AUS Vs ENG: Steve Smith, David Warner Help Australia Seal 6 Wicket Win Against England - Sakshi
Sakshi News home page

AUS vs ENG: అదరగొట్టిన వార్నర్‌, స్మిత్‌.. ఇంగ్లండ్‌పై ఆసీస్‌ ఘన విజయం

Published Thu, Nov 17 2022 5:19 PM | Last Updated on Thu, Nov 17 2022 6:59 PM

Steve Smith, David Warner help Australia seal 6 wicket win Against england - Sakshi

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. ఆడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై 6 వికెట్ల ఆసీస్‌ ఘన విజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 46.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్‌ వార్నర్‌(86), స్మిత్‌(80 నాటౌట్‌), హెడ్‌(69) పరుగులతో రాణించారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లీ రెండు , జోర్డాన్‌, లియామ్ డాసన్ తలా వికెట్‌ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో డేవిడ్‌ మాలాన్‌ మినహా మిగితా ఎవరూ అంతగా రాణించలేదు.

ఈ మ్యాచ్‌లో మలాన్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 128 బంతులు ఎదుర్కొన్న మలాన్‌ 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 134 పరుగులు సాధించాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, జంపా తలా మూడు వికెట్లు సాధించగా.. స్టార్క్‌, స్టోయినిష్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఇరు జట్లు మధ్య రెండో వన్డే సిడ్నీ వేదికగా నవంబర్‌ 19న జరగనుంది.
చదవండి: IND vs NZ: బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌.. శాంసన్‌తో అట్లుంటుంది మరి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement