కెన్నింగ్‌స్టన్ ఓవల్ వేదికగా టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌కు పర్యాటక శ్రీలంక ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది.
నిసాంక సూపర్ సెంచరీ
219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్ నిసాంక సూపర్ సెంచరీతో (127 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిసాంక.. ఏంజెలో మాథ్యూస్‌తో (32 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు. లంక ఇన్నింగ్స్‌లో దిముల్ కరుణరత్నే (8), కుసాల్ మెండిస్ (39) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు.
పోప్ భారీ శతకం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. నిసాంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.
ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment