
ఐసీసీ తమ టీ20 వరల్డ్‌కప్ 2024 జట్టును ఇవాళ (జులై 1) ప్రకటించింది. ఇందులో ఏకంగా టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. భారత్ వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టు నుంచి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇందులో నలుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఉండగా.. భారత స్టార్ ఆటగాడు, ఫైనల్ మ్యాచ్ హీరో విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం గమనార్హం.
ఐసీసీ జట్టులో భారత క్రికెటర్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభించింది. భారత్ తర్వాత అత్యధికంగా ఆఫ్ఘన్ క్రికెటర్లకు ఐసీసీ జట్టులో చోటు దక్కింది. ఆ జట్టు నుంచి వరల్డ్‌కప్ లీడింగ్ రన్ స్కోరర్ రహ్మానుల్లా గుర్బాజ్, వరల్డ్‌కప్ లీడింగ్ వికెట్ టేకర్ ఫజల్‌హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్‌లకు ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా నుంచి స్టోయినిస్.. వెస్టిండీస్ నుంచి పూరన్‌లకు ఛాన్స్ దక్కింది. 12వ ఆటగాడిగా సఫారీ స్పీడ్ గన్ నోర్జే ఎంపికయ్యాడు. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలు ముగిసాక ఐసీసీ జట్టును ప్రకటించడం ఆనవాయితీ.
వరల్డ్‌కప్ 2024లో ఐసీసీ జట్టు సభ్యుల ప్రదర్శన..
రోహిత్ శర్మ- 257 పరుగులు, సగటు 36.71, స్ట్రయిక్‌రేట్ 156.7, అర్దసెంచరీలు 3
రహ్మానుల్లా గుర్బాజ్- 281 పరుగులు, సగటు 35.12, స్ట్రయిక్‌రేట్ 124.33, అర్దసెంచరీలు 3
పూరన్- 228 పరుగులు, సగటు 38.0, స్ట్రయిక్‌రేట్ 146.15, అర్దసెంచరీలు 1
సూర్యకుమార్ యాదవ్- 199 పరుగులు, సగటు 28.42, స్ట్రయిక్‌రేట్ 135.37, అర్దసెంచరీలు 2
స్టోయినిస్- 169 పరుగులు, స్ట్రయిక్‌రేట్ 164.07, వికెట్లు 10, ఎకానమీ 8.88
హార్దిక్ పాండ్యా- 144 పరుగులు, స్ట్రయిక్‌రేట్ 151.57, వికెట్లు 11, ఎకానమీ 7.64
అక్షర్ పటేల్- 92 పరుగులు, స్ట్రయిక్‌రేట్ 139.39, వికెట్లు 9, ఎకానమీ 7.86
రషీద్ ఖాన్- 14 వికెట్లు, సగటు 12.78, ఎకానమీ 6.17, అత్యుత్తమ ప్రదర్శన 4/17
బుమ్రా- 15 వికెట్లు, సగటు 8.26, ఎకానమీ 4.17, అత్యుత్తమ ప్రదర్శన 3/7
అర్ష్‌దీప్ సింగ్- 17 వికెట్లు, సగటు 12.64, ఎకానమీ 7.16, అత్యుత్తమ ప్రదర్శన 4/9
ఫజల్‌హక్ ఫారూఖీ- 17 వికెట్లు, సగటు 9.41, ఎకానమీ 6.31, అత్యుత్తమ ప్రదర్శన 5/9
12 ఆటగాడు అన్రిచ్ నోర్జే- 15 వికెట్లు, సగటు 13.4, ఎకానమీ 5.74, అత్యుత్తమ ప్రదర్శన 4/7