ఐపీఎల్ వల్లే మా జట్టు విఫలం: స్టీవ్ వా
సిడ్నీ: టెస్ట్, వన్డే క్రికెట్ ను కొన్నేళ్లపాటు ఎలాంటి ఇబ్బందులే లేకుండా ఏలిన దిగ్గజ జట్టు ఆస్ట్రేలియా ప్రస్తుతం తడబడుతోంది. వరుస సిరీస్ లలో ప్రత్యర్థుల చేతుల్లో ఓటమి పాలవడమే కాదు ఏకంగా వైట్ వైష్ అవుతుంది. ఆస్ట్రేలియా ఓట్టు ఓటమికి కారణాలపై దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా భిన్నంగా స్పందించాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగి పోయిందని, ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కూడా ఆసీస్ వైఫల్యానికి కారణమని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ లో ఆడటం, ఆ వెంటనే తీరికలేని సిరీస్ షెడ్యూల్స్ కారణంగా ఆటగాళ్లు అలసటతో పాటు ఒత్తిడికి గురువతున్నారని చెప్పాడు. రెండు నెలల కిందట లంక గడ్డపై వారి చేతిలో మూడు టెస్టుల సిరీస్ లో 3-0తో వట్ వాష్ అయింది. కొన్ని రోజుల కిందట దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్ లో ఏకంగా 5-0తో దారుణ వైఫల్యాన్ని మూటకట్టుకుంది. వచ్చే ఏడాది ఆసీస్ జట్టు భారత్ లో పర్యటించనుంది. వాస్తవానికి తనతో పాటు అంతకంటే ముందు తరం క్రికెటర్లు క్లబ్ క్రికెట్ కూడా ఆడారని గుర్తుచేశాడు. ప్రస్తుత క్రికెట్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం, బీజీ షెడ్యూల్స్ వల్ల ప్లేయర్లు గాయాలపాలయ్యే అవకాశాలు అధికమని స్టీవ్ వా వివరించాడు.