను 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ గెలుపొందింది. రెండో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘన్ 10వ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మొసద్దెక్ హొసేన్ బౌలింగ్‌లో హజ్రతుల్లా జజాయ్ (23) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 9.2 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 45/2. ఆచితూచి ఆడుతున్న ఆఫ్ఘాన్ స్వల్ప లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఆచితూచి ఆడుతుంది. 8 ఓవర్ల ముగిసే సమాయానిఆ జట్టు స్కోర్ 37/1గా ఉంది. హజ్రతుల్లా జజాయ్ (17), ఇబ్రహీమ్ జద్రాన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆఫ్ఘానిస్తాన్ 128 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘానిస్తాన్ ఐదో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. షకీబ్ బౌలింగ్‌లో ఓపెనర్ గుర్బాజ్ (11) స్టంప్ అవుటయ్యాడు. 4.1 ఓవర్ల తర్వాత ఆఫ్ఘానిస్తాన్ స్కోర్ 15/1. బంగ్లాను నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేసిన ఆఫ్ఘన్ స్పిన్నర్లు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు బంగ్లాదేశ్‌ను నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేశారు. ముజీబ్, రషీద్ ఖాన్లు తలో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లా నడ్డి విరిచారు. వీరిద్దరి ధాటికి బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులకే పరిమితమైంది. మొసద్దెక్ హొసేన్ (48 నాటౌట్) రాణించడంతో బంగ్లా జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రషీద్ ఖాతాలో మరో వికెట్ ఆఫ్ఘన్ స్పిన్నర్లలో తొలుత ముజీబ్.. ఆతర్వాత రషీద్ ఖాన్ రెచ్చిపోయారు. 16వ ఓవర్లో రషీద్.. మహ్మదుల్లాను (25) ఔట్ చేయడం ద్వారా 3 వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 16 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 95/6. 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఆఫ్ఘన్ స్పిన్నర్లు ముజీబ్, రషీద్ ఖాన్ల ధాటికి బంగ్లాదేశ్ జట్టు విలవిలలాడుతుంది. ఆ జట్టు 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను దాదాపు ఆఫ్ఘనిస్తాన్ చేతికి అప్పగించింది. 11వ ఓవర్లో రషీద్ ఖాన్.. అఫీఫ్ హొసేన్‌ను (12) ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ముచ్చెమటలు పట్టిస్తున్న ఆఫ్ఘన్ స్పిన్నర్లు ఆఫ్ఘన్ స్పిన్నర్లు ముజీబ్, రషీద్ ఖాన్లు బంగ్లాదేశ్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వీరిద్దరు బంగ్లా ఆటగాళ్లను కుదురుకోనీయకుండా వరుస క్రమంలో వికెట్లు పడగొడుతున్నారు. తొలుత ముజీబ్ రెచ్చిపోగా.. తాజాగా రషీద్ చెలరేగుతున్నాడు. 7వ ఓవర్లో రషీద్.. అద్భుతమైన గూగ్లీతో ముష్ఫికర్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెచ్చిపోతున్న ముజీబ్.. ఈసారి కెప్టెన్ బలి ఆఫ్ఘాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ బంగ్లా ఆటగాళ్లను బెంబేలెత్తిస్తున్నాడు. తాను వేసిన మూడు ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి బంగ్లా నడ్డి విరిచాడు. ఆరో ఓవర్లో ముజీబ్.. బంగ్లా కెప్టెన్ షకీబ్ (11)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 6 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 28/3. క్రీజ్‌లో ముష్ఫికర్ (1), అఫీఫ్ హొసేన్ (2) ఉన్నారు. బంగ్లాను మరో దెబ్బకొట్టిన ముజీబ్ రెండో ఓవర్లోనే ఓపెనర్ మహ్మద్ నయీమ్ (8)ను క్లీన్ బౌల్డ్ చేసిన ముజీబుర్ రెహ్మాన్.. నాలుగో ఓవర్లో మరో వికెట్ పడగొట్టాడు. ముజీబ్.. అనాముల్ హాక్ (5)ను ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 13 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్‌లో షకీబ్, ముష్ఫికర్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయింది. ముజీబుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో మహ్మద్ నయీమ్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో అనాముల్ హాక్ (1), కెప్టెన్ షకీబ్ ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆసియా కప్ 2022 గ్రూప్-బిలో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 30) బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకకు షాకిచ్చిన విషయం తెలిసిందే. తుది జట్లు.. ఆఫ్ఘనిస్తాన్: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, కరీం జనత్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫరూఖీ బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం (వికెట్‌కీపర్), మహ్మదుల్లా, మెహిది హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అఫీఫ్ హొసేన్, మహ్మద్ నయీం, అనాముల్ హాక్, మొసద్దెక్ హొసేన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్ -
అఫ్గన్‌తో మ్యాచ్.. అరుదైన ఘనత అందుకోనున్న బంగ్లా కెప్టెన్
ఆసియా కప్‌లో భాగంగా గ్రూఫ్-బిలో మంగళవారం అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే శ్రీలంకపై 8 వికెట్లతో విజయం సాధించి జోరు మీదున్న అఫ్గనిస్తాన్‌ను బంగ్లా కట్టడి చేస్తుందా అన్నది అనుమానమే. ఎందుకంటే ఇటీవలే బంగ్లా ఫామ్ చూసుకుంటే దారుణంగా ఉంది. జింబాబ్వేతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్ ఆటతీరు నాసిరకంగా తయారైంది. ఇక జింబాబ్వేతో సిరీస్ ఓటమి అనంతరం మహ్మదుల్లా కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకోవడంతో కొత్త కెప్టెన్‌గా బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్‌ను ఎంపిక చేసింది బీసీబీ(బంగ్లా క్రికెట్ బోర్డు). షకీబ్‌కు తోడూ ముష్ఫికర్ రహీమ్ కూడా జట్టులోకి రావడంతో బంగ్లాదేశ్ జట్టు కాస్త పటిష్టంగా కనిపిస్తోంది. కానీ తొలి మ్యాచ్‌లో గెలిచి జోరు మీదున్న అఫ్గనిస్తాన్‌ను ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక బంగ్లాదేశ్ స్టార్.. కెప్టెన్ కమ్ ఆల్‌రౌండర్ షకీబ్ హల్ హసన్ వందో టి20 మ్యాచ్ ఆడనున్నాడు. బంగ్లా తరపున వందో టి20 ఆడనున్న మూడో క్రికెటర్‌గా షకీబ్ నిలవనున్నాడు. షకీబ్ కంటే ముందు ముష్పికర్ రహీమ్, మహ్మదుల్లా ఈ ఘనత సాధించారు. మరోవైపు అఫ్గనిస్తాన్ మాత్రం లంకపై గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. టాస్ గెలిస్తే మాత్రం అఫ్గన్ మరోసారి కచ్చితంగా బౌలింగ్‌ను ఎంచుకోవడం ఖాయం. రషీద్ ఖాన్, షజల్లా ఫరూఖీ, నవీన్ ఉల్ హక్, మహ్మద్ నబీలతో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తుండగా.. బ్యాటింగ్‌లో హజరతుల్లా జజాయి, రహమనుల్లా గుర్బాజ్, ఇబ్రహం జర్దాన్, నజీబుల్లా జర్దాన్లతో బలంగా కనిపిస్తోంది. చదవండి: Aditya Tare: 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికిన క్రికెటర్ Ban Vs Afg: ఆ జట్టు అసలు గెలిచే అవకాశమే లేదు: టీమిండియా మాజీ క్రికెటర్ -
Asia Cup 2022: ఆ జట్టు అస్సలు గెలవదు: టీమిండియా మాజీ క్రికెటర్
Asia Cup 2022- Bangladesh vs Afghanistan Winner Prediction: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మంగళవారం(ఆగష్టు 30) తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్- బిలో ఉన్న షకీబ్ అల్ హసన్ బృందం.. అదే గ్రూప్‌లో ఉన్న అఫ్గనిస్తాన్‌తో షార్జా వేదికగా తలపడనుంది. ఇక ఈ మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకతో పోటీ పడిన అఫ్గన్.. 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. మరోవైపు బంగ్లాదేశ్ వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలో పరాభవాల తర్వాత ఈ టీ20 టోర్నీలో ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మంగళవారం నాటి మ్యాచ్‌లో విజేత ఎవరో తేల్చేశాడు. ఈ జట్టు అస్సలు గెలవదు! ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ బలాబలాలు, విజయావకాశాలపై అభిప్రాయం పంచుకున్నాడు. ‘‘బంగ్లాదేశ్ అస్సలు గెలిచే ఛాన్సే లేదు. సికందర్ రజా(జింబాబ్వే బ్యాటర్) వాళ్ల బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్డేల్లో పర్లేదు గానీ.. టీ20లలో వాళ్ల పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగాలేదు. ఒకవేళ షార్జా పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే.. ఎక్కువ పరుగులు రాబట్టే అవకాశం లేకపోతే.. బంగ్లాదేశ్ విజయావకాశాలు కాస్త మెరుగుపడతాయి. అయితే, బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే గట్టి పోటీనివ్వగలరు. ఇక మహ్మదుల్లా, సబ్బీర్ రెహమాన్, ముష్ఫికర్, షకీబ్ అల్ హసన్, మెహెదీ హసన్, మెహెదీ హసన్ మిరాజ్‌లు ఉన్నారు. కాబట్టి మరీ ఈ జట్టును చెత్త అని తీసిపారేలేము గానీ.. స్థాయికి తగ్గట్లు మాత్రం కనిపించడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తారు! ఇక అఫ్గనిస్తాన్ జట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ జట్టు బాగుంది. వాళ్లు ఎక్కువగా సిక్సర్లు బాదటానికి ప్రయత్నిస్తారు. రహ్మనుల్లా గుర్బాజ్, హజ్రతుల్లా జజాయ్, నజీబుల్లా జద్రాన్.. ఈ పిచ్‌పై రాణించగలరు. మరీ ఎక్కువ బౌన్సీ వికెట్ కాదు కాబట్టి వాళ్లు విజృంభించగలరు’’ అని ఆకాశ్ అభిప్రాయపడ్డారు. బౌలర్లు సైతం మెరుగ్గా రాణించగలరని, శ్రీలంకను కట్టడి చేసిన తీరును గుర్తుచేశాడు. కాగా శ్రీలంకతో మ్యాచ్‌లో అఫ్గన్ బౌలర్లు చెలరేగిన విషయం తెలిసిందే. లంకను 105 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫజల్హక్ ఫారూఖీ 3.4 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి లంక జట్టు పతనాన్ని శాసించాడు. ఇక బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ 18 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో చెలరేగి ఏకంగా 40 పరుగులు సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక శ్రీలంకపై విజయంతో అఫ్గనిస్తాన్ ప్రస్తుతం గ్రూప్-బి టాపర్‌గా ఉంది. బంగ్లాతో మ్యాచ్ గెలిస్తే సూపర్-4కు అర్హత సాధించే క్రమంలో మరింత మెరుగైన స్థితికి చేరుకుంటుంది. ఇక బంగ్లా- అఫ్గన్ల మధ్య మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం కానుంది. చదవండి: IND vs PAK: రోజుకు 150 సిక్స్‌లు కొడుతున్నా అన్నావు.. ఇప్పుడు ఏమైంది భయ్యా నీకు? Shubman Gill: ‘సారా’తో దుబాయ్‌లో శుబ్‌మన్ గిల్.. ఫొటో వైరల్! అయితే ఈసారి.. -
బంగ్లాకు షాకిచ్చిన అఫ్ఘానిస్థాన్.. టీ20 సిరీస్ సమం
Afghanistan Beat Bangladesh To Level Series: 3 వన్డేలు, 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న అఫ్ఘనిస్థాన్, ఆతిధ్య జట్టుకు షాకిచ్చింది. శనివారం జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన అఫ్ఘాన్ జట్టు.. టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. అఫ్ఘాన్ బౌలర్లు అజ్మతుల్లా(3/22), ఫజల్ హాక్ ఫరూఖి(3/18)ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం ఛేదనలో హజ్రతుల్లా జజాయ్ (45 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఉస్మాన్ ఘనీ (48 బంతుల్లో 47; 5 ఫోర్లు, సిక్స్) రాణించడంతో అఫ్ఘన్ జట్టు 17.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్, మహ్మదుల్లా తలో వికెట్ పడగొట్టారు. కాగా, మార్చి 3న జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌లోనూ చెలరేగి ఆడిన ఆతిధ్య జట్టు 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చదవండి: PAK Vs AUS: డబుల్ చేజార్చుకున్న అజహర్ అలీ.. పాక్ భారీ స్కోర్ -
ఓడిపోతారన్న దశలో ప్రపంచ రికార్డు భాగస్వామ్యంతో గెలిపించారు
అఫ్గనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. 45 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. ఈ దశలో అఫిఫ్ హొస్సేన్ (115 బంతుల్లో 93 నాటౌట్, 11 ఫోర్లు, 1 సిక్సర్), మెహదీ హసన్(120 బంతుల్లో 81 నాటౌట్, 9 ఫోర్లు) అద్బుత ఇన్నింగ్స్ ఆడారు. చివరి వరకు నిలిచిన ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 174 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో చరిత్ర సృష్టించడమే గాక బంగ్లాదేశ్‌కు మరుపురాని విజయం అందించారు . ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ 49.1 ఓవర్లలో 215 పరుగులుకు ఆలౌటైంది. నజీబుల్లా 67 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రహమత్ 34 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, తస్కిన్ అహ్మద్, షకీబ్, షోరిఫుల్ హొసెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా బంగ్లాదేశ్ మ్యాచ్ విజయంతో పాటు పలు రికార్డులు బద్దలు కొట్టింది. ►వన్డే క్రికెట్ చరిత్రలో ఏడో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన రెండో జంటగా మెహదీ హసన్, అఫిఫ్ హొస్సేన్‌లు నిలిచారు. తొలి స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన జాస్ బట్లర్, ఆదిల్ రషీద్‌లు( 177 పరుగులు భాగస్వామ్యం, 2015లో న్యూజిలాండ్‌పై) ఉన్నారు. ►ఇంతకముందు బంగ్లాదేశ్‌కు వన్డేల్లో ఏడో వికెట్‌కు ఇమ్రుల్ కైస్, మహ్మద్ సైఫుద్దీన్ జోడి నమోదు చేసిన 127 పరుగుల భాగస్వామ్యం అత్యుత్తమంగా ఉంది. తాజాగా ఈ రికార్డును మెహదీ హసన్- అఫిఫ్ హొస్సేన్ జోడి బద్దలు కొట్టింది. ►ఇక బంగ్లాదేశ్ తరపున వన్డేల్లో ఏడో వికెట్‌కు 100 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేసిన మూడో జంటగా మెహదీ హసన్- అఫిఫ్ హొస్సేన్‌లు నిలిచారు. అంతకముందు ఇమ్రుల్ కైస్- మహ్మద్ సైఫుద్దీన్(2018లో జింబాబ్వేపై), ముష్ఫికర్ రహీమ్- నయీమ్ ఇస్లామ్(2010లో న్యూజిలాండ్‌పై) ఉన్నారు. ►బంగ్లాదేశ్ తరపున ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వన్డేల్లో 50ప్లస్ స్కోర్లు రెండుసార్లు సాధించిన మూడో ఆటగాడిగా మెహదీ హసన్ నిలిచాడు. ఇంతకముందు నాసిర్ హొసేన్, మహ్మద్ సైఫుద్దీన్‌లు ఉన్నారు. చదవండి: Sanju Samson: సంజూలో మంచి టాలెంట్ ఉంది.. సరైన రీతిలో వాడుకుంటాం: రోహిత్ శర్మ 1⃣7⃣4⃣* Afif Hossain 🤝 Mehidy Hasan The second-highest partnership for the seventh wicket in men's ODIs 🔥#BANvAFG pic.twitter.com/1kI2gF9imj — ICC (@ICC) February 23, 2022 -
తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా..
లండన్: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ అరుదైన ఘనతను సాధించాడు. ఓవరాల్ వరల్డ్‌కప్‌లో వెయ్యి పరుగులు సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షకీబుల్ ఈ ఫీట్ సాధించాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో షకీబుల్(51) హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ మెగా టోర్నీలో టాప్ ప్లేస్‌ను ఆక్రమించాడు. తాజా వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ షకీబుల్ సాధించిన పరుగులు 476. దాంతో డేవిడ్ వార్నర్(447)ను షకీబుల్ అధిగమించాడు. ఈ టోర్నీలో షకీబుల్ సాధించిన పరుగుల్లో రెండు సెంచరీలు ఉండటం విశేషం. ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లపై శతకాలతో మెరిశాడు షకీబుల్. ఇప్పటివరకూ షకీబుల్ నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడాడు. 2007లో షకీబుల్ వరల్డ్‌కప్ ప్రస్థానం ఆరంభం కాగా, అతనికి ఇది 27 వరల్డ్‌కప్ మ్యాచ్. మరొకవైపు వన్డే ఫార్మాట్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు షకీబుల్. ఇక్కడ తమీమ్ ఇక్బాల్ తొలి స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో ఆరు వేల వన్డే పరుగులు సాధించిన జాబితాలో ఇద్దరు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఉండగా అందులో షకీబుల్ స్థానం సంపాదించాడు. , -
అఫ్గాన్ లక్ష్యం 263
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 263 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ముష్ఫికర్ రహీమ్(83), షకీబుల్ హసన్(51)లు రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ శుభారంభం లభించలేదు. బంగ్లాదేశ్ ఓపెనర్ లిటాన్ దాస్(16) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో తమీమ్ ఇక్బాల్-షకీబుల్ హసన్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 59 పరుగులు జత చేసిన తర్వాత తమీమ్(36) ఔటయ్యాడు. కాగా, షకీబుల్-ముష్ఫికర్ రహీమ్‌ల జోడి సమయోచితంగా బ్యాటింగ్ చేసింది. కాగా, బంగ్లాదేశ్ స్కోరు 143 పరుగుల వద్ద ఉండగా షకీబుల్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత పెవిలియన్ చేరాడు. ఆపై కాసేపటికి సౌమ్య సర్కార్(3) కూడా ఔట్ కావడంతో బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. ఆ తరుణంలో ముష్పికర్ రహీమ్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి మహ్మదుల్లా(27), మొసదెక్ హుస్సేన్(35)ల నుంచి సహకారం లభించడంతో బంగ్లాదేశ్ తిరిగి తేరుకుంది. రహీమ్ ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరగా, హుస్సేన్ చివరి బంతికి ఔటయ్యాడు. దాంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహ్మాన్ మూడు వికెట్లు సాధించగా, నైబ్కు రెండు వికెట్లు లభించాయి. దవ్లాత్ జద్రాన్, నబీలు తలో వికెట్ తీశారు. -
బంగ్లాదేశ్‌ను నిలువరించేనా?
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిని అఫ్గాన్ కెప్టెన్ గుల్బదిన్ నైబ్ ముందుగా బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ బంగ్లాదేశ్ ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ఆ జట్టు ఐదు పాయింట్లతో ఉంది. ఇక అఫ్గానిస్తాన్ ఇప్పటికే ఇంటి ముఖం పట్టింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడి సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.( ఇక్కడ చదవండి: మేం మునిగాం.. బంగ్లానూ ముంచుతాం) ఇదిలా ఉంచితే, ఇరు జట్లు 7 సార్లు వన్డేల్లో తలపడగా, 4 సార్లు బంగ్లాదేశ్ గెలిచింది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో అఫ్గాన్ విజయం సాధించింది. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు ఒకసారి మాత్రమే ముఖాముఖి పోరులో తలపడ్డాయి. అందులో బంగ్లాదేశ్ గెలుపొందింది. 2015 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ 105 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని అఫ్గాన్ భావిస్తోంది. బంగ్లాదేశ్‌కు షాకిచ్చి టోర్నీలో బోణీ కొట్టడానికి అఫ్గాన్ సిద్ధమైంది. మరొకవైపు అఫ్గాన్‌పై గెలిచి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని బంగ్లాదేశ్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. -
మేం మునిగాం.. బంగ్లానూ ముంచుతాం
సౌతాంప్టన్: బంగ్లాదేశ్‌తో నేడు జరుగనున్న మ్యాచ్ గురించి అఫ్గానిస్తాన్ కెప్టెన్ గుల్బదీన్ నైబ్ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ప్రపంచ కప్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లూ ఓడిన అఫ్గాన్ సెమీఫైనల్ రేసు నుంచి ఔటయింది. బంగ్లా మాత్రం ఐదు పాయింట్లతో నాకౌట్ బెర్తుకు పోరాడుతోంది. ఈ నేపథ్యంలో నైబ్ మాట్లాడుతూ... తామిప్పటికే మునిగిపోయామని, సోమవారం బంగ్లాను ఓడించి వారినీ ముంచేస్తామని నవ్వుతూ అన్నాడు. భారత్‌తో మ్యాచ్‌లోలాగే పిచ్ స్పిన్‌కు సహకరిస్తే బంగ్లాదేశ్‌ను ఓడించడం తమకు కష్టమేం కాదని నైబ్ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ అఫ్గానిస్తాన్ ఆరు మ్యాచ్‌లు ఆడి అన్నింటా ఓటమి చూసింది. దాంతో వరల్డ్‌కప్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.