సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ వెటరన్ పేసర్ మిచిల్ స్టార్క్ నిప్పులు చేరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
తొలి ఓవర్‌లోనే రాయ్, మలాన్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. ముఖ్యంగా మలాన్‌ను స్టార్క్ ఔట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన స్టార్క్.. అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో మలన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
స్టార్క్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి స్వింగ్ అయ్యి వికెట్లను గిరాటేసింది. దీంతో ఒక్క సారిగా మలన్ షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంది. కాగా తొలి వన్డేలో కూడా ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్‌ను అచ్చెం ఇటువంటి బంతితోనే స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
That is a SEED from Starc!#AUSvENG | #PlayOfTheDay | #Dettol pic.twitter.com/XISUPw34Pm
— cricket.com.au (@cricketcomau) November 19, 2022
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాకు అదిరిపోయే స్వాగతం! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment