ప్రస్తుత ప్రపంచకప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అజేయ అర్ధశతకం సాధించిన నిస్సంక.. ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ సాధించి, లంక దిగ్గజాలు సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షన్‌ల సరసన చేరాడు. జయసూర్య, దిల్షన్‌లు కూడా ప్రపంచకప్ టోర్నీల్లో వరుసగా నాలుగు అర్ధసెంచరీలు సాధించారు. జయసూర్య 2007లో.. దిల్షన్ 2011లో ఈ ఘనత సాధించారు.
గిల్ రికార్డును కూడా సమం చేసిన నిస్సంక..
నిస్సంక.. ఇంగ్లండ్‌పై నిన్న సాధించిన హాఫ్ సెంచరీతో జయసూర్య, తిలకరత్నే దిల్షన్‌ల రికార్డును సమం చేయడంతో మరో రికార్డును కూడా సాధించాడు. నిస్సంక.. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌తో కలిసి రికార్డును షేర్ చేసుకున్నాడు. గిల్, నిస్సంకలు ఈ ఏడాది వన్డేల్లో 11 హాఫ్ సెంచరీలు సాధించగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 10, టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి,రోహిత్ శర్మలు సంయుక్తంగా 9 హాఫ్ సెంచరీలు తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక.. ఇంగ్లండ్‌ను 156 పరుగులకే కుప్పకూల్చగా.. శ్రీలంక ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. నిస్సంక 77 పరుగులు, సదీర సమరవిక్రమ 65 పరుగులతో అజేయంగా నిలిచి, లంకను విజయతీరాలకు (25.4 ఓవర్లలో 160/2) చేర్చారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన లహీరు కుమారకు (7-0-35-3) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment