BAN Vs AFG One-Off Test: Debutant Nijat Masood Picks Up Five Wicket Haul On Debut - Sakshi
Sakshi News home page

BAN Vs AFG One-Off Test: ఆఫ్గాన్‌ పేసర్‌ అరుదైన రికార్డు.. తొలి బౌలర్‌గా

Published Thu, Jun 15 2023 9:05 PM | Last Updated on Fri, Jun 16 2023 12:49 PM

Debutant Nijat Masood picks up five-wicket haul on debut - Sakshi

ఆఫ్గానిస్తాన్‌ ఫాస్ట్‌బౌలర్‌ నిజత్ మసూద్ తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఫైవ్‌ వికెట్‌ హాల్‌ సాధించాడు. 16 ఓవర్లలో 72 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో నిజత్ మసూద్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి ఆఫ్గాన్‌ ఫాస్ట్‌బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతకుముందు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లోనే తొలి బంతికే వికెట్‌ తీసిన ఏడో బౌలర్‌గా నిజత్ మసూద్‌ రికార్డులకెక్కాడు.  

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌ పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆట సమయానికి ఆ జట్టు 370 పరుగుల ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్‌ను (134/1) కొనసాగిస్తోంది. మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ (17) ఔట్‌ కాగా.. జకీర్‌ హసన్‌ (54), నజ్ముల్‌ హసన్‌ షాంటో (54) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకు చాపచుట్టేసింది. బంగ్లా బౌలర్లలో  ఎబాదత్‌ హొసేన్‌ (4/47), షొరీఫుల్‌ ఇస్లాం (2/28), తైజుల్‌ ఇస్లాం (2/7), మెహిది హసన్‌ మీరజ్‌ (2/15) అద్భుతంగా రాణించారు
చదవండి: Asia Cup 2023: ఆసియాకప్‌కు ముందు టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ఆటగాళ్లు వచ్చేస్తున్నారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement