
ICC Player Of The Month: 2023, మార్చి నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 12) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గెలుచుకున్నాడు. మార్చి నెలలో వివిధ ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనకు గాను షకీబ్‌ను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, యూఏఈ క్రికెటర్ ఆసిఫ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ ఉండినప్పటికీ, అంతిమంగా జ్యూరీ షకీబ్‌వైపే మొగ్గుచూపింది.
మార్చిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన షకీబ్.. తన జట్టు 1-2 తేడాతో సిరీస్ కోల్పోయినప్పటికీ తాను మాత్రం ఆ సిరీస్‌లో టాప్ రన్ స్కోరర్‌గా (బంగ్లా తరఫున), హూయ్యెస్ట్ వికెట్‌టేకర్‌గా నిలిచాడు. ఇదే ఫామ్‌ను టీ20 సిరీస్‌లోనూ కొనసాగించిన షకీబ్.. బంగ్లాదేశ్ జగజ్జేత ఇంగ్లండ్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
ఆతర్వాత ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన షకీబ్.. మొత్తంగా మార్చి నెలలో 12 మ్యాచ్‌లు ఆడి 353 పరుగులు తీసి 15 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు గెలవడం ఇది రెండోసారి. 2021 జులైలో షకీబ్ ఈ అవార్డును తొలిసారి గెలుచుకున్నాడు.