dilshan
-
SL VS ENG: జయసూర్య రికార్డును సమం చేసిన నిస్సంక
ప్రస్తుత ప్రపంచకప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అజేయ అర్ధశతకం సాధించిన నిస్సంక.. ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ సాధించి, లంక దిగ్గజాలు సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షన్ల సరసన చేరాడు. జయసూర్య, దిల్షన్లు కూడా ప్రపంచకప్ టోర్నీల్లో వరుసగా నాలుగు అర్ధసెంచరీలు సాధించారు. జయసూర్య 2007లో.. దిల్షన్ 2011లో ఈ ఘనత సాధించారు. గిల్ రికార్డును కూడా సమం చేసిన నిస్సంక.. నిస్సంక.. ఇంగ్లండ్‌పై నిన్న సాధించిన హాఫ్ సెంచరీతో జయసూర్య, తిలకరత్నే దిల్షన్ల రికార్డును సమం చేయడంతో మరో రికార్డును కూడా సాధించాడు. నిస్సంక.. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌తో కలిసి రికార్డును షేర్ చేసుకున్నాడు. గిల్, నిస్సంకలు ఈ ఏడాది వన్డేల్లో 11 హాఫ్ సెంచరీలు సాధించగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 10, టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి,రోహిత్ శర్మలు సంయుక్తంగా 9 హాఫ్ సెంచరీలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక.. ఇంగ్లండ్‌ను 156 పరుగులకే కుప్పకూల్చగా.. శ్రీలంక ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. నిస్సంక 77 పరుగులు, సదీర సమరవిక్రమ 65 పరుగులతో అజేయంగా నిలిచి, లంకను విజయతీరాలకు (25.4 ఓవర్లలో 160/2) చేర్చారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన లహీరు కుమారకు (7-0-35-3) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
రిచర్డ్ లెవి విధ్వంసం వృధా.. ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలకరత్నే దిల్షన్
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ నింజాస్‌తో నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్‌లో చండీఘడ్ ఛాంప్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నింజాస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ఛాంప్స్ మరో 9 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నింజాస్ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (29 బంతుల్లో 71; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలకరత్నే దిల్షన్ (46 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఛాంప్స్ను విజయతీరాలకు చేర్చాడు. దిల్షన్‌కు మరో ఎండ్‌లో గౌరవ్ తోమర్ (50) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీతో సహకరించాడు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో పాటు బంతిలోనూ (2/40) చెలరేగిన దిల్షన్.. కీలకమైన రిచర్డ్ లెవి, అభిమన్యు వికెట్లు పడగొట్టాడు. నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో గౌహతి అవెంజర్స్- వైజాగ్ టైటాన్స్.. పట్నా వారియర్స్-ఇండోర్ కింగ్స్ తలపడగా అవెంజర్స్, ఇండోర్ నైట్స్ జట్లు విజయం సాధించాయి. అవెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 78 పరుగులకే చాపచుట్టేయగా.. అవెంజర్స్ 7.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇండోర్ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేయగా.. ఇండోర్ నైట్స్ మరో ఓవర్ మిగిలుండగానే 8 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. సురేశ్ రైనా సారధ్యం వహిస్తున్న ఇండోర్ నైట్స్ టీమ్‌లో ఏకంగా ముగ్గురు డకౌట్లు కాగా.. దిల్షన్ మునవీర (53), పర్విందర్ సింగ్ (31) పోరాడి గెలిపించారు. -
హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన శ్రీలంక.. సఫారీలకు మరో షాక్
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్-2022లో భాగంగా సౌతాఫ్రికా లెజెండ్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 18) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక దిగ్గజాల టీమ్ ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. ఛేదనలో సఫారీ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా శ్రీలంక 11 పరుగుల తేడాతో విజయం సాధించి, ప్రస్తుత ఎడిషన్‌లో హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో జీవన్ మెండిస్ (27 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఉపుల్ తరంగ (27 బంతుల్లో 36; 7 ఫోర్లు), మునవీరా (24 బంతుల్లో 26; 4 ఫోర్లు), గుణరత్నే (17 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించగా.. సఫారీ బౌలర్లు క్రుగెర్ 2, ఫిలాండర్, బోథా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. మోర్నీ వాన్ విక్ (56 బంతుల్లో 76; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగినప్పటికీ విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సఫారీ జట్టులో విక్ మినహా మరే ఇతర ఆటగాడు రాణించలేకపోయాడు. లంక బౌలర్లలో కులశేఖర 2, దిల్షాన్, ఉడాన, జీవన్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో శ్రీలంక తిరిగి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి (3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) చేరుకోగా.. 4 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు, ఓ విజయం సాధించిన సౌతాఫ్రికా (ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది) నాలుగో స్థానానికి పడిపోయింది. 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇండియా లెజెండ్స్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం) మూడో ప్లేస్‌లో నిలిచింది. ఆతర్వాత న్యూజిలాండ్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం, ఓ ఓటమి), ఇంగ్లండ్ (3 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), బంగ్లాదేశ్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), ఆస్ట్రేలియా (ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓటమి) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి. -
దిల్షాన్ అదుర్స్
కోల్‌కతా: ఇటీవలి వరుస పరాజయాలకు చెక్ పెడుతూ శ్రీలంక జట్టు తమ టి20 ప్రపంచకప్‌ను గెలుపుతో ఆరంభించింది. ఓపెనర్ దిల్షాన్ (56 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు; 3 సిక్సర్లు) సూపర్ బ్యాటింగ్‌తో మునుపటి ఫామ్‌ను అందుకుని చివరికంటా క్రీజులో నిలవడంతో గురువారం అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. గ్రూప్-1లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 153 పరుగులు చేసింది. ఆరంభంలో త్వరగా వికెట్లు పడినా కెప్టెన్ అస్ఘర్ స్టానిక్జాయ్ (47 బంతుల్లో 62; 3 ఫోర్లు; 4 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. సమీయుల్లా (14 బంతుల్లో 31; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) సహకారం అందించాడు. పెరీరాకు మూడు వికెట్లు, హెరాత్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన లంక 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 155 పరుగులు చేసింది. మాథ్యూస్ (10 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు; 1 సిక్స్) చివర్లో మెరిశాడు. నబీ, రషీద్‌లకు చెరో వికెట్ దక్కింది. స్కోరు వివరాలు అఫ్ఘానిస్తాన్ ఇన్నింగ్స్: షహజాద్ (సి) చమీర (బి) మాథ్యూస్ 8; నూర్ అలీ (బి) హెరాత్ 20; అస్ఘర్ (సి) చండిమాల్ (బి) పెరీరా 62; కరీమ్ (సి) చండిమాల్ (బి) పెరీరా 0; నబీ ఎల్బీడబ్ల్యు (బి) హెరాత్ 3; సమీయుల్లా (సి) పెరీరా (బి) కులశేఖర 31; షఫీకుల్లా (సి) తిరిమన్నె (బి) పెరీరా 5; దావ్లత్ నాటౌట్ 5; నజీబుల్లా నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-12, 2-44, 3-46, 4-51, 5-112, 6-132, 7-136. బౌలింగ్: మాథ్యూస్ 3-0-17-1; కులశేఖర 4-0-43-1; చమీర 4-0-19-0; హెరాత్ 4-0-24-2; పెరీరా 4-0-33-3; సిరివర్ధన 1-0-16-0. శ్రీలంక ఇన్నింగ్స్: చండిమాల్ (సి) సమీయుల్లా (బి) నబీ 18; దిల్షాన్ నాటౌట్ 83; తిరిమన్నె (బి) రషీద్ ఖాన్ 6; పెరీరా (రనౌట్) 12; కపుగెడెర (రనౌట్) 10; మాథ్యూస్ నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1-41, 2-58, 3-85, 4-113. బౌలింగ్: కరీమ్ సాదిఖ్ 2-0-21-0; హమీద్ హసన్ 3.5-0-38-0; దవ్లత్ జద్రాన్ 3-0-31-0; నబీ 4-1-25-1; రషీద్ ఖాన్ 4-0-27-1; సమీయుల్లా 2-0-9-0. -
రాణించిన దిల్షాన్; శ్రీలంక గెలుపు
నెల్సన్: న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 277 పరుగుల టార్గెట్ ను 22 బంతులు మిగులుండగానే చేరుకుంది. 46.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. గుణతిలక(65), దిల్షాన్(91), తిరిమన్నె(87) రాణించడంతో లంక విజయం సాధించింది. చండిమాల్ 27 పరుగులు చేశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసింది. విలియమ్సన్ 59, లాథమ్ 42, సాంత్నర్ 38, గప్టిల్ 30, బ్రాస్ వేల్ 30, నికోల్స్ 20, సౌతీ 18, మిల్నె 17 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రదీప్, చమీర, వాండర్ సే రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరివర్దన ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో కివీస్, లంక 2-1 ఆధిక్యంలో ఉన్నాయి. -
శ్రీలంక క్రికెటర్ దిల్షాన్‌కు జరిమానా
చిట్టాగాంగ్: ఐసీసీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించినందుకుగాను శ్రీలంక బ్యాట్స్‌మన్ తిలకరత్నె దిల్షాన్‌కు జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 20 శాతం చెల్లించాలని ఐసీసీ ఆదేశించింది. టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని దిల్షాన్ వ్యతిరేకించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కివీస్‌తో మ్యాచ్ నాలుగో ఓవర్లో దిల్షాన్ అవుటయ్యాడు.బంతి దిల్షాన్ గ్లౌవ్స్‌ను వికెట్ కీపర్ చేతిలో పడింది. దిల్షాన్‌ను అవుట్‌గా ప్రకటించగా, అంపైర్ నిర్ణయంతో వ్యతిరేకించాడు. ఫీల్డ్ అంపైర్లు రోడ్ టకర్, అలీమ్ దర్, థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్, రిజర్వ్ అంపైర్ స్టీవ్ డేవిస్ ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకుగాను దిల్షాన్‌కు జరిమానా విధించారు.