Dawid Malan
-
డేవిడ్ మలాన్ ఊచకోత.. 39 బంతుల్లోనే ముగిసిన మ్యాచ్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో ఇవాళ (జనవరి 29) ఓ వన్ సైడెడ్ మ్యాచ్ జరిగింది. ఢాకా క్యాపిటల్స్‌పై ఫార్చూన్ బారిషల్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 22 ఓవర్లలో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ 15.3 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌటైంది. బారిషల్ బౌలర్లు మొహమ్మద్ నబీ (4-0-9-3), తన్వీర్ ఇస్లామ్ (2-1-2-3), ఫహీమ్ అష్రాఫ్ (2.3-0-15-3) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు పోటీపడి వికెట్లు తీశారు. ముగ్గురూ తలో మూడు వికెట్లు తీశారు. జేమ్స్ ఫుల్లర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. లిటన్ దాస్, రోన్స్ఫర్డ్ బీటన్ తలో 10 పరుగులు చేయగా.. కెప్టెన్ తిసార పెరీరా అత్యధికంగా 15 పరుగులు సాధించాడు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో (11) వచ్చాయి. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో 7 బౌండరీలు, ఓ సిక్సర్ మాత్రమే నమోదయ్యాయి.మలాన్ ఊచకోత74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్.. డేవిడ్ మలాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడటంతో 6.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది (వికెట్ కోల్పోయి). మలాన్‌కు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కూడా తోడవ్వడంతో మ్యాచ్ తొందరగా ముగిసింది. తమీమ్ 14 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బారిషల్ ఇన్నింగ్స్‌లో తౌహిద్ హృదోయ్ 9 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. తౌహిద్ వికెట్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు దక్కింది. ఈ గెలుపుతో బారిషల్ రంగ్పైర్ రైడర్స్‌ను వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. క్యాపిటల్స్ 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.కాగా, ఈ మ్యాచ్‌కు ముందు డేవిడ్ మలాన్ బీపీఎల్ ఫ్రాంచైజీలను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. మీ దగ్గర డబ్బుంటేనే ఫ్రాంచైజీలను తీసుకోండి. లేదంటే ఊరకనే ఉండండంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుత బీపీఎల్ సీజన్లో కొన్ని ఫ్రాంచైజీలు విదేశీ ఆటగాళ్లకు రెమ్యూనరేషన్ చెల్లించడంలో జాప్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మలాన్ ఈ కామెంట్స్ చేశాడు. కొద్ది రోజుల కిందట దర్బార్ రాజ్‌షాహీ ఫ్రాంచైజీకి చెందిన విదేశీ ఆటగాళ్లు మ్యాచ్ ఫీజులు చెల్లించని కారణంగా ఓ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేశాయి. ఆ మ్యాచ్‌లో రాజ్‌షాహీ ఫ్రాంచైజీ స్వదేశీ ఆటగాళ్లను మాత్రమే బరిలోకి దించింది. -
డేవిడ్ మలాన్ విధ్వంసం.. 25 బంతుల్లోనే..!
జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో కేప్ టౌన్ సాంప్ ఆర్మీ (ఇంగ్లండ్) ఆటగాడు డేవిడ్ మలాన్ విధ్వంసం సృష్టించాడు. నైస్ లాగోస్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. మలాన్‌తో పాటు రోహన్ ముస్తఫా కూడా మెరుపు అర్ద సెంచరీతో (23 బంతుల్లో 50; 10 ఫోర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సాంప్ ఆర్మీ.. నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగుల భారీ స్కోర్ చేసింది. సాంప్ ఆర్మీ ఇన్నింగ్స్‌లో బ్రియాన్ బెన్నెట్ 0, మరుమణి 7, లియోనార్డో జూలియన్ 10, ఖయాస్ అహ్మద్ 8 పరుగులు చేశారు. లాగోస్ బౌలర్లలో బినుర ఫెర్నాండో, ముజరబానీ, తిసార పెరీరా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లాగోస్ 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సాంప్ ఆర్మీ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. లాగోస్ ఇన్నింగ్స్‌లో తిసార పెరీరా (17 బంతుల్లో 48; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రస్సీ వాన్ డెర్ డస్సెన్ 19, అవిష్క ఫెర్నాండో 19, నజీబుల్లా జద్రాన్ 11, ర్యాన్ బర్ల్ 17*, జాషువ బిషప్ 6 పరుగులు చేశారు. సాంప్ ఆర్మీ బౌలర్లలో అమీర్ హంజా 2, డేవిడ్ విల్లే, రోహన్ ముస్తఫా, ఖయాస్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.నిన్ననే (సెప్టెంబర్ 23) జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో జోబర్గ్ బంగ్లా టైగర్స్‌పై హరారే బోల్ట్స్.. డర్బన్ వోల్వ్స్‌పై బులవాయో జాగ్వర్స్ విజయాలు సాధించాయి. జోబర్గ్ బంగ్లా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరారే బోల్ట్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ 9.4 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. 20 పరుగులు చేసిన సికందర్ రజా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బోల్ట్స్ 9.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. దసున్ షనక (21 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో బోల్ట్స్‌ను గెలిపించాడు.డర్బన్ వోల్వ్స్తో జరిగిన మ్యాచ్‌లో బులవాయో జాగ్వర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వోల్వ్స్.. విల్ స్మీడ్ (55 నాటౌట్), మార్క్ చాప్మన్ (38 నాటౌట్) రాణించడంతో 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అనంతరం లారీ ఈవాన్స్ (26), నిక్ హబ్సన్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో జాగ్వర్స్ మరో మూడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: చరిత్ర సృష్టించిన పూరన్ -
ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటన
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. 2017లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. తన కెరీర్లో 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1074, 1450, 1892 పరుగులు సాధించాడు.అరంగేట్రంలోనే అదరగొట్టిటెస్టుల్లో ఒకటి, వన్డేల్లో ఆరు, టీ20లలో ఒక సెంచరీ సాయంతో ఈ మేర డేవిడ్ మలన్ పరుగులు స్కోరు చేశాడు. ఇక ఇంటర్నేషనల్ కెరీర్లో మూడు ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన మలన్.. ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లిష్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు జోస్ బట్లర్ ఈ ఫీట్ నమోదు చేశాడు.ఇక పొట్టి ఫార్మాట్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన డేవిడ్ మలన్.. అగ్ర బ్యాటర్‌గా నిలిచాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ విధ్వంసకర వీరుడు కేవలం 44 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. ఫాస్టెస్ట్ 1000అంతేకాదు.. న్యూజిలాండ్‌తో టీ20లో 48 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని సత్తా చాటాడు. ఈ క్రమంలో 2020 సెప్టెంబరులో ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలిచాడు డేవిడ్ మలన్.అంతేకాదు.. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి బ్యాటర్‌గా డేవిడ్ మలన్ రికార్డు సాధించాడు. కేవలం 24 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్-2022 గెలిచిన జట్టులోనూ డేవిడ్ మలన్ సభ్యుడు.ప్రపంచకప్‌లో శతక్కొట్టివన్డేల్లోనూ మలన్ తన మార్కును చూపించాడు. 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్న అతడు 2022లో కేవలం 15 ఇన్నింగ్స్ వ్యవధిలోనే ఐదు సెంచరీలు బాది తనదైన ముద్ర వేశాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో చోటు దక్కించుకున్నాడు.జేసన్ రాయ్ స్థానంలో ఇంగ్లండ్ తుదిజట్టులో స్థానం పొందిన డేవిడ్ మలన్.. బంగ్లాదేశ్‌తో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టి తన బ్యాట్ పవర్ చూపించాడు. అయితే, ప్రపంచకప్ టోర్నీ తర్వాత అతడికి జట్టులో చోటు కరువైంది. ఆస్ట్రేలియాతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ సెలక్టర్లు మలన్‌కు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో తాను అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలుకుతున్నట్లు బుధవారం ప్రకటన విడుదల చేశాడు 37 ఏళ్ల డేవిడ్ మలన్.చదవండి: శ్రేయస్ అయ్యర్ బౌలింగ్.. భారీ సిక్సర్ బాదిన బ్యాటర్ -
హెండ్రిక్స్ విధ్వంసం.. సత్తా చాటిన డేవిడ్ మలాన్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్ మూడో మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు రీజా హెండ్రిక్స్ రెచ్చిపోయాడు. కరాచీ కింగ్స్‌తో నిన్న (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో కేవలం 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హెండ్రిక్స్‌తో పాటు డేవిడ్ మలాన్ (41 బంతుల్లో 52; 4 ఫోర్లు, సిక్స్) కూడా మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (11) విఫలం కాగా.. ఆఖర్లో ఖుష్దిల్ షా (13 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు) వేగంగా పరుగులు సాధించాడు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, డేనియల్ సామ్స్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ.. మొహమ్మద్ అలీ (4-0-23-3), డేవిడ్ విల్లే (4-0-22-2), అబ్బాస్ అఫ్రిది (3-0-16-2), ఉసామా మిర్ (4-0-14-1) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సుల్తాన్స్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. కరాచీ ఇన్నింగ్స్‌లో షోయబ్ మాలిక్ (53), కెప్టెన్ షాన్ మసూద్ (30), కీరన్ పోలార్డ్ (28 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కరాచీ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లు కావడం విశేషం. రాయ్, షకీల్ మెరుపు అర్దసెంచరీలు నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో పెషావర్ జల్మీపై క్వెట్టా గ్లాడియేటర్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. ఓపెనర్లు జేసన్ రాయ్ (75), సౌద షకీల్ (74) మెరుపు అర్దసెంచరీలతో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 206 పరుగులు చేయగా.. ఛేదనలో చివరి వరకు పోరాడిన పెషావర్ లక్ష్యానికి 17 పరుగుల దూరంలో (190/6) నిలిచిపోయింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు బాబర్ ఆజమ్ (68), సైమ్ అయూబ్ (42) రాణించారు. -
దంచికొట్టిన మలన్.. చెలరేగిన పేసర్లు.. ఫైనల్‌కు సన్‌రైజర్స్
SA20, 2024 Qualifier 1 - Sunrisers Eastern Cape won by 51 runs: సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ డిఫెండింగ్ చాంపియన్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-1లో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసి.. ఈ సీజన్లో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. దంచికొట్టిన మలన్ సొంతమైదానం న్యూలాండ్స్‌లో మంగళవారం డర్బన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డేవిడ్ మలన్(45 బంతుల్లో 63 రన్స్) దంచికొట్టగా.. కెప్టెన్ ఐడెన్ మార్కరమ్(23 బంతుల్లో 30) కూడా రాణించాడు. చెలరేగిన ఒట్నీల్, జాన్సెన్ వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు స్కోరు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్‌కు సన్‌రైజర్స్ పేసర్లు ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెస్ చుక్కలు చూపించారు. 51 పరుగుల తేడాతో రైజర్స్ గెలుపు ఇద్దరూ తలా నాలుగేసి వికెట్లు పడగొట్టి డర్బన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. వీరికి తోడు స్పిన్నర్ లియామ్ డాసన్ రెండు కీలక వికెట్లు తీసి 106 పరుగులకే డర్బన్ జట్టును ఆలౌట్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. రైజర్స్ విధించిన టార్గెట్‌ను పూర్తిచేయలేక 19.3 ఓవర్లకే డర్బన్ ఇలా చేతులెత్తేయడంతో 51 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. అద్భుత బౌలింగ్‌తో డర్బన్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్(20), వియాన్ మల్దర్(38), హెన్రిచ్ క్లాసెన్(23) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇక సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒట్నీల్ బార్ట్‌మన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. డర్బన్‌కు మరో అవకాశం ఇదిలా ఉంటే.. డర్బన్ సూపర్ జెయింట్స్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంది. పర్ల్ రాయల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో డర్బన్ ఫైనల్లో చోటు కోసం తలపడాల్సి ఉంటుంది. చదవండి: జింబాబ్వే పర్యటనకు టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్.. షెడ్యూల్ ఇదే 𝑭𝒊𝒓𝒔𝒕 𝒊𝒏𝒏𝒊𝒏𝒈𝒔 𝒂𝒄𝒕𝒊𝒐𝒏 🔥#Betway #SA20 #Playoffs #SECvDSG #WelcomeToIncredible pic.twitter.com/LG99C0gG5r — Betway SA20 (@SA20_League) February 6, 2024 -
WC 2023: వరల్డ్‌కప్‌లో స్టోక్స్ తొలి సెంచరీ.. ఇంగ్లండ్ భారీ స్కోరు
ICC WC 2023- Eng Vs Ned: వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా వరల్డ్‌కప్ టోర్నీలో తన తొలి శతకం నమోదు చేశాడు. పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(15) విఫలం కాగా.. మరో ఓపెనర్ డేవిడ్ మలన్ 87 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్ చెత్త షాట్ సెలక్షన్‌తో 28 పరుగులకే వెనుదిరగగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టోక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా 84 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో వరల్డ్‌కప్‌లో తన పేరిటా ఓ సెంచరీని లిఖించుకున్నాడు. మిగతా వాళ్లలో క్రిస్ వోక్స్ అర్ద శతకం(51) బాదాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు సాధించింది. డచ్ బౌలర్లలో బాస్ డి లిడే మూడు, ఆర్యన్ దత్, లోగన్ వాన్ బీక్ చెరో రెండు, పాల్ వాన్ మెకెరన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్ వేదికగా ప్రపంచకప్ బరిలో దిగిన ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నెదర్లాండ్స్‌కు కూడా సెమీ ఫైనల్ అవకాశాలు లేవు. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో 9, 10 స్థానాల కోసం అన్నట్లుగా ఈ నామమాత్రపు మ్యాచ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. గాయం కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన స్టోక్స్ పునరాగమనంలోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే, ఈ నామమాత్రపు మ్యాచ్‌లో మాత్రం సెంచరీ చేయడం విశేసం. కాగా 2019లో ఇంగ్లండ్ ట్రోఫీ గెలవడంలో స్టోక్స్‌దే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) -
బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించిన ఇంగ్లండ్.. 364 పరుగుల భారీ స్కోర్
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ జట్టు తమ విశ్వరూపం చూపించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లీష్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి ఏకంగా 364 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ మలాన్(107 బంతుల్లో 140) విధ్వసకర శతకంతో విరుచుకుపడ్డాడు. అతడితో పాటు జో రూట్(82), జానీ బెయిర్ స్టో(52) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఓపెనర్లు మలాన్, బెయిర్ స్టో తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆఖరి ఓవర్లలో వరుసక్రమంలో ఇంగ్లండ్ వికెట్లు కోల్పోవడంతో 400 పరుగుల మార్క్‌ను చేరుకోలేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ 4 వికెట్లు పడగొట్టగా.. షోర్ఫుల్ ఇస్లాం మూడు, టాస్కిన్ అహ్మద్, షకీబ్ తలా వికెట్ సాధించారు. చదవండి: CWC 2023 ENG VS BAN: డేవిడ్ మలాన్ విధ్వంసకర శతకం.. పలు రికార్డులు నమోదు -
WC 2023: చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆల్‌టైం రికార్డు బ్రేక్
ICC Cricket World Cup 2023-England vs Bangladesh: బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో గ్రాహం గూచ్ పేరిట ఉన్న రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఇంగ్లండ్ తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ధర్మశాల వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మలన్ విధ్వంసకర శతకం ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్ టీమ్‌కు ఓపెనర్లు జానీ బెయిర్ స్టో అర్ధ శతకం(52), డేవిడ్ మలన్ సునామీ సెంచరీ(140)తో అద్భుత ఆరంభం అందించారు. ఈ క్రమంలో బెయిర్‌స్టో స్థానంలో క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్.. 33.4 ఓవర్లో షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఫోర్ బాది యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అదే జోష్‌లో అరుదైన ఘనత కూడా సాధించాడు. మరోసారి షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లోనే(35.4ఓవర్) రెండు పరుగులు తీసి.. గ్రాహం గూచ్ను అధిగమించాడు. తద్వారా వరల్డ్‌కప్ ఈవెంట్లలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ప్రపంచకప్ టోర్నీల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు 1.జో రూట్- 898* 2.గ్రాహం గూచ్- 897 3.ఇయాన్ బెల్- 718 4.అలన్ లాంబ్- 656 5.గ్రేమ్ హిక్- 635. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: #Shubman Gill: టీమిండియాకు భారీ షాక్! వాళ్లలో ఒకరికి గోల్డెన్ ఛాన్స్.. వరల్డ్‌కప్ జట్టులో! -
CWC 2023: డేవిడ్ మలాన్ విధ్వంసకర శతకం.. పలు రికార్డులు నమోదు
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మలాన్ 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో ఆరో సెంచరీని పూర్తి చేశాడు.సెంచరీ తర్వాత గేర్ మార్చిన మలాన్.. మెహిది హసన్ మీరజ్ వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్లో వరుసగా 4,6,6,4 పరుగులు సాధించి ఇంగ్లండ్‌ను భారీ స్కోర్ దిశగా పరుగులు పెట్టిస్తున్నాడు. మలాన్‌కు జతగా మరో ఎండ్‌లో జో రూట్ (45) ఉన్నారు. 33 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 221 పరుగులు చేసింది. కెరీర్లో 100వ మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 59 బంతుల్లో 52 పరుగులు చేసి షకీబ్ ఉల్ హసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఇంగ్లండ్.. బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు చేస్తుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సెంచరీతో మలాన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న మలాన్ వన్డేల్లో వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 6 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మలాన్ కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే 6 సెంచరీలు చేయగా.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ 27 ఇన్నింగ్స్‌ల్లో 6 శతకాలు బాది మలాన్ వెనుక ఉన్నాడు. ఈ రికార్డుతో పాటు మలాన్ మరో ఘనత సాధించాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సెంచరీలు (4) చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా డేవిడ్ గోవర్ (1983), జానీ బెయిర్‌స్టో (2018)ల సరసన నిలిచాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 14 పరుగులకే ఔటైన మలాన్.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ తర్వాత మరింతగా చెలరేగిపోతున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఇది ఆరో సెంచరీ. ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర అజేయమైన సెంచరీలతో కదంతొక్కగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు (డికాక్, డస్సెన్, మార్క్రమ్) శతక్కొట్టారు. తాజా శతకంతో మలాన్ వీరి సరసన చేరాడు. 35 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 239/1గా ఉంది. మలాన్ (128), రూట్ (55) క్రీజ్‌లో ఉన్నారు. -
ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు నామినేట్ అయిన టీమిండియా స్టార్లు
2023 సెప్టెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు, ఓ ఇంగ్లండ్ ప్లేయర్ నామినేట్ అయ్యారు. సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్, మొహమ్మద్ సిరాజ్, డేవిడ్ మలాన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు బరిలో నిలిచారు. గత నెలలో సూపర్ ఫామ్‌లో ఉండిన గిల్ 80 సగటున 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీల సాయంతో 480 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో 2 హాఫ్ సెంచరీలు, బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన గిల్ టీమిండియా ఆసియా కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. అనంతరం అదే ఫామ్‌ను ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా కొనసాగించిన గిల్.. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 74, రెండో వన్డేలో 104 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. సిరాజ్ విషయానికొస్తే.. ఈ హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ కూడా గత నెలలో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై నిప్పులు చెరిగిన సిరాజ్ ఏకంగా 6 వికెట్లు సాధించి, వన్డే ర్యాంకింగ్స్‌లో సైతం ఒక్కసారిగా భారీ జంప్ కొట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో పాటు సెప్టెంబర్ మొత్తంలో అద్భుతంగా రాణించిన సిరాజ్ 17.27 సగటున 11 వికెట్లు పడగొట్టాడు. మలాన్ విషయానికొస్తే.. ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తిన మలాన్ ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి పరుగుల వరద పారిస్తున్నారు. గత నెల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో వరుసగా 54, 96, 127 పరుగులు చేసిన మలాన్ 105.72 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించి, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. -
ENG Vs NZ 4th ODI: శతక్కొట్టిన డేవిడ్ మలాన్.. ఇంగ్లండ్ భారీ స్కోర్
లండన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ మలాన్ (114 బంతుల్లో 127; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మలాన్ ఒక్కడే రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. బెయిర్‌స్టో 13, రూట్ 29, హ్యారీ బ్రూక్ 10, జోస్ బట్లర్ 36, లివింగ్‌స్టోన్ 28, మొయిన్ అలీ 3, సామ్ కర్రన్ 20, డేవిడ్ విల్లే 19, బ్రైడన్ కార్స్ 15 నాటౌట్, రీస్ టాప్లే 1 నాటౌట్ పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లతో విజృంభించగా.. డారిల్ మిచెల్, మ్యాట్ హెన్రీ తలో 2 వికెట్లు, జేమీసన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. గత మ్యాచ్ భారీ శతకంతో విరుచుకుపడిన బెన్ స్టోక్స్, ఐదు వికెట్లతో చెలరేగిన ట్రెంట్ బౌల్ట్ ఈ మ్యాచ్‌లో లేరు. అనంతరం 312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 6 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే 7 పరుగులు చేసి రనౌట్ కాగా.. విల్ యంగ్ (15), హెన్రీ నికోల్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, 4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో న్యూజిలాండ్, రెండు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్ గెలుపొందాయి. ఈ మ్యాచ్ ఇంగ్లండ్ గెలిస్తే (3-1) సిరీస్ వారి వశమే అవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే 2-2తో సిరీస్ సమం అవుతుంది. ఇదే పర్యటనలో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమమైన విషయం తెలిసిందే. -
హ్యారీ బ్రూక్, మలాన్ విధ్వంసం.. న్యూజిలాండ్ చిత్తు
ఇంగ్లండ్ టూర్‌ను న్యూజిలాండ్ ఓటమితో ఆరంభించింది. చెస్టర్-లీ-స్ట్రీట్ ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో కివీస్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులు మాత్రమే చేసింది. బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(41) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లీష్ జట్టు బౌలర్లలో లూక్ వుడ్, కార్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్,మోయిన్ అలీ, లివింగ్ స్టోన్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 14 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(54), హ్యారీ బ్రూక్(43) పరుగులతో అదరగొట్టారు. కివీస్ బౌలర్లలో సౌథీ, లూకీ ఫెర్గూసన్, సోధి తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 1న జరగనుంది. చదవండి: AUS vs SA 1st T20I: మిచెల్ మార్ష్ ఊచకోత.. డేవిడ్ విధ్వంసం! దక్షిణాఫ్రికా చిత్తు -
చెలరేగిన కొలిన్ మున్రో.. చేతులెత్తేసిన మలాన్, హేల్స్, రూట్
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్.. కొలిన్ మున్రో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. మున్రో మినహా రాకెట్స్ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. రాకెట్స్ టీమ్‌లో డేవిడ్ మలాన్ (10), అలెక్స్ హేల్స్ (4), జో రూట్ (14), డేనియల్ సామ్స్ (17) లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నా ఆ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. వెల్ష్ ఫైర్ బౌలర్లలో డేవిడ్ విల్లే, జేక్ బాల్, వాన్ డర్ మెర్వ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. రాణించిన జో క్లార్క్.. 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెల్ష్‌ఫైర్.. 6 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జో క్లార్క్ (54), కెప్టెన్ టామ్ ఎబెల్ (32) వెల్ష్ఫైర్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వెల్ష్ ఫైర్ స్టార్ ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో (9 బంతుల్లో 3), గ్లెన్ ఫిలప్స్ (12) విఫలమయ్యారు. స్టెఫెన్ ఎస్కినాజీ (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. రాకెట్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్ 2, జాన్ టర్నర్, ఐష్ సోధి తలో వికెట్ పడగొట్టారు. -
మలాన్ వీరోచిత శతకం.. పసికూనపై అతికష్టం మీద గెలిచిన ఇంగ్లండ్
3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టు.. ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో అతికష్టం మీద 3 వికెట్ల తేడాతో నెగ్గింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 210 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను.. డేవిడ్ మలాన్ (145 బంతుల్లో 114 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత శతకంతో పోరాడి గెలిపించాడు. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్.. 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి ఖరారు అనుకున్న దశలో మలాన్ తన అనుభవాన్ని అంతా రంగరించి, టెయిలెండర్ల సాకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా ఆదిల్ రషీద్ (29 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్)ను సమన్వయం చేసుకుంటూ మలాన్ పోరాడిన తీరు అమోఘం. మలాన్- రషీద్ జోడీ ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 51 పరుగులు జోడించి, మరో 8 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మలాన్, రషీద్ మినహా జేసన్ రాయ్ (4), ఫిలిప్ సాల్ట్ (12), జేమ్స్ విన్స్ (6), జోస్ బట్లర్ (9), క్రిస్ వోక్స్ (7), మొయిన్ అలీ (14), విఫలం కాగా.. విల్ జాక్స్ (26) కాస్త పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహదీ హసన్ మిరాజ్ 2, షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్‌గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 47.2 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (23), షాంటో (58), మహ్మదుల్లా (31) ఓ మోస్తరుగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోప్రా ఆర్చర్, మార్క్ వుడ్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, విల్ జాక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 3న ఇదే వేదికపై జరుగుతుంది. -
అన్నా.. ఏందన్నా ఇది! ఇలాంటి షాట్ ఎవరూ ట్రై చేసి ఉండరు! వైరల్
South Africa vs England, 3rd ODI- Moeen Ali: ఇంగ్లండ్- సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఒంటిచేత్తో షాట్‌కు యత్నించి విఫలమయ్యాడు. స్విచ్ హిట్ బాదాలని ప్రయత్నించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఫెయిలయ్యాడు. ఆ తర్వాత మళ్లీ అలాంటి షాట్ ఆడేందుకు ట్రై చేయలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో తొలి రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన ఆతిథ్య ప్రొటిస్ జట్టు.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. అదరగొట్టిన మలన్, బట్లర్, అలీ ఇక నామమాత్రపు మూడో వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌కు ఊరట విజయం దక్కింది. డేవిడ్ మలన్ 118 పరుగులు, జోస్ బట్లర్ 131 పరుగులతో చెలరేగడంతో 59 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. వీరికి తోడు మొయిన్ అలీ 41 రన్స్‌తో రాణించాడు. దీంతో బట్లర్ బృందం క్లీన్‌స్వీప్ గండం నుంచి గట్టెక్కింది. ఇదేం షాట్ భయ్యా అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 44వ ఓవర్ మూడో బంతికి తబ్రేజ్ షంసీ బౌలింగ్‌లో మొయిన్ అలీ రివర్స్ హిట్‌కు యత్నించిన తీరు ఆశ్చర్యపరిచింది. షంసీ వేసిన షార్ట్‌బాల్‌ను కుడిచేతితో బౌండరీకి తరలించాలని భావించిన ఈ లెఫ్టాండర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక తర్వాతి బంతికి మాత్రం భారీ సిక్సర్ బాది చైనామన్ స్పిన్నర్ షంసీకి షాకిచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు .. ‘‘అన్నా ఏందన్నా ఇది! బహుశా ఎవరూ కూడా మరీ ఇంత వింతైన షాట్ ట్రై చేసి ఉండరు. మేమైతే ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు అలీ భాయ్!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా మూడో వన్డేలో బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. అలీ ఈ మ్యాచ్‌లో 23 బంతుల్లో 41 పరుగులతో అద్భుతంగా రాణించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులు ఇచ్చాడు. వికెట్ మాత్రం తీయలేకపోయాడు. చదవండి: IND vs NZ: గంటకు 150 కి.మీ. వేగం.. సర్కిల్ బయటపడ్డ బెయిల్స్! ఉమ్రాన్‌తో అట్లుంటది మరి! Suryakumar: ఒకే స్టైల్లో రెండు స్టన్నింగ్ క్యాచ్‌లు.. 'స్కై' అని ఊరికే అనలేదు What was Brother Moeen doing 😂😂😂 pic.twitter.com/8NcE1OW285 — Taimoor Zaman (@taimoorze) February 1, 2023 Imagine he made contact with this shot. One-handed reverse Slap from Moeen Ali😂😭 #EngvSa #SAvENG pic.twitter.com/ioHJwv5e6U — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) February 1, 2023 -
శతకాలతో చెలరేగిన బట్లర్, మలాన్.. ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం లభించింది. ఇప్పటికే సౌతాఫ్రికా సిరీస్‌ను చేజెక్కించుకున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 59 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కెప్టెన్ జాస్ బట్లర్, ఓపెనర్ డేవిడ్ మలాన్‌లు శతకాలతో విరుచుకుపడడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోరు చేసింది. బట్లర్(127 బంతుల్లో 131, ఆరు ఫోర్లు, 7 సిక్సర్లు), డేవిడ్ మలాన్(114 బంతుల్లో 118, ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) చెలరేగగా.. చివర్లో మొయిన్ అలీ 23 బంతుల్లో 41 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ 80 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రీజా హెండ్రిక్స్ 52, టెంబా బవుమా 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఆరు వికెట్లతో టాప్ లేపగా.. ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీశాడు. ఇక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును జాస్ బట్లర్ దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ ఈ సిరీస్‌తో ఏదైనా లాభపడిందంటే అది ఆర్చర్ రూపంలో మాత్రమే. గాయంతో చాలాకాలం పాటు జట్టుకు దూరమైన జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అయితే తన విలువేంటో మూడో వన్డేలో చూపించాడు. ఆరు వికెట్లతో ప్రొటిస్ నడ్డి విరిచాడు. కీలకమైన వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆర్చర్ ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు శుభసూచకం అని చెప్పొచ్చు. -
ICC T20 No.1: దుమ్ములేపిన సూర్య.. అదే జరిగితే మలన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ICC Men's T20I Batting Rankings- Suryakumar Yadav: పొట్టి ఫార్మాట్లో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ హవా కొనసాగుతోంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న మిస్టర్ 360.. ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ అరుదైన రికార్డుపై కన్నేశాడు. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌తో సూర్య బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాంచీ మ్యాచ్‌తో.. ఈ క్రమంలో రాంచిలో జరిగిన తొలి మ్యాచ్‌లో 34 బంతుల్లో 47 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. 910 రేటింగ్ పాయింట్లు సాధించి సత్తా చాటాడు. అయితే, రెండో టీ20లో 31 బంతుల్లో 26 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో రెండు పాయింట్లు కోల్పోయి 908 రేటింగ్ పాయింట్ల వద్ద నిలిచిపోయాడు. మలన్ ఆల్‌టైం రికార్డు అయితే, అహ్మదాబాద్‌లో ఆఖరిదైన మూడో టీ20లో ఈ ముంబైకర్ బ్యాట్ ఝులిపిస్తే గనుక కెరీర్ బెస్ట్ రేటింగ్ అందుకునే అవకాశం ఉంది. కాగా 2020లో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ 915 పాయింట్లతో టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. పాయింట్ల రికార్డు విషయంలో సూర్య ప్రస్తుతం మలన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20 ఫార్మాట్లో దుమ్మురేపుతున్న సూర్యకుమార్ యాదవ్.. ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే టీమిండియాతో సిరీస్‌లో సత్తా చాటిన కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్.. ఎనిమిది స్థానాలు ఎగబాకి 19వ ర్యాంకుకు చేరుకున్నాడు. అదే విధంగా డారిల్ మిచెల్ తొమ్మిది స్థానాలు మెరుగుపరచుకుని 29వ స్థానంలో నిలిచాడు. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్- టాప్-5లో ఉన్నది వీళ్లే 1.సూర్యకుమార్ యాదవ్(908 పాయింట్లు)- ఇండియా 2. మహ్మద్ రిజ్వాన్ (836)- పాకిస్తాన్ 3. డెవాన్ కాన్వే(788)- న్యూజిలాండ్ 4. బాబర్ ఆజం(778)- పాకిస్తాన్ 5. ఎయిడెన్ మార్కరమ్(748)- సౌతాఫ్రికా చదవండి: Hanuma Vihari: శభాష్ విహారి.. నీ పోరాటానికి సలాం, మణికట్టు గాయమైనా ఒంటి చేత్తో వీరోచిత పోరాటం Prithvi Shaw: పృథ్వీ షాకు నో ఛాన్స్! ఓపెనర్లుగా గిల్- ఇషాన్ జోడీనే.. ఎందుకంటే.. Ind Vs NZ: ఏదైతేనేం.. హార్దిక్ అలా! సూర్య ఇలా!... ఎన్నో మార్పులు.. భావోద్వేగానికి లోనైన ‘స్కై’ -
వారెవ్వా స్టార్క్.. మొన్న రాయ్.. ఇప్పుడు మలాన్! వీడియో వైరల్
సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ వెటరన్ పేసర్ మిచిల్ స్టార్క్ నిప్పులు చేరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తొలి ఓవర్లోనే రాయ్, మలాన్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. ముఖ్యంగా మలాన్‌ను స్టార్క్ ఔట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన స్టార్క్.. అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో మలన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టార్క్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి స్వింగ్ అయ్యి వికెట్లను గిరాటేసింది. దీంతో ఒక్క సారిగా మలన్ షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంది. కాగా తొలి వన్డేలో కూడా ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్‌ను అచ్చెం ఇటువంటి బంతితోనే స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. That is a SEED from Starc!#AUSvENG | #PlayOfTheDay | #Dettol pic.twitter.com/XISUPw34Pm — cricket.com.au (@cricketcomau) November 19, 2022 చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాకు అదిరిపోయే స్వాగతం! వీడియో వైరల్ -
అదరగొట్టిన వార్నర్, స్మిత్.. ఇంగ్లండ్‌పై ఆసీస్ ఘన విజయం
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. ఆడిలైడ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై 6 వికెట్ల ఆసీస్ ఘన విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 46.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(86), స్మిత్(80 నాటౌట్), హెడ్(69) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ రెండు , జోర్డాన్, లియామ్ డాసన్ తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో డేవిడ్ మాలాన్ మినహా మిగితా ఎవరూ అంతగా రాణించలేదు. ఈ మ్యాచ్‌లో మలాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 128 బంతులు ఎదుర్కొన్న మలాన్ 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 134 పరుగులు సాధించాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్, జంపా తలా మూడు వికెట్లు సాధించగా.. స్టార్క్, స్టోయినిష్ చెరో వికెట్ పడగొట్టారు. ఇరు జట్లు మధ్య రెండో వన్డే సిడ్నీ వేదికగా నవంబర్ 19న జరగనుంది. చదవండి: IND vs NZ: బంతిని చూడకుండానే భారీ సిక్సర్.. శాంసన్‌తో అట్లుంటుంది మరి! -
కళ్లు చెదిరే విన్యాసం.. క్యాచ్ పట్టకపోయినా సంచలనమే
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్టన్ అగర్ కళ్లు చెదిరే విన్యాసం అందరిని ఆకట్టుకుంది. క్యాచ్ పట్టి ఉంటే మాత్రం చరిత్రలో నిలిచిపోయేది. అయితే క్యాచ్ మిస్ అయినప్పటికి అతని విన్యాసం మాత్రం సంచలనమే అవుతుంది. ఎందుకంటే సిక్సర్ వెళ్లాల్సిన బంతిని కేవలం ఒక్క పరుగుకే పరిమితం చేసి ఐదు పరుగులు సేవ్ చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ 45వ ఓవర్లో అప్పటికే సెంచరీతో దుమ్మురేపుతున్న డేవిడ్ మలాన్ కమిన్స్ బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. చాలా హైట్‌లో వెళ్లిన బంతి వెళ్లడంతో కచ్చితంగా సిక్స్ అని అభిప్రాయపడ్డారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న ఆస్టన్ అగర్ సూపర్మ్యాన్లా పైకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు. అయితే అప్పటికే బౌండరీ లైన్ దాటేయడంతో క్యాచ్ పట్టినా ఉపయోగముండదు. అందుకే బంతిని వెంటనే బౌండరీ లైన్ అవతలకు విసిరేసిన తర్వాతే కిందపడ్డాడు. అలా ఆరు పరుగులు రావాల్సింది పోయి ఇంగ్లండ్‌కు ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఆస్టన్ అగర్ విన్యాసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అంతకముందు లియామ్ డాసన్‌ను కూడా ఆస్టన్ అగర్ తన స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో రనౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇక డేవిడ్ మలాన్ సెంచరీతో(128 బంతుల్లో 134 పరుగులు, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరవడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. డేవిడ్ విల్లీ(34 నాటౌట్), జాస్ బట్లర్(29 పరుగులు) మలాన్‌కు సహకరించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్, ఆడమ్ జంపాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్టోయినిస్ చెరొక వికెట్ తీశారు. That's crazy! Take a bow, Ashton Agar #AUSvENG pic.twitter.com/FJTRiiI9ou — cricket.com.au (@cricketcomau) November 17, 2022 చదవండి: చేసిందే తప్పు.. పైగా అంపైర్‌ను బూతులు తిట్టాడు స్టార్క్ దెబ్బ.. రాయ్‌కు దిమ్మతిరిగిపోయింది! వైరల్ వీడియో -
IND VS ENG: అనుకున్నదే అయ్యింది.. ఆ ఇద్దరు ఔట్
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 10) జరుగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు అనుకున్న విధంగానే ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ కీలకమైన మ్యాచ్‌కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఫిలిప్ సాల్ట్, క్రిస్ జోర్డాన్ జట్టులోకి వచ్చారు. ఈ రెండు మార్పులు మినహాయించి.. శ్రీలంకపై బరిలోకి దిగిన జట్టునే ఇంగ్లండ్ యధాతథంగా కొనసాగించింది. ఇంగ్లండ్ విజయావకాశాలను ప్రభావితం చేయగల మలాన్, వుడ్ జట్టులో లేకపోవడంతో ఇంగ్లండ్ ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి. మరోవైపు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా.. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. జింబాబ్వేపై బరిలోకి దిగిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. దీంతో రిషబ్ పంత్‌కు మరో అవకాశం దక్కినట్లైంది. జట్ల వివరాలు.. టీమిండియా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ ఇంగ్లండ్: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ -
టీమిండియాతో సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు మరో బిగ్ షాక్..!
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా ఈనెల 10న టీమిండియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే ఆ జట్టు డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ జట్టుకు దూరం కాగా.. తాజాగా స్టార్ పేసర్ మార్క్ వుడ్ జనరల్ స్టిఫ్నెస్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. గాయం కారణంగా వుడ్ ప్రాక్టీస్‌కు సైతం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వుడ్ సమస్య అంత పెద్దదేమీ కాకపోయినప్పటికీ.. ఇండియాతో మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది ఇంగ్లీష్ టీమ్‌ను కలవరపెడుతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో వుడ్.. టీమిండియాతో మ్యాచ్ సమయానికి ఫిట్‌గా లేకపోతే, ఆ ప్రభావం కచ్చితంగా జట్టు విజయావకాశాలపై పడుతుందని ఇంగ్లండ్ మేనేజ్మెంట్ కంగారు పడుతుంది. ఒకవేళ వుడ్ మ్యాచ్ సమయానికి కోలుకోలేకపోతే.. అతనికి ప్రత్యామ్నాయంగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ తైమాల్ మిల్స్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. కాగా, వరల్డ్‌కప్-2022లో వుడ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి మాంచి ఊపుమీదున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, గ్రూప్-1 నుంచి అతికష్టం మీద సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఇంగ్లండ్‌కు నిన్న (నవంబర్ 7) కూడా ఓ భారీ షాక్ తగిలింది. కీలక ఆటగాడు, విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మలాన్ గజ్జల్లో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. నవంబర్ 1న శ్రీలంకతో జరిగిన సెమీస్ డిసైడర్ మ్యాచ్‌లో గాయపడిన మలాన్.. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారులు మలాన్ స్థానాన్ని ఫిలిప్ సాల్ట్‌తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. -
టీమిండియాతో సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. విధ్వంసకర ప్లేయర్ ఔట్
టీ20 వరల్డ్‌కప్-2022 కీలక దశలో ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు, విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మలాన్ గజ్జల్లో గాయం కారణంగా టీమిండియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. నవంబర్ 1న శ్రీలంకతో జరిగిన గ్రూప్-1 రెండో సెమీస్ డిసైడర్ మ్యాచ్‌లో గాయపడిన మలాన్.. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు. టీమిండియాతో జరిగే సెమీస్ మ్యాచ్‌కు ఫిట్‌గా లేడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. మలాన్ స్థానాన్ని ఫిల్ సాల్ట్ రీప్లేస్ చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాగా, పొట్టి క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్లలో ముఖ్యుడై మలాన్.. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటలేకపోయాడు. ఐర్లాండ్ చేతిలో పరాభవం ఎదురైన మ్యాచ్‌లో చేసిన 35 పరుగులే అతని అత్యధిక స్కోర్‌గా ఉంది. టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్ నుంచి ఆరో స్థానానికి పడిపోయిన మలాన్ జట్టులో లేకపోవడం ఇంగ్లండ్ విజయావకాశాలపై తప్పక ప్రభావం చూపుతుందని ఆ దేశ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్ ఖారారు చేసుకున్న ఇంగ్లండ్.. నవంబర్ 10న టీమిండియాతో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్ల మధ్య నవంబర్ 13న ఫైనల్ జరుగుతుంది. -
మలాన్, మొయిన్ మెరుపులు.. ఆసీస్‌కు ఘోర పరాభవం
టీ20 ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఘోర పరాభవం ఎదురైంది. స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో వరుసగా రెండో టీ20లోనూ ఓటమిపాలైన ఆసీస్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. కాన్బెర్రా వేదికగా ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన రెండో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 9 పరుగుల దూరంలో (170) నిలిచిపోయింది. ఫలితంగా ఇంగ్లండ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మలాన్, మొయిన్ మెరుపులు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 4.1 ఓవర్లలో 31 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. వన్ డౌన్ బ్యాటర్ డేవిడ్ మలాన్ (48 బంతుల్లో 82; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ మొయిన్ అలీ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. వీరిద్దరు మినహా జట్టు మొత్తం విఫలమైంది. జోస్ బట్లర్ (13 బంతుల్లో 17) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్ 3 వికెట్లు పడగొట్టగా.. జంపా 2, కమిన్స్, స్టార్క్ తలో వికెట్ దక్కించుకున్నారు. మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్ పోరాటం వృధా.. 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ కూడా ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోగా.. మిచెల్ మార్ష్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (23 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్) జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరు వరుసగా ఔట్ కావడంతో, ఆఖర్లో వచ్చిన వేడ్ (10 బంతుల్లో 10), కమిన్స్ (11 బంతుల్లో 18) వేగంగా పరుగులు రాబట్టలేకపోవడంతో ఆసీస్ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇంగ్లీష్ బౌలర్లలో సామ్ కర్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోక్స్, డేవిడ్ విల్లే, రీస్ టాప్లే తలో వికెట్ సాధించారు. -
మలాన్, బ్రూక్‌ల విధ్వంసం.. ఇంగ్లండ్‌దే టి20 సిరీస్
పాకిస్తాన్‌తో జరిగిన ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఇంగ్లండ్ చేజెక్కించుకుంది. ఆదివారం పాక్‌తో జరిగిన చివరి టి20లో ఇంగ్లండ్ 67 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో డేవిడ్ మలాన్, హ్యారీ బ్రూక్‌లు విధ్వంసం సృష్టించగా.. బౌలింగ్‌లో క్రిస్ వోక్స్ మూడు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు భారీ స్కోరు చేసింది. డేవిడ్ మలాన్(47 బంతుల్లో 78 నాటౌట్, 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ (29 బంతుల్లో 46 నాటౌట్, 1 ఫోర్, 4 సిక్సర్లు), బెన్ డకెట్ 30 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఆజం విఫలం కావడం పాక్‌ను దెబ్బతీసింది. వన్‌డౌన్ బ్యాటర్ షాన్ మసూద్ 56 పరుగులతో ఆకట్టుకున్నప్పటికి అతనికి సహకరించేవారు కరువయ్యారు. కుష్దిల్ షా 27 పరుగులు చేశాడు. ఓవారాల్‌గా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన డేవిల్ మలాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఇక ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా తొలి ఆరు మ్యాచ్‌ల్లో చెరో మూడు గెలిచి 3-3తో సమానంగా ఉన్న దశలో ఆఖరి టి20లో చెలరేగిన ఇంగ్లండ్ విజయంతో పాటు 4-3తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టి20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌తో పాటు పాకిస్తాన్‌కు ఇది మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడింది. ఇక టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ జరగనుంది. -
ILT20: జట్టును ప్రకటించిన షార్జా వారియర్స్.. మోయిన్ అలీతో పాటు!
యూఏఈ టీ20 లీగ్ తొలి సీజన్ కోసం అంతర్జాతీయ ఆటగాళ్ల జాబితాను షార్జా వారియర్స్ శుక్రవారం విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు మోయిన్ అలీ,డేవిడ్ మలన్‌తో పాటు ఎవిన్ లూయిస్, మొహమ్మద్ నబీ, క్రిస్ వోక్స్ వంటి ఆటగాళ్లతో షార్జా ఒప్పందం కుదర్చుకుంది. కాగా షార్జా వారియర్స్ ఫ్రాంచైజీను భారత్ ఆధారిత కంపెనీ కాప్రి గ్లోబల్ కొనుగోలు చేసింది. ఇక ఈ లీగ్ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. వాటిలో ఐదు జట్లును ఐపీఎల్ ప్రాంఛైజీలే దక్కించుకోవడం గమనార్హం. ఇక ఇప్పటికే దుబాయ్ క్యాపిటల్స్,ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తాము ఒప్పందం కుదుర్చుకున్న జాబితాను విడుదల చేశాయి. షార్జా వారియర్స్ జట్టు: మొయిన్ అలీ (ఇంగ్లండ్), డేవిడ్ మలన్ (ఇంగ్లండ్), ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్థాన్), క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్), నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్థాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), నవీన్-ఉల్-హక్ (ఆఫ్ఘనిస్థాన్), ), టామ్ కోహ్లర్-కాడ్మోర్ (ఇంగ్లాండ్), క్రిస్ బెంజమిన్ (ఇంగ్లండ్), డానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్), మార్క్ దేయల్ (వెస్టిండీస్), బిలాల్ ఖాన్ (ఒమన్) మరియు జేజే స్మిత్ (నమీబియా) ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ సభ్యులు: పోలార్డ్(వెస్టిండీస్), బ్రావో(వెస్టిండీస్), నికోలస్ పూరన్(వెస్టిండీస్), బౌల్ట్(న్యూజిలాండ్), ఫ్లెచర్(వెస్టిండీస్), ఇమ్రాన్ తాహిర్(సౌతాఫ్రికా), సమిత్ పటేల్ (ఇంగ్లాడ్) , విల్ స్మీడ్(ఇంగ్లాడ్), జోర్డాన్ థామ్సన్(ఇంగ్లాడ్), నిజబుల్హా జోర్ధార్ (ఆఫ్ఘనిస్తాన్), జహీర్ ఖాన్(ఆఫ్ఘనిస్తాన్), ఫజల్ హుక్(ఆఫ్ఘనిస్తాన్), బ్రాడ్లే(స్కాట్లాండ్), లీడ్ (నెదర్లాండ్). దుబాయ్ క్యాపిటల్స్ జట్టు: రోవ్‌మన్ పావెల్, హజ్రతుల్లా జజాయ్, డేనియల్ లారెన్స్, జార్జ్ మున్సే, భానుక రాజపక్సే, నిరోషన్ డిక్వెల్లా, సికందర్ రజా, దాసున్ షనక, ఫాబియన్ అలెన్, ఇసురు ఉదానా, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీర, ఫ్రెడ్ క్లాస్సేన్,ముజారబానీ చదవండి: T20 WC 2022: ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలకు బంగ్లాదేశ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్! -
సెంచరీ మిస్ అయినా 9 సిక్సర్లతో వీరవిహారం..
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ టోర్నమెంట్లో బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. 100 బంతుల్లో ముగిసే మ్యాచ్ కావడంతో అభిమానులు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాటర్లు కొట్టే సిక్సర్లు, బౌండరీలతో మైదానాలు చిన్నవిగా మారిపోయాయా. తాజాగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్.. ట్రెంట్ రాకెట్స్ బ్యాటర్ డేవిడ్ మలాన్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఆగిపోయినప్పటికి.. ఆఖరివరకు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 44 బంతుల్లో 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మలాన్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండడం విశేషం. మలాన్ దెబ్బకు 94 బంతుల్లోనే లక్ష్యం కరిగిపోయింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సాల్ట్ 46 బంతుల్లో 70 నాటౌట్, జాస్ బట్లర్ 41 పరుగులు రాణించగా.. చివర్లో స్టబ్స్ 10 బంతుల్లో 4 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. అనంతరం ట్రెంట్ రాకెట్స్ 94 బంతుల్లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: Hundred Tourney: సిక్సర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన ప్రొటిస్ బ్యాటర్ -
దంచికొట్టిన డేవిడ్ మలాన్.. దూసుకుపోతున్న ట్రెంట్ రాకెట్స్
హండ్రెడ్ లీగ్ 2022లో ట్రెంట్ రాకెట్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. తొలి మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆ జట్టు.. నిన్న (ఆగస్ట్ 9) నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే తరహాలో రెచ్చిపోయి మరో ఘన విజయం నమోదు చేసింది. ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ మలాన్ (49 బంతుల్లో 88 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి రాకెట్స్ ప్రత్యర్ధిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. డేనియల్ సామ్స్ (3/31), ఫ్లెచర్ (2/22), లూక్ వుడ్ (2/30) విజృంభించడంతో సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ వీస్ 27 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛేదనలో ట్రెంట్ రాకెట్స్ మలాన్ సహా అలెక్స్ హేల్స్ (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో మరో 6 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో ట్రెంట్ రాకెట్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. చదవండి: న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్.. వైదొలిగిన స్టార్ బౌలర్ -
సూర్య 'ప్రతాపం' సరిపోలేదు.. సిరీస్ మాత్రం టీమిండియాదే
నాటింగ్‌హామ్: ఆఖరి పోరులో ఇంగ్లండ్ చెమటోడ్చి పరువు నిలబెట్టుకుంది. మూడో టి20లో సూర్య కుమార్ యాదవ్ (55 బంతుల్లో 117; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులకు సరైన సహకారం లేక భారత్ 17 పరుగులతో ఓడింది. సిరీస్‌ను 2–1తో సరిపెట్టుకుంది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (39 బంతుల్లో 77; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), లివింగ్‌స్టోన్ (29 బంతుల్లో 42 నాటౌట్; 4 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (28; 2 సిక్స్‌లు)లాంటి మరో స్కోరు ఉంటే భారతే గెలిచేది. ఎందుకంటే మిగతా వారిలో ఇద్దరు మినహా అంతా సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారు. ఇంగ్లండ్ పేసర్ రీస్ టోప్లే (3/22) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకోగా... భువనేశ్వర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం లభించింది. సిరీస్ చేజిక్కడంతో హార్దిక్, భువనేశ్వర్, చహల్, బుమ్రా స్థానాల్లో అయ్యర్, ఉమ్రాన్, అవేశ్, బిష్ణోయ్‌లను తీసుకున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో రేపు తొలి వన్డే జరుగుతుంది. మలాన్, లివింగ్‌స్టోన్ మెరుపులు ఓపెనర్లు బట్లర్ (9 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ రాయ్ (27; 1 ఫోర్, 2 సిక్స్‌లు) వేగంగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యారు. హర్షల్ తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్ 6వ) అప్పుడే వచ్చిన మలాన్‌ను అవుట్ చేసే అవకాశాన్ని (రిటర్న్‌క్యాచ్) జారవిడిచాడు. అప్పుడు అతని స్కోరు 4 పరుగులే! ఆ తర్వాత మలాన్ అనుభవం లేని బౌలింగ్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లవింగ్స్టోన్తో కలిసి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. ఐదో వికెట్‌కు 84 పరుగులు జోడించాక బిష్ణోయ్ బౌలింగ్‌లో మలాన్ నిష్క్రమించాడు. ఆఖర్లో లివింగ్‌స్టోన్, బ్రూక్ (9 బంతుల్లో 19; 3 ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ 200 మార్కును దాటేసింది. సూపర్ సూర్య... భారత టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ (11), పంత్ (1), కోహ్లి (11) పేలవంగా ఆడారు. 31/3 స్కోరుతో టీమిండియా డీలాపడిన దశలో సూర్య... శ్రేయస్ అండతో వీరోచిత పోరాటం చేశాడు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 119 పరుగులు జోడించారు. విల్లే, జోర్డాన్, లివింగ్‌స్టోన్ ఎవరు బౌలింగ్‌కు దిగినా తన దూకుడు కొనసాగించాడు. 32 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్)తో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న సూర్య మరో 50 పరుగుల్ని (48 బంతుల్లో సెంచరీ) కేవలం 16 బంతుల్లోనే చేశాడు. భారీ సిక్సర్లతో ఇంగ్లండ్ శిబిరాన్ని వణికించాడు. అయితే అవతలి వైపు ధాటిగా ఆడగలిగే దినేశ్ కార్తీక్ (6), జడేజా (7) వికెట్లను పారేసుకోవడంతో ఒత్తిడంతా సూర్యమీదే పడింది. షాట్లు కొట్టే ప్రయత్నంలో 19వ ఓవర్లో అతను అవుటై నిష్క్రమిస్తుంటే స్టేడియం మొత్తం కరతాళధ్వనులతో జేజేలు పలికింది. భారత్ గెలుపునకు దూరమైంది. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) పంత్ (బి) ఉమ్రాన్ 27; బట్లర్ (బి) అవేశ్ 18; మలాన్ (సి) పంత్ (బి) బిష్ణోయ్ 77; సాల్ట్ (బి) హర్షల్ 8; లివింగ్‌స్టోన్ (నాటౌట్) 42; అలీ (సి) హర్షల్ (బి) బిష్ణోయ్ 0; బ్రూక్ (సి) బిష్ణోయ్ (బి) హర్షల్ 19; జోర్డాన్ (రనౌట్) 11; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–31, 2–61, 3–84, 4–168, 5–169, 6–197, 7–215. బౌలింగ్: అవేశ్ ఖాన్ 4–0–43–1, ఉమ్రాన్ 4–0–56–1, రవి బిష్ణోయ్ 4–0–30–2, జడేజా 4–0–45–0, హర్షల్ 4–0–35–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సాల్ట్ (బి) టోప్లే 11; పంత్ (సి) బట్లర్ (బి) టోప్లే 1; కోహ్లి (సి) రాయ్ (బి) విల్లే 11; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) అలీ 117; అయ్యర్ (సి) బట్లర్ (బి) టోప్లే 28; కార్తీక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విల్లే 6; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) గ్లీసన్ 7; హర్షల్ (సి) గ్లీసన్ (బి) జోర్డాన్ 5; అవేశ్ నాటౌట్ 1; బిష్ణోయ్ (బి) జోర్డాన్ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్లకు 198. వికెట్ల పతనం: 1–2, 2–13, 3–31, 4–150, 5–166, 6–173, 7–191, 8–196, 9–198. బౌలింగ్: డేవిడ్ విల్లే 4–0–40–2, టోప్లే 4–0–22–3, గ్లీసన్ 4–0–31–1, క్రిస్ జోర్డాన్ 4–0–37–2, లివింగ్‌స్టోన్ 2–0– 36–0, మొయిన్ అలీ 2–0–31–1. -
నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి
ఇంగ్లండ్ వన్డే జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడి 11 నెలలు కావొస్తుంది. గ్యాప్ చాలా వచ్చిందనో ఏమో కానీ శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ నెదర్లాండ్స్ ఆటగాళ్లకు ఏకంగా విశ్వరూపం చూపించింది. డచ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. తమ క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లండ్ వన్డేల్లో అత్యధిక స్కోరు (50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 498 పరుగులు) నమోదు చేసింది. ముగ్గురు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలతో చెలరేగడం విశేషం. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు 232 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇదే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్లకు క్రికెట్ ఆడే అవకాశాలు తక్కువగా వస్తాయి. అలాంటి వారి దేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడం అరుదుగా జరుగుతుంటుంది. అందుకే డచ్ దేశంలో ఉన్న క్రికెట్ స్టేడియాల్లో చెట్లు విపరీతంగా పెరిగిపోవడంతో మైదానం పరిసరాలు అడవిని తలపిస్తున్నాయి. అయితే ఇంగ్లండ్ పర్యటనకు రావడంతో అప్పటికప్పుడు స్టేడియాలను సిద్ధం చేసినప్పటికి చెట్లను మాత్రం తొలగించలేకపోయారు. తాజాగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఘోస మాములుగా లేదు. ఇంగ్లండ్ బ్యాటర్లు కొట్టే కొట్టుడుకు బంతులన్నీ వెళ్లి స్టేడియం అవతల ఉన్న చెట్ల పోదల్లోకి వెళ్లిపోయాయి. దీంతో డచ్ ఆటగాళ్లు పదే పదే పొదల్లోకి దూరి బంతి కోసం వెతుకులాట చేయడం ఆసక్తిగా మారింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మధ్యలో డేవిడ్ మాలన్.. నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. ఆ బంతి వెళ్లి స్టేడియంలో అవతల ఉన్న చెట్ల పొదల్లో పడింది. బంతిని వెతకడానికి నెదర్లాండ్స్ జట్టులో దాదాపు సగం మంది సభ్యులు చెట్లు, పుట్టల్లోకి వెళ్లాల్సి వచ్చింది. అంతమంది ఒకేసారి వెతికితే గానీ రెండు నిమిషాలకు బంతి కనిపించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Drama in Amstelveen as the ball ends up in the trees 🔍 pic.twitter.com/MM7stEMHEJ — Henry Moeran (@henrymoeranBBC) June 17, 2022 చదవండి: వన్డేల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. 498 పరుగుల భారీ స్కోర్ Dinesh Karthik: 37 ఏళ్ల వయసులో..'డీకే'తో అట్లుంటది మరి -
13 సార్లు 200లోపూ ఆలౌట్.. 20 మంది ఆటగాళ్లు డకౌట్
ఇంగ్లండ్ జట్టు టెస్టుల్లో ఈ ఏడాది చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది ఆడిన 28 ఇన్నింగ్స్‌ల్లో 13 సార్లు 200లోపూ ఆలౌట్ అయింది. ఇక తాజాగా యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో డేవిడ్ మలాన్ డకౌట్ కావడం ద్వారా మరో చెత్త రికార్డు నమోదు చేసింది. ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో ఈ ఏడాది గోల్డెన్ డక్ లేదా డకౌట్ అయిన 20వ ఆటగాడిగా నిలిచాడు. మలాన్ కంటే ముందు 19 మంది ఉంటే అందులో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ సహా బెన్‌స్టోక్స్, ఇతర క్రికెటర్లు ఉన్నారు. చదవండి: Pat Cummins: బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ మరో ఓటమి దిశగా పయనిస్తోంది. ఆస్ట్రేలియాను 267 పరుగులకు ఆలౌట్ చేశామన్న ఆనందం ఎక్కువసేపు నిలవకుండానే పోయింది. 82 పరుగులు తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 31 పరుగులకే నాలుగో వికెట్లు కోల్పోయి రెండోరోజు ఆటను ముగించింది. ఇంకా 51 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ ఓటమినుంచి తప్పించుకోవడం కష్టమే. చదవండి: James Anderson: అరె అండర్సన్.. పట్టి ఉంటే స్టన్నింగ్ క్యాచ్ అయ్యేది! -
''మా జట్టును చూస్తే కోపం, చిరాకు వస్తుంది''
Dawid Malan Frustrated About Own Team Batting Failure.. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ దారుణ ఆటతీరు కనబరుస్తుంది. తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే ఆటతీరును కనబరుస్తుంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 473 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా.. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే 12 పరుగుల వద్ద ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ జో రూట్(62), డేవిడ్ మలాన్(80)లు కలిసి మూడో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్ పటిష్టంగానే కనిపించింది. అయితే రూట్, మలాన్‌లు వెనుదిరిగిన వెంటనే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. స్టోక్స్ 34 పరుగులు మినహా మిగతావారు అంతా విఫలమయ్యారు. కేవలం 84 పరుగుల వ్యవధిలో మిగతా ఆరు వికెట్లు కోల్పోయి 236 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు 237 పరుగుల భారీ ఆధిక్యం లభించినట్టయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ 2, ట్రెవిస్ హెడ్ 8 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: Ashes 2nd Test Australia Vs England: స్టార్క్ విజృంభణ.. ఆసీస్‌కు భారీ అధిక్యం ఈ నేపథ్యంలో డేవిడ్ మలాన్ తన సొంత జట్టుపైనే అసహనం వ్యక్తం చేశాడు.'' ఈరోజు మా ఆటతీరు దురదృష్టకరంగా సాగింది. అన్‌లక్కీ అనే పదం ఇక్కడ వాడకూడదు. మ్యాచ్‌లో కొన్ని చెత్తషాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నాం. కానీ మా ఆటతీరులో నాణ్యత లోపించింది. జట్టుగా సమష్టిగా పరుగులు చేయడంలో విఫలమయ్యాం. నేను, రూట్ కలిసి 138 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేసినప్పటికి దానిని నిలబెట్టుకోలేకపోయాం. ఇదే నాకు కోపం, చిరాకు తెప్పించింది. కేవలం 80 పరుగుల వ్యవధిలో మిగతా వికెట్లు చేజార్చుకొని ప్రత్యర్థికి భారీ ఆధిక్యం అందించాం. అయితే ఇప్పటికి మాకు అవకాశాలు సన్నగిల్లలేదు. ఆసీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో తక్కువకు ఆలౌట్ చేస్తే పోరాడగలుగుతామనే నమ్మకం ఉంది. ఇన్ని చెప్పినా ఆరోజు ఆట ఎలా సాగాలో అలాగే నడుస్తుంది.. మన చేతుల్లో ఏం ఉండదు. ఎందుకంటే ఇది జెంటిల్మన్ గేమ్'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: Virender Sehwag: కోహ్లి కెప్టెన్సీ వివాదం: సెహ్వాగ్ భయ్యా ఎక్కడున్నావు!? -
Ashes Series 2021: తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
Ashes Series 2021: England Announces 12 Man Squad For Gabba Test: ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నేపథ్యంలో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా డిసెంబరు 8న మొదలుకానున్న మ్యాచ్ కోసం 12 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. మోకాలి నొప్పి కారణంగా వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ జట్టుకు దూరం కాగా... మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్ స్పెషలిస్టు ఫాస్ట్‌బౌలర్లుగా జట్టులో స్థానం సంపాదించుకున్నారు. కాగా జో రూట్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా వేదికగా ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. గబ్బా టెస్టుకు ఇంగ్లండ్ ప్రకటించిన జట్టు: ►జో రూట్(కెప్టెన్), స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, హసీబ్ హమీద్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. యాషెస్ సిరీస్ 2021- షెడ్యూల్: ►మొదటి టెస్టు: డిసెంబరు 08-12: గబ్బా ►రెండో టెస్టు: డిసెంబరు 16-20: అడిలైడ్ ►మూడో టెస్టు: డిసెంబరు 26- 30: మెల్బోర్న్ ►నాలుగో టెస్టు: జనవరి 5-9: సిడ్నీ ►ఐదో టెస్టు: జనవరి 14-18 చదవండి: Sara Tendulkar: మోడలింగ్‌లో అడుగుపెట్టిన సచిన్ తనయ.. వీడియో వైరల్ చదవండి: Australia Ashes Squad: యాషెస్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆసీస్.. వరల్డ్‌కప్ హీరోకు నో ఛాన్స్. -
పంజాబ్ కింగ్స్‌కి షాక్.. మలాన్ ఔట్.. జట్టులోకి ఐడెన్ మార్కమ్
దుబాయి: ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ ముంగిట పంజాబ్ కింగ్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా, ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ సీజన్ నుంచి వైదొలిగాడు. అయితే, మలాన్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్కమ్‌తో పంజాబ్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. టీ20 వరల్డ్‌కప్ 2021, యాషెస్ సిరీస్‌కి ముందు కుటుంబంతో కలిసి గడపాలని అనుకుంటున్నా... అందుకే ఐపీఎల్ 2021 ఫేజ్ 2కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు మలాన్ తెలిపాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు, ఆఖరి నిమిషంలో రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఐపీఎల్ 2021 సీజన్ నుంచి ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లు తప్పుకోవడం గమనార్హం. మలాన్ తో పాటు క్రిస్‌వోక్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), జానీ బెయిర్‌స్టో (సన్‌రైజర్స్ హైదరాబాద్) సీజన్ నుంచి తప్పుకున్నారు. చదవండి: Viral Video: రనౌట్ అవకాశం; ఊహించని ట్విస్ట్.. ఫీల్డర్ల పరుగులు 𝘼𝙞-𝙙𝙚𝙣 vich tuhadda swaagat hai! 👋🏻 Welcoming our newest 🦁 Aiden Markram who will replace Dawid Malan for the remainder of the season! 😍#SaddaPunjab #IPL2021 #PunjabKings pic.twitter.com/OJMW3QEwW1 — Punjab Kings (@PunjabKingsIPL) September 11, 2021 -
ఆ మూడు ఐపీఎల్ జట్లకు భారీ షాక్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం
దుబాయ్: సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచ్‌లు కళ తప్పనున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఇంగ్లీష్ మీడియా కథనాలు. వివరాల్లోకి వెళితే.. వివిధ ఫ్రాంచైజీలకు చెందిన ముగ్గురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్‌కు దూరం కానున్నట్లు బ్రిటీష్ మీడియా వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. సన్‌రైజర్స్ కీలక ఆటగాడు జానీ బెయిర్‌స్టో, పంజాబ్ కింగ్స్ ఆటగాడు డేవిడ్ మలాన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు క్రిస్ వోక్స్.. మలిదశ ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సదరు ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఆటగాళ్ల గైర్హాజరీపై ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలు స్పందిచాల్సి ఉంది. కాగా, ఇదివరకే పలువురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు వివిధ కారణాల చేత లీగ్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ ఐపీఎల్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించారు. మొత్తంగా మలిదశ ఐపీఎల్లో ఇంగ్లండ్ ఆటగాళ్ల మెరుపులు లేకపోవడంతో లీగ్ కళ తప్పనుందని అభిమానులు నిరాశ చెందుతున్నారు. చదవండి: ఈసారి టైటిల్ నెగ్గేది మేమే: డీసీ స్టార్ ప్లేయర్ -
ENG Vs IND: రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
లండన్: ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్ రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఉమేశ్ వేసిన గుడ్‌లెంగ్త్ బంతిని అంచనా వేయడంలో మలాన్ పొరబడ్డాడు. బంతి మలాన్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకి స్లిప్‌లో ఉన్న రోహిత్ వైపు వెళ్లింది. రోహిత్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. కాగా మలాన్ 31 పరుగులు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. చదవండి: Sheldon Cotrell: వారెవ్వా కాట్రెల్.. స్టన్నింగ్ క్యాచ్.. ఆఖరి బంతికి సిక్స్ ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్ కూడా తడబడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను తక్కువకే ఆలౌట్ చేశామన్న ఆనందం లేకుండానే ఇంగ్లండ్ కూడా వెనువెంటనే వికెట్లు కోల్పోతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఓలీ పోప్ 27, జానీ బెయిర్ స్టో 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ కోహ్లి 50 పరుగులతో రాణించగా.. మిగతావారు విఫలమయ్యారు. చదవండి: శార్దూల్ సుడిగాలి ఇన్నింగ్స్.. సెహ్వాగ్ రికార్డు సహా మరో రికార్డు బద్దలు Umesh on fire! 🔥 Gets Malan to nick one to Rohit at slip. Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #BackOurBoys #Umesh #Malan pic.twitter.com/MdKd0xLu4k — Sony Sports (@SonySportsIndia) September 3, 2021 -
శ్రీలంకతో చివరి వన్డే: హార్డ్ హిట్టర్ వచ్చేస్తున్నాడు
లండన్: శ్రీలంక జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్ వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. అందుకు తగ్గట్టుగానే తొలి వన్డేలో లంకపై ఇంగ్లండ్ మంచి విజయాన్ని అందుకుంది. కాగా నేడు ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఇదిలా ఉంటే శ్రీలంకతో జరగనున్న చివరి వన్డేకు ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ టామ్ బాంటన్‌ను ఈసీబీ జట్టులోకి తీసుకొచ్చింది. డేవిడ్ మలన్‌కు బ్యాకప్‌గా టామ్ బాంటన్‌ను తీసుకున్నట్లు తెలిపింది. కాగా డేవిడ్ మలన్ వ్యక్తిగత కారణాల రిత్యా వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య చివరి వన్డే బ్రిస్టల్ వేదికగా జూలై 4న జరగనుంది. టామ్ బాంటన్ ఇటీవలే టీ20 బ్లాస్ట్‌లో సోమర్సెట్ తరపున 47 బంతుల్లోనే సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్ ఆధారంగా టామ్ బాంటన్‌ను మరోసారి జట్టులోకి పిలిచినట్లు తెలుస్తుంది. ఇక టీ20 బ్లాస్ట్‌లో సోమర్సెట్ తరపున ఆడుతున్న బాంటన్ ఈరోజే జట్టుతో కలవనుండడంతో డెర్బిస్తో జరగనున్న మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఇక బాంటన్ చివరిసారిగా ఇంగ్లండ్ తరపున ఆగస్టు 2020లో ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆడాడు. -
మలాన్ నం.1 టీ20 బ్యాట్స్‌మెన్ అయ్యుండొచ్చు.. కానీ గేల్‌తో పోలికా
చెన్నై: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్ జట్టులో మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని మాజీలు గళం విప్పుతున్న వేళ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆ జట్టు స్టార్ ఆటగాడు క్రిస్ గేల్‌ను వెనకేసుకొచ్చాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న గేల్.. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో(రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 28 బంతుల్లో 40) కాస్త పర్వాలేదనిపించినా, ఆ తరువాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో(10, 11, 15 పరుగులు) ఉసూరుమనిపించాడు. ఈ నేపథ్యంలో అతనిపై వేటు వేసి టీ20 నంబర్ ఆటగాడు డేవిడ్ మలాన్‌కు(ఇంగ్లండ్) అవకాశం ఇవ్వాలని మాజీ ఆటగాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదన గంభీర్ కొట్టిపారేశాడు. మలాన్ ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మెన్ అయ్యుండొచ్చు.. కానీ గేల్‌తో అతనికి పోలిక ఏంటని ప్రశ్నించాడు. మొదట గేల్‌ను వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపే ఆలోచనను పంజాబ్ విరమించుకోవాలని, గేల్ తన అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్‌లన్నీ ఓపెనర్‌గా ఆడినవేనన్న విషయాన్ని మరవకూడదని గంభీర్ ప్రస్థావించాడు. ప్రస్తుత సీజన్లో గేల్ వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా 60కిపైగా బంతుల్ని ఎదుర్కొన్నాడని, అదే ఓపెనర్‌గా ఇన్ని బంతల్ని ఎదుర్కొని ఉంటే కచ్చితంగా సెంచరీ చేసేవాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేనప్పటికీ బలహీనమైన మిడిలార్డర్ కారణంగా పంజాబ్ మ్యాచ్‌లను చేజేతులా చేజార్చుకుంటుందని వ్యాఖ్యానించాడు. శుక్రవారం చెపాక్ వేదికగా ముంబైతో జరిగే మ్యాచ్‌లో యూనివర్సల్ బాస్‌ను ఓపెనర్‌గా పంపాలని, వరుసగా విఫలమవుతున్న నికోలస్ పూరన్ స్థానంలో మలాన్‌కు అవకాశం కల్పించాలని సూచించాడు. ఓపెనర్లుగా రాహుల్, గేల్లు వస్తే పంజాబ్‌కు బలమైన పునాది లభిస్తుందని, దీంతో పంజాబ్ పరాజయాల పరంపరకు అడ్డుకట్టపడుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా, గేల్.. గతేడాది ఐపీఎల్ సీజన్ నుంచి పంజాబ్ వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇదిలా ఉంటే, పంజాబ్ కింగ్స్.. ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం ఒక్క గెలుపు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. చదవండి: కపిల్, ధోని, గవాస్కర్లతో వాళ్లను పోల్చకండి.. -
మొన్న కోహ్లికి ఎసరు పెట్టాడు.. ఇప్పుడు మలాన్ వంతు
దుబాయ్: ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబార్ ఆజమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇటీవలే టీమిండియా సారధి విరాట్ కోహ్లి నుంచి వన్డే టాప్ ర్యాంక్‌ను చేజిక్కించుకున్న బాబర్.. టీ20 అగ్రస్థానంపై కూడా కన్నేశాడు. దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గతవారం జరిగిన మూడవ టీ20లో అద్భుత శతకంతో(122) అదరగొట్టిన బాబార్.. 47 రేటింగ్ పాయింట్లు దక్కించుకుని రెండో స్థానంలో ఉన్న ఆసీస్ ఆటగాడు ఆరోన్ ఫించ్‌ను వెనక్కునెట్టి ఆ స్థానానికి దూసుకొచ్చాడు. సఫారీలపై బాబర్ సాధించిన శతకం అతని కెరీర్లో తొలి అంతర్జాతీయ టీ20 శతకం కావడం విశేషం. ప్రస్తుతం 844 రేటింగ్ పాయింట్లు కలిగి ఉన్న బాబర్... అగ్రస్థానంలో ఉన్న డేవిడ్ మలాన్(ఇంగ్లండ్)(892) కంటే కేవలం 48 పాయింట్లు మాత్రమే వెనుకపడి ఉన్నాడు. కాగా, గతేడాది నవంబర్ వరకు టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగిన బాబర్‌కు మరోసారి టీ20 అగ్రపీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. పాక్ జట్టు నేటి (ఏప్రిల్ 21) నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో బాబర్ ఓ మోస్తరుగా రాణించినా డేవిడ్ మలాన్ అగ్రస్థానానికి ఎసరు పెట్టడం ఖాయం. ఇదిలా ఉంటే, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(762) ఒక స్థానం కిందకు పడిపోయాడు. గతవారం ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న విరాట్.. తాజా జాబితాలో ఐదో ర్యాంక్‌కు దిగజారాడు. టీమిండియాకు చెందిన మరో ఆటగాడు కేఎల్ రాహుల్(743) సైతం రెండు స్థానాలు కోల్పోయి 7వ స్థానంలో ఉండగా, భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(613) ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని 13వ ర్యాంక్‌కు చేరాడు. ఇక టీ20 బౌలర్ల జాబితా విషయానికొస్తే.. దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంషి(732), ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్(719), ఆసీస్ బౌలర్ ఆష్టన్ అగర్లు(702) మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీం ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్(272) మొదటి స్థానంలో ఉండగా, భారత్(270), ఆస్ట్రేలియా(267), పాక్(262) వరుసగా రెండు నుంచి నాలుగు ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నాయి. చదవండి: వైరలవుతున్న టీమిండియా ప్రస్తుత, మాజీ కెప్టెన్ల భార్యల ఫోటోలు -
'ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌కు సిద్ధం'
ముంబై: డేవిడ్ మలాన్.. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో మలాన్‌కు భారీ ధర పలకడం ఖాయమని అంతా ఊహించారు. కానీ అనూహ్యంగా మలాన్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. చివరికి పంజాబ్ కింగ్స్ మలాన్‌ను రూ. 2 కోట్ల కనీస మద్దతు ధరకు దక్కించుకుంది. అలా ఐపీఎల్లో అడుగుపెట్టిన మలాన్ ఇటీవలే టీమిండియాతో జరిగిన సిరీస్‌ను ముగించుకొని పంజాబ్ కింగ్స్ జట్టుతో కలిశాడు. ఏడు రోజుల క్వారంటైన్లో ఉన్న మలాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ''తొలిసారి ఐపీఎల్‌కు ఆడనుండడం సంతోషం కలిగిస్తుంది. నేను ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయంగా అరంగేట్రం చేసేసరికి ఆ జట్టులో మూడోస్థానం ఖాళీగా ఉంది.ఓపెనింగ్ చేయాలనే కోరిక బలంగా ఉండేది.. కాని అది కుదరకపోవడంతో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చా .. అలా నాకు ఆ ప్లేస్ కలిసివచ్చింది. ఇక ఇప్పుడు ఐపీఎల్లో రాహుల్ సారధ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. తుది జట్టులో ఉంటే మాత్రం మూడో స్థానంలో ఆడుతానని కచ్చితంగా చెప్పను. అయితే మూడు, నాలుగు, ఐదు ఇలా ఏ స్థానం అయినా బ్యాటింగ్ చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నా. అయితే ఇలాంటి క్యాష్ రిచ్‌లీగ్‌లో ఆడాలన్న కోరిక బలంగా ఉన్నా.. నా ప్రథమ కర్తవ్యం మాత్రం ఇంగ్లండ్ తరపున టెస్టు క్రికెట్ ఆడడం. ఐదు రోజుల సంప్రదాయ ఆటలో ఉండే నైపుణ్యం ఎన్ని టీ20 మ్యాచ్‌లాడిన సొంతం చేసుకోలేం. అందుకే నా దృష్టిలో టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యమిస్తా. ఇక ఐపీఎల్లో అవకాశమిస్తే మాత్రం నా శైలి ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తా. మంచి ఇన్నింగ్స్‌లు ఆడాలన్న కోరిక బలంగా ఉన్నా.. సమయం కలిసిరాకపోతే.. మన చేతిలో ఏం ఉండదనేది బలంగా నమ్ముతా ..అదే నా ఫిలాసఫీ.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక డేవిడ్ మలాన్ ఇంగ్లండ్ తరపున 24 టీ20 మ్యాచ్‌లాడి 1003 పరుగులు.. 3 వన్డేల్లో 90 పరుగులు.. 15 టెస్టుల్లో 724 పరుగులు చేశాడు. ఇక కింగ్స్ పంజాబ్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 12న ముంబై వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది. చదవండి: మ్యాక్స్‌వెల్‌ను తీసుకొని దండగ.. ఆర్సీబీకి భారీ మూల్యం 'కేకేఆర్‌కు భజ్జీ కీలకంగా మారనున్నాడు' -
ఇంగ్లండ్ ఓడినా.. మలాన్ నయా రికార్డు లిఖించాడు
అహ్మదాబాద్: ఇంగ్లండ్ పించ్ హిట్టర్ డేవిడ్ మలాన్ నయా రికార్డు లిఖించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్ రికార్డును మలాన్ బ్రేక్ చేశాడు. టీమిండియాతో శనివారం జరిగిన ఆఖరి టీ20ల్లో మలాన్ 46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు సాయంతో 68 పరుగులు సాధించాడు. ఫలితంగా అంతర్జాతీ టీ20ల్లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరాడు. అదే సమయంలో అజామ్‌ను రికార్డును చెరిపేశాడు. అజామ్ 26 ఇన్నింగ్స్‌ల్లో 1000 అంతర్జాతీయ టీ20 పరుగులు సాధిస్తే, మలాన్ 24వ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును చేరాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఉన్నాడు. కోహ్లి 27 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగుల్ని సాధించాడు. ఇక కేఎల్ రాహుల్(టీమిండియా), అరోన్ ఫించ్(ఆస్ట్రేలియా)లు 29 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-2 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించడంతో సిరీస్‌ను దక్కించుకుంది. ఫలితంగా వరుసగా ఆరో టీ20 సిరీస్‌ను టీమిండియా ఖాతాలో వేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 224 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ కోహ్లి(80 నాటౌట్; 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దుమ్ములేపగా, రోహిత్ శర్మ(64; 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసకర ఆటతో అదరగొట్టాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి శుభారంభాన్ని అందించింది. ఆపై సూర్యకుమార్ యాదవ్(32; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్ చేయగా, హార్దిక్ పాండ్యా(39 నాటౌట్; 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టచ్‌లోకి వచ్చాడు. ఆపై ఇంగ్లండ్‌ను 188 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. -
ఐపీఎల్ వేలం: అందరి కళ్లు అతనిపైనే..
-
ఐపీఎల్ వేలం: అందరి కళ్లు అతనిపైనే..
చెన్నై: ఐపీఎల్ 2021 మినీ వేలం కొద్దిసేపట్లో మొదలుకానుంది. వేలంలో 125 మంది విదేశీ ఆటగాళ్లు కనిపిస్తున్నా అందరి కళ్లు మాత్రం ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ మలాన్‌పైనే ఉన్నాయి. ప్రస్తుతం మలాన్ టీ20 ప్రపంచ నెంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. గత కొద్దికాలంగా టీ20 మ్యాచ్‌ల్లో రికార్డు లెవల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. 2017లో ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన మలాన్ 19 టీ20 మ్యచ్‌లాడి 855 పరుగులు చేశాడు. వీటిలో 1 సెంచరీ, 9 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇటీవలే బిగ్‌బాష్ లీగ్‌తో పాటు మిగతా లీగ్‌ల్లోనూ మలాన్ తన జోరును కొనసాగించాడు. దీంతో మలాన్‌ను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్లో అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తుండడంతో ఈసారి ఐపీఎల్లో మంచి ధర పలికే అవకాశం ఉంది. మలాన్‌తో పాటు ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసేందుకు పలు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. 2019 డిసెంబర్లో జరిగిన వేలంలో కమిన్స్ తర్వాత మ్యాక్స్‌వెల్‌కు అత్యధిక ధర పలికిన సంగతి తెలిసిందే. మ్యాక్స్‌వెల్‌ను 10.75 కోట్లకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దక్కించుకుంది. కాగా ఐపీఎల్ 2020 సీజన్లో మాత్రం మ్యాక్స్‌వెల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 13 మ్యాచులాడిన మ్యాక్సీ 108 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంజాబ్ జట్టు మ్యాక్స్‌వెల్‌ను రిలీజ్ చేసింది. అయితే టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు బిగ్‌బాష్ లీగ్‌లోనూ మ్యాక్స్‌వెల్ దుమ్మురేపే ప్రదర్శన చేశాడు. దీంతో మ్యాక్సీ మరోసారి వేలంలో ఫెవరెట్ ఆటగాడిగా మారిపోయాడు. సీఎస్కే, ఆర్సీబీ లాంటి జట్లు మ్యాక్స్‌వెల్‌పై ఎన్ని కోట్లు పెట్టడానికైనా రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరిద్దరితో పాటు స్టీవ్ స్మిత్‌పై కూడా మంచి అంచనాలే ఉండడంతో అతనికి మంచి ధర పలికే అవకాశం ఉంది. వీరితో పాటు మొయిన్ అలీ(ఇంగ్లండ్), కైల్ జేమిసన్ (న్యూజిలాండ్)లకు కూడా వేలంలో మంచి ధర దక్కనుంది. చదవండి: 10 కోట్లకు కొంటే ఆడలేదు.. ఇప్పుడేమో ఫేవరెట్!