ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులైన మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (2023), మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2023) రేసులో ఇద్దరు టీమిండియా స్టార్ ఆటగాళ్లు నిలిచారు. మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు నామినీస్ జాబితాలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీస్ జాబితాలో యశస్వి జైస్వాల్ ఉన్నారు.
టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో స్కైతో పాటు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్‌మన్, ఉగాండ ఆటగాడు అల్పేశ్ రామ్‌జనీ ఉండగా.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో యశస్వితో పాటు న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ, శ్రీలంక పేసర్ దిల్షన్ మధుషంక నిలిచారు. గతేడాది ప్రదర్శన ఆధారంగా ఐసీసీ ఆయా ఆటగాళ్లను నామినేట్ చేసింది.
2023 టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ (17 ఇన్నింగ్స్‌ల్లో 48.86 సగటున 155.95 స్ట్రయిక్‌రేట్‌తో 733 పరుగులు)
2023 టీ20ల్లో సికందర్ రజా (11 ఇన్నింగ్స్‌ల్లో 51.50 సగటున 150.14 స్ట్రయిక్‌రేట్‌తో 515 పరుగులు), బౌలింగ్‌లో 14.88 సగటున 6.57 ఎకానమీతో 17 వికెట్లు
2023 టీ20ల్లో అల్పేశ్ రామ్‌జనీ (30 మ్యాచ్‌ల్లో 8.98 సగటున 4.77 ఎకానమీతో 55 వికెట్లు)
2023 టీ20ల్లో మార్క్ చాప్‌మన్ (17 ఇన్నింగ్స్‌ల్లో 50.54 సగటున 145.54 స్ట్రయిక్‌రేట్‌తో 556 పరుగులు)
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ నామినీస్ విషయానికొస్తే.. రచిన్ రవీంద్ర (10 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 578 పరుగులు, 7 వికెట్లు), గెరాల్డ్ కొయెట్జీ (8 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు), దిల్షన్ మధుషంక (9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు) వన్డే వరల్డ్‌కప్ 2023లో అద్భుత ప్రదర్శనల కారణంగా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. యశస్వి జైస్వాల్ (4 టెస్ట్‌లు, 15 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 718 పరుగులు) అయితే ఫార్మాట్లకతీతంగా ఇరగదీసి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ముందున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment