టీ20 వరల్డ్‌కప్ 2024కు ముందు పలువురు టీమిండియా క్రికెటర్లు "టీమ్ ఆఫ్ ద ఇయర్" క్యాప్స్ అందుకున్నారు. గతేడాది జాతీయ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్‌లను టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్స్‌తో పాటు ఐసీసీ అవార్డులు వరించాయి.
ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్‌ను అందుకున్నాడు. ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్‌ను అందుకున్నాడు.
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్ లభించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్‌లు అందుకున్నారు.
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో భారత ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. అనంతరం జూన్ 9న భారత జట్టు దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాకిస్తాన్, కెనడా, యూఎస్‌ఏ, ఐర్లాండ్‌లతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడనుంది.
టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్
ట్రావెలింగ్ రిజర్వ్స్: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment