Pathum Nissanka
-
కివీస్‌తో రెండో టీ20.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడ్డ శ్రీలంక
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఇవాళ (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంక జట్టు బొక్కబోర్లా పడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), నువాన్ తుషార (4-0-22-2), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) ధాటికి 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక.. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శ్రీలంకను తొలుత లోకీ ఫెర్గూసన్ (2-0-7-3) హ్యాట్రిక్‌తో దెబ్బకొట్టగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు తీసి శ్రీలంక చేతి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడిన పథుమ్ నిస్సంకను (52) ఫిలిప్స్ ఆఖరి ఓవర్ రెండో బంతికి ఔట్ చేశాడు. ఆతర్వాత మూడు, ఐదు బంతులకు పతిరణ (0), తీక్షణ (14) వికెట్లు తీశాడు. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంకతో పాటు భానుక రాజపక్స్(15), తీక్షణ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫిలిప్స్, ఫెర్గూసన్ తలో 3 వికెట్లు.. బ్రేస్‌వెల్ 2, సాంట్నర్, ఫోల్క్స్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని తొలి టీ20లో శ్రీలంక విజయం సాధించిన విషయం తెలిసిందే. -
SL vs WI 2nd T20I: విండీస్‌ను చిత్తు చేసిన శ్రీలంక
వెస్టిండీస్ చేతిలో తొలి టీ20లో ఎదురైన పరాభవానికి శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంది. దంబుల్లా వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి నామమాత్రపు స్కోరుకే పరిమితమైనా.. బౌలర్ల విజృంభణ కారణంగా జయకేతనం ఎగురవేసింది. విండీస్‌ను 73 పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.పరిమిత ఓవర్ల సిరీస్ కోసంకాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ జట్టు శ్రీలంక పర్యటనకు వచ్చింది. పొట్టి సిరీస్‌కు దంబుల్లా, వన్డే సిరీస్‌కు పల్లెకెలె ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తొలి టీ20లో విండీస్ గెలవగా.. మంగళవారం శ్రీలంక జయభేరి మోగించింది.నిసాంక హాఫ్ సెంచరీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్,ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పాతుమ్ నిసాంక (49 బంతుల్లో 54; 9 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో రాణించగా... కుశాల్ మెండిస్ (26; 2 ఫోర్లు, ఒక సిక్సర్), కుశాల్ పెరీరా (24; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించారు.బౌలర్లు పడగొట్టేశారుఇక విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 16.1 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రావ్మన్ పావెల్ (17 బంతుల్లో 20; ఒక ఫోర్, ఒక సిక్స్) టాప్ స్కోరర్. బ్రాండన్ కింగ్ (5), ఎవిన్ లూయిస్ (7), ఆండ్రూ ఫ్లెచర్ (4), రోస్టన్ చేజ్ (0) పూర్తిగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో టీ20 అరంగేట్ర ఆటగాడు దునిత్ వెల్లలాగె 3, మహీశ్ తీక్షణ, అసలంక, హసరంగ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లోని చివరిదైన మూడో టీ20 గురువారం జరుగనుంది.చదవండి: T20 WC: భారత్ అవుట్!.. ఇంత చెత్తగా ఆడతారా?: పాక్ మాజీ కెప్టెన్ -
SL Vs WI: విండీస్‌తో రెండో టీ20.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక
డంబుల్లా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక అర్ద సెంచరీతో (54) రాణించగా.. కుసాల్ మెండిస్ 26, కుసాల్ పెరీరా 24, కమిందు మెండిస్ 19, చరిత్ అసలంక 9, భానుక రాజపక్స 5, వనిందు హసరంగ 5 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, షమార్ స్ప్రింగర్ తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కమిందు మెండిస్ (51), చరిత్ అసలంక (59) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రాండన్ కింగ్ (63), ఎవిన్ లెవిస్ (50) అర్ద సెంచరీలు చేసి విండీస్‌ను గెలిపించారు. చదవండి: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. భారీ రికార్డుపై కన్నేసిన విరాట్ -
మొన్న టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్..!
హెడ్ కోచ్ సనత్ జయసూర్య ఆథ్వర్యంలో శ్రీలంక క్రికెట్ జట్టు సంచలన విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే భారత్‌కు వన్డే సిరీస్‌లో షాకిచ్చిన (0-2 తేడాతో) శ్రీలంక.. తాజాగా ఇంగ్లండ్‌కు వారి సొంతగడ్డపై ఓటమి రుచి చూపించింది. జయసూర్య హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక శ్రీలంక ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లు ప్రతి ఒక్కరూ రాణిస్తున్నారు. జయసూర్య పర్యవేక్షణలో కమిందు మెండిస్, పథుమ్ నిస్సంక, మిలన్ రత్నాయకే లాంటి యువ ఆటగాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో శ్రీలంక తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ.. యువ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉండింది. మూడో టెస్ట్‌లో నిస్సంకకు అవకాశం ఇచ్చి జయసూర్య పెద్ద సాహసమే చేశాడు. సత్ఫలితం రాబట్టాడు. మూడో టెస్ట్‌లో నిస్సంక తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ.. ఛేదనలో మెరుపు సెంచరీ చేసి శ్రీలంకకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మొత్తంగా జయసూర్య శ్రీలంకకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కనిపిస్తున్నాడు.కాగా, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది.నిస్సంక సూపర్ సెంచరీ219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక సూపర్ సెంచరీతో (127 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిస్సంక.. ఏంజెలో మాథ్యూస్‌తో (32 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు.పోప్ భారీ శతకంఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. నిస్సంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. -
144 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి: నిసాంక ప్రపంచ రికార్డు
శ్రీలంక యువ బ్యాటర్ పాతుమ్ నిసాంక సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగి.. వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 144 ఏళ్ల చరిత్రలో ఇంగ్లండ్ గడ్డపై ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. అదేమిటంటే...!!లంక అనూహ్య విజయంప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టు గెలుపొంది సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అయితే, నామమాత్రపు మూడో టెస్టులో శ్రీలంక అనూహ్య రీతిలో విజయం సాధించింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది.వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకునితద్వారా వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకుని ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించగలిగింది. అయితే, ఇంగ్లండ్‌లో మూడో టెస్టులో శ్రీలంక గెలుపొందడంలో ఓపెనర్ పాతుమ్ నిసాంకదే కీలక పాత్ర. తొలి ఇన్నింగ్స్‌లో 51 బంతుల్లో 64 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లోనే 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టును విజయతీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.1880 నుంచి ఇదే మొదటిసారిఅయితే, నిసాంక సెంచరీ మార్కు అందుకునే కంటే ముందే అత్యంత అరుదైన ఘనత ఒకటి తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 41 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్న నిసాంక.. రెండో ఇన్నింగ్స్‌లో 42 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా 26 ఏళ్ల నిసాంక చరిత్రకెక్కాడు.ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ వీరులు వీరేకాగా 1880లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 559 మ్యాచ్‌లకు ఈ దేశం ఆతిథ్యం ఇచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కూడా నిసాంక మాదిరి ఇలా రెండు ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన దాఖలాలు లేవు.ఇదిలా ఉంటే.. టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా యాభై పరుగుల మార్కు అందుకున్న క్రికెటర్ల జాబితాలో మాత్రం నిసాంక తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ముందున్నది ఎవరంటే..👉మార్క్ గ్రేట్బచ్(న్యూజిలాండ్)- జింబాబ్వే మీద- 1992లో👉నాథన్ ఆస్ట్లే(న్యూజిలాండ్)- వెస్టిండీస్ మీద- 1996లో👉తిలకరత్నె దిల్షాన్(శ్రీలంక)- న్యూజిలాండ్ మీద- 2009లో👉క్రిస్ గేల్(వెస్టిండీస్)- న్యూజిలాండ్ మీద- 2012లో👉జెర్మానే బ్లాక్‌వుడ్(వెస్టిండీస్)- టీమిండియా మీద- 2916లో👉డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- పాకిస్తాన్ మీద- 2017లో👉జాక్ క్రాలే(ఇంగ్లండ్)- పాకిస్తాన్ మీద- 2022లో👉హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- న్యూజిలాండ్ మీద- 2023లో👉పాతుమ్ నిసాంక(శ్రీలంక)- ఇంగ్లండ్ మీద- 2024లోచదవండి: Afg vs NZ: నోయిడాలో తొలి రోజు ఆట రద్దు.. కారణం ఇదే! -
నిసాంక సూపర్ సెంచరీ.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన శ్రీలంక
కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌కు పర్యాటక శ్రీలంక ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది.నిసాంక సూపర్ సెంచరీ219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్ నిసాంక సూపర్ సెంచరీతో (127 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిసాంక.. ఏంజెలో మాథ్యూస్‌తో (32 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు. లంక ఇన్నింగ్స్‌లో దిముల్ కరుణరత్నే (8), కుసాల్ మెండిస్ (39) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు.పోప్ భారీ శతకంఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. నిసాంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
చెలరేగిన చండీమాల్.. 225 పరుగుల లక్ష్యం హాం ఫట్
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ఇవాళ (జులై 9) రసవత్తర సమరం జరిగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని క్యాండీ ఫాల్కన్స్ ఆడుతూపాడుతూ ఛేదించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్.. పథుమ్ నిస్సంక శతక్కొట్టండతో (59 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లు) నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.జాఫ్నా ఇన్నింగ్స్‌లో నిస్సంకతో పాటు రిలీ రొస్సో (18 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించాడు. క్యాండీ బౌలర్లలో షనక 3, దుష్మంత చమీరా, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం 225 పరుగుల భారీ లక్ష్య ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ ఆది నుంచే దూకుడుగా ఆడింది. దినేశ్ చండీమాల్ (37 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కమిందు మెండిస్ (36 బంతుల్లో 65 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (13 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్ హరీస్ (18 బంతుల్లో 25; 5 ఫోర్లు) బ్యాట్‌ను పని చెప్పారు. ఫలితంగా క్యాండీ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఊదేసింది. -
52 బంతుల్లో శతక్కొట్టిన లంక ఓపెనర్
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మూడో సెంచరీ (టిమ్ సీఫర్ట్, కుశాల్ పెరీరా) నమోదైంది. క్యాండీ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ ఓపెనర్ పథుమ్ నిస్సంక సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా.. నిస్సంక మెరుపు శతకంతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది.52 బంతుల్లోనే శతక్కొట్టిన నిస్సంకనిస్సంక కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఓవరాల్‌గా 59 బంతులు ఎదుర్కొన్న నిస్సంక 16 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేసి ఔటయ్యాడు. నిస్సంకతో పాటు రిలీ రొస్సో (18 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించడంతో జాఫ్నా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. జాఫ్నా ఇన్నింగ్స్‌లో నిస్సంక, రొస్సో మినహా చెప్పుకోదగ్గ స్కోర్లు ఎవరూ చేయలేదు. కుశాల్ మెండిస్ 26, అవిష్క ఫెర్నాండో 16, కెప్టెన్ చరిత్ అసలంక 2, అజ్మతుల్లా 1, వనుజ సహన్ 0 పరుగులకే ఔటయ్యారు. క్యాండీ బౌలర్లలో షనక 3, దుష్మంత చమీరా, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో క్యాండీ కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ జట్టు 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. దినేశ్ చండీమాల్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. ఆండ్రీ ఫ్లెచర్ (13), మొహమ్మద్ హరీస్ (25) ఔట్ కాగా.. చండీమాల్తో (32 బంతుల్లో 78; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) పాటు కమిందు మెండిస్ (16) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో క్యాండీ గెలవాలంటే 48 బంతుల్లో 88 పరుగులు చేయాల్సి ఉంది. -
ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..
2024 ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (మార్చి 4) వెల్లడించింది. టీమిండియా యంగ్ గన్ యశస్వి జైస్వాల్, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక గత నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా ఎంపికయ్యారు. ఫిబ్రవరి నెలలో వీరి ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని ఐసీసీ వీరి పేర్లను ప్రకటించింది. యశస్వి గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ల్లో 112 సగటున 560 పరుగులు చేశాడు. ఇందులో వరుస డబుల్ సెంచరీలు ఉన్నాయి. కేన్ మామ ఫిబ్రవరిలో ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో (సౌతాఫ్రికాతో) వరుస సెంచరీల సాయంతో 403 పరుగులు చేశాడు. నిస్సంక విషయానికొస్తే.. ఈ లంక ఓపెనర్ గత నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడిన 3 వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీ సాయంతో 350కిపైగా పరుగులు చేశాడు. మహిళల విభాగంలో యూఏఈకి చెందిన కవిష ఎగోడగే, ఈషా ఓజా, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా ఎంపికయ్యారు. ఈ ముగ్గురు ఆల్‌రౌండర్లు గత నెలలో జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించారు. స్వతంత్ర ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఓటింగ్ పద్దతిన విజేతలను నిర్ణయిస్తారు. విజేతల పేర్లను వచ్చే వారం ప్రకటిస్తారు. icc-cricket.com/awardsలో పేర్లు నమోదు చేసుకున్న అభిమానులు శనివారం వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. -
SL Vs Afg: శతక్కొట్టిన యువ బ్యాటర్.. క్లీన్‌స్వీప్ చేసిన లంక
Sri Lanka vs Afghanistan, 3rd ODI- పల్లెకెలె: అఫ్గానిస్తాన్‌లో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో లంక 7 వికెట్ల తేడాతో అఫ్గాన్‌పై ఘన విజయం సాధించింది. అఫ్గాన్ 48.2 ఓవర్లలో 266 పరుగుల వద్ద ఆలౌటైంది. రహ్మత్ షా (65; 7 ఫోర్లు, 1 సిక్స్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (54; 4 ఫోర్లు) రాణించారు. శ్రీలంక 35.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసి గెలిచింది. 25 ఏళ్ల పాతుమ్ నిసాంక (101 బంతుల్లో 118; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగా...అవిష్క ఫెర్నాండో (91; 10 ఫోర్లు, 5సిక్స్‌లు) శతకం చేజార్చుకున్నాడు. నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నబీ... ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్స్ కొత్త ర్యాంకింగ్స్‌లో అఫ్గాన్ ఆటగాడు మొహమ్మద్ నబీ నంబర్‌వన్ స్థానాన్ని అందుకున్నాడు. అతి పెద్ద వయసులో (39 ఏళ్ల ఒక నెల) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నబీ నిలిచాడు. 1739 రోజులు (మే 7, 2019నుంచి) నంబర్‌వన్ ఆల్‌రౌండర్ ర్యాంక్‌లో కొనసాగిన షకీబ్ అల్ హసన్ ఎట్టకేలకు రెండో స్థానానికి పడిపోయాడు. -
డబుల్ సెంచరీ, సెంచరీ.. జయసూర్యను తలపిస్తున్న లంక ఓపెనర్
శ్రీలంక యువ ఓపెనర్ పథుమ్ నిస్సంక అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఒక్క మ్యాచ్ గ్యాప్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ బాదాడు. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో రికార్డు డబుల్ సెంచరీతో (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్సర్లు) చరిత్ర సృష్టించిన నిస్సంక.. ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న మూడో వన్డేలో మరో సెంచరీ చేసి యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. నిస్సంక రోజుల వ్యవధిలో డబుల్ సెంచరీ, సెంచరీ చేయడంతో లంక క్రికెట్ అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోతున్నాయి. సనత్ జయసూర్య తర్వాత ఇన్నాళ్లకు తమకు ఆ స్థాయి ఓపెనర్ దొరికాడని వారు సంబురపడిపోతున్నారు. నిస్సంక, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, మధుశంక లాంటి క్రికెటర్లు శ్రీలంక క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక విజయపు అంచుల్లో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. అజ్మతుల్లా ఒమర్జాయ్ (54), రహ్మత్ షా (65), రహ్మనుల్లా గుర్బాజ్ (48), ఇక్రమ్ (32) రాణించడంతో 48.2 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌటైంది. లంక బౌలర్లలో మధుషన్ 3, అషిత ఫెర్నాండో, దునిత్ వెల్లలగే, అఖిల ధనంజయ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక మెరుపు వేగంతో విజయం దిశగా సాగుతుంది. నిస్సంక (117 నాటౌట్), ఆవిష్క ఫెర్నాండో (91) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు 31 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 247 పరుగులు చేసింది. లంక విజయానికి మరో 20 పరుగులు మాత్రమే కావాలి. నిస్సంకతో పాటు కుశాల్ మెండిస్ (36) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రీలంక ఇదివరకే సిరీస్ కైవసం చేసుకుంది. -
నిసాంక 210 నాటౌట్
పల్లెకెలె: ఓపెనర్ పతున్ నిసాంక (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఫలితంగా అఫ్గానిస్తాన్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 42 పరుగుల తేడాతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా లంక నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. నిసాంక ప్రత్యర్థి బౌలింగ్‌పై కడదాకా విధ్వంసం కొనసాగించాడు. 88 బంతుల్లో సెంచరీ సాధించిన ఈ ఓపెనర్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో తర్వాతి 100 పరుగుల్ని కేవలం 48 బంతుల్లోనే సాధించడంతో 136 బంతుల్లో అతని డబుల్ సెంచరీ పూర్తయ్యింది. ఇప్పటివరకు వన్డేల్లో లంక టాప్ స్కోరర్‌గా నిలిచిన మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య (189) ప్రేక్షకుడిగా హాజరైన ఈ మ్యాచ్‌లోనే నిసాంక అతని రికార్డును అతని కళ్లముందే బద్దలు కొట్టడం విశేషం. అవిష్క ఫెర్నాండో (88 బంతుల్లో 88; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించిన నిసాంక... సమరవిక్రమ (45; 4 ఫోర్లు, 1 సిక్స్)తో మూడో వికెట్‌కు 120 పరుగులు జత చేశాడు. అనంతరం అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసి పోరాడి ఓడింది. 27/4 స్కోరు వద్ద కష్టాల్లో పడిన జట్టును అజ్మతుల్లా ఒమర్జాయ్ (115 బంతుల్లో 149 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు), మొహమ్మద్ నబీ (130 బంతుల్లో 136; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో నడిపించారు. ఇద్దరు ఆరో వికెట్‌కు 242 పరుగులు జోడించారు. శ్రీలంక బౌలర్లలో మదుషాన్ 75 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రేపు ఇదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది. 12 ఓవరాల్‌గా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో నమోదైన డబుల్ సెంచరీల సంఖ్య. ఇందులో సగానికి (7)పైగా బాదింది భారత బ్యాటర్లే! ఒక్క రోహిత్ శర్మే మూడు ద్విశతకాలను సాధించాడు. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ ఈ జాబితాలో ఉన్నారు. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్), క్రిస్ గేల్ (వెస్టిండీస్), ఫఖర్ జమాన్ (పాకిస్తాన్), మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) కూడా వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు. 3 నిసాంకది వన్డేల్లో మూడో వేగవంతమైన డబుల్ సెంచరీ (138 బంతుల్లో). ఈ జాబితాలో మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో), ఇషాన్ కిషన్ (131 బంతుల్లో) ముందు వరుసలో ఉన్నారు. -
విధ్వంసకర డబుల్ సెంచరీ.. సెహ్వాగ్, క్రిస్ గేల్ రికార్డులు బద్దలు
వన్డే క్రికెట్లో మరో విధ్వంసకర డబుల్ సెంచరీ నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక మెరుపు ద్విశతకంతో (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. కేవలం 136 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును చేరిన నిస్సంక.. వన్డేల్లో మూడో వేగవంతమైన డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ (138 బంతుల్లో), వీరేంద్ర సెహ్వాగ్ (140 బంతుల్లో) లాంటి అరివీర భయంకరుల రికార్డులను అధిగమించాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ పేరిట ఉంది. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కేవలం 126 బంతుల్లోనే డబుల్ బాదాడు. రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (128) పేరిట ఉంది. తాజా డబుల్ సెంచరీతో నిస్సంక మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. వన్డేల్లో డబుల్ నమోదు చేసిన తొలి శ్రీలంక ఆటగాడిగా, ఓవరాల్‌గా 12వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. నిస్సంకకు ముందు రోహిత శర్మ, మార్టిన్ గప్తిల్, సెమ్వాగ్, క్రిస్ గేల్, ఫకర్ జమాన్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, మ్యాక్స్‌వెల్, సచిన్ టెండూల్కర్ వన్డేల్లో డబుల్ మార్కును తాకారు. వీరిలో రోహిత్ శర్మ అత్యధికంగా మూడు వన్డే డబుల్‌లు సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. నిస్సంక విధ్వంసకర ద్విశతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగుల భారీ స్కోర్ చేసింది. నిస్సంకతో పాటు మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (88), సమరవిక్రమ (45) రాణించారు. నిస్సంక ఊచకోత ధాటికి ప్రపంచలోకెల్లా మెరుగైన స్పిన్ అటాక్ కలిగిన ఆఫ్ఘన్లు చిగురుటాకుల్లా వణికిపోయారు. -
SL VS ENG: జయసూర్య రికార్డును సమం చేసిన నిస్సంక
ప్రస్తుత ప్రపంచకప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అజేయ అర్ధశతకం సాధించిన నిస్సంక.. ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ సాధించి, లంక దిగ్గజాలు సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షన్ల సరసన చేరాడు. జయసూర్య, దిల్షన్లు కూడా ప్రపంచకప్ టోర్నీల్లో వరుసగా నాలుగు అర్ధసెంచరీలు సాధించారు. జయసూర్య 2007లో.. దిల్షన్ 2011లో ఈ ఘనత సాధించారు. గిల్ రికార్డును కూడా సమం చేసిన నిస్సంక.. నిస్సంక.. ఇంగ్లండ్‌పై నిన్న సాధించిన హాఫ్ సెంచరీతో జయసూర్య, తిలకరత్నే దిల్షన్ల రికార్డును సమం చేయడంతో మరో రికార్డును కూడా సాధించాడు. నిస్సంక.. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌తో కలిసి రికార్డును షేర్ చేసుకున్నాడు. గిల్, నిస్సంకలు ఈ ఏడాది వన్డేల్లో 11 హాఫ్ సెంచరీలు సాధించగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 10, టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి,రోహిత్ శర్మలు సంయుక్తంగా 9 హాఫ్ సెంచరీలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక.. ఇంగ్లండ్‌ను 156 పరుగులకే కుప్పకూల్చగా.. శ్రీలంక ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. నిస్సంక 77 పరుగులు, సదీర సమరవిక్రమ 65 పరుగులతో అజేయంగా నిలిచి, లంకను విజయతీరాలకు (25.4 ఓవర్లలో 160/2) చేర్చారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన లహీరు కుమారకు (7-0-35-3) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
WC 2023: పొరపాటు చేయలేదు.. మా ఓటమికి కారణాలివే! అయినా..: బట్లర్
ICC WC 2023- Jos Buttler Comments On Loss: ‘‘మాకిది కష్టకాలం. కెప్టెన్‌గా నాతో పాటు మా ఆటగాళ్లంతా పూర్తిగా నిరాశకు లోనయ్యాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోయాం. మా జట్టులో అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. కానీ ఇపుడిలా జరిగిపోయింది. అయినా ఒక్కరోజులో మాది చెత్త టీమ్‌గా మారిపోదు కదా! అయితే, బాధ.. మాపై మాకు కోపం.. విసుగు వస్తున్నాయి. మేమిలా విఫలం చెందడానికి ఇదీ కారణం అని చెప్పడానికి ఏమీ లేదు. సెలక్షన్ విషయంలో మేము ఎలాంటి పొరపాట్లు చేయలేదు. మాకది అసలు సమస్యే కాదు. అయితే, స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాం అనేది మాత్రం వాస్తవం. ఆ విషయంలో గర్వపడుతున్నాం ఈరోజు రూట్ రనౌట్ కావడం వంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. సాధారణంగా మేము ఇలాంటి తప్పులు చేయము. ఈరోజు భాగస్వామ్యాలు నెలకొల్పడంలోనూ పూర్తిగా వైఫల్యం చెందాం. బ్యాట్, బంతి.. రెండింటితోనూ కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాం. ఏదేమైనా పటిష్ట జట్టుగా ఎదిగిన తీరు, మేము నెలకొల్పిన ప్రమాణాల పట్ల గర్వపడుతున్నాం. మిగిలిన మ్యాచ్‌లలో తిరిగి పుంజుకుని రాణిస్తామనే నమ్మకం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం’’అని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ వరుస పరాభవాలు మూటగట్టుకుంటోంది. శ్రీలంక చేతిలో మరోసారి చిత్తుగా తాజాగా బెంగళూరులో గురువారం శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది ఇంగ్లండ్. వరల్డ్‌కప్ చరిత్రలో ఇంగ్లండ్‌పై ఏకపక్ష విజయాలతో దూసుకుపోతున్న శ్రీలంక మరోసారి అదే ఫీట్ రిపీట్ చేయడంతో ఇంగ్లండ్‌కు మరో ఘోర ఓటమి ఎదురైంది. దీంతో హాట్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బట్లర్ బృందం సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్థాయికి తగ్గట్లు ఆడలేక పరాభవాల పాలవుతున్నామని పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్‌లలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపాడు. ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక స్కోర్లు: ►టాస్- ఇంగ్లండ్- బ్యాటింగ్ ►ఇంగ్లంగ్ స్కోరు: 156 (33.2) ►శ్రీలంక స్కోరు: 160/2 (25.4) ►8 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లాహిరు కుమార(మూడు వికెట్లు) ►టాప్ స్కోరర్: పాతుమ్ నిసాంక(77- నాటౌట్) చదవండి: శ్రీలంక చేతిలో ఇంగ్లండ్‌కు మరో ఘోర ఓటమి.. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్లేనా? View this post on Instagram A post shared by ICC (@icc) -
బాబర్ ఆజమ్ విశ్వరూపం.. సుడిగాలి శతకంతో విధ్వంసం
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో భాగంగా గాలే టైటాన్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 7) జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్టయికర్స్ ఆటగాడు, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ విశ్వరూపం ప్రదర్శించాడు. మెరుపు శతకంతో విధ్వంసం సృష్టించాడు. భారీ ఛేదనలో (189) పూనకాలు వచ్చినట్లు ఊగిపోయిన పాక్ కెప్టెన్.. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కొలొంబో స్ట్రయికర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. Colombo Strikers win the last over thriller in Pallekele. Babar Azam leads the batting side with a sensational century. pic.twitter.com/sM8bkYU1jT — CricTracker (@Cricketracker) August 7, 2023 ఆఖరి ఓవర్లో వేగంగా మ్యాచ్‌ను ముగించే క్రమంలో బాబర్ (104) ఔట్ కాగా.. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మహ్మద్ నవాజ్ 4 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 14 పరుగులు చేసి కొలంబోను విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు బాబర్‌కు జతగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన పథుమ్ నిస్సంక (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, సిక్స్) అర్ధశతకంతో రాణించగా.. నువనిదు ఫెర్నాండో (8) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. నవాజ్‌తో పాటు చమిక కరుణరత్నే (2) అజేయంగా నిలిచారు. ఆఖరి ఓవర్ ఐదో బంతికి బౌండరీ బాది నవాజ్ కొలొంబోను గెలిపించాడు. గాలే బౌలర్లలో తబ్రేజ్ షంషి 2, కసున్ రజిత ఓ వికెట్ పడగొట్టారు. Kasun Rajitha ends Babar Azam's masterclass. Colombo Strikers need a miracle to win the game. pic.twitter.com/btIUW54X9p — CricTracker (@Cricketracker) August 7, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గాలే టైటాన్స్.. లసిత్ క్రూస్పుల్లే (19 బంతుల్లో 36; 4 ఫోర్లు,2 సిక్సర్లు), షెవాన్ డేనియల్ (31 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), భానుక రాజపక్స (31 బంతుల్లో 30; 2 ఫోర్లు), టిమ్ సీఫర్ట్ (35 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కొలొంబో బౌలర్లలో నసీం షా, రమేశ్ మెండిస్, సందకన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన బాబర్ సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి లీగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
SL Vs WI: విండీస్‌కు మరో పరాభవం.. ఇంతకంటే గొప్పగా ఏం చేయగలరు?!
ICC Cricket World Cup Qualifiers 2023- Sri Lanka vs West Indies- హరారే: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ‘సూపర్ సిక్స్’ దశను కూడా శ్రీలంక జట్టు అజేయంగా ముగించింది. వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. వెస్టిండీస్ నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 44.2 ఓవర్లలో ఛేదించింది. దుమ్ములేపిన నిసాంక నిసాంక (113 బంతుల్లో 104; 14 ఫోర్లు) సెంచరీ సాధించగా... దిముత్ కరుణరత్నే (92 బంతుల్లో 83; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 190 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక కుశాల్ మెండిస్ (34 నాటౌట్; 3 ఫోర్లు), సమరవిక్రమ (17 నాటౌట్; 1 ఫోర్) మూడో వికెట్‌కు అజేయంగా 40 పరుగులు జతచేశారు. కీసీ కార్టీ ఒక్కడే అంతకుముందు వెస్టిండీస్ 48.1 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. కీసీ కార్టీ (87; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మహీశ్ తీక్షణ 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో నెదర్లాండ్స్‌తో శ్రీలంక తలపడుతుంది. ఫైనల్ చేరడంద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్ ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించాయి. ఇదిలా ఉంటే.. సూపర్ సిక్స్ దశలో ఆఖరి మ్యాచ్‌లోనూ విండీస్ పరాజయం పాలవడంతో మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఇంతకంటే గొప్పగా ఏం చేయగలరు? మన ఆట తీరు మారదు కదా!’’ అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బజ్‌బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
థండర్‌బోల్ట్.. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది! వీడియో వైరల్
శ్రీలంకతో రెండో టీ20లో న్యూజిలాండ్ పేసర్ ఆడం మిల్నే దుమ్ము రేపాడు. ఐదు వికెట్లతో చెలరేగి లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. తన నాలుగు ఓవర్ల బ్యాటింగ్ కోటా పూర్తి చేసిన మిల్నే.. 26 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయంలో వికెట్లు కూల్చాడు. ఓపెనర్ పాతుమ్ నిసాంక(9)ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి కివీస్‌కు శుభారంభం అందించిన మిల్నే.. కుశాల్ పెరెరా(35), చరిత్ అసలంక(24) సహా ఆఖర్లో ప్రమోద్ మదుషాన్(1), దిల్షాన్ మదుషంక(0)లను పెవిలియన్‌కు పంపాడు. మిల్నే విజృంభణ.. దంచి కొట్టిన సీఫర్ట్ మిల్నే విజృంభణతో డునెడిన్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆతిథ్య కివీస్ .. లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేసి టార్గెట్‌ను ఛేదించింది. దసున్ షనక విధించిన 142 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 14.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. టిమ్ సీఫర్ట్ 43 బంతుల్లో 79 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా 9 వికెట్లతో గెలుపొంది.. తొలి టీ20లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది ఇదిలా ఉంటే.. తన అద్భుత బౌలింగ్‌తో లంక బ్యాటర్లను బోల్తా కొట్టించిన ఆడం మిల్నే.. సూపర్ డెలివరీతో పాతుమ్ నిసాంక బ్యాట్‌ను విరగ్గొట్టిన తీరు ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆరంభంలోనే ఈ మేరకు తన పేస్ పదును చూపించాడు మిల్నే. తొలి ఓవర్లోనే మిల్నే దెబ్బకు పాతుమ్ నిసాంక బ్యాట్ హ్యాండిల్ విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా న్యూజిలాండ్- శ్రీలంక రెండో టీ20లో మిల్నే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 8న నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది. చదవండి: వన్డే క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు 🚨 BROKEN BAT 🚨 Adam Milne with a ☄️ breaking Nissanka’s bat 😮 Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/F2uI6NiUni — Spark Sport (@sparknzsport) April 5, 2023 Pathum Nissanka's bat 🤯#SparkSport #NZvSL pic.twitter.com/t2cLh9w9Iq — Spark Sport (@sparknzsport) April 5, 2023 -
ఒకేరోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు స్టార్ క్రికెటర్లు! ఓవైపు సిరీస్ ఆడుతూనే..
Sri Lanka vs Afghanistan ODI Series: శ్రీలంక యువ ఆటగాళ్లు చరిత్ అసలంక, కసున్ రజిత, పాతుమ్ నిసాంక అభిమానులకు స్వీట్ షాకిచ్చారు. ఈ ముగ్గురూ ఒకేరోజు వివాహ బంధంలో అడుగుపెట్టారు. కొలంబోలోని వేర్వేరు వేదికల్లో సోమవారం తమ పెళ్లి తంతును పూర్తి చేసుకున్నారు. కొత్త జంటలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కాగా అఫ్గనిస్తాన్‌తో శ్రీలంక ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య లంక ఓడిపోగా.. రెండో వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే ఈ క్రమంలో బుధవారం నాటి ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి సిరీస్ సమం చేయాలని దసున్ షనక సేన భావిస్తోంది. కాగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో అసలంక, నిసాంక, రజిత ఆడటం విశేషం. ఆ మరుసటి రోజే ఇలా ఈ ముగ్గురూ తమ ప్రియురాళ్ల వేలికి ఉంగరం తొడిగి వైవాహిక బంధాన్ని మొదలుపెట్టడం గమనార్హం. ఇక జట్టులో కీలక సభ్యులైన అసలంక, నిసాంక, రజిత.. పల్లెకెలోలో జరుగనున్న మూడో వన్డేలోనూ జట్టులో ఆడే అవకాశం ఉంది. బ్యాటర్, ఆల్‌రౌండర్, బౌలర్! 24 ఏళ్ల పాతుమ్ నిసాంక లంక ఓపెనర్‌గా రాణిస్తుండగా.. 25 ఏళ్ల చరిత్ అసలంక బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇక 29 ఏళ్ల కసున్ రజిత పేస్ దళంలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు పెళ్లి బంధంలో అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా శ్రీలంకలో సంక్షోభం నేపథ్యంలో హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా ఈ మూడు జంటల పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. చదవండి: 6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8! FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్ చేసి.. ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్‌లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందడుగు వేసిన అఫ్గనిస్తాన్ Congratulations to Charith Asalanka, Pathum Nissanka and Kasun Rajitha! 💍🎉 pic.twitter.com/qlUZKtOMVG — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 28, 2022 -
అయ్యో నిసాంక! పాపం కిందపడిపోయాడు.. షూ కూడా! హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
ICC Mens T20 World Cup 2022 - Sri Lanka vs United Arab Emirates: యూఏఈతో మ్యాచ్‌లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిసాంక. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి 60 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 74 పరుగులు సాధించాడు. తద్వారా లంక జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు సాయం చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కాసేపు బెంబేలెత్తించాడు! టీ20 ప్రపంచకప్-2022 క్వాలిఫైయర్స్‌లో భాగంగా జీలాంగ్ వేదికగా యూఏఈతో తమ రెండో మ్యాచ్ ఆడింది దసున్ షనక బృందం. తొలి మ్యాచ్‌లో నమీబియా చేతిలో కంగుతిన్న ఈ ఆసియాకప్-2022 విజేతను యూఏఈ కూడా కాస్త భయపెట్టింది. ముఖ్యంగా చెన్నైకి చెందిన యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయప్పన్ ఒకే ఓవర్లో వరుసగా మూడు వికెట్లు పడగొట్టి లంక బ్యాటర్లకు వణుకుపుట్టించాడు. అయితే, పాతుమ్ నిసాంక మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. పాపం కిందపడిపోయాడు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా 18వ ఓవర్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జాహూర్ ఖాన్ వేసిన బంతిని షాట్ ఆడే క్రమంలో నిసాంక బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయాడు. అతడి షూ కూడా ఊడిపోయింది. అయితే, బంతి బౌండరీ దాటడంతో నాలుగు పరుగులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లంక ఘన విజయం ఇక మ్యాచ్ విషయానికొస్తే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పాతుమ్ నిసాంక అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి శ్రీలంక 152 పరుగులు చేయగలిగింది. లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈని లంక బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. దుష్మంత చమీర 3, వనిందు హసరంగ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రమోద్ మదుషాన్ ఒకటి, మహీశ్ తీక్షణ రెండు, దసున్ షనక ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో 17.1 ఓవర్లలోనే 73 పరుగులు చేసి యూఏఈ ఆలౌట్ అయింది. ఇక శ్రీలంక తమ తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో గురువారం తలపడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
'ఇదేం చెత్త అంపైరింగ్.. కళ్లు కనిపించడం లేదా'
ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంక- ఆఫ్గానిస్తాన్ తొలి మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. శ్రీలంక ఇన్నింగ్స్ 2 ఓవర్ వేసిన నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో బంతి పాతుమ్ నిస్సంక బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే బౌలర్‌తో పాటు వికెట్ కీపర్ కూడా క్యాచ్‌కు అప్పీల్ చేశాడు. అయితే ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి వెంటనే ఔట్ అని వేలు పైకిత్తాడు. ఈ క్రమంలో నిస్సంక నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న గుణతిలకతో చర్చించి రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లేలో బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్ కనిపించలేదు. అయినప్పటికీ థర్డ్ అంపైర్ మాత్రం బంతి బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది అంటూ ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాటర్‌తో పాటు డగౌట్లో ఉన్న శ్రీలంక జట్టు మేనేజ్మెంట్ కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంపై శ్రీలంక అభిమానులు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఇదేం చెత్త అంపైరింగ్‌రా.. కళ్లు కనిపించడం లేదా" అంటూ కామెంట్ చేశాడు. Can't even ask 'Out or not out' 😵💫 Pathum Nissanka at the receiving end of a shocker in #AsiaCup2022 #SLvAFG #AsiaCup pic.twitter.com/e47XDC6Kwi — CricXtasy (@CricXtasy) August 27, 2022 Sri lanka dedicating this scorecard to their father india (Source: Daniel Alexander)#AFGvSL #AsiaCup2022 pic.twitter.com/dDpyDxIZ8E — YouAreWrong (@huihui_____) August 27, 2022 #AFGvSL #AsiaCup2022 Third Umpire taking decision on Pathum Nissanka's Dismissal: pic.twitter.com/HSZ2AY7ghD — Vichitra.Duniya 🌏 (@vichitra_duniya) August 27, 2022 -
టెస్ట్ మ్యాచ్ మధ్యలో కరోనాగా నిర్ధారణ.. బెంబేలెత్తిపోతున్న ఆటగాళ్లు
Pathum Nissanka: శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. ఆతిధ్య శ్రీలంక జట్టుకు చెందిన ఆటగాళ్లు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. రెండో టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఓపెనర్ పథుమ్ నిస్సంకకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కోవిడ్ బారిన పడిన లంక ఆటగాళ్ల సంఖ్య ఆరుకు చేరింది. మూడో రోజు ఆట మధ్యలో అస్వస్థతకు గురైన నిస్సంకకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. 🔴 Team Updates: Pathum Nissanka has tested positive for Covid-19. He was found to be positive during an Antigen test conducted on the player yesterday morning, following the player complaining of feeling unwell. #SLvAUS pic.twitter.com/NwTdTLOVFZ — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 దీంతో అతను మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. అతని స్థానంలో ఒషాడ ఫెర్నాండో కోవిడ్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చాడు. అంతకుముందు తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా లంక స్టార్ ఆటగాడు ఏంజలో మాథ్యూస్ సైతం ఇలానే మ్యాచ్ మధ్యలో కోవిడ్ బారిన పడ్డాడు. ఆ తర్వాత జట్టు మొత్తానికి జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మరో నలుగురికి (ప్రవీణ్ జయవిక్రమ, ధనంజయ డిసిల్వ, జెఫ్రె వాండర్సే, అషిత ఫెర్నాండో) కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శ్రీలంక జట్టులో వరుసగా కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నా ప్రత్యర్ధి ఆస్ట్రేలియా జట్టులో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఇదిలా ఉంటే, కోవిడ్ కేసు వెలుగుచూసినా మ్యాచ్ యధాతథంగా కొనసాగుతుంది. నాలుగో రోజు ఆటలో సెంచరీ హీరో దినేశ్ చండీమాల్ మరింత రెచ్చిపోయి డబుల్ బాదడంతో శ్రీలంకకు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 431/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 123 పరుగులు జోడించి 554 పరుగుల వద్ద ఆలౌటైంది. చండీమాల్ 206 పరుగులతో అజేయంగా నిలువగా.. కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (85), ఏంజలో మాథ్యూస్ (52), కమిందు మెండిస్ (61)లు లంక భారీ స్కోర్ సాధించడంలో తమవంతు పాత్ర పోషించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4, స్వెప్సన్ 3, లయన్ 2, కమిన్స్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), లబూషేన్ (104) శతకాలతో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. లంక అరంగేట్రం బౌలర్ ప్రభాత్ జయసూర్య 6 వికెట్లతో ఆసీస్‌ను తిప్పేశాడు. చదవండి: WI Vs Ban: చేదు అనుభవాల నుంచి కోలుకుని.. బంగ్లాదేశ్ ఘన విజయం -
SL vs AUS: జోరు మీదున్న శ్రీలంక.. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టు ఇదే!
