రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్.. బంగ్లాదేశ్‌కు కోల్పోయిన సంగతి తెలిసిందే. సిరీస్ ఓటమితో బాధలో ఉన్న ఆఫ్గన్‌కు మరో గట్టిషాక్ తగిలింది. జట్టు హెడ్‌కోచ్ జొనాథన్ ట్రాట్‌తో పాటు ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్‌జైయ్‌లకు ఐసీసీ శిక్షించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి(Code Of Conduct) లెవెల్-1 నిబంధన ఉల్లఘించినందుకు గానూ ఇద్దరిపై ఐసీసీ చర్యలు తీసుకుంది.
వర్షం అంతరాయం కలిగించిన సమయంలో ఫీల్డ్ అంపైర్లు పిచ్‌ను పరిశీలించడానికి ఇన్‌స్పెక్షన్‌కు వచ్చారు. ఈ సమయంలో కోచ్ జొనాథన్ ట్రాట్ అంపైర్ల నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్టాడినట్లు తెలిసింది. ఈ మేరకు ఫీల్డ్ అంపైర్లు కోచ్ ట్రాప్‌పై రిఫరీకి ఫిర్యాదు చేశారు.
ఇక ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిర్ హృదయ్‌ను ఔట్ చేశాకా.. అజ్మతుల్లా ఒమర్‌జైయ్ హృదయ్‌ను టార్గెట్ చేస్తూ పరుష పదజాలం ఉపయోగిస్తూ పెవిలియన్ వైపు చేతిని చూపెట్టాడు. ఇది స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీంతో ఆర్టికల్ 2.5 ప్రకారం అజ్మతుల్లా ఐసీసీ నియమావళి నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది.
ఇద్దరికి ఇదే తొలి తప్పుగా భావించిన ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. 24 నెలల్లో మరోసారి ఇదే తప్పు చేస్తే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్స్ విధించే అవకాశం ఉంటుంది.
ఇక షెల్లాట్ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్దతి) బంగ్లాదేశ్ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను తొలుత 17 ఓవర్లకు కుదించారు. మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.
అజ్మతుల్లా జజాయ్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లా బౌలర్లలో టాస్కిన్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజర్ రెహమన్, షకీబ్ అల్ హసన్‌లు తలా రెండు వికెట్లు సాధించారు. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ టార్గెట్‌ను 119 పరుగులగా నిర్ణయించారు.
119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. బంగ్లా ఛేజింగ్‌లో లిటన్ దాస్(35), షకీబ్(18 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. ఇక సిరీస్ విజయంతో వన్డే సిరీస్ ఓటమికి బంగ్లాదేశ్ బదులు తీర్చకున్నట్లైంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో ఆఫ్గాన్ సొంతం చేసుకుంది.
చదవండి: #MLC2023: దంచికొట్టిన సీఎస్‌కే ఓపెనర్.. సూపర్‌కింగ్స్‌కు రెండో విజయం
CWG 2026: 'అంత బడ్జెట్ మావల్ల కాదు'.. కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహించలేం
Comments
Please login to add a commentAdd a comment