Emerging cricketer
-
ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో సూర్యకుమార్, యశస్వి జైస్వాల్
ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులైన మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (2023), మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2023) రేసులో ఇద్దరు టీమిండియా స్టార్ ఆటగాళ్లు నిలిచారు. మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు నామినీస్ జాబితాలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీస్ జాబితాలో యశస్వి జైస్వాల్ ఉన్నారు. టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో స్కైతో పాటు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, ఉగాండ ఆటగాడు అల్పేశ్ రామ్‌జనీ ఉండగా.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో యశస్వితో పాటు న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ, శ్రీలంక పేసర్ దిల్షన్ మధుషంక నిలిచారు. గతేడాది ప్రదర్శన ఆధారంగా ఐసీసీ ఆయా ఆటగాళ్లను నామినేట్ చేసింది. 2023 టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ (17 ఇన్నింగ్స్‌ల్లో 48.86 సగటున 155.95 స్ట్రయిక్‌రేట్‌తో 733 పరుగులు) 2023 టీ20ల్లో సికందర్ రజా (11 ఇన్నింగ్స్‌ల్లో 51.50 సగటున 150.14 స్ట్రయిక్‌రేట్‌తో 515 పరుగులు), బౌలింగ్‌లో 14.88 సగటున 6.57 ఎకానమీతో 17 వికెట్లు 2023 టీ20ల్లో అల్పేశ్ రామ్‌జనీ (30 మ్యాచ్‌ల్లో 8.98 సగటున 4.77 ఎకానమీతో 55 వికెట్లు) 2023 టీ20ల్లో మార్క్ చాప్మన్ (17 ఇన్నింగ్స్‌ల్లో 50.54 సగటున 145.54 స్ట్రయిక్‌రేట్‌తో 556 పరుగులు) ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ నామినీస్ విషయానికొస్తే.. రచిన్ రవీంద్ర (10 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 578 పరుగులు, 7 వికెట్లు), గెరాల్డ్ కొయెట్జీ (8 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు), దిల్షన్ మధుషంక (9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు) వన్డే వరల్డ్‌కప్ 2023లో అద్భుత ప్రదర్శనల కారణంగా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. యశస్వి జైస్వాల్ (4 టెస్ట్‌లు, 15 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 718 పరుగులు) అయితే ఫార్మాట్లకతీతంగా ఇరగదీసి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ముందున్నాడు. -
టీమిండియా క్రికెటర్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
ICC Womens Emerging Cricketer Of The Year 2022: భారత స్టార్ మహిళా క్రికెటర్ రేణుకా సింగ్ ఠాకూర్‌కు ఐసీసీ అత్యున్నత పురస్కారం లభించింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్న ఈ సిమ్లా (హిమాచల్ ప్రదేశ్) అమ్మాయి.. ఐసీసీ వుమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని ఐసీసీ వరల్డ్ గవర్నింగ్ బాడీ ఇవాళ (జనవరి 25) ప్రకటించింది. 𝗣𝗿𝗲𝘀𝗲𝗻𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗜𝗖𝗖 𝗪𝗼𝗺𝗲𝗻’𝘀 𝗘𝗺𝗲𝗿𝗴𝗶𝗻𝗴 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗬𝗲𝗮𝗿 2️⃣0️⃣2️⃣2️⃣ Congratulations Renuka Singh 👏🏻👏🏻#TeamIndia pic.twitter.com/ZKfk7ENDm3 — BCCI (@BCCI) January 25, 2023 26 ఏళ్ల రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ అయిన రేణుకా.. అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి రెండేళ్లకే ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది. రేసులో ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ బ్రౌన్, ఇంగ్లండ్ ప్లేయర్ అలైస్ క్యాప్సీ, సహచర క్రికెటర్ యష్తిక భాటియా పోటీపడినప్పటికీ.. రేణుకానే ఈ అవార్డు వరించింది. Impressing everybody with her magnificent displays of seam and swing bowling, the ICC Emerging Women's Cricketer of the Year had a great 2022 👌#ICCAwards2022 — ICC (@ICC) January 25, 2023 రేణుకా టీమిండియా తరఫున ఇప్పటివరకు 7 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 41 వికెట్లు (వన్డేల్లో 18, టీ20ల్లో 23) పడగొట్టింది. ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆమె లేని లోటును భర్తీ చేస్తున్న రేణుకా.. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ ప్రదర్శన తర్వాత రాత్రికిరాత్రి స్టార్ అయిపోయింది. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చిన రేణుకా 4 కీలక వికెట్లు తీసి ఆసీస్ వెన్ను విరిచింది. రేణుకా స్పెల్‌లో ఏకంగా 16 డాట్ బాల్స్ ఉండటం విశేషం. -
ఎమర్జింగ్ క్రికెట్ టోర్నీ విజేత ఈసీడీజీ
సాక్షి, హైదరాబాద్: అంతర్ రాష్ట్ర ఎమర్జింగ్ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన ఎమర్జింగ్ క్రికెటర్స్ డెవలప్మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) జట్లు విజేతలుగా నిలిచాయి. బెంగళూరులోని కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ (కేఐఓసీ)లో నిర్వహించిన సీనియర్స్, జూనియర్స్ విభాగాలు రెండింట్లోనూ ఈసీడీజీ గెలుపొందింది. ఈ టోర్నీలో ఈసీడీజీ, కేఐఓసీతోపాటు మూడో జట్టుగా బెంగళూరుకు చెందిన రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ జట్టు పాల్గొంది. శుక్రవారం జరిగిన జూనియర్స్ ఫైనల్లో ఈసీడీజీ జట్టు 8 పరుగుల తేడాతో కేఐఓసీపై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈసీడీజీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఫరీదుద్దీన్ (49), ఆర్యన్ కాక్ (40), ఫర్హాన్ (32)లు రాణించారు. కేఐఓసీ బౌలర్లలో ధ్రువ్ మూడు, శివం రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో కేఐఓసీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. శివం (68), ఆయుష్ (43) రాణించారు. ఈసీడీజీ బౌలర్లు ముస్తాక్, నాసర్, ఫరీద్‌లు మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక సీనియర్స్ ఫైనల్లో ఈసీడీజీ జట్టు 70 పరుగుల తేడాతో కేఐఓసీపై ఘనవిజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈసీడీజీ 197 (20 ఓవర్లలో 9 వికెట్లకు) పరుగుల భారీస్కోరు సాధించగా, కేఐఓసీ జట్టు 127 (20 ఓవర్లలో 9 వికెట్లకు) పరుగులే చేయగలిగింది.