Sri Lanka Vs Australia Test Series 2022: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగబోయే టెస్టు సిరీస్‌కు శ్రీలంక బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఆసీస్‌తో రెండు మ్యాచ్‌లు ఆడే క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన వివరాలు శనివారం వెల్లడించింది. దిముత్ కరుణ కెప్టెన్సీలోని ఈ జట్టులో స్పిన్నర్ జాఫ్రీ వాండర్సేకు చోటు దక్కింది. వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్న అతడు టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. జాఫ్రీతో పాటు కుశాల్ మెండిస్, పాథుమ్ నిశాంక, చమిక కరుణ రత్నే, ధనంజయ డి సిల్వ, నిరోషన్ డిక్విల్లా తదితర వన్డే ప్లేయర్లు కూడా ఈ జట్టులో ఉన్నారు. కాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా జూన్ 29 నుంచి గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో లంక- ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక మూడు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా శ్రీలంకకు వచ్చింది. ఈ క్రమంలో టీ20 సిరీస్‌ను 2-1తేడాతో పర్యాటక కంగారూ జట్టు సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంతో 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన శ్రీలంక జట్టు ఇదే! దిముత్ కరుణరత్నే(కెప్టెన్), పాథుమ్ నిశాంక, ఒషాడా ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, కుశాల్ మెండిస్, ధనుంజయ డి సిల్వా, కమిందు మెండిస్, నిరోషన్ డిక్విల్లా(వికెట్ కీపర్), దినేశ్ చండిమాల్(వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, చమిక కరుణరత్నే, కసున్ రజిత, విశ్వ ఫెర్నాండో, ఆసిత ఫెర్నాండో, దిల్షాన్ ముదుషంక, ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్డెనియా, జాఫ్రీ వాండర్సే. చదవండి: India Vs Ireland T20: రాహుల్ త్రిపాఠిపై రవిశాస్త్రి ప్రశంసలు.. అతడు క్రీజులో ఉంటే చాలు! -
ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం.. 9 ఏళ్ల తర్వాత..!
కొలంబో: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. 2013 తర్వాత ఆసీస్‌పై శ్రీలంక వరుసగా రెండు వన్డేల్లో నెగ్గడం ఇదే ప్రథమం. తొలుత ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఫించ్ (62; 4 ఫోర్లు, 1 సిక్స్), హెడ్ (70 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం శ్రీలంక 48.3 ఓవర్లలో 4 వికెట్లకు 292 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ నిసాంక (137; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా... కుశాల్ మెండిస్ (87 రిటైర్డ్ హర్ట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో లంక 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చదవండి: అతనొక్కడే.. 11 మంది కెప్టెన్లు.. భారత వెటరన్ ఖాతాలో అరుదైన రికార్డు -
India Vs Sl 2nd Test: రెండో టెస్టుకు ముందు శ్రీలంక జట్టుకు భారీ షాక్!
India Vs Sl 2nd Pink Ball Test: టీమిండియాతో రెండో టెస్టుకు ముందు శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెంగళూరు వేదికగా జరుగనున్న పింక్‌బాల్ టెస్టుకు ఆ జట్టు ఆటగాడు పథుమ్ నిసాంక దూరం కానున్నట్లు సమాచారం. గాయంతో బాధపడుతున్న అతడు రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. కాగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా టీమిండియాతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ మీద 222 పరుగుల తేడాతో రోహిత్ సేన చేతిలో ఓటమి చెందింది. ఇక మ్యాచ్‌లో శ్రీలంక తరఫున నిసాంక తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తంగా 67 పరుగులు చేశాడు. లంక బ్యాటర్లలో ఇతడి స్కోరే అధికం. ఇక 23 ఏళ్ల నిసాంకకు వెన్నునొప్పి తిరగబెట్టినందున అతడు రెండో టెస్టు ఆడే అవకాశం లేదని శ్రీలంక క్రికెట్ అధికారి పేర్కొనడంతో లంక అభిమానులు ఉసూరుమంటున్నారు. అతడి స్థానంలో దినేశ్ చండిమాల్ లేదంటే.. కుశాల్ మెండిస్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి: Jofra Archer: ఖుషీలో ముంబై ఇండియన్స్.. రాడనుకున్న ఆర్చర్ వచ్చేస్తున్నాడు..!