క్రికెట్ చరిత్రలో 2020-21 బోర్డర్‌ గవాస్కర్ ట్రోఫీనే అత్యుత్తమం | 2020 21 Border Gavaskar Trophy Between India And Australia Voted As Ultimate Test series In Cricket History | Sakshi
Sakshi News home page

ఐసీసీ 'అల్టిమేట్ టెస్ట్ సిరీస్‌'గా భారత్‌, ఆస్ట్రేలియా సిరీస్‌

Published Tue, Jun 8 2021 8:44 PM | Last Updated on Tue, Jun 8 2021 8:46 PM

2020 21 Border Gavaskar Trophy Between India And Australia Voted As Ultimate Test series In Cricket History - Sakshi

దుబాయ్: టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అల్టిమేట్ టెస్ట్ సిరీస్‌ ఏది అనే అంశంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించిన పోల్‌లో 2020-21 బోర్డర్‌ గవాస్కర్ ట్రోఫీకి అత్యధిక ప్రజాదరణ లభించింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఈ సిరీస్‌ను అల్టిమేట్ టెస్ట్ సిరీస్‌గా ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ అవార్డు రేసులో 1999 భారత్-పాకిస్తాన్ సిరీస్‌ ఉన్నా, అభిమానులు దానిపై అంత ఆసక్తిచూపలేదు. ఓవరాల్‌గా బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు 70.9% ఓట్లు రాగా.. భారత్-పాకిస్తాన్ సిరీస్‌కు 29.1% ఓట్లు వచ్చాయి. 

గత నెల చివరి వారంలో ఈ అవార్డు కోసం ఐసీసీ 16 ద్వైపాక్షిక సిరీస్‌లను షార్ట్‌లిస్ట్‌ చేయగా, బోర్డర్‌ గవాస్కర్ ట్రోఫీ అత్యుత్తమ ప్రజాదరణ కలిగిన సిరీస్‌గా నిలిచింది. కాగా, ఈ అవార్డు నిమిత్తం 2001 భారత్-ఆస్ట్రేలియా, 2014 ఇంగ్లండ్‌-శ్రీలంక, 2008-09 ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా, 1882 ఇంగ్లండ్-ఆస్ట్రేలియా, 2020-21 భారత్-ఆస్ట్రేలియా, 1936-37 ఆస్ట్రేలియా-ఇంగ్లండ్, 1999 వెస్టిండీస్-ఆస్ట్రేలియా, 1999 భారత్‌-పాకిస్తాన్, 1960-61 ఆస్ట్రేలియా-వెస్టిండీస్, 1985-86 ఆస్ట్రేలియా-న్యూజీలాండ్, 2005 ఇంగ్లండ్-ఆస్ట్రేలియా, 1984 ఇంగ్లండ్‌-వెస్టిండీస్, 1981 ఇంగ్లండ్-ఆస్ట్రేలియా, 1995 వెస్టిండీస్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లను ఐసీసీ పరిగణలోకి తీసుకుంది. ఈ కాంటెస్ట్‌ను ఐసీసీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా నిర్వహించింది. 

ఇదిలా ఉంటే, కంగారు గడ్డపై భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆద్యాంతం రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. ఇందులో భారత్ 2-1 తేడాతో ఆసీస్‌పై చారిత్రక సిరీస్‌ విజయాన్ని నమోదు చేసింది. సీనియర్ల గైర్హాజరీలో యువ భారత్‌ను అజింక్య రహానే ముందుండి నడిపించాడు. నాలుగు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో ఆరంభం మ్యాచ్‌లో ఆసీస్, రెండో టెస్టులో భారత్ గెలుపొందాయి. ఆతర్వాత మూడో టెస్ట్‌ డ్రా కాగా, సిరీస్‌ డిసైడర్‌ అయిన నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు కంచుకోటగా ఉన్న గబ్బాలో భారత్ విజయఢంకా మోగించి చరిత్ర సృష్టించింది. 
చదవండి: టీమిండియా క్రికెటర్లు లేకుండానే ఐసీసీ అవార్డులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement