చిట్టాగాంగ్: ఐసీసీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించినందుకుగాను శ్రీలంక బ్యాట్స్మన్ తిలకరత్నె దిల్షాన్కు జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 20 శాతం చెల్లించాలని ఐసీసీ ఆదేశించింది. టి-20 ప్రపంచ కప్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అంపైర్ నిర్ణయాన్ని దిల్షాన్ వ్యతిరేకించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కివీస్తో మ్యాచ్ నాలుగో ఓవర్లో దిల్షాన్ అవుటయ్యాడు.బంతి దిల్షాన్ గ్లౌవ్స్ను వికెట్ కీపర్ చేతిలో పడింది. దిల్షాన్ను అవుట్గా ప్రకటించగా, అంపైర్ నిర్ణయంతో వ్యతిరేకించాడు. ఫీల్డ్ అంపైర్లు రోడ్ టకర్, అలీమ్ దర్, థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్ఫోర్డ్, రిజర్వ్ అంపైర్ స్టీవ్ డేవిస్ ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకుగాను దిల్షాన్కు జరిమానా విధించారు.
శ్రీలంక క్రికెటర్ దిల్షాన్కు జరిమానా
Published Tue, Apr 1 2014 3:50 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement