Ashes 2023, England vs Australia 5th Test Day 4 Highlights - Sakshi
Sakshi News home page

Ashes 5th Test: మరో రసవత్తర ముగింపునకు రంగం సిద్ధం..

Published Mon, Jul 31 2023 7:52 AM | Last Updated on Mon, Jul 31 2023 8:16 AM

England vs Australia: 5th Ashes Test, Day 4 Highlights - Sakshi

లండన్‌: ఈసారి యాషెస్‌ సిరీస్‌ మునుపెన్నడు లేని విధంగా పోటాపోటీగా జరుగుతోంది. ఇప్పుడు ఆఖరి మజిలీ కూడా రసవత్తరంగా మారింది. అయితే ఆటలో అరటిపండులా... రసపట్టుపై వాన చినుకులు అంతరాయం కలిగించాయి. ఆదివారం నాలుగో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 389/9తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన మరో ఇంగ్లండ్‌ 6 పరుగులు చేసి ఆలౌటైంది.

అండర్సన్‌ (8)ను అవుట్‌ చేసి మర్ఫీ (4/110) కూడా స్టార్క్‌ (4/100)తో సమంగా నిలిచాడు. అనంతరం 384 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా వర్షంతో ఆట నిలిచే సమయానికి 38 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 135 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్‌ (58 బ్యాటింగ్‌; 9 ఫోర్లు), ఉస్మాన్‌ ఖ్వాజా (69 బ్యాటింగ్‌; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.

మ్యాచ్‌ చివరిరోజు సోమవారం ఆసీస్‌ నెగ్గాలంటే మరో 249 పరుగులు చేయాలి. ఇంగ్లండ్‌ గెలవాలంటే పది వికెట్లు తీయాలి. లంచ్‌ బ్రేక్‌ దాకా 75/0 స్కోరు చేసిన ఆసీస్‌ రెండో సెషన్‌లోనూ అదే ఆటను కొనసాగించడంతో ఖ్వాజా, వార్నర్‌ అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. తర్వాత కాసేపటికే వర్షం ముంచెత్తింది. దీంతో ఈ సెషన్‌లో కేవలం 14 ఓవర్ల ఆటే సాధ్యపడింది. ప్రస్తుతం ఆసీస్‌ 2–1తో ఆధిక్యంలో ఉంది. గత యాషెస్‌ సాధించడంతో ఈ మ్యాచ్‌తో సంబంధం లేకుండానే సిరీస్‌ను నిలబెట్టుకుంది.
చదవండి: Ashes 5th Test Day 4: డేవిడ్‌ వార్నర్‌ ప్రపంచ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement