ICC awards
-
రెండు టోపీలు... రెండు ట్రోఫీలు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇదివరకే ప్రకటించిన అవార్డుల్ని ఆదివారం భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుకున్నాడు. 2024 క్యాలెండర్ ఇయర్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్లో విశేష ప్రదర్శన కనబరిచిన ఈ భారత సీనియర్ పేసర్ పురుషుల క్రికెట్లో నాలుగు అవార్డులకు ఎంపికయ్యాడు. ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’... ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ వ్యక్తిగత అవార్డులు కాగా... 2024 ప్రదర్శన ఆధారంగా అన్ని దేశాల నుంచి ఆటగాళ్లతో ఐసీసీ జట్లను ఎంపిక చేసింది. ఐసీసీ ప్రకటించిన టి20, టెస్టు జట్లలోనూ బుమ్రా ఉన్నాడు. దీంతో ‘టి20 టీమ్ ఆఫ్ ద ఇయర్’... ‘టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాలల్లో భాగంగా ఐసీసీ ప్రత్యేకమైన రెండు టోపీలను అందజేసింది. వ్యక్తిగత అవార్డులుగా రెండు ట్రోఫీలను బహూకరించింది. ప్రస్తుతం వెన్నుగాయంతో ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఈ ‘పేస్ ఎక్స్‌ప్రెస్’ అవార్డు స్వీకరించేందుకే దుబాయ్‌కి వచ్చాడు. ఉదయం మ్యాచ్‌కు ముందు తుది కసరత్తులో ఉన్న తమ జట్టు సహచరులతో ఆత్మీయంగా భేటీ అయ్యాక దాయాదుల మ్యాచ్ ఆరంభానికి ముందు అవార్డులు అందుకున్నాడు. ప్రేక్షకులంతా చప్పట్లతో అభినందనలు తెలిపారు. గతేడాది టెస్టుల్లో కేవలం 13 మ్యాచ్‌లే ఆడిన 31 ఏళ్ల బుమ్రా 71 వికెట్లు పడగొట్టడం విశేషం. ఓ క్యాలెండర్ ఇయర్లో 70 పైచిలుకు వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా ఘనతకెక్కాడు. అతనికంటే ముందువరుసలో దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్, లెజెండ్ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, అశి్వన్ ఉన్నారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 19 వికెట్లు తీసిన బుమ్రా... ఆ్రస్టేలియాలో జరిగిన ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో 32 వికెట్లు తీశాడు. అంటే కేవలం రెండే రెండు జట్లతో జరిగిన ముఖాముఖి సిరీస్‌ల్లోనే 51 వికెట్లు పడగొట్టడం విశేషం. -
2024 ఐసీసీ అవార్డుల విజేతలు వీరే..!
2024 ఐసీసీ అవార్డుల ప్రకటన ప్రక్రియ జనవరి 24న మొదలై, ఇవాల్టితో (జనవరి 28) ముగిసింది. మూడు ఫార్మాట్లలో పురుషులు, మహిళల విభాగాల్లో వ్యక్తిగత అవార్డులతో పాటు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను రివీల్ చేశారు. గతేడాదికి సంబంధించి మొత్తం 12 వ్యక్తిగత అవార్డులు, 5 ఐదు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు ప్రకటించబడ్డాయి.వ్యక్తిగత విభాగాల్లో ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)-జస్ప్రీత్ బుమ్రా (నామినీలు-హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, జో రూట్)ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (రేచల్ హెహోయ్ ఫ్లింట్ ట్రోఫీ)-మేలీ కెర్ (నామినీలు-చమారీ ఆటపట్టు, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, లారా వోల్వార్డ్ట్)ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-జస్ప్రీత్ బుమ్రా (నామినీలు-హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జో రూట్)ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-స్మృతి మంధన (నామినీలు-చమారీ ఆటపట్టు, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, లారా వోల్వార్డ్ట్)ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ (నామినీలు- వనిందు హసరంగ, కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్)ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ (నామినీలు-సస్కియా హోర్లీ, శ్రేయాంక పాటిల్, ఫ్రేయా సర్జెంట్)ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ (నామినీలు-సైమ్ అయూబ్, గస్ అట్కిన్సన్, షమార్ జోసఫ్)ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ (నామినీలు-బాబర్ ఆజమ్, ట్రవిస్ హెడ్, సికందర్ రజా)ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ (నామినీలు- చమారీ ఆటపట్టు, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, లారా వోల్వార్డ్ట్)ఫార్మాట్ల వారీగా టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు..ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జామీ స్మిత్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగ, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్. -
ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరో ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును గెలుచుకున్నాడు. 31 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం, ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డుకు (సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) ఎంపికయ్యాడు. గతేడాది ఫార్మాట్లకతీతంగా రాణించినందుకు గానూ బుమ్రాను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు గెలుచుకున్న తొలి భారత పేసర్ బుమ్రానే. ఓవరాల్‌గా ఈ అవార్డు గెలుచుకున్న ఐదో భారత క్రికెటర్ బుమ్రా. బుమ్రాకు ముందు రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ టెండూల్కర్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లి (2017, 2018) ఈ అవార్డులు గెలుచుకున్నారు. 2024 ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం ట్రవిస్ హెడ్, జో రూట్, హ్యారీ బ్రూక్ బుమ్రాతో పోటీపడ్డారు. ఈ అవార్డు గెలవడానికి ముందు బుమ్రా ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు-2024 కూడా గెలుచుకున్నాడు. బుమ్రా గతేడాది టెస్ట్‌ల్లో విశేషంగా రాణించాడు (13 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు). ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న బుమ్రా.. భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా గతేడాది 907 రేటింగ్ పాయింట్స్‌ను సాధించాడు. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం బుమ్రాతో పాటు హ్యారీ బ్రూక్, జో రూట్, కమిందు మెండిస్ పోటీ పడ్డారు.2024 ఐసీసీ అవార్డులుఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)-జస్ప్రీత్ బుమ్రాఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (రేచల్ హెహోయ్ ఫ్లింట్ ట్రోఫీ)-మేలీ కెర్ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-జస్ప్రీత్ బుమ్రాఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-స్మృతి మంధనఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జామీ స్మిత్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగా, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్. -
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా జస్ప్రీత్ బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి గానూ ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ (జనవరి 27) ప్రకటించింది. గతేడాది టెస్ట్‌ల్లో విశేషంగా రాణించినందుకు గానూ బుమ్రాను టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. బుమ్రా గతేడాది టెస్ట్‌ల్లో 14.92 సగటున 71 వికెట్లు తీశాడు. గతేడాది టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ బుమ్రానే.గతేడాది టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా దరిదాపుల్లో ఎవరూ లేరు. బుమ్రా తర్వాత ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ అత్యధిక వికెట్లు సాధించాడు. అట్కిన్సన్ గతేడాది 11 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో బుమ్రా, అట్కిన్సన్ తర్వాత షోయబ్ బషీర్ (49), మ్యాట్ హెన్రీ (48), రవీంద్ర జడేజా (48) ఉన్నారు.బుమ్రా టెస్ట్‌ల్లో తన అసమాన ప్రదర్శనతో నంబర్ వన్ ర్యాంక్ బౌలర్‌గానూ నిలిచాడు. భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు పొందిన బౌలర్‌గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. బుమ్రా గతేడాది సౌతాఫ్రికా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై అనేక సంచలన వికెట్ టేకింగ్ స్పెల్స్ వేశాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. ఈ సిరీస్‌లో బుమ్రా లీడింగ్ వికెట్‌టేకర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు.ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం బుమ్రాతో పాటు హ్యారీ బ్రూక్, జో రూట్, కమిందు మెండిస్ పోటీపడ్డారు. అంతిమంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు బుమ్రానే వరించింది. 2018లో కోహ్లి తర్వాత ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న మొదటి భారత క్రికెటర్ బుమ్రానే.మరోవైపు ఇవాళ ప్రకటించిన మరో ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధన గెలుచుకుంది. మంధన గతేడాది (2024) ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైంది. మంధన గతేడాది 13 వన్డేల్లో నాలుగు సెంచరీల సాయంతో 57.86 సగటున, 95.15 స్ట్రయిక్‌రేట్‌తో 747 పరుగులు చేసింది. తద్వారా గతేడాది లీడింగ్ రన్ స్కోరర్‌గానూ నిలిచింది. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మంధన.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై తలో సెంచరీ చేసింది. ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు.ఇవాళే ప్రకటించిన ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డును ఆఫ్ఘనిస్తాన్ యువ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ గెలుచుకున్నాడు. ఒమర్జాయ్ గతేడాది 14 వన్డేల్లో 417 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు. ఒమర్జాయ్ బ్యాటింగ్ సగటు గతేడాది 52.12గా ఉంది. ఒమర్జాయ్ ప్రదర్శనల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ గతేడాది ఆడిన ఐదు వన్డే సిరీస్‌ల్లో నాలుగింట జయకేతనం ఎగురవేసింది. మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం ఒమర్జాయ్తో పాటు కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వనిందు హసరంగ పోటీపడ్డారు.ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-జస్ప్రీత్ బుమ్రాఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-స్మృతి మంధనఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ -
ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును గెలుచుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్
భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు గెలుచుకుంది. గతేడాది వన్డేల్లో విశేషంగా రాణించినందుకు గానూ మంధనను ఈ అవార్డు వరించింది.గతేడాది మొత్తం 13 వన్డేలు ఆడిన మంధన, నాలుగు సెంచరీల సాయంతో 57.86 సగటున, 95.15 స్ట్రయిక్‌రేట్‌తో 747 పరుగులు చేసింది. తద్వారా గతేడాది లీడింగ్ రన్ స్కోరర్‌గానూ నిలిచింది. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మంధన.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై తలో సెంచరీ చేసింది.ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు. అయితే చివరికి ఈ అవార్డు మంధననే వరించింది. ఈ అవార్డు సాధించడానికి ముందు మంధన ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్, ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్‌లలో చోటు దక్కించుకుంది. వన్డే టీమ్‌కు మంధనతో పాటు భారత్ నుంచి దీప్తి శర్మ ఎంపిక కాగా.. టీ20 టీమ్‌లో మంధన, దీప్తి శర్మతో పాటు భారత్ నుంచి రిచా ఘోష్ కూడా చోటు దక్కించుకుంది.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్.వ్యక్తిగత విభాగంలో ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- స్మృతి మంధన ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ -
వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు గెలుచుకున్న ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్
ఆఫ్ఘనిస్తాన్ యువ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ప్రతిష్టాత్మక ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది వన్డేల్లో విశేషంగా రాణించినందుకు గానూ ఒమర్జాయ్ను ఈ అవార్డు వరించింది. ఒమర్జాయ్ గతేడాది 14 వన్డేల్లో 417 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు. ఒమర్జాయ్ బ్యాటింగ్ సగటు గతేడాది 52.12గా ఉంది. ఒమర్జాయ్ ప్రదర్శనల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ గతేడాది ఆడిన ఐదు వన్డే సిరీస్‌ల్లో నాలుగింట జయకేతనం ఎగురవేసింది. శ్రీలంక మినహా ఐర్లాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై విజయాలు సాధించింది. ఒమర్జాయ్ గతేడాది ఆఫ్ఘనిస్తాన్ తరఫున సెకండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా, సెకెండ్ హైయెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. 24 ఏళ్ల ఒమర్జాయ్ రైట్ ఆర్మ్ పేస్ బౌలింగ్‌తో పాటు రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు. ఒమర్జాయ్ 2024లో తన తొలి వన్డేలోనే సూపర్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతను అజేయమైన 149 పరుగులు చేశాడు. ఒమర్జాయ్ గతేడాది సౌతాఫ్రికాపై ఓ అద్భుత ప్రదర్శన చేశాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లోని రెండో వన్డేలో ఒమర్జాయ్ 50 బంతుల్లో అజేయమైన 86 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఒమర్జాయ్ బంతితోనూ చెలరేగాడు. 2021లో వన్డే అరంగ్రేటం చేసిన ఒమర్జాయ్ ఇప్పటివరకు 36 వన్డేలు ఆడి 907 పరుగులు చేశాడు. అలాగే 30 వికెట్లు పడగొట్టాడు. మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం ఒమర్జాయ్తో పాటు కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వనిందు హసరంగ పోటీ పడ్డారు.2024కు సంబంధించి ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు- ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ - ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్- ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్- ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝా- ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్- ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్- ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్- ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జామీ స్మిత్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగా, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్. -
శ్రీలంక ప్లేయర్‌కు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు
శ్రీలంక నయా బ్యాటింగ్ స్టార్ కమిందు మెండిస్‌ను ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు వరించింది. కమిందు 2024 సంవత్సరానికి గానూ ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు. కమిందు గతేడాది ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. కమిందు గతేడాది 50కి పైగా సగటుతో 1451 పరుగులు సాధించాడు.ఎరాస్మస్కు అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డునమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎంపికయ్యాడు. ఎరాస్మస్ గతేడాది వన్డే, టీ20 ఫార్మాట్లలో అదరగొట్టాడు. అందుకు అతన్ని ఈ అవార్డు వరించింది. ఎరాస్మస్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. 2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఎరాస్మస్ అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.ఈశా ఓఝాకు మహిళల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుయూఏఈ కెప్టెన్ ఈశా ఓఝాకు మహిళల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు-2024 లభించింది. గతేడాది ఈషా ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో అదరగొట్టింది.ఐసీసీ టెస్ట్ జట్టులో కమిందుశ్రీలంక అప్‌కమింగ్ స్టార్ కమిందు మెండిస్ 2024 ఐసీసీ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టులో కమిందుతో పాటు యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, రవీంద్ర జడేజా, పాట్ కమిన్స్, హ్యాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
అక్టోబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (నవంబర్ 5) వెల్లడించింది. పురుషుల విభాగంలో పాక్ బౌలర్ నౌమన్ అలీ, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్, సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ ఈ అవార్డుకు నామినేట్ కాగా.. మహిళల విభాగంలో టీ20 వరల్డ్‌కప్ టాప్ పెర్ఫార్మర్లు అమేలియా కెర్ (న్యూజిలాండ్), డియాండ్రా డొట్టిన్ (వెస్టిండీస్), లారా వోల్వార్డ్ట్ (సౌతాఫ్రికా) నామినేట్ అయ్యారు.నౌమన్ అలీ: ఈ పాక్ వెటరన్ స్పిన్నర్ అక్టోబర్ నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నౌమన్ ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి 13.85 సగటున 20 వికెట్లు పడగొట్టాడు.కగిసో రబాడ: ఈ సౌతాఫ్రికన్ సీమర్ గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌లో వీర లెవెల్లో విజృంభించాడు. ఈ సిరీస్‌లో రబాడ టెస్ట్‌ల్లో 300 వికెట్ల మార్కును తాకాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రబాడ 14 వికెట్లు పడగొట్టి, ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు. మిచెల్ సాంట్నర్: ఈ న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్టోబర్ నెలలో భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో శివాలెత్తిపోయాడు. పూణే టెస్ట్‌లో సాంట్నర్ పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఏకంగా 13 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.డియాండ్రా డొట్టిన్: ఈ విండీస్ ఆల్‌రౌండర్ గత నెలలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ మెగా టోర్నీలో డొట్టిన్ స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌పై విజయాల్లో కీలకపాత్ర పోషించింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో డొట్టిన్ నాలుగు వికెట్ల ప్రదర్శనతో పాటు కీలకమైన ఇన్నింగ్స్ (33 పరుగులు) ఆడినప్పటికీ.. విండీస్ ఓటమిపాలైంది.అమేలియా కెర్: ఈ న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గత నెలలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో కెర్ ముఖ్యపాత్ర పోషించింది. ఈ టోర్నీలో కెర్ 135 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది.లారా వోల్వార్డ్ట్: గత నెలలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాను ఫైనల్‌కు చేర్చడంలో లారా కీలకపాత్ర పోషించింది. ఈ మెగా టోర్నీలో లారా లీడింగ్ రన్ స్కోరర్‌గా (44.60 సగటున 223 పరుగులు) నిలిచింది. వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో లారా కీలక ఇన్నింగ్స్‌లు ఆడింది. -
ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న విండీస్ స్పిన్నర్
విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకున్నాడు. 2024 మే నెలకు గానూ మోటీని ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం మోటీతో పాటు పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ అఫ్రిది, ఐర్లాండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ పోటీపడ్డారు. ముగ్గురిలో మోటీకే అత్యధిక ఓట్లు రావడంతో ఐసీసీ అతన్ని ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ప్రకటించింది. మోటీ గడిచిన నెలలో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో మోటీ మూడు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరోవైపు షాహిన్ అఫ్రిది గడిచిన నెలలో జరిగిన ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో 14.5 సగటున 10 వికెట్లు (టీ20ల్లో) పడగొట్టాడు. లోర్కాన్ టక్కర్ విషయానికొస్తే.. ఈ ఐరిష్ బ్యాటర్ మే నెలలలో ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో 37.83 సగటున 227 పరుగులు చేశాడు. ఇందులో ఓ ఫిఫ్టి, నాలుగు 40 ప్లస్ స్కోర్లు ఉన్నాయి.మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ (మే) విషయానికొస్తే.. ఈ అవార్డు కోసం శ్రీలంక స్టార్ బ్యాటర్ చమారీ ఆటపట్టు, ఇంగ్లండ్ సోఫీ ఎక్లెస్టోన్, స్కాట్లాండ్ బౌలర్ కేథరీన్ బ్రైస్ పోటీపడగా.. మే నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ చమారీనే ఈ అవార్డు వరించింది. చమారీ మే నెలలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 37.75 సగటున 151 పరుగులు చేసి బౌలింగ్‌లో ఆరు వికెట్లు పడగొట్టింది. -
"టీమ్ ఆఫ్ ద ఇయర్" క్యాప్స్ అందుకున్న టీమిండియా క్రికెటర్లు
టీ20 వరల్డ్‌కప్ 2024కు ముందు పలువురు టీమిండియా క్రికెటర్లు "టీమ్ ఆఫ్ ద ఇయర్" క్యాప్స్ అందుకున్నారు. గతేడాది జాతీయ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్‌లను టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్స్‌తో పాటు ఐసీసీ అవార్డులు వరించాయి.ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్‌ను అందుకున్నాడు. ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్‌ను అందుకున్నాడు.ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్ లభించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్‌లు అందుకున్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో భారత ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. అనంతరం జూన్ 9న భారత జట్టు దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాకిస్తాన్, కెనడా, యూఎస్ఏ, ఐర్లాండ్‌లతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడనుంది.టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ట్రావెలింగ్ రిజర్వ్స్: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ -
ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..
2024 ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (మార్చి 4) వెల్లడించింది. టీమిండియా యంగ్ గన్ యశస్వి జైస్వాల్, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక గత నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా ఎంపికయ్యారు. ఫిబ్రవరి నెలలో వీరి ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని ఐసీసీ వీరి పేర్లను ప్రకటించింది. యశస్వి గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ల్లో 112 సగటున 560 పరుగులు చేశాడు. ఇందులో వరుస డబుల్ సెంచరీలు ఉన్నాయి. కేన్ మామ ఫిబ్రవరిలో ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో (సౌతాఫ్రికాతో) వరుస సెంచరీల సాయంతో 403 పరుగులు చేశాడు. నిస్సంక విషయానికొస్తే.. ఈ లంక ఓపెనర్ గత నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడిన 3 వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీ సాయంతో 350కిపైగా పరుగులు చేశాడు. మహిళల విభాగంలో యూఏఈకి చెందిన కవిష ఎగోడగే, ఈషా ఓజా, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా ఎంపికయ్యారు. ఈ ముగ్గురు ఆల్‌రౌండర్లు గత నెలలో జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించారు. స్వతంత్ర ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఓటింగ్ పద్దతిన విజేతలను నిర్ణయిస్తారు. విజేతల పేర్లను వచ్చే వారం ప్రకటిస్తారు. icc-cricket.com/awardsలో పేర్లు నమోదు చేసుకున్న అభిమానులు శనివారం వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. -
యశస్విని వెనక్కినెట్టిన రచిన్: అవార్డులు గెలిచింది వీళ్లే.. పూర్తి జాబితా
ICC Awards 2023: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)- 2023 వార్షిక పురస్కారాల్లో భారత్‌కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవగా.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. కోహ్లి ఏకంగా నాలుగోసారి(వన్డే) ఈ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించగా.. సూర్య వరుసగా రెండోసారి పురస్కారం అందుకుని ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని ఘనత(టీ20) సాధించాడు. కెప్టెన్సీలో అదరగొట్టాడు.. అందుకే గత ఏడాది సూర్య 18 మ్యాచ్‌లు ఆడి 155.95 స్ట్రయిక్‌రేట్‌తో 733 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ‘టి20 ఫార్మాట్లో భారత మిడిలార్డర్ వెన్నెముకగా సూర్య ఉన్నాడు. తన దూకుడైన ఆటతో పలుసార్లు భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్సీ బాధ్యతల్లోనూ అతను ఒత్తిడికి లోనుకాకుండా నిలకడగా రాణించాడు’ అని ఐసీసీ వ్యాఖ్యానించింది. ఇక ఈ టీమిండియా స్టార్లతో పాటు 2023 ఏడాదికి గానూ ఐసీసీ అవార్డులు అందుకున్న జాబితా చూద్దాం. ►మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 విజేత జట్టు కెప్టెన్ ►మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- విరాట్ కోహ్లి(ఇండియా) డబ్ల్యూటీసీ టైటిల్ ►మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా)- 13 మ్యాచ్‌లలో కలిపి 1210 పరుగులు- ఆసీస్ డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర యశస్విని వెనక్కినెట్టి ►మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)- వన్డే వరల్డ్‌కప్‌లో 578 పరుగులు. యశస్వి జైస్వాల్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మధుషాంకలను వెనక్కినెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. డచ్ జట్టు విజయాలకు కారణం ►మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- బాస్ డి లీడే(నెదర్లాండ్స్)- 285 పరుగులు చేసి, 15 వికెట్లు తీసి- వన్డే వరల్డ్‌కప్‌నకు డచ్ జట్టు అర్హత సాధించడంలో కీలక పాత్ర- వన్డే ప్రపంచకప్‌లో 139 పరుగులు- 16 వికెట్లు. మహిళా క్రికెట్లో మహరాణులు ►వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- నాట్ సీవర్ బ్రంట్(ఇంగ్లండ్) ►వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- చమరి ఆటపట్టు(శ్రీలంక)- 8 మ్యాచ్‌లలో కలిపి 415 రన్స్ ►వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హేలీ మాథ్యూస్(వెస్టిండీస్)- స్టెఫానీ టేలర్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో వెస్టిండియన్ ప్లేయర్- టీ20లలో జట్టుకు అవసరమైన సమయంలో 99 నాటౌట్, ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 132, 79 రన్స్ ►వుమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఫోబె లిచ్‌ఫీల్డ్(ఆస్ట్రేలియా)- ఆసీస్ టాపార్డర్‌కు వెన్నెముకగా నిలిచినందుకు ►వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- క్వీంటర్ అబెల్(కెన్యా)- అంతర్జాతీయ టీ20లలో 476 పరుగులు, 30 వికెట్లు జింబాబ్వేకే ఆ అవార్డు స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు- జింబాబ్వే జాతీయ జట్టు(ఓటమి బాధలో ఉన్న వెస్టిండీస్ ఆటగాడు అకీల్ హుసేన్‌ను ఓదార్చినందుకు) అంపైర్ ఆఫ్ ది ఇయర్- రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్. ఐసీసీ టెస్టు జట్టు: ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్. ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: ఫోబె లిచ్‌ఫీల్డ్, చమరి ఆటపట్టు (కెప్టెన్), ఎలిస్ పెర్రీ, అమేలియా కెర్, బెత్ మూనీ (వికెట్ కీపర్), నాట్ సీవర్-బ్రంట్, యాష్ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, నాడిన్ డి క్లెర్క్, లీ తహుహు, నహీదా అక్తర్. ఐసీసీ 2023 వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్. ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్: చమరి అటపట్టు(కెప్టెన్), బెత్ మూనీ (వికెట్ కీపర్), లారా వోల్వార్డ్, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, ఎల్లిస్ పెర్రీ, యాష్ గార్డెన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగాన్ షట్. ఐసీసీ పురుషుల టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, సికందర్ రజా, అల్పేశ్ రాంజాని, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎన్‌గరవ, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! -
క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు రేసులో కోహ్లి.. మరో రెండు అవార్డులకు కూడా..!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2023 అవార్డుల నామినీస్ జాబితాలను పలు దఫాలుగా ప్రకటిస్తూ వస్తుంది. తొలుత పురుషులు, మహిళలకు సంబంధించిన టీ20, ఎమిర్జింగ్ ప్లేయర్స్ నామినీస్ జాబితాను ప్రకటించిన ఐసీసీ.. ఆతర్వాత వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ నామినీస్ జాబితాను విడుదల చేసింది. తాజాగా ఐసీసీ.. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీస్ జాబితాను ప్రకటించింది. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీస్ జాబితాలో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు ( విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా), ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లు (పాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్) ఉండగా.. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీస్ జాబితాలో ఇద్దరు ఆస్ట్రేలియన్లు (ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా), ఓ టీమిండియన్ (రవిచంద్రన్ అశ్విన్), ఓ ఇంగ్లండ్ ఆటగాడు (జో రూట్) ఉన్నారు. 2023 ఐసీసీ అవార్డులలో విరాట్ కోహ్లి టెస్ట్ ఫార్మాట్ మినహా అన్ని విభాగాల్లో పోటీపడుతుండటం విశేషం. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023: విరాట్ కోహ్లి (భారత్) పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) రవీంద్ర జడేజా (భారత్) ట్రవిస్ హెడ్ (ఆస్ట్రేలియా) మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023: రవిచంద్రన్ అశ్విన్ (భారత్) ట్రవిస్ హెడ్ (ఆస్ట్రేలియా) ఉస్మాన్ ఖ్వాజా (ఆస్ట్రేలియా) జో రూట్ (ఇంగ్లండ్) మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023: శుభ్‌మన్ గిల్ (భారత్) మొహమ్మద్ షమీ (భారత్) విరాట్ కోహ్లి (భారత్) డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023: ఆష్లే గార్డ్నర్ (ఆస్ట్రేలియా) చమారీ ఆటపట్టు (శ్రీలంక) నాట్ సీవర్ బ్రంట్ (ఇంగ్లండ్) అమేలియా కెర్ (న్యూజిలాండ్) మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023: సూర్యకుమార్ యాదవ్ (భారత్) సికందర్ రజా (జింబాబ్వే) మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్) అల్పేశ్ రామ్‌జనీ (ఉగాండ) వుమెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023: చమారీ ఆటపట్టు (శ్రీలంక) సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్) హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) ఎల్లైస్ పెర్రీ (ఆస్ట్రేలియా) మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023: యశస్వి జైస్వాల్ (భారత్) రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) గెరాల్డ్ కొయెట్జీ (సౌతాఫ్రికా) దిల్షన్ మధుషంక (శ్రీలంక) వుమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023: మరూఫా అక్తర్ (బంగ్లాదేశ్) లారెన్ బెల్ (ఇంగ్లండ్) డార్సీ కార్టర్ (స్కాట్లాండ్) ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (ఆస్ట్రేలియా) -
వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డు రేసులో ముగ్గురు టీమిండియా క్రికెటర్లు
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 నామినీస్ జాబితాను ఇవాళ (జనవరి 4) ప్రకటించింది. అవార్డు రేసులో ఏకంగా ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఉండటం విశేషం. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అద్బుత ప్రదర్శన కనబర్చిన విరాట్ కోహ్లి, మొహమ్మద్ షమీతో పాటు గతేడంతా వన్డేల్లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ గిల్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు కోసం పోటీపడనున్నారు. వీరితో పాటు న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ రేసులో నిలిచాడు. మిచెల్ సైతం గతేడంతా వన్డేల్లో అద్భుతంగా రాణించడంతో పాటు వరల్డ్‌కప్ 2023లోనూ చెలరేగిపోయాడు. కాగా, ఐసీసీ నిన్న మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (2023), మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2023) అవార్డుల కోసం నామినీస్ జాబితాను ప్రకటించింది. టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌తో పాటు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, ఉగాండ ఆటగాడు అల్పేశ్ రామ్‌జనీ ఉండగా.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో టీమిండియా అప్‌కమింగ్ స్టార్ యశస్వి జైస్వాల్‌తో పాటు న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ, శ్రీలంక పేసర్ దిల్షన్ మధుషంక నిలిచారు. గతేడాది ఆయా విభాగాల్లో ప్రదర్శన ఆధారంగా ఐసీసీ నామినీస్ జాబితాను ఎంపిక చేసింది. -
ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో సూర్యకుమార్, యశస్వి జైస్వాల్
ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులైన మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (2023), మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2023) రేసులో ఇద్దరు టీమిండియా స్టార్ ఆటగాళ్లు నిలిచారు. మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు నామినీస్ జాబితాలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీస్ జాబితాలో యశస్వి జైస్వాల్ ఉన్నారు. టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో స్కైతో పాటు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, ఉగాండ ఆటగాడు అల్పేశ్ రామ్‌జనీ ఉండగా.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో యశస్వితో పాటు న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ, శ్రీలంక పేసర్ దిల్షన్ మధుషంక నిలిచారు. గతేడాది ప్రదర్శన ఆధారంగా ఐసీసీ ఆయా ఆటగాళ్లను నామినేట్ చేసింది. 2023 టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ (17 ఇన్నింగ్స్‌ల్లో 48.86 సగటున 155.95 స్ట్రయిక్‌రేట్‌తో 733 పరుగులు) 2023 టీ20ల్లో సికందర్ రజా (11 ఇన్నింగ్స్‌ల్లో 51.50 సగటున 150.14 స్ట్రయిక్‌రేట్‌తో 515 పరుగులు), బౌలింగ్‌లో 14.88 సగటున 6.57 ఎకానమీతో 17 వికెట్లు 2023 టీ20ల్లో అల్పేశ్ రామ్‌జనీ (30 మ్యాచ్‌ల్లో 8.98 సగటున 4.77 ఎకానమీతో 55 వికెట్లు) 2023 టీ20ల్లో మార్క్ చాప్మన్ (17 ఇన్నింగ్స్‌ల్లో 50.54 సగటున 145.54 స్ట్రయిక్‌రేట్‌తో 556 పరుగులు) ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ నామినీస్ విషయానికొస్తే.. రచిన్ రవీంద్ర (10 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 578 పరుగులు, 7 వికెట్లు), గెరాల్డ్ కొయెట్జీ (8 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు), దిల్షన్ మధుషంక (9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు) వన్డే వరల్డ్‌కప్ 2023లో అద్భుత ప్రదర్శనల కారణంగా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. యశస్వి జైస్వాల్ (4 టెస్ట్‌లు, 15 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 718 పరుగులు) అయితే ఫార్మాట్లకతీతంగా ఇరగదీసి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ముందున్నాడు. -
వరల్డ్‌కప్ హీరోకే ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు
2023 నవంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుల వివరాలను ఐసీసీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. పురుషుల విభాగానికి సంబంధించి ఈ అవార్డును వరల్డ్‌కప్ హీరో, ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ దక్కించుకోగా.. మహిళల విభాగంలో బంగ్లాదేశ్ యువ స్పిన్నర్ నహీద అక్తర్ ఈ అవార్డును గెలుచుకుంది. పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ట్రవిస్ హెడ్, మొహమ్మద్ షమీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మధ్య తీవ్రపోటీ జరిగినప్పటికీ.. అంతింమంగా హెడ్నే అవార్డు వరించింది. వరల్డ్‌కప్ సెమీస్‌లో (2 వికెట్లు, 62 పరుగులు), ఫైనల్లో (రోహిత్ శర్మ క్యాచ్‌తో పాటు 137 పరుగులు) అద్భుత ప్రదర్శనల కారణంగా మెజార్టీ శాతం ఓట్లు హెడ్కే దక్కాయి. 29 ఏళ్ల హెడ్‌కు ఇది తొలి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కాగా.. ఆసీస్ తరఫున వార్నర్ తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న ఆటగాడు హెడే కావడం మరో విశేషం. మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు విషయానికొస్తే.. ఈ అవార్డు కోసం బంగ్లాదేశ్ యువ క్రికెటర్ నహీద అక్తర్.. సహచర క్రికెటర్ ఫర్జానా హాక్, పాక్ స్పిన్నర్ సైదా ఇక్బాల్ నుంచి పోటీ ఎదుర్కొంది. అయితే నవంబర్ నెలలో విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనకు (14.14 సగటున 7 వికెట్లు) గానూ నహీద ఈ అవార్డును ఎగరేసుకుపోయింది. విండీస్‌తో సిరీస్‌లో నహీద ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న తొలి బంగ్లాదేశీ మహిళా క్రికెటర్ నహీదానే కావడం విశేషం. -
CWC 2023: డికాక్, బుమ్రాలను కాదని రచిన్‌కే దక్కింది..!
2023 అక్టోబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును న్యూజిలాండ్ రైజింగ్ స్టార్ రచిన్ రవీంద్ర దక్కించుకున్నాడు. ఈ అవార్డు కోసం క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా), జస్ప్రీత్ బుమ్రా (భారత్) పోటీపడినప్పటికీ చివరికి రచిన్‌నే వరించింది. అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను రచిన్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రచిన్ బ్యాట్‌తో పాటు బంతిలోనూ చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీల సాయంతో 565 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే 7 వికెట్లు కూడా పడగొట్టాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన రచిన్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ వరల్డ్‌కప్ రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో 25 ఏళ్ల వయసులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రచిన్ (565).. సచిన్ రికార్డును (523) తుడిచిపెట్టాడు. లంకతో జరిగిన మ్యాచ్‌లో రచిన్ రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. మొత్తానికి ఈ వరల్డ్‌కప్ రచిన్‌కు కలగా మిగిలిపోనుంది. కాగా, శ్రీలంకపై విజయంతో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో ఊహించని అద్భుతం జరిగితే తప్ప కివీస్ సెమీస్ చేరుకుండా ఉండదు. ఈ నెల 15న ముంబైలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరిగే అవకాశం ఉంది. 16న కోల్‌కతాలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ ఖరారైపోయింది. -
ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో వరల్డ్‌కప్ హీరోలు
ఐసీసీ ప్రతి నెలా ప్రకటించే ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో వన్డే వరల్డ్‌కప్ 2023 హీరోలు పోటీపడుతున్నారు. అక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా (భారత్) ప్రకటించబడ్డారు. ఈ ముగ్గురి ఆటగాళ్ల హవా అక్టోబర్ నెలతో పాటు ప్రస్తుత మాసంలోనూ (నవంబర్) కొనసాగుతుంది. ప్రపంచకప్‌లో ఈ ఆటగాళ్లు ఆయా విభాగాల్లో అత్యుత్తమ స్థాయిల్లో ఉన్నారు. అక్టోబర్ 5న మొదలైన వరల్డ్‌కప్ 2023లో డికాక్ ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 550 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రచిన్ రవీంద్ర సైతం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీల సాయంతో 523 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. బౌలింగ్‌లో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. Here are the Men's and Women's 'ICC Player of the Month nominees for October 2023. pic.twitter.com/0tK6mbq1s0 — CricTracker (@Cricketracker) November 7, 2023 బుమ్రా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి, వరల్డ్‌కప్ అత్యధిక వికెట్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ అక్టోబర్ నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలతో పాటు మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ పేర్లను కూడా ప్రకటించింది. మహిళల విభాగంలో వెస్టిండీస్ హేలీ మాథ్యూస్, బంగ్లాదేశ్ నహీద అక్తర్, న్యూజిలాండ్ అమేలయా కెర్ ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న పురుషుల వన్డే ప్రపంచకప్‌లో భారత్, సౌతాఫ్రికా జట్లు ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం ఆసీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఘోర పరాజయాలను మూటగట్టుకున్న బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఎలిమినేషన్‌కు గురయ్యాయి. నెదర్లాండ్స్ అధికారికంగా ఎలిమినేట్ కానప్పటికీ, సెమీస్ అవకాశాలు దాదాపుగా లేనట్లే. -
శుభ్‌మన్ గిల్‌కు ఐసీసీ అవార్డు.. తొలి భారత ఆటగాడిగా రికార్డు
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. 2023 సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను గిల్‌కు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు గెలవడం ద్వారా గిల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రెండు సార్లు దక్కించుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఏడాది జనవరిలో గిల్ తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ అవార్డును గిల్ ఒకే ఏడాది రెండుసార్లు సాధించడం విశేషం. కాగా, ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అత్యధిక సార్లు దక్కించుకున్న ఘనత పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు దక్కుతుంది. బాబర్ ఇప్పటివరకు ఈ అవార్డును మూడుసార్లు గెలుచుకున్నాడు. బాబర్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు రెండ్రెండు సార్లు ఈ అవార్డును దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 2021 జులైలొ తొలిసారి, ఈ ఏడాది మార్చిలో రెండోసారి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ 2022 డిసెంబర్లో తొలిసారి, 2023 ఫిబ్రవరిలో రెండోసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. భారత్ నుంచి ఈ అవార్డును రిషబ్ పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి ఒక్కోసారి గెలుచుకున్నారు. 2021 జనవరి నుంచి ఐసీసీ ఈ అవార్డులను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవార్డులను తొలి మూడు నెలలు (పంత్, అశ్విన్, భువీ) భారత ఆటగాళ్లే దక్కించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే, ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా హవా కొనసాగింది. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ విజయాల నేపథ్యంలో భారత్ వన్డే ర్యాంకింగ్స్‌లో మెరుగైన రేటింగ్ పాయింట్లు సాధించింది. -
ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు నామినేట్ అయిన టీమిండియా స్టార్లు
2023 సెప్టెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు, ఓ ఇంగ్లండ్ ప్లేయర్ నామినేట్ అయ్యారు. సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్, మొహమ్మద్ సిరాజ్, డేవిడ్ మలాన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు బరిలో నిలిచారు. గత నెలలో సూపర్ ఫామ్‌లో ఉండిన గిల్ 80 సగటున 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీల సాయంతో 480 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో 2 హాఫ్ సెంచరీలు, బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన గిల్ టీమిండియా ఆసియా కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. అనంతరం అదే ఫామ్‌ను ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా కొనసాగించిన గిల్.. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 74, రెండో వన్డేలో 104 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. సిరాజ్ విషయానికొస్తే.. ఈ హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ కూడా గత నెలలో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై నిప్పులు చెరిగిన సిరాజ్ ఏకంగా 6 వికెట్లు సాధించి, వన్డే ర్యాంకింగ్స్‌లో సైతం ఒక్కసారిగా భారీ జంప్ కొట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో పాటు సెప్టెంబర్ మొత్తంలో అద్భుతంగా రాణించిన సిరాజ్ 17.27 సగటున 11 వికెట్లు పడగొట్టాడు. మలాన్ విషయానికొస్తే.. ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తిన మలాన్ ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి పరుగుల వరద పారిస్తున్నారు. గత నెల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో వరుసగా 54, 96, 127 పరుగులు చేసిన మలాన్ 105.72 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించి, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్‌కు ఐసీసీ అవార్డు
చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్.. 2023 జులై నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్ గెలుచుకుంది. ఆష్లే ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును వరుసగా రెండు నెలలు (జూన్, జులై) గెలుచుకుని, ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఆష్లేకు ఇది నాలుగో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కావడం విశేషం. జులై నెలలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో 232 పరుగులతో పాటు 15 వికెట్లు తీసిన ఆష్లే వరుసగా రెండో నెల కూడా ఐసీసీ అవార్డును గెలుచుకుంది. జులై నెలకు గాను పురుషుల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ గెలుచుకున్నాడు. జులై నెలలో కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శనకు గాను వోక్స్‌కు ఈ అవార్డు దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం నెదర్లాండ్స్ స్టార్ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్, ఇంగ్లండ్‌కే చెందిన జాక్ క్రాలే పోటీపడినప్పటికీ వోక్స్నే ఈ అవార్డు వరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్స్, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు మరియు మీడియా ప్రతినిధులతో కూడిన ప్రత్యేక ప్యానెల్ నుండి సేకరించిన ఓట్ల ఆధారంగా వోక్స్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. జులై నెలలో జరిగిన 3,4,5 యాషెస్ టెస్ట్‌ల్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సైతం దక్కించుకున్న వోక్స్.. ఈ నెలలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 18.15 సగటున 19 వికెట్లు పడగొట్టాడు. వోక్స్‌కు పోటీదారులైన జాక్ క్రాలే, బాస్ డి లీడ్ కూడా జులై నెలలో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ వారికి నిరశే ఎదురైంది. క్రాలే జులైలో జరిగిన 2, 3, 4, 5 యాషెస్ టెస్ట్‌ల్లో 58.85 సగటున 412 పరుగులు చేశాడు. ఇందులో మాంచెస్టర్ టెస్ట్‌లో అతను చేసిన 189 పరుగుల ఇన్నింగ్స్, నిర్ణయాత్మక ఐదో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో చేసిన 73 పరుగుల ఇన్నింగ్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. బాస్ డి లీడ్ విషయానికొస్తే.. ఈ నెదర్లాండ్స్ యువ ఆల్‌రౌండర్ జులైలో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో అద్భుతంగా రాణించాడు. టోర్నీలో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో అతను అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనను (5/52, 123 (92 బంతుల్లో)) కనబర్చి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో మొత్తం యాషెస్ స్టార్లే.. ఒక్కరు మాత్రం..!
2023 జులై నెలకు గాను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 7) ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ను ప్రకటించింది. ఈ జాబితాలో ఒక్కరు మినహా మొత్తం యాషెస్ 2023 స్టార్లే ఉండటం విశేషం. పురుషుల విభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జాక్ క్రాలే, క్రిస్ వోక్స్‌లతో పాటు నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్ నామినేట్ కాగా.. మహిళల విభాగంలో ఆసీస్ ప్లేయర్స్ ఆష్లే గార్డ్నర్, ఎల్లిస్ పెర్రీతో పాటు ఇంగ్లండ్ నాట్ సీవర్ బ్రంట్ నామినేట్ అయ్యింది. పై పేర్కొన్న జాబితాలో నెదర్లాండ్స్ బాస్ డి లీడ్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ అదరగొట్టగా.. మిగతా ఐదుగురు పురుషులు, మహిళల యాషెస్‌లో ఇరగదీసారు. శ్రీలంకలో జరిగిన వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో కనబర్చిన అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు (5/52, 123 (92)) గాను లీడ్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్).. యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు మిస్ అయ్యి, మూడో టెస్ట్ నుంచి బరిలోకి దిగిన వోక్స్.. జులై నెలలో జరిగిన 3,4,5 యాషెస్ టెస్ట్‌ల్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సైతం దక్కించుకున్నాడు. వోక్స్ జులైలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 18.15 సగటున 19 వికెట్లు పడగొట్టాడు. జాక్ క్రాలే (ఇంగ్లండ్).. జులైలో జరిగిన 2, 3, 4, 5 యాషెస్ టెస్ట్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన క్రాలే.. ఈ నాలుగు టెస్ట్‌ల్లో 58.85 సగటున 412 పరుగులు చేశాడు. ఇందులో మాంచెస్టర్ టెస్ట్‌లో అతను చేసిన 189 పరుగుల ఇన్నింగ్స్, నిర్ణయాత్మక ఐదో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో చేసిన 73 పరుగుల ఇన్నింగ్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఆష్లే గార్డ్నర్ (ఆసీస్).. జూన్ నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు విన్నర్ అయిన ఆష్లే గార్డ్నర్ జులైలో జరిగిన మ్యాచ్‌ల్లో 232 పరుగులతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు వరుసగా రెండో నెల కూడా నామినేట్ అయ్యింది. ఎల్లిస్ పెర్రీ (ఆసీస్).. పెర్రీ.. జులై నెలలో ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో అద్భుతంగా రాణించి (4 మ్యాచ్‌ల్లో 276 పరుగులు) తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. నాట్ సీవర్ బ్రంట్ (ఇంగ్లండ్).. మహిళల యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన 3 వన్డేల సిరీస్‌లో బ్రంట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఈ సిరీస్‌లో భాగంగా జులై నెలలో జరిగిన ఆఖరి 2 మ్యాచ్‌ల్లో ఈమె రెండు సెంచరీలు (111 నాటౌట్, 129) సాధించింది. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. -
క్వాలిఫయర్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న లంక స్పిన్నర్
ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నాడు. 2023 జూన్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఆసీస్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (జూన్) అవార్డు దక్కించుకుంది. మహిళల యాషెస్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు గానూ గార్డ్నర్ను ఈ అవార్డు వరించింది. పురుషుల విభాగంలో జింబాబ్వే సీన్ విలియమ్స్, ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్ నుంచి హసరంగకు పోటీ ఎదురైనప్పటికీ అంతిమంగా అతన్నే ఈ అవార్డు వరించింది. మహిళల విభాగంలో ఇంగ్లండ్ ట్యామీ బేమౌంట్, వెస్టిండీస్ హేలీ మాథ్యూస్ ఐసీసీ అవార్డు కోసం పోటీపడగా జ్యూరీ గార్డ్నర్వైపు మొగ్గు చూపింది. జూన్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కారణంగా వీరిద్దరు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. కాగా, ప్రతి నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్స్, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు, ఐసీసీ-క్రికెట్.కామ్‌లో నమోదు చేసుకున్న గ్లోబల్ క్రికెట్ అభిమానులతో కూడిన ప్రత్యేక ప్యానెల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపిక చేస్తారన్న విషయం తెలిసిందే. -
బాబర్ ఆజమ్‌కు షాక్.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న అనామక ప్లేయర్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు షాక్ తగిలింది. బాబర్‌ను కాదని ఓ అనామక జట్టు ప్లేయర్ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు గెలుచుకున్నాడు. ఐర్లాండ్‌కు చెందిన హ్యారీ టెక్టార్ 2023 మే నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికయ్యాడు. మే నెలలో టెక్టార్‌తో పోలిస్తే బాబర్ ప్రదర్శనలే మెరుగ్గా ఉన్నప్పటికీ, అవార్డు టెక్టార్నే వరించింది. టెక్టార్, బాబర్‌తో పాటు బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హొస్సేన్ షాంటో ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో ఉండగా.. స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు టెక్టార్కే అధిక ఓట్లు వేసి గెలిపించారు. పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుతో పాటు మహిళల విభాగంలోనూ ఈ అవార్డు విజేతను ప్రకటించారు. అవార్డు రేసులో శ్రీలంక ప్లేయర్స్ చమారి ఆటపట్టు, హర్షిత మాధవి, థాయ్‌లాండ్ క్రికెటర్ థిపోట్చా పుత్తవాంగ్ ఉండగా.. 19 ఏళ్ల థాయ్ క్రికెటర్ థిపోట్చా పుత్తవాంగ్‌ను ఈ అవార్డు వరించింది. కాగా, ప్రతి నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపిక చేస్తారన్న విషయం తెలిసిందే. మే నెలలో నామినీస్ ప్రదర్శనలు.. బాబర్ ఆజమ్: న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 3, 4, 5 వన్డేల్లో 54, 107, 117 పరుగులు నజ్ముల్ షాంటో: ఐర్లాండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో 44, 117, 35 పరుగులు హ్యారీ టెక్టార్: బంగ్లాదేశ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 21, 140, 45 పరుగులు చదవండి: WTC Final 2023: ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్‌గా ఈ ఐదుగురు క్రికెటర్లు -
ICC Awards: రేసులో పాకిస్తాన్ కెప్టెన్
2023 మే నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (జూన్ 6) ప్రకటించింది. గడిచిన నెలలో వన్డేల్లో ప్రదర్శన ఆధారంగా నామినీస్ ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. పురుషులతో పాటు మహిళల క్రికెట్ నుంచి చెరో ముగ్గురి పేర్లను ఐసీసీ వెల్లడించింది. పురుషుల విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హొస్సేన్ షాంటో, ఐర్లాండ్ ప్లేయర్ హ్యారీ టెక్టార్ రేసులో ఉండగా.. మహిళల కేటగిరి నుంచి శ్రీలంక ప్లేయర్స్ చమారి ఆటపట్టు, హర్షిత మాధవి, థాయ్‌లాండ్ క్రికెటర్ థిపోట్చా పుత్తవాంగ్ నామినీస్‌గా ఉన్నారు. స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓట్లు వేసి విజేతలను నిర్ణయిస్తారు. వచ్చే వారం విజేతలను ఐసీసీ ప్రకటిస్తుంది. మే నెలలో నామినీస్ ప్రదర్శనలు.. బాబర్ ఆజమ్: న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 3, 4, 5 వన్డేల్లో 54, 107, 117 పరుగులు నజ్ముల్ షాంటో: ఐర్లాండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో 44, 117, 35 పరుగులు హ్యారీ టెక్టార్: బంగ్లాదేశ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 21, 140, 45 పరుగులు చదవండి: WTC Final: అతను సెంచరీ కొట్టాడా టీమిండియా గెలిచినట్లే..! -
మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరంటే..?
ICC Player Of The Month: 2023, మార్చి నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 12) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గెలుచుకున్నాడు. మార్చి నెలలో వివిధ ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనకు గాను షకీబ్‌ను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, యూఏఈ క్రికెటర్ ఆసిఫ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ ఉండినప్పటికీ, అంతిమంగా జ్యూరీ షకీబ్వైపే మొగ్గుచూపింది. మార్చిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన షకీబ్.. తన జట్టు 1-2 తేడాతో సిరీస్ కోల్పోయినప్పటికీ తాను మాత్రం ఆ సిరీస్‌లో టాప్ రన్ స్కోరర్‌గా (బంగ్లా తరఫున), హూయ్యెస్ట్ వికెట్‌టేకర్‌గా నిలిచాడు. ఇదే ఫామ్‌ను టీ20 సిరీస్‌లోనూ కొనసాగించిన షకీబ్.. బంగ్లాదేశ్ జగజ్జేత ఇంగ్లండ్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఆతర్వాత ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన షకీబ్.. మొత్తంగా మార్చి నెలలో 12 మ్యాచ్‌లు ఆడి 353 పరుగులు తీసి 15 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు గెలవడం ఇది రెండోసారి. 2021 జులైలో షకీబ్ ఈ అవార్డును తొలిసారి గెలుచుకున్నాడు. -
న్యూజిలాండ్‌పై అదరగొట్టాడు.. ప్రతిష్టాత్మక అవార్డు పట్టేశాడు
వైట్‌బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వరించింది. జనవరి నెలకు గాను గిల్‌కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. గత నెలలో శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లలో గిల్ దుమ్మురేపాడు. న్యూజిలాండ్‌తో హైదరబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో దుమ్మురేపిన గిల్.. అనంతరం టీ20 సిరీస్‌లోను అద్భుతమైన సెంచరీ సాధించాడు. అదే విధంగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ గిల్ ఓ సెంచరీ చేశాడు. ఓవరాల్‌గా జనవరి నెలలో శుబ్‌మన్ 567 పరుగులు చేశాడు. కాగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం గిల్.. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, కివీస్ బ్యాటర్ డెవాన్ కాన్వే నుంచి పోటీ ఎదుర్కొన్నప్పటికీ, ఐసీసీ ప్యానల్ అతడివైపే మొగ్గుచూపింది. మరోవైపు జనవరి నెలకు గాను మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇంగ్లండ్ యంగ్ క్రికెటర్ గ్రేస్ స్క్రీవెన్స్ కు లభించింది. ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో ఆమె అద్భుతంగా రాణించింది. ఈ అవార్డు గెలుచుకున్న అత్యంత పిన్న వయసు క్రికెటర్‌గా గా స్క్రీవెన్స్ చరిత్ర సృష్టించింది. చదవండి: WPL Auction: పాకిస్తాన్‌పై దుమ్మురేపింది.. వేలంలో ఊహించని ధర! ఎంతంటే? -
2022 ఐసీసీ అవార్డు విన్నర్ల మొత్తం జాబితా ఇదే..
2022 సంవత్సరానికి గానూ ఐసీసీ పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల జాబితాను దశల వారీగా విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022: బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) వుమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: నతాలీ సీవర్ (ఇంగ్లండ్) టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: సూర్యకుమార్ యాదవ్ (భారత్) వుమెన్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: తహీల మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) వుమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: నతాలీ సీవర్ (ఇంగ్లండ్) టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: మార్కో జన్సెన్ (సౌతాఫ్రికా) ఎమర్జింగ్ వుమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: రేణుకా సింగ్ (భారత్) అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: గెర్హార్డ్ ఎరాస్మస్ (నమీబియా) వుమెన్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: ఈషా ఓజా (యూఏఈ) వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, షాయ్ హోప్, శ్రేయస్ అయ్యర్, టామ్ లాథమ్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, మెహిది హసన్ మీరజ్, అల్జరీ జోసఫ్, మహ్మద్ సిరాజ్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా వుమెన్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అలైసా హీలీ (వికెట్‌కీపర్), స్మృతి మంధన, లారా వోల్వార్డ్ట్, నతాలీ సీవర్, బెత్ మూనీ, అమేలియా కెర్ర్, సోఫీ ఎక్లెస్టోన్, అయబోంగా ఖాకా, రేణుకా సింగ్, షబ్నిమ్ ఇస్మాయిల్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, సికందర్ రజా, హార్ధిక్ పాండ్యా, సామ్ కర్రన్, వనిందు హసరంగ, హరీస్ రౌఫ్, జోష్ లిటిల్ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: సోఫీ డివైన్ (కెప్టెన్), స్మృతి మంధన, బెత్ మూనీ, యాశ్ గార్డ్నర్, తహిల మెక్‌గ్రాత్, నిదా దార్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, ఇనోకా రణవీర, రేణుకా సింగ్ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్: బెన్ స్టోక్స్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ఉస్మాన్ ఖ్వాజా, క్రెయిగ్ బ్రాత్‌వైట్, మార్నస్ లబూషేన్, బాబర్ ఆజమ్, జానీ బెయిర్‌స్టో, పాట్ కమిన్స్, కగిసో రబాడ, నాథన్ లయోన్, జేమ్స్ ఆండర్సన్ అంపైర్ ఆఫ్ ద ఇయర్: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్) -
బాబర్ ఆజమ్‌కు డబుల్ ధమాకా.. వన్డే క్రికెటర్ అవార్డుతో పాటు ఐసీసీ అత్యున్నత ట్రోఫీ
Sir Garfield Sobers Trophy 2022: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఈ ఏడాది ఐసీసీ అవార్డుల పంట పండింది. ఇప్పటికే ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు దక్కించుకున్న బాబర్.. తాజాగా ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఇందుకు గానూ ఐసీసీ బాబర్‌ను సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ-2022తో సత్కరించింది. ఈ అవార్డు రేసులో బాబర్‌తో పాటు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీలు పోటీ పడినప్పటికీ, ఐసీసీ వరల్డ్ గవర్నింగ్ బాడీ బాబర్ వైపే మొగ్గుచూపింది. బాబర్ 2022లో అన్ని ఫార్మాట్లలో కలిపి 44 మ్యాచ్‌ల్లో 54.12 సగటున 2598 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే ఐసీసీ బాబర్‌ను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. Double delight for Babar Azam 🤩After being named the ICC Men's ODI Cricketer of the Year, the Pakistan star bags the Sir Garfield Sobers Trophy for the ICC Men's Cricketer of the Year 👏#ICCAwards— ICC (@ICC) January 26, 2023 2021లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్న బాబర్.. వరుసగా రెండో ఏడాది కూడా అవార్డు దక్కించుకున్నాడు. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి తర్వాత వరుసగా రెండో ఏడాది ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్న ఆటగాడిగా బాబర్ రికార్డులకెక్కాడు. 2022లో బాబర్ 9 వన్డేల్లో 84.87 సగటున మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 679 పరుగులు చేశాడు. ప్రస్తుతం బాబర్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. 2021 జూలైలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్న బాబర్.. దాదాపు ఏడాదిన్నరగా ఐసీసీ టాప్ వన్డే బ్యాటర్‌గా చలామణి అవుతున్నాడు. మరోవైపు, ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ అఫ్ ద ఇయర్ 2022 అవార్డును ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ నతాలీ సీవర్ గెలుచుకుంది. సీవర్ గతేడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 33 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు, 1346 పరుగులు చేసింది. ఈ అవార్డుకు ముందు సీవర్ 2022 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకుంది. England's talismanic all-rounder caps off a phenomenal 2022 with the Rachael Heyhoe Flint Trophy for ICC Women’s Cricketer of the Year 👌#ICCAwards— ICC (@ICC) January 26, 2023 ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ అఫ్ ద ఇయర్ 2022 అవార్డు గెలుచుకున్నందుకు గానూ ఐసీసీ సీవర్‌ను రేచల్ హేహోయ్ ఫ్లింట్ ట్రోఫీతో (Rachael Heyhoe Flint Trophy) సత్కరించింది. కాగా, మెన్స్, వుమెన్స్ విభాగంలో వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు (2022) గెలిచిన ప్లేయర్లు (బాబర్, సీవర్) ఐసీసీ క్రికెటర్ అఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకోవడం విశేషం. -
క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు 'కింగ్ కోహ్లి'.. ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం
Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల యంత్రం, కింగ్ విరాట్ కోహ్లి క్రికెట్ చర్రితలో ఏ ఆటగాడికి సాధ్యం కాని ఓ అత్యంత అరుదైన ఘనతను ఇవాళ (జనవరి 23) సొంతం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన 2022 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టులో చోటు దక్కించుకున్న కోహ్లి.. ఐసీసీ మూడు ఫార్మాట్ల క్రికెట్ జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. •ICC Test team of the year. •ICC ODI team of the year. •ICC T20 team of the year. Virat Kohli is the only player to feature or to be part of the ICC's years team in all three formats.!! — CricketMAN2 (@ImTanujSingh) January 23, 2023 2012, 2014, 2016, 2017, 2018, 2019 ఐసీసీ వన్డే జట్లలో చోటు సంపాదించిన కింగ్.. 2017, 2018, 2019 ఐసీసీ టెస్ట్ టీమ్‌ల్లోనూ సభ్యుడిగా ఎంపిక కాబడ్డాడు. తాజాగా 2022 ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్న రన్‌మెషీన్.. ఐసీసీ బెస్ట్ టెస్ట్ (3), వన్డే (6), టీ20 జట్ల (1)లో భాగమైన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతేడాది పొట్టి ఫార్మాట్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన కింగ్.. ఆసియాకప్-2022లో ఆఫ్ఘనిస్తాన్పై సూపర్ సెంచరీ, టీ20 వరల్డ్‌కప్-2022లో పాకిస్తాన్‌పై అజేయమైన హాఫ్‌సెంచరీ తదితర మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడి బెస్ట్ టీ20-2022 జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది సూపర్ ఫామ్‌ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్న కోహ్లి.. 2023లో వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో కింగ్ ఇప్పటికే 2 సెంచరీలు (శ్రీలంకపై) బాదాడు. న్యూజిలాండ్‌తో త్వరలో ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటున్న పరుగుల యంత్రం, ఆతర్వాత ఆసీస్‌తో జరిగే 4 మ్యాచ్‌లో టెస్ట్ సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. కాగా, ఐసీసీ ప్రకటించిన 2022 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టులో చోటు కోహ్లితో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలకు కూడా చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు సారధి జోస్ బట్లర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీస్ ఎవరంటే..?
2022 మార్చి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీస్ జాబితాను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఆస్ట్రేలియా టెస్ట్ సారధి పాట్ కమిన్స్, వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ చోటు దక్కించుకున్నారు. గత నెలలో ఆసీస్‌తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లలో అద్భుతంగా రాణించిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో ముందుండగా.. రెండున్నర దశాబ్దాల తర్వాత పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించిన ఆసీస్ సారధి పాట్ కమిన్స్, ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేసిన విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆసీస్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 78 సగటున 390 పరుగులు చేసిన పాక్ కెప్టెన్.. అనంతరం జరిగిన వన్డే సిరీస్‌లోనూ రెచ్చిపోయాడు. 3 వన్డేల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాధించి తన జట్టుకు ఒంటిచేత్తో సిరీస్ విజయాన్నందించాడు. సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టీ20లో సైతం చెలరేగిన బాబర్.. మరో హాఫ్ సెంచరీ బాది కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇదే సిరీస్‌లో ఆసీస్ స్కిప్పర్ పాట్ కమిన్స్ ఆఖరి టెస్ట్‌లో 8 వికెట్లు సాధించి, తన జట్టు చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. టెస్ట్ సిరీస్‌లో మొత్తం 12 వికెట్లు సాధించిన కమిన్స్.. సిరీస్ ఆధ్యాంతం జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడు. మరోవైపు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేసిన విండీస్ సారధి బ్రాత్‌వైట్.. సిరీస్‌లో భాగంగా జరిగిన 3 టెస్ట్‌ల్లో సెంచరీ, 2 అర్ధసెంచరీల సాయంతో 85.25 సగటున 341 పరుగులు చేశాడు. బ్రాత్‌వైట్ సంచలన ప్రదర్శన కారణంగా విండీస్.. పర్యాటక ఇంగ్లండ్ జట్టును ఖంగుతినిపించి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. చదవండి: భారత క్రికెటర్లకు శుభవార్త.. బయో బబుల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..! -
2021 అవార్డులను ప్రకటించిన ఐసీసీ.. జాబితాలో పాక్ ప్లేయర్ల హవా
గతేడాది అన్ని ఫార్మాట్లలో అదరగొట్టిన పాక్ క్రికెటర్లు ఐసీసీ అవార్డులను కొల్లగొట్టారు. 2021 సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల వన్డే(బాబర్ ఆజమ్), టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్(మహ్మద్ రిజ్వాన్), క్రికెటర్ ఆఫ్ ద ఇయర్(షాహీన్ అఫ్రిది) అవార్డులతో పాటు ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును(ఫాతిమా సనా) సొంతం చేసుకున్నారు. అంతకుముందు ఐసీసీ ప్రకటించిన వన్డే, టీ20 జట్లకు సైతం పాక్ ఆటగాడే(బాబర్ ఆజమ్) కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ రెండు జట్లలో ఒక్క భారత ఆటగాడికి కూడా ప్రాతినిధ్యం లభించకపోవడం విశేషం. Congratulations to #BabarAzam, #LizelleLee and #JoeRoot on winning the prestigious ICC Awards for their performances in 2021. pic.twitter.com/sEqaIMvOqf — Circle of Cricket (@circleofcricket) January 24, 2022 అయితే, ఐసీసీ టెస్ట్ జట్టులో మాత్రం ముగ్గురు టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్‌లు టెస్టు జట్టులో ఉన్నారు. ఇదిలా ఉంటే, పురుషులు, మహిళల విభాగాల్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఐసీసీ అవార్డులకు ఎంపిక చేశారు. ఈ జాబితాలో భారత్ నుంచి మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది. మూడు ఫార్మాట్లలో రాణించినందుకు గాను ఆమెకు.. ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డు లభించింది. A year to remember 🤩 Smriti Mandhana's quality at the top of the order was on full display in 2021 🏏 More on her exploits 👉 https://t.co/QI8Blxf0O5 pic.twitter.com/3jRjuzIxiT — ICC (@ICC) January 24, 2022 2021 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన అవార్డుల జాబితా : - ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - జో రూట్ (ఇంగ్లాండ్) - ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) - ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) - ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - షాహీన్ అఫ్రిది (పాకిస్థాన్) - ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - జన్నేమన్ మలాన్ (సౌతాఫ్రికా) - ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - జీషన్ మసూద్ (ఒమన్) - ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఈయర్ - మారియస్ ఎరాస్మస్ - ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - స్మృతి మంధాన (ఇండియా) - ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - టామీ బ్యూమోంట్ (ఇంగ్లాండ్) - ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - ఫాతిమా సనా (పాకిస్థాన్) - ఐసీసీ ఉమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - ఆండ్రియా (ఆస్ట్రియా) (ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఈయర్, ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు ఇంకా ప్రకటించాల్సి ఉంది) చదవండి: ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడు.. -
ICC Awards 2021: వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే..!
పాకిస్థాన్ సారధి బాబర్ ఆజమ్ ప్రతిష్టాత్మక ఐసీసీ పురస్కారానికి ఎంపికయ్యాడు. 2021 సంవత్సరానికి గాను ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు రేసులో బాబర్‌కు పోటీగా షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్), జన్నెమాన్ మలాన్(దక్షిణాఫ్రికా), పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్) ఉన్నప్పటికీ పాక్ కెప్టెన్‌నే అవార్డు వరించింది. ఈ మేరకు ఐసీసీ సోమవారం ప్రకటన ద్వారా తెలిపింది. PCB congratulates @babarazam258 on winning ICC Men's ODI Cricketer of the Year 2021 pic.twitter.com/BLqblHbJiq — Pakistan Cricket (@TheRealPCB) January 24, 2022 ఈ అవార్డుతో పాటు పాక్ కెప్టెన్ ఖాతాలో మరో రెండు అవార్డులు చేరాయి. వన్డే కెప్టెన్ ఆఫ్ ద ఇయర్ 2021, టీ20 కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డులను సైతం బాబరే సొంతం చేసుకున్నాడు. గతేడాది మొత్తం 6 వన్డేలు ఆడిన బాబర్.. 67.50 సగటున 405 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. కాగా, గతేడాది టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా పాక్‌కే దక్కింది. ఆ దేశ వికెట్‌కీపర్, స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. 🏅 Marais Erasmus, a member of the Elite Panel of ICC Umpires, is the 2021 ICC Umpire of the Year 👏 All the announced awards so far 👉 https://t.co/2SczDfXxGP pic.twitter.com/zaC0BSyMXf — ICC (@ICC) January 24, 2022 మొత్తంగా చూస్తే గతేడాదికి సంబంధించి పాకిస్థాన్‌కు అవార్డుల పంట పండింది. రిజ్వాన్ అవార్డు కలుపుకుంటే వారి ఖాతాలో మొత్తం నాలుగు అవార్డులు చేరాయి. మరోవైపు, భారత్-దక్షిణాఫ్రికా సిరీస్‌లో అంపైర్‌గా వ్యవహరించిన మరియాస్ ఎరాస్మస్ అంపైర్ అఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. అతను 2016, 2017 సంవత్సరాల్లో కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. చదవండి: టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021 ఎవరంటే..! -
ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా ఓపెనర్.. పది వికెట్ల కివీస్ బౌలర్ కూడా..
2021 డిసెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నామినేట్ అయ్యాడు. అతనితో పాటు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కూడా అవార్డు రేసులో నిలిచారు. టీమిండియా రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన మయాంక్.. గత నెలలో ఆడిన రెండు టెస్ట్‌ల్లో (న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఒకటి, ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్‌లో తొలి టెస్ట్) 69 సగటుతో 276 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. An Aussie fast bowler, an in-form India opener and a record-equaling spinner from New Zealand. Who will be your ICC Men's Player of the month? 👀 Details 👉 https://t.co/XsumbkHtzj And VOTE 🗳️ https://t.co/FBb5PMInKI pic.twitter.com/hhZeqJIopf — ICC (@ICC) January 8, 2022 ఇక ఇదే సిరీస్‌లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్ల సాధించి.. జిమ్‌లేకర్, అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసాడు. ఆ టెస్ట్‌లో మొత్తం 14 వికెట్లను తన ఖాతాలోకి వేసుకున్న అజాజ్.. మాయంక్తో పాటు అవార్డు రేసులో నిలిచాడు. మరోవైపు ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో సత్తా చాటుతున్న ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ వీరికి పోటీగా నిలిచాడు. స్టార్క్ డిసెంబర్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 19.64 సగటుతో 14 వికెట్లు తీశాడు. చదవండి: పాక్ మాజీ కెప్టెన్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు -
అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటగాళ్లు.. రేసులో ఇద్దరు పాక్ ఆటగాళ్లు
దుబాయ్: ICC Player of the Year (Sir Garfield Sobers Trophy) అవార్డు కోసం 2021 సంవత్సరానికి గాను అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ అటతీరును కనబర్చిన ఆటగాళ్ల జాబితాను ఐసీసీ శుక్రవారం(డిసెంబర్ 31) విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఇద్దరు పాక్ ఆటగాళ్లు నిలువగా.. టీమిండియా నుంచి ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. ఈ జాబితాలో తాజా బ్యాటింగ్ సంచలనం, పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ముందువరుసలో ఉండగా.. అదే జట్టుకు చెందిన షాహీన్ అఫ్రిది, ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ అవార్డు విజేతను 2022 జనవరి 24న ప్రకటించనున్నట్లు ఐసీసీ పేర్కొంది. పాక్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన రిజ్వాన్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 44 మ్యాచ్‌ల్లో 56.32 సగటుతో 1915 పరుగులు సాధించగా.. విలియమ్సన్ 16 మ్యాచ్‌ల్లో 43.31 సగటుతో 693 పరుగులు, రూట్.. 18 మ్యాచ్‌ల్లో 58.37 సగటుతో 1855 పరుగులు స్కోర్ చేశారు. వీరిలో రూట్ అత్యధికంగా 6 సెంచరీలు నమోదు చేయగా.. రిజ్వాన్ రెండు శతకాలు, విలియమ్సన్ ఒకటి సాధించారు. మరోవైపు ఈ ఏడాది మొత్తం 36 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన షాహీన్ అఫ్రిది.. 20.20 సగటుతో ఏకంగా 78 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న రిజ్వాన్.. 29 మ్యాచ్‌ల్లో 73.66 సగటుతో ఏకంగా1326 పరుగులు సాధించాడు. ఈ ఏడాది వికెట్ కీపింగ్‌లోనూ రాణించిన అతను.. 56 వికెట్లు పడగొట్టడంలో భాగస్తుడయ్యాడు. చదవండి: ఆసియా కప్ విజేతగా టీమిండియా.. ఫైనల్లో లంకేయులపై ఘన విజయం -
ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు ఎంపికైన ఆసీస్ స్టార్ ఓపెనర్
దుబాయ్: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నవంబరు నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. నవంబర్ నెలలో జరిగిన టీ20 ప్రపంచకప్-2021లో అద్భుత ప్రదర్శనకు గాను అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించినట్లు ఐసీసీ పేర్కొంది. వార్నర్.. పాకిస్థాన్ ఓపెనర్ ఆబిద్ అలీ, న్యూజిలాండ్ సీమర్ టిమ్ సౌథీలను వెనక్కినెట్టి ఈ అవార్డును కైవసం చేసుకున్నట్లు ఐసీసీ సోమవారం ప్రకటించింది. కాగా, వార్నర్ పొట్టి ప్రపంచకప్-2021లో రెండు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోవడంతో ఆసీస్ తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ మెగా టోర్నీలో అతను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మరోవైపు, నవంబర్ నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హేలీ మ్యాథ్యూస్ ఎంపికైంది. గత నెలలో జరిగిన వన్డేల్లో మాథ్యూస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన(4 మ్యాచ్‌ల్లో 141 పరుగులు, 9 వికెట్లు)తో అదరగొట్టడంతో ఆమెను ఈ అవార్డు వరించింది. మాథ్యూస్.. ఈ అవార్డుకు ఎంపికయ్యే క్రమంలో పాక్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆనం అమిన్, బంగ్లాదేశ్‌కు చెందిన నహీదా అక్తర్లను వెనక్కి నెట్టింది. చదవండి: మూడు రోజుల క్వారంటైన్లో టీమిండియా.. డుమ్మా కొట్టిన కోహ్లి..! -
ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు
David Warner Nominated For ICC Player Of The Month Award: 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' అవార్డుకు గాను నవంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్ల జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, పాక్ ఆటగాడు ఆబిద్ అలీ, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ నిలిచారు. పురుషుల విభాగంలో ఈ ముగ్గురు క్రికెటర్లు నామినీస్ కాగా.. మహిళల కేటగిరీలో పాక్ స్పిన్నర్ ఆనమ్ అమిన్, బంగ్లా బౌలర్ నహీదా అక్తర్, విండీస్ ఆల్‌రౌండర్ హలే మథ్యూస్ ఉన్నారు. వార్నర్.. నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 69.66 సగటుతో 209 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలువగా.. అదే టోర్నీలో సౌథీ 7 వికెట్లతో రాణించి తన జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. డబ్ల్యూటీసీలో భాగంగా భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో సైతం సౌథీ 8 వికెట్లు సత్తా చాటాడు. ఈ అవార్డు రేసులో ఉన్న పాక్ ఓపెనర్ ఆబిద్ అలీ బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 133, 91 పరుగులతో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, నవంబర్ నెలలో టీమిండియా ఆటగాళ్లు తక్కువ మ్యాచ్‌లు ఆడటం.. అందులో పెద్దగా రాణించకపోవడంతో ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. కాగా, ఐసీసీ.. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెలా ఈ అవార్డును అందజేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: IND Vs SA: వాళ్లిద్దరినీ త్వరగా ఔట్ చేస్తే.. భారత్‌దే విజయం! -
ఐసీసీ అవార్డులో టీమిండియా ప్లేయర్స్‌కు మొండిచెయ్యి..
దుబాయ్: జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు న్యూజిలాండ్ నయా బ్యాటింగ్ సెన్సేషన్ డెవాన్ కాన్వేను వరించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం కాన్వేతో పాటు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్, దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ పోటీపడినప్పటికీ.. ఐసీసీ కాన్వే వైపే మొగ్గు చూపింది. దీంతో పురుషుల విభాగంలో ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి కివీస్ ప్లేయర్‌గా కాన్వే చరిత్ర పుటల్లోకెక్కాడు. జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కాన్వే.. అరంగేట్రం టెస్ట్‌లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత భారత్‌తో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ విలువైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన కాన్వే.. మొత్తం మూడు టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. మరోవైపు మహిళల క్రికెట్లో ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా(జూన్) ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ నిలిచింది. ఈ అవార్డు రేసులో టీమిండియా నవయువ బ్యాటర్ షెఫాలీ వర్మ, సహచర ప్లేయర్ స్నేహ్ రాణా ఉన్నప్పటికీ.. ఎక్లెస్టోన్ వీరిద్దరినీ వెనక్కి నెట్టి ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచింది. దీంతో టీమిండియా ప్లేయర్స్‌కు మరోసారి మొండిచెయ్యే మిగిలింది. భారత్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో 8 వికెట్లు, ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లో మూడేసి వికెట్లు తీసిన ఎక్లెస్టోన్.. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించి ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు కైవసం చేసుకుంది. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన షెఫాలి వర్మ.. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు నమోదు చేసి శభాష్ అనిపించుకుంది. ఇదే టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా బంతితోనూ, బ్యాట్‌తోనూ రాణించి, భారత్ జట్టును ఓటమి బారి నుంచి రక్షించింది. -
మే నెల మొనగాడు.. ఈ బంగ్లా ఆటగాడు
దుబాయ్: మే నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ దక్కించుకున్నాడు. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం పాకిస్తాన్‌కు చెందిన హసన్ అలీ, శ్రీలంకకు చెందిన ప్రవీణ్ జయవిక్రమ పోటీపడగా.. చివరకు ముష్ఫికర్ రహీమ్‌ను ఈ అవార్డు వరించింది. దీంతో ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలిచిన తొలి బంగ్లా ఆటగాడిగా ముష్ఫికర్ రహీమ్ రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ అవార్డు రేసులో నిలిచిన పాక్ యువ బౌలర్ హసన్ అలీ.. మే నెలలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల్లో 8.92 సగటుతో 14 వికెట్లు పడగొట్టగా, శ్రీలంక అరంగేట్ర బౌలర్ప్రవీణ్ జయవిక్రమ బంగ్లాదేశ్‌తో ఆడిన టెస్టులో మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. ఇక ముష్ఫికర్ రహీమ్.. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 79 సగటుతో 237 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎగురేసుకుపోయాడు. ఈ సిరీస్‌లో జరిగిన రెండో వన్డేలో రహీమ్ 125 పరుగులు సాధించడంతో బంగ్లా తొలిసారి లంకపై వన్డే సిరీస్ గెలిచింది. రహీమ్ ఈ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఐసీసీ ఓటింగ్ అకాడమీ సభ్యుడు వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. 15 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన తర్వాత కూడా ముష్ఫికర్ రహీమ్ పరుగుల దాహం తీరలేదని వ్యాఖ్యానించాడు. మరోవైపు మహిళల క్రికెట్లో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును స్కాట్లాండ్ ఆల్‌రౌండర్ కాథరిన్ బ్రైస్ దక్కించుకుంది. ఆమెకు గేబీ లూయిస్(ఐర్లాండ్), లీ పాల్(ఐర్లాండ్)ల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. చదవండి: WTC Final: ‘కోహ్లి క్రేజ్ అలాంటిది మరి.. జాన్ సీన మద్దతు భారత్‌కే’! -
క్రికెట్ చరిత్రలో 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే అత్యుత్తమం
దుబాయ్: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అల్టిమేట్ టెస్ట్ సిరీస్ ఏది అనే అంశంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించిన పోల్‌లో 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అత్యధిక ప్రజాదరణ లభించింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఈ సిరీస్‌ను అల్టిమేట్ టెస్ట్ సిరీస్‌గా ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ అవార్డు రేసులో 1999 భారత్-పాకిస్తాన్ సిరీస్ ఉన్నా, అభిమానులు దానిపై అంత ఆసక్తిచూపలేదు. ఓవరాల్‌గా బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు 70.9% ఓట్లు రాగా.. భారత్-పాకిస్తాన్ సిరీస్‌కు 29.1% ఓట్లు వచ్చాయి. గత నెల చివరి వారంలో ఈ అవార్డు కోసం ఐసీసీ 16 ద్వైపాక్షిక సిరీస్‌లను షార్ట్‌లిస్ట్ చేయగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అత్యుత్తమ ప్రజాదరణ కలిగిన సిరీస్‌గా నిలిచింది. కాగా, ఈ అవార్డు నిమిత్తం 2001 భారత్-ఆస్ట్రేలియా, 2014 ఇంగ్లండ్-శ్రీలంక, 2008-09 ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా, 1882 ఇంగ్లండ్-ఆస్ట్రేలియా, 2020-21 భారత్-ఆస్ట్రేలియా, 1936-37 ఆస్ట్రేలియా-ఇంగ్లండ్, 1999 వెస్టిండీస్-ఆస్ట్రేలియా, 1999 భారత్-పాకిస్తాన్, 1960-61 ఆస్ట్రేలియా-వెస్టిండీస్, 1985-86 ఆస్ట్రేలియా-న్యూజీలాండ్, 2005 ఇంగ్లండ్-ఆస్ట్రేలియా, 1984 ఇంగ్లండ్-వెస్టిండీస్, 1981 ఇంగ్లండ్-ఆస్ట్రేలియా, 1995 వెస్టిండీస్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లను ఐసీసీ పరిగణలోకి తీసుకుంది. ఈ కాంటెస్ట్‌ను ఐసీసీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా నిర్వహించింది. ఇదిలా ఉంటే, కంగారు గడ్డపై భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆద్యాంతం రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. ఇందులో భారత్ 2-1 తేడాతో ఆసీస్‌పై చారిత్రక సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. సీనియర్ల గైర్హాజరీలో యువ భారత్‌ను అజింక్య రహానే ముందుండి నడిపించాడు. నాలుగు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో ఆరంభం మ్యాచ్‌లో ఆసీస్, రెండో టెస్టులో భారత్ గెలుపొందాయి. ఆతర్వాత మూడో టెస్ట్ డ్రా కాగా, సిరీస్ డిసైడర్ అయిన నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు కంచుకోటగా ఉన్న గబ్బాలో భారత్ విజయఢంకా మోగించి చరిత్ర సృష్టించింది. చదవండి: టీమిండియా క్రికెటర్లు లేకుండానే ఐసీసీ అవార్డులు -
టీమిండియా క్రికెటర్లు లేకుండానే ఐసీసీ అవార్డులు
దుబాయ్: ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులకు వరుసగా రెండో నెల కూడా భారత క్రికెటర్లు నామినేట్ కాలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రకటిస్తూ వస్తున్న ఈ అవార్డులను తొలిసారి(జనవరి) టీమిండియా డాషింగ్ క్రికెటర్ రిషబ్ పంత్ దక్కించుకోగా, ఫిబ్రవరి నెలకు అశ్విన్, మార్చిలో భువనేశ్వర్ కుమార్, ఏప్రిల్ నెలకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ దక్కించుకున్నారు. కాగా, మే నెలకు గాను నామినేట్ అయిన పురుషులు, మహిళా క్రికెటర్ల జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. పురుషుల క్రికెట్లో హసన్ అలీ(పాకిస్థాన్), ప్రవీణ్ జయవిక్రమ(శ్రీలంక), ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్)లు నామినేట్ కాగా, మహిళల క్రికెట్లో క్యాథరిన్ బ్రైస్(స్కాట్లాండ్), గేబీ లూయిస్(ఐర్లాండ్), లీ పాల్(ఐర్లాండ్) నామినేట్ అయ్యారు. The ICC Men's Player of the Month nominees for May are in 👀 Hasan Ali 🇵🇰 14 Test wickets at 8.92 Praveen Jayawickrama 🇱🇰 11 Test wickets at 16.18 Mushfiqur Rahim 🇧🇩 237 ODI runs at 79.00 Vote now 🗳️ https://t.co/PPTfbb1PT5#ICCPOTM pic.twitter.com/C9IFIyI35A — ICC (@ICC) June 8, 2021 మే నెలలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల్లో పాక్ యువబౌలర్హసన్అలీ 8.92 సగటుతో 14 వికెట్లు పడగొట్టి ఈ నెల ఐసీసీ అవార్డుల రేసులో ముందుండగా, శ్రీలంక అరంగేట్ర బౌలర్ప్రవీణ్ జయవిక్రమ బంగ్లాదేశ్‌తో ఆడిన టెస్టులో ఏకంగా 11 వికెట్లు పడగొట్టి, హసన్‌అలీకి గట్టి పోటీగా నిలిచాడు. మరోవైపు బంగ్లా ఆటగాడు ముష్ఫికర్ రహీమ్.. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 79 సగటుతో 237 పరుగులు చేసి, తాను కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో ఉన్నానని సవాల్ విసురుతున్నాడు. ఈ సిరీస్‌లో జరిగిన రెండో వన్డేలో రహీమ్ 125 పరుగులు సాధించడంతో బంగ్లా తొలిసారి లంకపై వన్డే సిరీస్ గెలిచింది. చదవండి: టీమిండియాకు శుభవార్త.. ఆ మ్యాచ్ అయ్యాక 20 రోజులు రిలాక్స్ -
ప్లేయర్ ఆఫ్ ది మంత్: భారత ఆటగాళ్లకు దక్కని చోటు
దుబాయ్: ఏప్రిల్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన పురుషులు, మహిళా క్రికెటర్ల జాబితాను ఐసీసీ బుధవారం ప్రకటించింది. పురుషుల జాబితాలో పాకిస్థాన్ బ్యాట్స్మెన్లు బాబర్ అజామ్, ఫఖర్ జమాన్, శ్రీలంక ఆటగాడు కుశాల్ భుర్టెల్ చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో అద్బుత ప్రదర్శన చేసిన బాబర్ అజమ్, ఫఖర్ జమాన్ అవార్డుకు నామినేట్ అయ్యారు. బాబార్ అజమ్ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక సెంచరీ, అర్థ సెంచరీతో ఆకట్టుకోగా.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, జింబాబ్వేలతో జరిగిన టీ20 సిరీస్‌లలో 7 మ్యాచ్‌ల్లోనే 126.55 స్ట్రైక్ రేట్‌తో 305 పరుగులు సాధించిన బాబర్.. రెండు అర్థశతకాలు.. ఒక సెంచరీ( 59 బంతుల్లో 122 పరుగులు) దుమ్మురేపాడు. కాగా ఇటీవలే ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బాబర్ అజమ్ విరాట్ కోహ్లిని వెనక్కినెట్టి నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు ఫఖర్ జమాన్ సైతం ప్రొటీస్‌తో జరిగిన రెండో వన్డేలో 193 పరుగులు మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు ఆఖరి వన్డేలోనూ సెంచరీతో మెరిశాడు. మొత్తంగా 111.3 స్ట్రైక్‌రేట్‌తో 302 పరుగులు సాధించాడు.ఇక నేపాల్ క్రికెటర్ కుషాల్ భుర్టెల్ ఇటీవలే జరిగిన మలేషియా, నెదర్లాండ్స్, నేపాల్ మధ్య జరిగిన టీ20 ట్రై సిరీస్‌లో అద్భుత ప్రదర్శన నమోదు చేశాడు. నాలుగు వరుస అర్థసెంచరీల సహాయంతో మొత్తంగా 278 పరుగులతో రాణించిన కుషాల్ నేపాల్ ట్రై సిరీస్‌ను నెగ్గడంలో కీలకపాత్ర వహించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు నామినేట్ అయ్యాడు. కాగా ఐసీసీ ఈ అవార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. ఇక మహిళల విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్వుమెన్లు అలీస్సా హీలీ, మెగన్ స్కట్, న్యూజిలాండ్ క్రీడాకారిణి కాస్పెర్క్ అవార్డుకు నామినేట్ అయ్యారు. కాగా జనవరిలో ఐసీసీ ఈ అవార్డులను ప్రవేశపెట్టగా పురుషుల జాబితాలో తొలిసారి రిషబ్ పంత్(జనవరి), రవిచంద్రన్ అశ్విన్(ఫిబ్రవరి), భువనేశ్వర్ కుమార్(మార్చి) వరుసగా టీమిండియా ఆటగాళ్లే గెలుచుకోవడం విశేషం. చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్: దుమ్మురేపిన పంత్.. దిగజారిన బాబర్ అజమ్ The ICC Men's Player of the Month nominees for April are in 👀 Fakhar Zaman 🇵🇰 302 ODI runs at 100.66, two centuries Babar Azam 🇵🇰 228 ODI runs at 76.00; 305 T20I runs at 43.57 Kushal Bhurtel 🇳🇵 278 T20I runs at 69.50 Vote now: https://t.co/ZYuKhVxbHF 🗳️#ICCPOTM pic.twitter.com/7dyVhwkFOo — ICC (@ICC) May 5, 2021 Who gets your vote for the April ICC Women's Player of the Month? Alyssa Healy 🇦🇺 155 ODI runs at 51.66 Leigh Kasperek 🇳🇿 9 ODI wickets at 7.77 Megan Schutt 🇦🇺 7 ODI wickets at 13.14 Vote here 🗳️ https://t.co/3FkLQzksn9#ICCPOTM pic.twitter.com/oRBx1JZno5 — ICC (@ICC) May 5, 2021 -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా భువీ..
దుబాయ్: మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఎంపికైనట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం భువీతో పాటు జింబాబ్వే ప్లేయర్ సీన్ విలియమ్స్, అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్లు పోటీపడగా చివరికు ఈ అవార్డు భువీనే వరించింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన భువీ.. 4.65 ఎకానమీతో 6 వికెట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో అతను 6.38 ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో భువీ ఏకంగా 17 డాట్ బాల్స్ వేయడం విశేషం. ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తున్న నేపథ్యంలో వరుసగా మూడో నెల కూడా టీమిండియా ఆటగాడినే ఈ అవార్డు వరించడం మరో విశేషం. జనవరి నెలకు వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఫిబ్రవరి నెలకు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్ లీ ఎంపికయ్యారు. ఈ విభాగంలో లిజెల్ లీతో పాటు రేసులో ఇద్దరు భారత అమ్మాయిలు(రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ రౌత్) ఉన్నప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లిజెల్ వైపే ఐసీసీ మొగ్గు చూపింది. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో టీమిండియా పేసర్
దుబాయ్: మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు నామినేట్ అయిన క్రికెటర్ల జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం ప్రకటించింది. పురుషుల విభాగంలో భారత్ తరఫున సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, జింబాబ్వే తరఫున సీన్ విలియమ్స్, అఫ్గనిస్థాన్ నుంచి రషీద్ ఖాన్లకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడిన భువీ.. 4.65 ఎకానమీతో 6 వికెట్లు, ఐదు టీ20ల సిరీస్‌లో 6.38 ఎకానమీతో 4 వికెట్లు సాధించాడు. వికెట్ల పరంగా భువీ కాస్త వెనుకపడినప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో పూర్తిగా సఫలమయ్యాడు. స్లాగ్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి, టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్‌లో 11 వికెట్లు, 3 టీ20ల సిరీస్‌లో 6 వికెట్లు సాధించి, భువీకి ప్రధాన పోటీదారుడిగా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్ సీన్ విలియమ్స్ 264 పరుగులతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. అదే జట్టుతో జరిగిన 3 టీ20ల సిరీస్‌లో అతను 128.57 స్ట్రయిక్ రేట్‌తో 45 పరుగులు సాధించాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ మహిళల విభాగంలో ఇద్దరు భారత అమ్మాయిల(రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ రౌత్)తోపాటు సౌతాఫ్రికా లిజెల్ లీ నామినేట్ అయ్యారు. కాగా, ఐసీసీ ఈ అవార్డులను ఈ ఏడాది జనవరి నుంచి ప్రకటిస్తూ వస్తుంది. పురుషుల విభాగంలో తొలి అవార్డు రిషబ్ పంత్(జనవరి) దక్కించుకోగా, ఫిబ్రవరి నెలకు గాను అశ్విన్ కైవసం చేసుకున్నాడు. మహిళల విభాగంలో జనవరి నెలకు షబ్నిమ్ ఇస్మాయిల్(దక్షిణాఫ్రికా), ఫిబ్రవరి నెలకు ట్యామి బీమౌంట్(ఇంగ్లండ్) ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. చదవండి: ముంబై ఇండియన్స్ కాకపోతే సన్‌రైజర్స్‌కే ఆ ఛాన్స్.. -
ధోనికి ‘స్పిరిట్ ఆఫ్ ద డెకేడ్’.. కారణం ఇదే!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రెండు అవార్డులను గెలుచుకున్నాడు. ఇటీవల ఐసీసీ నామినేట్ చేసిన ఐదు అవార్డులకు కోహ్లి నామినేట్ కాగా అందులో రెండు అవార్డులు అతన్ని వరించాయి. అందులో సర్ గార్ల్‌ఫీల్డ్ సోబర్స్ అవార్డు ఫర్ ఐసీసీ మేల్ క్రికెటర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు ఒకటి కాగా, దశాబ్దపు మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డును కూడా కోహ్లి గెలుచుకున్నాడు. ఇక దశాబ్దపు స్పిరిట్ ఆఫ్ ద క్రికెటర్ అవార్డు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి దక్కగా, ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌కు దశాబ్దపు అత్యుత్తమ టెస్టు ప్లేయర్ అవార్డు లభించింది. ఇక్కడ కోహ్లి, స్మిత్‌లు అవార్డులు ఒకటైతే, ధోనికి దక్కిన అవార్డు మరొక ఎత్తు. అసలు ధోనికి దశాబ్దపు స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అవార్డు లభించడం ఎక్కువ వార్తల్లో నిలిచింది. ధోనికి ఈ అవార్డు ఎందుకు దక్కింది అనే విషయాన్ని పరిశీలిస్తే, ఇక్కడ మనం 9 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. (బాక్సింగ్ డే టెస్టు: అంపైర్స్ కాల్‌పై సచిన్ అసహనం) ఎంఎస్ ధోని అత్యంత విజయవంతమైన సారథి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. మైదానంలో ధోనికి శరీరమంతా కళ్లు ఉంటాయని, ముఖ్యంగా ఫీల్డింగ్, బౌలర్లతో వ్యూహాలు రచించి బ్యాట్స్‌మన్ బోల్తా కొట్టించే విషయంలో అతనికి సాటిలేరని ఈ జార్ఖండ్ డైనమైట్ కెప్టెన్సీని కొనియాడుతుంటారు. కానీ భారత్ 2011 ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టెస్ట్ మాత్రం అతని కెప్టెన్సీ కెరీర్‌కే ప్రత్యేకం. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. క్రీడా స్పూర్తి విషయంలో యావత్ క్రికెట్ ప్రపంచం ముందు విజేతగా నిలబడి ప్రశంసలు అందుకుంది. ఇయాన్ బెల్ రనౌట్ వివాదాస్పదం.. యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ మ్యాచ్ బ్యాట్స్‌మన్ అలసత్వానికి ఓ గుణపాఠంగా నిలిచింది. ముఖ్యంగా ఇయాన్ బెల్ వివాదస్పద రనౌట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ట్రెంట్ బ్రెడ్జ్ వేదికగా జరిగిన నాటి రెండో టెస్ట్ మూడో రోజు ఆట ఓ డ్రామాను తలిపించింది. టీ బ్రేక్ సమయం ముందు ఇషాంత్ శర్మ వేసిన 66వ ఓవర్ చివరి బంతిని నాటి ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా చక్కటి షాట్ ఆడాడు. దాదాపు బౌండరీ అనుకుంటుండగా.. ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న ప్రవీణ్ కుమార్ అద్భుత డైవ్‌తో బంతిని అడ్డుకున్నాడు. అయితే అది ఫోరా? కాదా? అనే సందిగ్ధత నెలకొంది. ఈ లోపు ఇయాన్ బెల్, మోర్గాన్ మూడు పరుగులు పూర్తి చేశారు. అయితే అది టీ బ్రేక్ ముందు బంతి కావడం.. బౌండరీ పోయిందనే అలసత్వంతో ఇయాన్ బెల్ మూడో పరుగు తర్వాత నాలుగో రన్ కోసం సగం క్రీజు వరకు పరుగెత్తుకొచ్చి ఆగిపోయాడు. ధోని సమయస్ఫూర్తి ఇక బంతిని అందుకున్న ధోని తెలివిగా స్టంప్స్ వద్ద ఉన్న సాహాకు బంతి విసిరడంతో అతను వికెట్లను గిరటేశాడు. దీంతో ఒక్కసారిగా మైదానంలో అయోమయం చోటుచేసుకుంది. అంపైర్లకు కఠిన సవాల్ ఎదురైంది. ముందుగా ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సాయంతో బంతి బౌండరీనా? కాదా? అని పరీక్షించారు. బంతి బౌండరీ వెళ్లలేదని తేలడంతో.. భారత ఫీల్డర్లు అప్పీల్ చేశారా? లేదా ? అని పరీక్షించారు. వారు అప్పీల్ చేయడంతో మరోసారి ధోనీని ప్రశ్నించారు. అతను అప్పీల్ వెనక్కు తీసుకోవడానికి నిరాకరించడంతో నిబంధనల మేరకు ఇయాన్ బెల్‌ను రనౌట్‌గా ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంతో అవాక్కైన ఇయాన్.. ఓవర్ పూర్తయిందనే మాట విన్నానని, బెయిల్స్ కిందపడేయంతోనే ఆగిపోయానని అంపైర్లకు తెలుపుతూ అసంతృప్తితో మైదానం వీడాడు. (రెండు ఫార్మాట్లకు ధోనినే కెప్టెన్!) మిస్టర్ కూల్ క్రీడాస్ఫూర్తి ఇక టీ బ్రేక్ సమయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాటి ఇంగ్లండ్ కోచ్ అండీ ఫ్లవర్, కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ లు ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళి ఇయాన్ ఔట్ అప్పీల్‌ను ఉపసంహరించుకోవలసిందిగా ధోనిని కోరడంతో ఇయాన్ బెల్ క్రీజులోకి అడుగుపెట్టాడు. దీంతో ఇంగ్లండ్ అభిమానులు ధోనీని కొనియాడారు. క్రీడా స్పూర్తి చాటాడని హీరో అంటూ ప్రశంసించారు. బ్రిటీష్ మీడియా సైతం ధోనీ, భారత జట్టు నిర్ణయాన్ని ప్రశంసించింది. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ఇయాన్ బెల్ అలసత్వమేనని, అతను నిబంధనల మేరకే ఔటయ్యాడని, ధోని క్రీడాస్పూర్తి చాటడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఇక ఈ నిర్ణయంతో అప్పట్లోనే ధోని ఐసీసీ స్పిరిట్ క్రికెట్ ఆఫ్ ద అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఆ రనౌట్‌ను వెనక్కి తీసుకోవడంతోనే ఇప్పుడు ధోనికి స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అవార్డు ఆఫ్ డెకేడ్ దక్కడం విశేషం. 🇮🇳 MS DHONI wins the ICC Spirit of Cricket Award of the Decade 👏👏 The former India captain was chosen by fans unanimously for his gesture of calling back England batsman Ian Bell after a bizarre run out in the Nottingham Test in 2011.#ICCAwards | #SpiritOfCricket pic.twitter.com/3eCpyyBXwu — ICC (@ICC) December 28, 2020 -
ఆన్లైన్ ఓటింగ్.. మీకు నచ్చిన క్రికెటర్‌కు ఓటేయ్యండి
దుబాయ్: గడిచిన దశాబ్దానికి సంబంధించి ఐసీసీ నామినేట్ చేసిన అవార్డుల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదు అవార్డుల కోసం పోటీ పడుతున్నాడు. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ డెకేడ్తో పాటు ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్, ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్, ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు ఆఫ్ ద డెకేడ్ రేసులో కోహ్లి ఉన్నాడు. పురుషుల, మహిళల విభాగాల్లో అవార్డుల జాబితాలను ఎంపిక చేసిన ఐసీసీ.. ఫ్యాన్స్ ఓటింగ్ ద్వారా విజేతలను ప్రకటించనుంది. ఇలా ఫ్యాన్స్ ఓటింగ్ ద్వారా క్రికెటర్లను విజేతలుగా ఐసీసీ ప్రకటించనుండటం ఇదే తొలిసారి. దీనికి సంబంధించి ఐసీసీ తన వెబ్సైట్లో క్రికెటర్ల పేర్లను ఓటింగ్ కోసం ఉంచింది.మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డ్‌కు మొత్తం ఏడుగు ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. అందులో కోహ్లితోపాటు ఇండియన్ స్పిన్నర్ అశ్విన్ కూడా దూకుడు మీదున్నాడు. ఈ ఇద్దరు కాకుండా జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ , ఏబీ డివిలియర్స్ , కుమార సంగక్కర ఉన్నారు. (చదవండి: కోహ్లిని ఊరిస్తున్న తొలి క్రికెటర్ రికార్డు) మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో భారత క్రికెటర్లకు నిలిచారు. మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డ్‌కు టీమిండియా సారథి విరాట్ కోహ్లి నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు కోసం మొత్తం ఏడుగు ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. అందులో కోహ్లితోపాటు ఇండియన్ స్పిన్నర్ అశ్విన్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు కాకుండా జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ , ఏబీ డివిలియర్స్, కుమార సంగక్కర ఉన్నారు. దశాబ్దపు అత్యుత్తమ వన్డే ప్లేయర్ల రేసులో కోహ్లితో పాటు ధోని, రోహిత్ శర్మలు భారత్ నుంచి పోటీ పడుతున్నారు. ఇక లసిత్ మలింగ, మిచెల్ స్టార్క్, డివిలియర్స్, సంగక్కార కూడా పోటీలో ఉన్నారు. దశాబ్దపు అత్యుత్తమ టీ20 ప్లేయర్ అవార్డు కోసం భారత్ నుంచి కోహ్లితో పాటు రోహిత్ నామినేట్ అయ్యారు. ఈ లిస్ట్‌లో రషీద్ ఖాన్, ఇమ్రాన్ తాహిర్, ఆరోన్ ఫించ్, మలింగ, క్రిస్ గేల్ ఉన్నారు. దశాబ్దపు ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు కోసం భారత్ నుంచి కోహ్లితో పాటు ధోని కూడా పోటీ పడుతున్నాడు. మీకు నచ్చిన క్రికెటర్‌కు ఓటేయ్యాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా రోహిత్
దుబాయ్: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక అవార్డుల్లో ఉత్తమ ఆటగాడిగా గార్ఫీల్డ్ గారీ సోబర్స్ పురస్కారానికి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో 98 బంతుల్లో 84 పరుగులు చేసిన అతను తమ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత హెడింగ్లీలో జరిగిన యాషెస్ టెస్టులో 135 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 2019లో వన్డేల్లో 12, టెస్టుల్లో 22 వికెట్లు కూడా తీసిన స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనను ఐసీసీ గుర్తించింది. ఈ ఏడాది అత్యుత్తమ వన్డే ఆటగాడిగా భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిలిచాడు. ప్రపంచ కప్‌లో ఏకంగా ఐదు సెంచరీలు సహా 81 సగటుతో రోహిత్ 648 పరుగులు సాధించాడు. అత్యుత్తమ టెస్టు ఆటగాడి అవార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌కు దక్కింది. 2019లో కమిన్స్ 59 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. చాహర్ సూపర్... టి20ల్లో అత్యుత్తమ ప్రదర్శనగా భారత బౌలర్ దీపక్ చాహర్ మ్యాజిక్ స్పెల్ ఎంపికైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహర్ 7 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది. ఉత్తమ అంపైర్‌గా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఎంపికయ్యాడు. ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు మార్నస్ లబ్‌షేన్ (ఆస్ట్రేలియా)కు దక్కింది. కోహ్లి క్రీడా స్ఫూర్తి... భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలో ప్రవర్తన ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డుకు ఎంపికైంది. ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత ప్రేక్షకులు స్టీవ్ స్మిత్‌ను హేళన చేస్తుండగా... వద్దని వారించిన కోహ్లి చప్పట్లతో ప్రోత్సహించమని కోరి అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. ‘ఎన్నో ఏళ్లుగా మైదానంలో తప్పుడు ప్రవర్తన కారణంగానే చెడ్డపేరు తెచ్చుకున్న నాకు ఈ అవార్డు రావడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మన అభిమానులు స్మిత్‌ను అలా చేయడం ఆ క్షణంలో తప్పనిపించింది. అందుకే కలగజేసుకున్నాను’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. ఐసీసీ టెస్టు జట్టు కోహ్లి (కెప్టెన్), మయాంక్, లాథమ్, లబ్‌షేన్, స్మిత్, స్టోక్స్, వాట్లింగ్, కమిన్స్, స్టార్క్, వాగ్నర్, లయన్ ఐసీసీ వన్డే జట్టు కోహ్లి (కెప్టెన్), రోహిత్, షై హోప్, బాబర్ ఆజమ్, విలియమ్సన్, స్టోక్స్, బట్లర్, స్టార్క్, బౌల్ట్, షమీ, కుల్దీప్ -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
-
ఒకేఒక్కడు కోహ్లి.. ఐసీసీ అవార్డులు క్లీన్‌స్వీప్
ఏమని చెప్పినా.. ఎంతని పొగిడినా అతని గురించి తక్కువే.. క్రికెట్ కోసమే అతడు పుట్టాడేమో అనే అనుమానం కలిగించే ఆట అతడి సొంతం.. అతడి ఆట చూసి అసూయపడని క్రికెటర్ ఉండకపోవచ్చు. ఇక ఈ ఆటగాడి యుగంలో మేము ఆడనందుకు సంతోషిస్తున్నామని అనుకోని మాజీ దిగ్గజ బౌలర్లు ఉండకపోవచ్చు. అతడికి సాధ్యం కానిది ఏమీ లేదు అంటే అతిశయోక్తి కాదు. మరికొంత కాలం అతడి ఆట ఇలాగే కొనసాగితే సాధించేందుకు రికార్డులు, భవిష్యత్‌లో సాధించే ఆటగాళ్లు బహుశా ఉండకపోవచ్చు. క్రికెట్ చరిత్రలోనే ఒకే ఏడాది మూడు ఐసీసీ ప్రధాన అవార్డులు గెలుచుకున్న ఏకైక ఆటగాడు టీమిండియా సారథి విరాట్ కోహ్లి. ఆటగాడిగా, సారథిగా రికార్డులు మీద రికార్డులు, అవార్డుల మీద అవార్డులు అంతకుమించి అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. దుబాయ్: అవార్డుల జాబితాలో ఎక్కడ చూసినా విరాట్ కోహ్లి పేరే. ప్రింటింగ్ తప్పుపడిందనుకుంటే పొరపాటే. ఆటపై అతడికి ఉన్న కమిట్మెంట్కు అవార్డులు క్యూ కట్టాయి. 2018 సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఏడాది మూడు ఐసీసీ ప్రధాన అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులే కాక ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికై సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డు అందుకున్నాడు. అంతేకాకుండా ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు సారథిగా కూడా కోహ్లినే ఎంపికయ్యాడు. గతేడాది 13 టెస్టుల్లో 55కు పైగా సగటుతో 1,322 పరుగుల చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ ఎదురులేని కోహ్లి 14 వన్డేల్లో 133.55 సగటుతో 1202 పరుగులు చేయగా ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా గతేడాది మొత్తం 37 మ్యాచ్‌ల్లో(టీ20లతో సహా) 68.37 సగటుతో 2,735 పరుగులు సాధించగా, మొత్తం 11 సెంచరీలు, 9 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఇక ఎందరో టీమిండియా మహామహా సారథులకు సాధ్యంకాని విజయాలు కోహ్లి కెప్టెన్సీలో దక్కాయి. అందని ద్రాక్షగా మిగిలిపోయిన ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లు టీమిండియా గెలిచింది కోహ్లి సారథ్యంలోనే. అంతేకాకుండా టీమిండియాకు టెస్టుల్లో చాంపియన్‌షిప్ దక్కడంలో కోహ్లి పాత్ర మరవలేనిది. స్పందించిన విరాట్ కోహ్లీ.... ‘కష్టానికి ఫలితం దక్కింది. ఎంతో ఆనందంగా వుంది. అవార్డులను క్లీన్‌స్వీప్ చేసినందుకు గర్వంగా ఉంది’ అంటూ విరాట్ కోహ్లి ట్వీట్ చేశాడు. ఇక మరోవైపు ఇది.. ఓ అసాధారణమైన ప్రతిభకు దక్కిన గౌరవమని కోహ్లీని ఉద్దేశిస్తూ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా కోహ్లీని ఐసీసీ అవార్డ్లు వరించాయి. 2017 సంవత్సరానికి గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా, 2012లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ICC Men's Cricketer of the Year ✅ ICC Men's Test Cricketer of the Year ✅ ICC Men's ODI Cricketer of the Year ✅ Captain of ICC Test Team of the Year ✅ Captain of ICC Men's ODI Team of the Year ✅ Let's hear from the man himself, @imvKohli! #ICCAwards 🏆 pic.twitter.com/3M2pxyC44n — ICC (@ICC) 22 January 2019 -
టీమిండియా ప్లేయర్లకు నిరాశ
దుబాయ్: ఐసీసీ వార్షిక అవార్డుల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లు మెరిశారు. టీమిండియా ప్లేయర్లకు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాప్ లో నిలిచాడు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. 2015 సంవత్సరానికి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన స్మిత్ ప్రతిష్టాత్మక సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ పురస్కారం అందుకోనున్నాడు. ఈ అవార్డుకు ఎంపికైన నాలుగో ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్. అంతకుముందు రికీ పాంటింగ్, మిచెల్ జాన్సన్, మైఖేల్ క్లార్క్ ఈ పురస్కారం అందుకున్నారు. దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైయ్యాడు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ ద్వారా అవార్డులు ప్రకటించారు. ఇతర పురస్కారాలు టి20 పెర్ ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్: డూ ప్లెసిస్(దక్షిణాఫ్రికా) ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: జోష్ హాజిల్ వుడ్(ఆస్టేలియా) స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డ్: బ్రెండన్ మెక్ కల్లమ్(న్యూజిలాండ్) అంపైర్ ఆఫ్ ది ఇయర్: రిచర్డ్ కెటెల్ బారో వుమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: మెగ్ లానింగ్(ఆస్ట్రేలియా కెప్టెన్) వుమెన్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: స్టాఫానీ టేలర్(వెస్టిండీస్ కెప్టెన్)