ఇటీవలే టి20 ప్రపంచకప్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ఆసీస్ క్లీన్‌స్వీప్ చేసింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఇంగ్లండ్ విజయలక్ష్యాన్ని 364 పరుగులుగా నిర్థారించారు. అయితే ఇంగ్లండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు.
ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి పేలవమైన ఆటతీరు కనబరిచిన ఇంగ్లండ్ 31.4 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. జేసన్ రాయ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జేమ్స్ విన్స్ 22 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్, సీన్ అబాట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకముందు ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 48 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. వార్నర్, హెడ్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 269 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత వచ్చిన వారెవరు పెద్దగా రాణించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ స్టోన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: ఇంగ్లండ్, ఆసీస్ మ్యాచ్ అంటేనే తొండి.. మరోసారి నిరూపితం
Comments
Please login to add a commentAdd a comment