ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన దశలో ఏ జట్టైనా ఈజీగా విజయం సాధిస్తుందని అందరం అనుకుంటాం. కానీ బంగ్లాదేశ్ జట్టు విషయంలో మాత్రం ఈ సీన్ రివర్స్ అయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఒత్తిడికి లోనయ్యి చచ్చీ చెడీ ఎలాగోలా నెగ్గింది. ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడంతో పాటు ఓటమి చేరువగా వచ్చి మళ్లీ గెలుపు రుచి చూసిన బంగ్లాదేశ్ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకుంది. శుక్రవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది.
విషయంలోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మహ్మద్ నబీ 40 బంతుల్లో 54 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. అజ్మతుల్లా 18 బంతుల్లో 33, నజీబుల్లా 23 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు తీయగా.. నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిపుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్, మెహదీ హసన్ మిరాజ్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. తౌహిద్ చౌదరీ 47 పరుగులు చేయగా.. షమీమ్ హొసెన్ 33 పరుగులు చేశాడు. ఆఫ్గన్ బౌలర్లలో కరీమ్ జనత్ మూడు వికెట్లు తీశాడు. 19 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. విజయానికి కేవలం ఆరు పరుగులు మాత్రమే అవసరం. ఈ నేపథ్యంలోనే ఆఖరి ఓవర్ వేసిన ఆఫ్గన్ బౌలర్ కరీమ్ జనత్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు.
తొలి బంతిని మిరాజ్ ఫోర్ బాదడంతో చివరి ఐదు బంతుల్లో రెండు పరుగులు వస్తే చాలు. కానీ తర్వాతి మూడు బంతులకు వరుసగా మిరాజ్, తస్కిన్ అహ్మద్ నసుమ్ అహ్మద్‌లను ఔట్ చేసి కరీమ్ జనత్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. అయితే ఓవర్ ఐదో బంతికి ఫోర్ బాది బంగ్లాకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు షోరిపుల్ ఇస్లామ్. ఈ విజయంతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
This over had more drama than a daily soap 🎢 pic.twitter.com/jxM2zt1CfP
— FanCode (@FanCode) July 14, 2023
చదవండి: #ViratKohli: ఆనందంతో చిందులు.. లోకం సంగతి మైమరిచిన కోహ్లి
IND Vs WI 2023: ఏంటి కిషన్.. తొలి మ్యాచ్‌లోనే ఇలా అయితే ఎలా? తెల్లముఖం వేశావుగా
Comments
Please login to add a commentAdd a comment