Mohammad Nabi Worst Record 1st Cricketer Golden-Duck His-100th Game - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: మహ్మద్‌ నబీ చెత్త రికార్డు.. టి20 క్రికెట్‌లో తొలి బ్యాటర్‌గా

Published Wed, Sep 7 2022 9:09 PM | Last Updated on Thu, Sep 8 2022 6:18 AM

Mohammad Nabi Worst Record 1st Cricketer Golden-Duck His-100th Game - Sakshi

సూపర్‌-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌ అఫ్గనిస్తాన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ నబీకి వందో మ్యాచ్‌. సాధారణంగా ఒక క్రికెటర్‌కు వందో మ్యాచ్‌ అంటే చాలా ప్రతిష్టాత్మకం. ఎలాగైనా ఆ మ్యాచ్‌ను మధురానుభూతిగా మలుచుకోవాలని అనుకుంటాడు. అలాంటి నబీ ప్రతిష్టాత్మక వందో మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. తద్వారా నబీ టి20 క్రికెట్‌లో చెత్త రికార్డు నమోదు చేశాడు.

టి20ల్లో వందో మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌ అయిన తొలి ఆటగాడిగా మహ్మద్‌ నబీ నిలిచాడు. ఇక నబీ వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. చివరగా ఆడిన ఎనిమిది టి20ల్లో నబీ స్కోర్లు 5, 9, 6, 5, 0, 8, 1, 0 ఉన్నాయి. ఇందులో రెండు గోల్డెన్‌ డక్‌లు ఉండడం గమనార్హం. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ గెలుస్తూనే టీమిండియాకు ఫైనల్‌ అవకాశాలు ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement