బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం
తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకను చిత్తు చేసి ఆఫ్ఘనిస్థాన్.. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో కేవలం 127 పరుగులు చేయడంతో ఆఫ్ఘన్ బ్యాటర్లు మొదటి నుంచి ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 9 బంతులు మిగిలి ఉండగానే.. 128 రన్స్ టార్గెట్‌ను 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ గెలుపొందింది.
రెండో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘన్
10వ ఓవర్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మొసద్దెక్ హొసేన్ బౌలింగ్‌లో హజ్రతుల్లా జజాయ్ (23) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 9.2 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 45/2.
ఆచితూచి ఆడుతున్న ఆఫ్ఘాన్
స్వల్ప లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఆచితూచి ఆడుతుంది. 8 ఓవర్ల ముగిసే సమాయానిఆ జట్టు స్కోర్ 37/1గా ఉంది. హజ్రతుల్లా జజాయ్ (17), ఇబ్రహీమ్ జద్రాన్ (8) క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఆఫ్ఘానిస్తాన్
128 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘానిస్తాన్ ఐదో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. షకీబ్ బౌలింగ్‌లో ఓపెనర్ గుర్బాజ్ (11) స్టంప్ అవుటయ్యాడు. 4.1 ఓవర్ల తర్వాత ఆఫ్ఘానిస్తాన్ స్కోర్ 15/1.
బంగ్లాను నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేసిన ఆఫ్ఘన్ స్పిన్నర్లు
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు బంగ్లాదేశ్‌ను నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేశారు. ముజీబ్, రషీద్ ఖాన్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లా నడ్డి విరిచారు. వీరిద్దరి ధాటికి బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులకే పరిమితమైంది. మొసద్దెక్ హొసేన్ (48 నాటౌట్) రాణించడంతో బంగ్లా జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
రషీద్ ఖాతాలో మరో వికెట్
ఆఫ్ఘన్ స్పిన్నర్లలో తొలుత ముజీబ్.. ఆతర్వాత రషీద్ ఖాన్ రెచ్చిపోయారు. 16వ ఓవర్‌లో రషీద్.. మహ్మదుల్లాను (25) ఔట్ చేయడం ద్వారా 3 వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 16 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 95/6.
53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
ఆఫ్ఘన్ స్పిన్నర్లు ముజీబ్, రషీద్ ఖాన్‌ల ధాటికి బంగ్లాదేశ్ జట్టు విలవిలలాడుతుంది. ఆ జట్టు 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను దాదాపు ఆఫ్ఘనిస్తాన్ చేతికి అప్పగించింది. 11వ ఓవర్‌లో రషీద్ ఖాన్.. అఫీఫ్ హొసేన్‌ను (12) ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు.
ముచ్చెమటలు పట్టిస్తున్న ఆఫ్ఘన్ స్పిన్నర్లు
ఆఫ్ఘన్ స్పిన్నర్లు ముజీబ్, రషీద్ ఖాన్‌లు బంగ్లాదేశ్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వీరిద్దరు బంగ్లా ఆటగాళ్లను కుదురుకోనీయకుండా వరుస క్రమంలో వికెట్లు పడగొడుతున్నారు. తొలుత ముజీబ్ రెచ్చిపోగా.. తాజాగా రషీద్ చెలరేగుతున్నాడు. 7వ ఓవర్‌లో రషీద్.. అద్భుతమైన గూగ్లీతో ముష్ఫికర్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
రెచ్చిపోతున్న ముజీబ్.. ఈసారి కెప్టెన్ బలి
ఆఫ్ఘాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ బంగ్లా ఆటగాళ్లను బెంబేలెత్తిస్తున్నాడు. తాను వేసిన మూడు ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి బంగ్లా నడ్డి విరిచాడు. ఆరో ఓవర్‌లో ముజీబ్.. బంగ్లా కెప్టెన్ షకీబ్ (11)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 6 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 28/3. క్రీజ్‌లో ముష్ఫికర్ (1), అఫీఫ్ హొసేన్ (2) ఉన్నారు.
బంగ్లాను మరో దెబ్బకొట్టిన ముజీబ్
రెండో ఓవర్‌లోనే ఓపెనర్ మహ్మద్ నయీమ్ (8)ను క్లీన్ బౌల్డ్ చేసిన ముజీబుర్ రెహ్మాన్.. నాలుగో ఓవర్‌లో మరో వికెట్ పడగొట్టాడు. ముజీబ్.. అనాముల్ హాక్ (5)ను ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 13 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్‌లో షకీబ్, ముష్ఫికర్ ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయింది. ముజీబుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో మహ్మద్ నయీమ్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో అనాముల్ హాక్ (1), కెప్టెన్ షకీబ్ ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
ఆసియా కప్ 2022 గ్రూప్-బిలో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 30) బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకకు షాకిచ్చిన విషయం తెలిసిందే.
తుది జట్లు..
ఆఫ్ఘనిస్తాన్: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, కరీం జనత్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫరూఖీ
బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం (వికెట్‌కీపర్), మహ్మదుల్లా, మెహిది హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అఫీఫ్ హొసేన్, మహ్మద్ నయీం, అనాముల్ హాక్, మొసద్దెక్ హొసేన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment