2023 సెప్టెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు, ఓ ఇంగ్లండ్ ప్లేయర్ నామినేట్ అయ్యారు. సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్, మొహమ్మద్ సిరాజ్, డేవిడ్ మలాన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు బరిలో నిలిచారు.
గత నెలలో సూపర్ ఫామ్‌లో ఉండిన గిల్ 80 సగటున 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీల సాయంతో 480 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో 2 హాఫ్ సెంచరీలు, బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన గిల్ టీమిండియా ఆసియా కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. అనంతరం అదే ఫామ్‌ను ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా కొనసాగించిన గిల్.. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 74, రెండో వన్డేలో 104 పరుగులు సాధించి ఔరా అనిపించాడు.
సిరాజ్ విషయానికొస్తే.. ఈ హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ కూడా గత నెలలో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై నిప్పులు చెరిగిన సిరాజ్ ఏకంగా 6 వికెట్లు సాధించి, వన్డే ర్యాంకింగ్స్‌లో సైతం ఒక్కసారిగా భారీ జంప్ కొట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో పాటు సెప్టెంబర్ మొత్తంలో అద్భుతంగా రాణించిన సిరాజ్ 17.27 సగటున 11 వికెట్లు పడగొట్టాడు.
మలాన్ విషయానికొస్తే.. ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తిన మలాన్ ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి పరుగుల వరద పారిస్తున్నారు. గత నెల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్లో వరుసగా 54, 96, 127 పరుగులు చేసిన మలాన్ 105.72 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించి, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment