బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిషేధం విధించింది. షకీబ్ దేశవాళీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ పోటీలలో బౌలింగ్ చేయకూడదని బీసీబీ ప్రకటించింది. షకీబ్ బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఈసీబీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఐసీసీ కూడా షకీబ్‌పై బ్యాన్ విధించింది. షకీబ్ బౌలింగ్ శైలిని త్వరలో ఐసీసీ టెస్టింగ్ సెంటర్‌లో పరిశీలించబోతున్నారు. ఈ పరీక్షలో షకీబ్ పాస్ అయితే అతనిపై నిషేధం ఎత్తి వేస్తారు.
కాగా, షకీబ్ ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్‌షిప్ పోటీల్లో సర్రే తరఫున బరిలోకి దిగి సోమర్‌సెట్ కౌంటీపై 9 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం షకీబ్ బౌలింగ్ శైలిపై అంపైర్లు రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో షకీబ్ బౌలింగ్ శైలిపై ఈ నెల ప్రారంభంలో పరీక్ష నిర్వహించారు. ఇందులో షకీబ్ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలింది. షకీబ్ తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడని ఈసీబీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment