white wash
-
టి20 ఛాంపియన్స్‌కు కోలుకోలేని షాక్
ఇటీవలే టి20 ప్రపంచకప్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ఆసీస్ క్లీన్‌స్వీప్ చేసింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఇంగ్లండ్ విజయలక్ష్యాన్ని 364 పరుగులుగా నిర్థారించారు. అయితే ఇంగ్లండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి పేలవమైన ఆటతీరు కనబరిచిన ఇంగ్లండ్ 31.4 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. జేసన్ రాయ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జేమ్స్ విన్స్ 22 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్, సీన్ అబాట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకముందు ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 48 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. వార్నర్, హెడ్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 269 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత వచ్చిన వారెవరు పెద్దగా రాణించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ స్టోన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఇంగ్లండ్, ఆసీస్ మ్యాచ్ అంటేనే తొండి.. మరోసారి నిరూపితం -
దశాబ్దంలోనే వెస్టిండీస్ అత్యంత చెత్త రికార్డు
టీమిండియాతో ముగిసిన మూడో వన్డేలోనూ వెస్టిండీస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఏ దశలోనూ పోరాడలేకపోయింది. చివర్లో ఓడియన్ స్మిత్ కాసేపు మెరుపులు మెరిపించినప్పటికి అవి వినోదానికే పరిమితమయ్యాయి. టీమిండియా ఈ విజయంతో సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇదిలా ఉండగా సిరీస్‌లో వైట్‌వాష్ అయిన వెస్టిండీస్ ఈ దశాబ్దంలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. 2019-22 మధ్య కాలంలో విండీస్ విదేశాల్లో క్లీన్‌స్వీప్ కావడం ఇది 11వ సారి. ఇక 1999-20 మధ్య కాలంలో 9 సిరీస్‌ల్లో వైట్‌వాష్ అయిన విండీస్.. 2009-10 మధ్య కాలంలో 8 సిరీస్‌ల్లో వైట్‌వాష్ అయింది. ఇందులో విచిత్రమేంటంటే.. 2019-22 మధ్య కేవలం మూడేళ్ల కాలంలోనే.. 11 సిరీస్‌ల్లో వైట్‌వాష్ కావడం గమనార్హం. వారి ఆటతీరు ఎంత దారుణంగా ఉందనేది దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక మ్యాచ్‌లో 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయింది.వెస్టిండీస్ బ్యాటింగ్‌లో ఓడియన్ స్మిత్ 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ 34, అల్జారీ జోసెఫ్ 29 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ , సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలా మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్, దీపక్ చహర్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. శ్రేయాస్ అయ్యర్ 80 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. రిషబ్ పంత్ 56 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక చివర్లో దీపక్ చహర్ 38, వాషింగ్టన్ సుందర్ 33 పరుగులు చేయడంతో టీమిండియా 250 ప్లస్ స్కోరు దాటింది. -
Afg Vs Ned: అఫ్గన్ అద్భుత విజయం.. పాపం నెదర్లాండ్స్ వైట్‌వాష్..
Afg vs Ned ODI Series: నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేలో అఫ్గనిస్తాన్ అదరగొట్టింది. దోహా వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా సిరీస్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటర్లు రియాజ్ హుసాన్(50 పరుగులు), నజీబుల్లా(71 పరుగులు) అర్ధ సెంచరీలతో రాణించడంతో మంచి స్కోరు నమోదు చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌కు ఓపెనర్లు స్కాట్ ఎడ్వర్డ్స్(54 పరుగులు), కొలిన్ ఆక్‌మన్(81) అద్భుత ఆరంభం అందించినా.. మిడిలార్డర్ మాత్రం ఘోరంగా విఫలమైంది. వీరిద్దరు అవుట్ కాగానే.. వరుసగా 0, 3,8, 13,4,2,1,0,1 స్కోర్లకే బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో అఫ్గనిస్తాన్ చేతిలో ఓటమి తప్పలేదు. ఇక అఫ్గన్ బ్యాటర్ నజీబుల్లాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా మొదటి వన్డేలో 36 పరుగులు, రెండో వన్డేలో 48 పరుగులతో గెలుపొందిన అఫ్గనిస్తాన్ మూడో వన్డేలో 75 పరుగుల తేడాతో విజయం సాధించి నెదర్లాండ్స్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. చదవండి: Ind Vs WI: 458 పరుగులు.. 17 వికెట్లు.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి.. ఆ ఇద్దరికి బంపర్ ఛాన్స్.. ఏకంగా విండీస్‌తో సిరీస్‌తో. Video: AfghanAtalan have always conveyed a message of love, spirit, and determination. Watch them celebrate their series win over the Netherlands. #AfghanAtalan | #AFGvNED pic.twitter.com/84f5U4xBD9 — Afghanistan Cricket Board (@ACBofficials) January 26, 2022 -
ఐపీఎల్ వల్లే మా జట్టు విఫలం: స్టీవ్ వా
సిడ్నీ: టెస్ట్, వన్డే క్రికెట్ ను కొన్నేళ్లపాటు ఎలాంటి ఇబ్బందులే లేకుండా ఏలిన దిగ్గజ జట్టు ఆస్ట్రేలియా ప్రస్తుతం తడబడుతోంది. వరుస సిరీస్ లలో ప్రత్యర్థుల చేతుల్లో ఓటమి పాలవడమే కాదు ఏకంగా వైట్ వైష్ అవుతుంది. ఆస్ట్రేలియా ఓట్టు ఓటమికి కారణాలపై దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా భిన్నంగా స్పందించాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగి పోయిందని, ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కూడా ఆసీస్ వైఫల్యానికి కారణమని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ లో ఆడటం, ఆ వెంటనే తీరికలేని సిరీస్ షెడ్యూల్స్ కారణంగా ఆటగాళ్లు అలసటతో పాటు ఒత్తిడికి గురువతున్నారని చెప్పాడు. రెండు నెలల కిందట లంక గడ్డపై వారి చేతిలో మూడు టెస్టుల సిరీస్ లో 3-0తో వట్ వాష్ అయింది. కొన్ని రోజుల కిందట దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్ లో ఏకంగా 5-0తో దారుణ వైఫల్యాన్ని మూటకట్టుకుంది. వచ్చే ఏడాది ఆసీస్ జట్టు భారత్ లో పర్యటించనుంది. వాస్తవానికి తనతో పాటు అంతకంటే ముందు తరం క్రికెటర్లు క్లబ్ క్రికెట్ కూడా ఆడారని గుర్తుచేశాడు. ప్రస్తుత క్రికెట్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం, బీజీ షెడ్యూల్స్ వల్ల ప్లేయర్లు గాయాలపాలయ్యే అవకాశాలు అధికమని స్టీవ్ వా వివరించాడు. -
టీమ్ ఓటమికి ఇద్దరమే బాధ్యులమా?
సిడ్నీ: శ్రీలంక చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమికి తనతో పాటు జోయ్ బర్న్స్ ను బలిపశువులు చేశారని ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అన్నాడు. ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ లో లంక గడ్డపై వారి చేతిలో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్ 3-0తో వైట్ వాట్ అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ రెండు టెస్టుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆసీస్ ఆటగాడు ఒక్క కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రమేనని మీడియాకు తెలిపాడు. ఉపఖండంలో లంక లాంటి టఫ్ పిచ్ లపై కేవలం రెండు టెస్టుల్లో రాణించలేనంత మాత్రానా కొందరిపై ఓటమి ప్రభావాన్ని చూపడం సరికాదని ఆసీస్ క్రికెట్ బోర్డును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. తాజాగా వన్డేల్లో దక్షిణాఫ్రికా చేతిలో 5 వన్డేల సిరీస్ లో ఆసీస్ వైట్ వాష్ కాలేదా అని ప్రశ్నించాడు. ఈ సిరీస్ కు ముందు న్యూజిలాండ్, వెస్టిండీస్ పర్యటనలలో వన్ డౌన్ బ్యాట్స్ మన్ గా తాను అద్బుత ఇన్నింగ్స్ లు ఆడినట్లు గుర్తుచేశాడు. అయితే ఈ విషయాలను పట్టించుకోని ఆసీస్ క్రికెట్ బోర్టు ఆ సిరీస్ లో మూడో టెస్టులో తనను పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తంచేశాడు. తనతో పాటు మరో టాపార్డర్ బ్యాట్స్ మన్ బర్న్స్ ఘోర వైఫల్యాలే జట్టు ఓటమికి కారణమని ఆరోపణలు రావడం దారుణమన్నాడు. వాస్తవానికి తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ ల్లో కలిపి ఖవాజా కేవలం 55 పరుగులు చేశాడని చివరిదైన మూడో టెస్టులో జట్టు నుంచి తప్పించారు.