ఫిబ్రవరి నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వీరే.. | Yashasvi Jaiswal, Kane Williamson, Pathum Nissanka Nominated For Player Of The Month Award February 2024 | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వీరే..

Published Mon, Mar 4 2024 3:18 PM | Last Updated on Mon, Mar 4 2024 3:49 PM

Yashasvi Jaiswal, Kane Williamson, Pathum Nissanka Nominated For Player Of The Month Award February 2024 - Sakshi

2024 ఫిబ్రవరి నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వివరాలను ఐసీసీ ఇవాళ (మార్చి 4) వెల్లడించింది. టీమిండియా యంగ్‌ గన్‌ యశస్వి జైస్వాల్‌, న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ కేన్‌ విలియమ్సన్‌, శ్రీలంక ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక గత నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌గా ఎంపికయ్యారు. ఫిబ్రవరి నెలలో వీరి ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని ఐసీసీ వీరి పేర్లను ప్రకటించింది.

యశస్వి గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ల్లో 112 సగటున 560 పరుగులు చేశాడు. ఇందులో వరుస డబుల్‌ సెంచరీలు ఉన్నాయి. కేన్‌ మామ ఫిబ్రవరిలో ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో (సౌతాఫ్రికాతో) వరుస సెంచరీల సాయంతో 403 పరుగులు చేశాడు. నిస్సంక విషయానికొస్తే.. ఈ లంక ఓపెనర్‌ గత నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడిన 3 వన్డేల్లో ఓ డబుల్‌ సెంచరీ, ఓ సెంచరీ సాయంతో 350కిపైగా పరుగులు చేశాడు. 

మహిళల విభాగంలో యూఏఈకి చెందిన కవిష ఎగోడగే, ఈషా ఓజా, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ ఫిబ్రవరి నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌గా ఎంపికయ్యారు. ఈ ముగ్గురు ఆల్‌రౌండర్లు గత నెలలో జరిగిన  మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించారు. 

స్వతంత్ర ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఓటింగ్‌ పద్దతిన విజేతలను నిర్ణయిస్తారు. విజేతల  పేర్లను వచ్చే వారం ప్రకటిస్తారు. icc-cricket.com/awardsలో పేర్లు నమోదు చేసుకున్న అభిమానులు శనివారం వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement