ICC Code of Conduct
-
రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకున్న గంటల వ్యవధిలోనే ఆసక్తికర పరిణామం
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న గంటల వ్యవధిలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా ఐసీసీ కోడ్ ఉల్లంఘించినందుకు గాను హసరంగపై రెండు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధం పడింది. నిషేధంతో పాటు హసరంగ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. హసరంగ ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లు కూడా చేరాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హసరంగ ఫీల్డ్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఓవర్ పూర్తి చేసిన అనంతరం అంపైర్ చేతి నుంచి క్యాప్‌ను బలవంతంగా లాక్కున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ఉల్లంఘన కింద దీన్ని నేరంగా పరిగణిస్తారు. ప్రస్తుత బంగ్లాదేశ్ సిరీస్‌లో హసరంగపై ఐసీసీ నిషేధం పడటం ఇది రెండోసారి. టీ20 సిరీస్ సందర్భంగా కూడా గత సిరీస్‌లో (ఆఫ్ఘనిస్తాన్) చేసిన తప్పిదాల కారణంగా అతను సస్పెండయ్యాడు. 26 ఏళ్ల హసరంగ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. అతను కేవలం నాలుగు టెస్ట్‌ల్లోనే శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్ట్‌ల్లో హసరంగకు మంచి ట్రాక్ రికార్డు లేదు. ఈ ఫార్మాట్లో అతను కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు కోరిక మేరకు హసరంగా తన టెస్టు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో శ్రీలంక టీ20 సిరీస్ గెలువగా.. బంగ్లాదేశ్ వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. -
హర్మన్‌పై వేటు.. ఆసియా గేమ్స్‌లో జట్టును నడిపించేది ఎవరు?
భారత మహిళల జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హర్మన్ సహనం కోల్పోయి బ్యాట్‌తో వికెట్లను విరగొట్టడం.. అంపైర్‌తో అనుచితంగా ప్రవర్తించడం ఐసీసీ తప్పుబట్టింది. అనుచిత ప్రవర్తనకు గానూ హర్మన్ ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్లు అంటే 2 సస్పెన్షన్ పాయింట్లతో సమానం. దాంతో రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. దీంతోపాటు ఆమె మ్యాచ్ ఫీజులో కూడా 75 శాతం కోత పడింది. ఐసీసీ లెవల్–2 నిబంధన ప్రకారం నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్ హర్మన్ కావడం గమనార్హం. దీని ప్రకారం ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో భారత్ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు హర్మన్ దూరం కానుంది. ఈ నేపథ్యంలో ఆసియా గేమ్స్‌లో టీమిండియా ఆడబోయే తొలి రెండు మ్యాచ్‌లకు వైస్‌కెప్టెన్ అయిన స్మృతి మంధాన జట్టును నడిపించనుంది. కాగా ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూ పట్టణంలో జరగనున్నాయి. ఇక ర్యాంకింగ్స్ ఆధారంగా టీమిండియా మహిళల జట్టు నేరుగా ఆసియా గేమ్స్‌కు క్వాలిఫై అయింది. సెప్టెంబర్ 24న భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా హర్మన్ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ.. అనుచిత ప్రవర్తనకు గానూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్లు శిక్షగా విధించగా, మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైరింగ్ ప్రమాణాలు బాగా లేవంటూ విమర్శించింది. దీనిపై ఒక డీమెరిట్ పాయింట్ శిక్ష పడింది. అనంతరం వేదికపై బంగ్లాదేశ్ కెపె్టన్ నిగార్ సుల్తానాతో కలిసి ట్రోఫీ అందుకునే సమయంలో ‘మ్యాచ్ టై చేసింది అంపైర్లే తప్ప మీరు కాదు. ఫొటో దిగేందుకు వాళ్లనూ రమ్మనండి’ అంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఉద్దేశించి చెప్పింది. చదవండి: FIFA World Cup: ప్రపంచకప్‌లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా.. వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ రీ షెడ్యూల్.. భద్రతా కారణాల దృష్ట్యా..! -
పుండు మీద కారం చల్లినట్లు..హెడ్‌కోచ్, ఆటగాడిని శిక్షించిన ఐసీసీ
రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్.. బంగ్లాదేశ్‌కు కోల్పోయిన సంగతి తెలిసిందే. సిరీస్ ఓటమితో బాధలో ఉన్న ఆఫ్గన్‌కు మరో గట్టిషాక్ తగిలింది. జట్టు హెడ్‌కోచ్ జొనాథన్ ట్రాట్‌తో పాటు ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జైయ్లకు ఐసీసీ శిక్షించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి(Code Of Conduct) లెవెల్-1 నిబంధన ఉల్లఘించినందుకు గానూ ఇద్దరిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. వర్షం అంతరాయం కలిగించిన సమయంలో ఫీల్డ్ అంపైర్లు పిచ్‌ను పరిశీలించడానికి ఇన్స్పెక్షన్కు వచ్చారు. ఈ సమయంలో కోచ్ జొనాథన్ ట్రాట్ అంపైర్ల నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్టాడినట్లు తెలిసింది. ఈ మేరకు ఫీల్డ్ అంపైర్లు కోచ్ ట్రాప్‌పై రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఇక ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిర్ హృదయ్‌ను ఔట్ చేశాకా.. అజ్మతుల్లా ఒమర్జైయ్ హృదయ్‌ను టార్గెట్ చేస్తూ పరుష పదజాలం ఉపయోగిస్తూ పెవిలియన్ వైపు చేతిని చూపెట్టాడు. ఇది స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీంతో ఆర్టికల్ 2.5 ప్రకారం అజ్మతుల్లా ఐసీసీ నియమావళి నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. ఇద్దరికి ఇదే తొలి తప్పుగా భావించిన ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. 24 నెలల్లో మరోసారి ఇదే తప్పు చేస్తే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్స్ విధించే అవకాశం ఉంటుంది. ఇక షెల్లాట్ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్దతి) బంగ్లాదేశ్ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను తొలుత 17 ఓవర్లకు కుదించారు. మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అజ్మతుల్లా జజాయ్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లా బౌలర్లలో టాస్కిన్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజర్ రెహమన్, షకీబ్ అల్ హసన్‌లు తలా రెండు వికెట్లు సాధించారు. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ టార్గెట్‌ను 119 పరుగులగా నిర్ణయించారు. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో ఛేదించింది. బంగ్లా ఛేజింగ్‌లో లిటన్ దాస్(35), షకీబ్(18 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. ఇక సిరీస్ విజయంతో వన్డే సిరీస్ ఓటమికి బంగ్లాదేశ్ బదులు తీర్చకున్నట్లైంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో ఆఫ్గాన్ సొంతం చేసుకుంది. చదవండి: #MLC2023: దంచికొట్టిన సీఎస్కే ఓపెనర్.. సూపర్‌కింగ్స్‌కు రెండో విజయం CWG 2026: 'అంత బడ్జెట్ మావల్ల కాదు'.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం -
అంపైర్‌ను బూతులు తిట్టిన ఆరోన్ ఫించ్.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను ఐసీసీ మందలించింది. మ్యాచ్ సందర్భంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఫించ్‌ను హెచ్చరించినట్లు ఐసీసీ పేర్కొంది. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఫించ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. కామెరున్ గ్రీన్ వేసిన బంతిని బట్లర్ ఇన్సైడ్ ఎడ్జ్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి మిస్ అయి కీపర్ వేడ్ చేతుల్లోకి వెళ్లింది. ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో కెప్టెన్ ఫించ్ అంపైర్‌ను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఈ నేపథ్యంలోనే ఐసీసీ కోడ్ ఆప్ కండక్ట్ కింద లెవెల్-1 నిబంధన ఉల్లఘించినట్లు ఐసీసీ పేర్కొంది. ఆర్టికల్ 2.3 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో అసభ్యకర వ్యాఖ్యలను చేయడం నిబంధన ఉల్లఘించడం కిందే వస్తుందని.. అందుకే ఫించ్‌కు జరిమానా కాకుండా కేవలం హెచ్చరికతో వదిలిపెట్టామని వెల్లడించింది. మరోసారి ఇదే రిపీట్ చేస్తే మ్యాచ్ నిషేధంతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఐసీసీ హెచ్చరిక కారణంగా డీమెరిట్ కింద ఫించ్‌కు ఒక పాయింట్ కోత పడింది. ఇక తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసిన ఇంగ్లండ్ ఎట్టకేలకు గెలుపొందింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్ (32 బంతుల్లో 68; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (51 బంతుల్లో 84; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరలెవెల్లో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (44 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆతర్వాత మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టోయినిస్ (15 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఓ దశలో ఆసీస్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది.అయితే ఆఖర్లో మార్క్ వుడ్ (3/34) వరుస క్రమంలో వికెట్లు తీయడంతో ఆసీస్ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. "It would have been f***ing nice to know in time." Aaron Finch swearing at the umpire against England, after asking whether a ball had carried to Matthew Wade as he considered a review. Finch has been given an official reprimand by the match referee, but avoided a fine. pic.twitter.com/Pm3AR1VmaR — Jack Snape (@jacksongs) October 10, 2022 చదవండి: ఉతికారేసిన బట్లర్, హేల్స్.. వణికించి ఓడిన ఆస్ట్రేలియా -
ఇంగ్లండ్ బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ
ఇంగ్లండ్ మహిళా ఫాస్ట్ బౌలర్ కేథరిన్ బ్రంట్‌కు ఐసీసీ షాకిచ్చింది. మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించి ఐసీసీ నియమావళి లెవెల్-1 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ కేథరిన్‌ను హెచ్చరించడమే గాక మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. ఇక డిసిప్లీనరి యాక్ట్ కింద ఒక పాయింట్ కోత విధించింది. ఏడాది కాలంలో కేథరిన్ బ్రంట్ ఐసీసీ నిబంధన ఉల్లఘించడం ఇది రెండోసారి. ఇప్పటికే రెండు డీమెరిట్ పాయింట్లు ఉండడంతో.. మరోసారి నిబంధన ఉల్లంఘిస్తే మాత్రం ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది. విషయంలోకి వెళితే.. శనివారం ఇంగ్లండ్, టీమిండియా మహిళల మధ్య కామన్వెల్త్ గేమ్స్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. భారత బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్ కేథరిన్ బ్రంట్ వేసింది. దీప్తి శర్మ ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్ విడిచిపెట్టడంతో కేథరిన్ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కోపంగా అరిచింది. ఆమె వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. దీంతో మ్యాచ్ అనంతరం ఐసీసీ నిబంధనల ప్రకారం ఆర్టికల్ 2.3 నిబంధన ఉల్లఘించిన కేథరిన్ బ్రంట్‌కు హెచ్చరిస్తూ ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ స్పష్టం చేశారు. తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో భారత జట్టు సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ హర్మన్‌ప్రీత్ బృందం ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది. శనివారం ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపై భారత్ 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) రాణించింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (23 బంతుల్లో)ని స్మృతి నమోదు చేయడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. ఆఖరి ఓవర్లో గెలుపు కోసం 14 పరుగులు చేసే ప్రయత్నంలో ఇంగ్లండ్ 9 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. స్పిన్నర్లు స్నేహ్ రాణా (2/28), దీప్తి శర్మ (1/18) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో తుది పోరులో భారత తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫైనల్ మొదలవుతుంది. కాంస్య పతక మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది. చదవండి: Commonwealth Games 2022: క్రికెట్లో కనకంపై గురి మంధాన ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు -
కేఎల్ రాహుల్‌కు జరిమానా..
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మూడో రోజు ఆటలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు మ్యాచ్ రిఫరి క్రిస్ బ్రాడ్ జరిమానా విధించారు. రాహుల్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెడుతున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. మూడో రోజు ఆట తొలి సెషన్ 34వ ఓవర్లో ఆండర్సన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో క్యాచ్‌కు అపీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రివ్యూకి వెళ్లాడు. అందులో బంతి బ్యాట్ ఎడ్జ్‌కి తగిలినట్లు తేలడంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని రాహుల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీనిపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో అతనిపై ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8(అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం) ఉల్లంఘన నేరం కింద జరిమానా విధించారు. దీంతోపాటు రాహుల్ క్రమశిక్షణ రికార్డ్‌లో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు. చదవండి: టీమిండియాకు బిగ్ షాక్.. కీలక సభ్యుడికి కరోనా -
బ్రాడ్‌కు జరిమానా విధించిన తండ్రి
లండన్ : ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. ఇటీవలె పాకిస్తాన్‌తో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో బ్రాడ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో... మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న అతని తండ్రి క్రిస్ బ్రాడ్ కుమారుడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. జరిమానాతోనే సరిపెట్టకుండా ఒక డీ మెరిట్ పాయింట్‌ను అతని ఖాతాలో వేశాడు. పాక్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో తన బౌలింగ్‌లో అవుటై పెవిలియన్‌కు వెళుతున్న యాసిర్ షాను ఉద్దేశించి బ్రాడ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లు రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.5 ప్రకారం... బ్యాట్స్‌మన్ అవుటైనప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు అతడిపై దూషణకు దిగడం, ఎగతాళి చేయడం వంటి వాటిని నేరంగా పరిగణిస్తారు. -
‘ఆ దృశ్యాలు ఫైనల్ మ్యాచ్‌లోనే చూశాను’
న్యూఢిల్లీ : అండర్-19 ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లా, భారత్ ఆటగాళ్ల ఘర్షణపై టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ స్పందించారు. యువ భారత్ ఆటగాళ్ల ప్రవర్తన అసహ్యకరంగా ఉందని వ్యాఖ్యానించాడు. ‘మైదానంలో ఏ జట్టయినా చెత్త ప్రదర్శన చేయొచ్చు. ఇంత చెత్తగా తిట్టుకోవడం మాత్రం ఎప్పుడూ చూడలేదు’ అంటూ ఘాటుగా విమర్శించాడు. ఎప్పుడూ చూడని దృశ్యాలు ఫైనల్ మ్యాచ్‌లో ‘చూపించారు’అని ఎద్దేవా చేశాడు. (చదవండి : ‘అతి’కి సస్పెన్షన్ పాయింట్లు) ‘ఏ జట్టయినా చాలా చెత్తగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయొచ్చు. కానీ ఇంత చెత్తగా మాత్రంగా ప్రవర్తించకూడదు. ఇది చాలా అవమానకరమైన, అసహ్యకరమైన ప్రవర్తన’ బంగ్లా ఏం చేసిందో, ఎలా ఆడిందో అది వారి సమస్య. మనోళ్లు ఎలా ఆడారో అది మన సమస్య. కానీ, బండ బూతులు తిట్టుకోవడమేంటి..!’అని బిషన్ సింగ్ ఆసహనం వ్యక్తం చేశాడు. ఇక తొలిసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చేరిన బంగ్లా జట్టు చివరి వరకు శ్రమించి మూడు వికెట్ల తేడాతో గెలిచి కప్పు కొట్టింది. అయితే, విజయం అనంతరం బంగ్లా శిబిరం నుంచి ఒక్కసారిగా ఆటగాళ్లు, జట్టు సిబ్బంది మైదానంలోకి చొచ్చుకురావడవంతో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైర్లు కలుగజేసుకోవడంతో వివాదం అక్కడితో ముగిసింది. ఐదుగురిపై చర్యలు.. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్ ముగిశాక ఆటగాళ్ల ప్రవర్తన... లెవెల్–3 నియమావళికి విరుద్ధంగా ఉండటంతో ఐసీసీ చర్యలు చేపట్టింది. కప్ నెగ్గిన ఆనందంలో ‘అతి’గా సంబరపడిన బంగ్లాదేశ్ ఆటగాళ్లపై, దీనికి దీటుగా ఆవేశపడిన భారత ఆటగాళ్లపై సస్పెన్షన్ పాయింట్లు విధించింది. భారత్‌కు చెందిన ఆకాశ్ సింగ్‌కు 8 సస్పెన్షన్ పాయింట్లు (6 డి మెరిట్ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్‌కి 5 సస్పెన్షన్ (2 డి మెరిట్) పాయింట్లు విధించారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో తౌహిద్ హ్రిదోయ్ (10 సస్పెన్షన్=6 డి మెరిట్), షమీమ్ హుస్సేన్ (8 సస్సెన్షన్=6 డి మెరిట్), రకీబుల్ హసన్ (4 సస్పెన్షన్= 5 డి మెరిట్)లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. రకీబుల్ ప్రవర్తించిన తీరుపై ఎక్కువ డి మెరిట్ పాయింట్ల నిషేధం విధించింది. ఆదివారం ఉత్కంఠ పెంచిన ‘లో’ స్కోర్ల మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. తొలిసారి ఐసీసీ ప్రపంచకప్ నెగ్గిన ఆనందంలో బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు విచక్షణ కోల్పోయారు. -
బౌలర్‌ను తిట్టిన విండీస్ ప్లేయర్‌పై భారీ ఫైన్
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లపై తిట్లవర్షం కురిపించిన విండీస్ ఆటగాడు మార్లన్ సామ్యూల్స్పై ఐసీసీ భారీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 30శాతం జరిమానా మోపింది. చివరి ఓవర్ వేసిన బెన్ స్టోక్పై మార్లన్ తిట్లవర్షం కురిపించాడు. అతడిని ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆటగాళ్లు, వారి సిబ్బంది కోసం ఉద్దేశించిన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.1.4ను అతడు ఉల్లంఘించినట్టు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంగ్లండ్ బౌలర్లపై సామ్యూల్స్ అసభ్య వ్యాఖ్యలు చేసినట్టు మొదట ఫీల్డ్ ఎంపైర్లు కుమార్ ధర్మసేనా, రాడ్ టకర్, థర్డ్ ఎంపైర్ మారైఎస్ ఎరాస్మస్, ఫోర్త్ ఎంపైర్ బ్రుస్ ఆక్సెన్‌ఫర్డ్ అభియోగాలు మోపారు. ఈ అభియోగాలను అంగీకరించిన సామ్యూల్స్.. మ్యాచ్ రీఫరీ రంజన్ ముదుగలె విధించిన జరిమానాకు అంగీకరించారు. ఎదుటి జట్టు ఆటగాళ్లను దూషించడం ఐసీసీ నిబంధనల ప్రకారం లెవల్ 1 ఉల్లంఘనగా భావిస్తారు. ఇందుకు సదరు ఆటగాడిపై గరిష్ఠంగా 50శాతం వరకు జరిమానా విధిస్తారు. -
శ్రీలంక క్రికెటర్ దిల్షాన్‌కు జరిమానా
చిట్టాగాంగ్: ఐసీసీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించినందుకుగాను శ్రీలంక బ్యాట్స్‌మన్ తిలకరత్నె దిల్షాన్‌కు జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 20 శాతం చెల్లించాలని ఐసీసీ ఆదేశించింది. టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని దిల్షాన్ వ్యతిరేకించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కివీస్‌తో మ్యాచ్ నాలుగో ఓవర్లో దిల్షాన్ అవుటయ్యాడు.బంతి దిల్షాన్ గ్లౌవ్స్‌ను వికెట్ కీపర్ చేతిలో పడింది. దిల్షాన్‌ను అవుట్‌గా ప్రకటించగా, అంపైర్ నిర్ణయంతో వ్యతిరేకించాడు. ఫీల్డ్ అంపైర్లు రోడ్ టకర్, అలీమ్ దర్, థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్, రిజర్వ్ అంపైర్ స్టీవ్ డేవిస్ ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకుగాను దిల్షాన్‌కు జరిమానా విధించారు.